
దళితుల కష్టాలు టీడీపీ నేతలకు, రామోజీరావుకు తెలియవని, ప్రభుత్వ పథకాలపై రామోజీ తప్పుడు కథనాలను రాస్తున్నారని ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు.
సాక్షి, తాడేపల్లి: దళితుల కష్టాలు టీడీపీ నేతలకు, రామోజీరావుకు తెలియవని, ప్రభుత్వ పథకాలపై రామోజీ తప్పుడు కథనాలను రాస్తున్నారని ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. దళితులకు చంద్రబాబు ఏనాడైనా మంచి చేశారా? అసైన్డ్ భూముల్లో రామోజీరావు ఫిల్మ్‌సిటీ కట్టారని దుయ్యబట్టారు.
‘‘ఈనాడు పత్రిక శకుని పాత్ర పోషిస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు పెట్టాలని రామోజీ చూస్తున్నారు. దళితుల కోసం వైఎస్సార్, సీఎం జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని జూపూడి అన్నారు.
‘‘చంద్రబాబు తన సామాజిక వర్గం కోసమే పనిచేస్తున్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. అవినీతికి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం’’ అని జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు.
చదవండి: బుద్ధప్రసాద్‌కు షాకిచ్చిన దివిసీమ రైతులు