సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ బృందం ఈసీని కలిసింది. టీడీపీ నేత చంద్రబాబు, ఈనాడు పత్రిక, ఆర్ టీవీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ.. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు, నంద్యాల సభల్లో చంద్రబాబు అప్రజాస్వామిక పదజాలం వాడారని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ 230 ఫిర్యాదులు ఈసీకి ఇచ్చాం. ఎన్నికల సంఘం సరిగ్గా స్పదించలేదు. కూటమి ఫిర్యాదులపై వెంటనే స్పందించింది. ఈసీ ప్రభావం పడకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు కూటమి కట్టారని మల్లాది విష్ణు అన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా తీర్పును ఆపలేరు. ప్రజలు ధర్మం, న్యాయం, నిజం పక్కనే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూతో ఆర్. టీవీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. మనుగడ కోల్పోతున్నామన్న భయంతోనే సీఎం జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment