
పోలీసుల అదుపులో నిందితుడు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాక ర్‌రావు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ ఎస్ శ్రేణులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు ఠాణాకు తరలించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లకు పంచేందుకే ఈ నగదు తీసుకొచ్చినట్లు వారు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment