hydrabad police
-
‘అయ్యో.. దేవుడా!’.. హైడ్రా పంజా-బోరుమంటున్న జనం (చిత్రాలు)
-
HYDRA: నేలకొరిగిన అక్రమాలు
మణికొండ/మొయినాబాద్: గండిపేట చెరువు ఆక్రమణల చెర వీడుతోంది. ఈ చెరువుకు ఆనుకుని వెలసిన బడాబాబుల నిర్మాణాలను ఎట్టకేలకు తొలగించేందుకు హైడ్రా అధికారులు ఆదివారం శ్రీకారం చుట్టారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెలసిన నిర్మాణాల తొలగింపునకు చర్యలు చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడిన హైడ్రా సిబ్బంది నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూలి్చవేశారు. వీటిలో ఒకటి ప్రముఖ న్యాయవాదికి చెందినది కాగా.. మరొకటి కేంద్ర మాజీ మంత్రి బంధువులకు సంబంధించింది కావడం గమనార్హం. అలాగే.. శంకర్పల్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ రెస్టారెంట్‌ను నేలమట్టం చేశారు. అదే రోడ్డులో ఖానాపూర్ దాటిన తర్వాత ఉన్న ఓరో స్పోర్ట్స్ విలేజ్‌లోని కొంత భాగాన్ని కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య.. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో హైడ్రా ఆర్ఎఫ్ఓ పాపారావు ఆధ్వర్యంలో కూలి్చవేతలు కొనసాగాయి. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణమోహన్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్‌గౌడ్ పనులను పర్యవేక్షించారు. మొయినాబాద్ మండలంలోని అప్పోజీగూడ, చిలుకూరు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వెస్టిసైడ్ వెంచర్లో గండిపేట చెరువు ఎఫ్టీఎల్ను ఆక్రమించి చేపట్టిన భారీ నిర్మాణాలను హైడ్రా అధికారులు గుర్తించారు. మల్లికార్జున్, చరణ్, జలమండలి డీజీఎం నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి డీకే లక్షి్మరెడ్డి, స్థానిక ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో వెస్టిసైడ్ వెంచర్‌లోని భవనాలను కూలి్చవేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన క్రికెట్ మైదానాన్ని ధ్వంసం చేశా రు. చెరువు చుట్టూ వందలాది అక్రమ నిర్మాణాలు ఉండటంతో అయిదు రోజుల పాటు కూలి్చవేతలు చేపట్టనున్నట్లు సమాచారం. చెరువును పూడ్చి.. గండిపేట చెరువును ఆనుకుని ఎకరం, రెండెకరాల భూములు కొనుగోలు చేసిన బడాబాబులు మరింత స్థలాన్ని ఆక్రమించి ఫాంహౌస్‌లు నిర్మించారు. ఖానాపూర్, గండిపేట, మంచిరేవుల, హిమాయత్‌నగర్, చిలుకూరు, అప్పోజీగూడ, చందానగర్, చిన్నమంగళారం, జన్వా డ, మిర్జాగూడ, మియాఖాన్ గడ్డ తదితర గ్రా మాల పరిధిలో వందల సంఖ్యలో ఆక్రమణలు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. గండిపేట పరీవాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. ఇదే తరహాలో హిమాయత్ సాగర్ పరిసరాల పరిధిలో వెలసిన నిర్మాణాలపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైకి చెందిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ. 16లక్షల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని, ముంబై గ్యాంగ్‌లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఒక విదేశీయుడు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చారని, అయితే స్పెషల్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయని పేర్కొన్నారు. రూ. 16లక్షల కొకైన్, ఎండీఎం,ఎల్ఎస్డీ బోల్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కీలకమైన నిందితుడు నైజీరియన్ టోనీ పరారీలో ఉన్నాడని తెలిపారు. ముంబై అడ్డాగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, పలు రాష్ట్రాల్లో ఏజంట్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు. ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో గుర్తించామని, వారిలో మార్పు రావటం లేదని తెలిపారు. కొనుగొలు చేసిన ఆరుగురిని గుర్తించామని పేర్కొన్నారు. సెక్షన్ 27 ప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. తల్లిదండ్రులతో సంప్రదించి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. చాలా మంది డ్రగ్స్ కన్జూమర్స్ ఉన్నారుని గుర్తిస్తున్నామని తెలిపారు. -
జూపూడి ఇంటి వద్ద డబ్బు సంచులు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాక ర్రావు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ ఎస్ శ్రేణులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి రావడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తిని, అతడి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని పోలీసులు ఠాణాకు తరలించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లకు పంచేందుకే ఈ నగదు తీసుకొచ్చినట్లు వారు ఆరోపించారు. -
మత్తు.. చిత్తు
సాక్షి, జనగామ: అమాయక యువతను మత్తు మాఫి యా విష వలయంలోకి లాగుతోంది. హైదరాబాద్ కల్చర్ జిల్లాకు అంటుకుంది. ఇన్నాళ్లు పెద్దలకే పరిమితమైన గంజాయి వ్యసనం ఇప్పుడు యువతను చెడగొడుతోంది. నిషేదిత గంజాయి విక్రయాలను కొందరు యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసిన మత్తు మాఫియా వారిని నాశనం చేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొంతమంది యువత అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న వారు.. ‘మత్తు’లోకి దింపుతూ.. బానిసలుగా మార్చేస్తున్నారు. రేపటి తరానికి దిక్సూచిగా నిలవాల్సిన యువత అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ప్యాకెట్ మనీల పేరుతో తల్లిదండ్రుల గారాబంతో మరింత నాశనమవుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంగా గంజాయి ప్యాకెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం సాగుతుంది. గతంలో పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకోగా బచ్చన్నపేట, రఘునాథపల్లిలో పెద్ద ఎత్తున పట్టుబడిన సంగతి తెలిసిందే. విద్యార్థులే లక్ష్యంగా.. అడ్డదారిలో డబ్బులు సంపాదనే లక్ష్యంగా కొంతమంది జనగామ కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలను సాగిస్తున్నట్లు సమాచారం. గంజాయిని హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి.. చిన్న చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, గుంటూరు తదితర పట్టణాల నుంచి ఇక్కడికి గంజాయి సరఫరా అవుతున్నట్లుగా తెలుస్తుంది. అర్థరాత్రి సమయంలో రహస్య ప్రదేశాలకు తరలిస్తూ.. 10 గ్రాముల ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేస్తూ..డంపింగ్ చేస్తున్నారు. ఎవరికి అనుమానం కలుగకుండా..జిల్లా కేంద్రంలోని వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలతో పాటు కళాశాలల వద్ద గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా చా కచక్యంగా తప్పించుకుంటూ గంజాయి అమ్మకా లు సాగుతున్నాయని సమాచారం. జిల్లా కేంద్రం చుట్టూ.. సిద్దిపేట, సూర్యపేట, వరంగల్, హైదరాబాద్ రహదారుల శివారులో సాయంకాలం 6 గంటల ప్రాంతం నుంచి రాత్రి 10 గంట ల వరకు గంజాయి పీలుస్తూ.. అనుభూతి పొం దినట్లుగా బ్రమపడుతున్నారు. స్థానికంగా నమ్మకం ఉన్న వారికి పెద్ద ఎత్తున కమీషన్ల ఎరచూపిస్తూ గంజాయి ప్యాకెట్లను అమ్మకాలు చేయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కసారి పీలిస్తే.. గంజాయి ఆకును ఒక్కసారి పీల్చిన యువత.. దూరం కావాడం చాలా కష్టం. ప్రతి వ్యక్తి శరీరంలో ఆల్కహాల్ ఎంత అవసరమో అంతే ఉండాలి. అవసరమైన దాని కంటే ఎక్కువగా డ్రగ్స్ తీసుకు వారి ఆయుష్సు రోజు రోజుకు తగ్గిపోతుంది. అంతే కాకుండా ప్రతి రోజు సమయానుకూలంగా మత్తు కావాలనే కోరిక పుడుతుంది. పొడి గంజా యితో పాటు ఇంజక్షన్ల రూపంలో కూడా వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. మత్తు ఇంజక్షన్లను తీసుకోవడం వల్ల పూర్తిగా నరాల వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. మత్తు దొరకని సమయంలో దీనికి అలవాటు పడిన వారు ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. అంతే కాకుండా సైకోగా మారే అవకాశం ఉంటుంది. దర్జాగా అమ్మకాలు.. పోలీసులకు.. పౌరులకు అనుమానం రాకుండా చాలా చోట్ల గంజాయి ఉన్న సిగరెట్లను అమ్మకా లు చేస్తున్నారు. గతలో జనగామ జిల్లా కేంద్రంలో విదేశీ సిగరెట్లతో పాటు గుట్కా అమ్మకాలు చేస్తు న్న వారిని పోలీసులు పట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయం కావడంతో అధి కారులు.. పోలీసు నిఘాతో పాటు బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. తనిఖీలను తప్పించుకునేందుకు విద్యార్థుల రూపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున గం జాయిని సరఫరా చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు డబ్బుల కోసం తల్లిదండ్రులను పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలు కోకొల్లలు. పీడీ యాక్టు తప్పదు గుట్కా, గుడుంబా, గంజాయి, హుక్కా అమ్మకాలు చేస్తూ రెండుసార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తాం. వీటి అమ్మకాలపై గట్టి నిఘా వేసినం. అమ్మకాలు చేస్తూ పట్టుబడితే ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుడుంబా, గుట్కా అమ్మకం దారులను తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తు జమానత్ తీసుకుంటున్నాం. ఒక సారి కేసు నమోదైన వారు తిరిగి విక్రయిస్తే.. లక్ష జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ చర్యగా భావిస్తాం. గంజాయి, గుట్కా అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తాం. వినోద్‌కుమార్, ఏసీపీ, జనగామ -
బాడీ మసాజ్ ముసుగులో వ్యభిచారం
చిలకలగూడ: బాడీ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకుడితోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ. 20 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజులు తెలిపిన మేరకు.. బెంగుళూరుకు చెందిన సమీర్ అగర్వాల్ (40) ఆరునెలల క్రితం మెట్టుగూడలో స్పా పేరిట మసాజ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అనుకున్నంత ఆదాయం రాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ‘లోకొంటో’ అశ్లీల వెబ్సైట్లో అందమైన యువతుల ఫొటోలతోపాటు తన సెల్‌ఫోన్ నంబర్ పెట్టాడు. ఆకర్షితులైన వారు ఫోన్ చేస్తే వారి పూర్తి వివరాలు తెలుసుకుని తన స్పా సెంటర్ కు పిలిపించుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. మూడు రోజుల క్రితం చిలకలగూడ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఓ కానిస్టేబుల్‌ను విటుడిగా పంపించి వివరాలు సేకరించి పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకుడు సమీర్ అగర్వాల్ (40)తో పాటు అక్కడ పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన షాకీర్‌అలీ (35), సుమిత్‌సర్కార్ (28), విటులు యుపీకి చెందిన అమిత్‌బోస్ (40), నగరానికి చెందిన శశాంక్ (25), శ్రీకాంత్ (27), వెస్ట్ బెంగాల్‌కే చెందిన యువతులు మోంటీసింగ్ (24), లి యాదాస్ (25)లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 20.130 నగదు, ఏడు సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకె ట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కుషాయిగూడ: సెలూన్ ముసుగులో మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఓ సెలూన్ సెంటర్‌పై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిర్వహాకులతో పాటుగా పలువురిని అరెస్టుచేశారు.డాక్టర్ ఏఎస్‌రావునగర్‌లో స్పా సెలూన్ సెంటర్లో కొంత కాలంగా పలువురు మహిళలతో క్రాస్ మసాజ్‌ను నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు సెంటర్‌పై ఆకస్మిక దాడులు జరిపారు. నిర్వహాకుడు హరీష్‌తో పాటుగా మసాజ్ చేస్తున్న ఇతర రాష్ట్రాల మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, 500 నగదు స్వాధీనం చేసుకొని కుషాయిగూడ పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు. -
ఆధార్‌తో ఫింగర్ ప్రింట్ బ్యూరో సమన్వయం
సాక్షి, హైదరాబాద్ : ఫింగర్ ప్రింట్ బ్యూరోతో ఆధార్ వ్యవస్థను సమన్వయం చేసేలా కసరత్తు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ వెల్లడించారు. తద్వారా నేరస్తుల గుర్తింపు సులభతరం అవుతుందని చెప్పారు. వేలిముద్రల సేకరణలో చట్టపర సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్‌ను సవరించేందుకు ఉన్నత స్థాయిలో చర్చిస్తామన్నారు. ఫింగర్ పింట్ బ్యూరో 19వ జాతీయ స్థాయి సమావేశాలు గురువారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి్ద సంస్థలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో తొలిరోజు కార్యక్రమానికి హాజరైన హన్స్‌రాజ్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ఒక్కరి వేలిముద్రలు డేటాబేస్‌లో ఉంటున్నాయని, కానీ మన దేశంలో నేరస్తులకు సంబంధించి 11.50 లక్షల మంది వేలిముద్రలే డేటాబేస్‌లో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో 80% కొత్త వ్యక్తులు చేస్తున్నవేనన్నారు. నేరాలు, శిక్ష శాతాల్లో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందన్న మంత్రి.. అన్ని రాష్ట్రాల డీజీపీలతో ఏటా ప్రధాని మోదీ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో తెలంగాణ పోలీస్ శాఖ దూసుకెళ్తోందని హాన్స్‌రాజ్ ప్రశంసించారు. టెక్నాలజీ వినియోగంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ పోలీస్ శాఖ ‘ది బెస్ట్’గా ఉందని కొనియాడారు. ‘కంపెన్డియం ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అన్ని ఠాణాలకు డేటా: ఎన్సీఆర్బీ డీజీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలోని ఫింగర్ ప్రింట్ విభాగం వద్ద ఉన్న వేలిముద్రల డేటాను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తామని ఎన్సీఆర్బీ డీజీ ఈష్‌కుమార్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోని ఫింగర్ ప్రింట్ బ్యూరోల్లో తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని.. 250 పోస్టులకుగాను 50 మంది సిబ్బందే పనిచేస్తున్నారని చెప్పారు. ఏటా నమోదవుతున్న కేసుల్లో ఒక శాతం మాత్రమే ఫింగర్ ప్రింట్ సిబ్బంది, అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫింగర్ ప్రింట్ బ్యూరోను సర్కిల్, సబ్ డివిజన్ వారీగా నియమిస్తే కేసులు పరిష్కారంతోపాటు నియంత్రణ కూడా పెరుగుతుందని వివరించారు. అతి తక్కువ సమయంలో.. : డీజీపీ తెలంగాణలో ఫింగర్ ప్రింట్ బ్యూరోను పటిష్టం చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆటోమేషన్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ విధానం (ఏఎఫ్ఐఎస్) ఇటీవలే ప్రారంభించామని, అతి తక్కువ కాలంలో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. ఏఎఫ్ఐఎస్ విధానాన్ని అమలుపరచడంతో 868 పాత కేసులు పరిష్కరించామని, ఇందులో 480 కేసులు పాత ఫింగర్ ప్రింట్స్ విధానంలో పరిష్కారం కాలేదని వివరించారు. కొత్త విధానంతో నిందితుల నుంచి రూ.7.2 కోట్ల విలువైన సొత్తు కాపాడగలిగామని చెప్పారు. ఫింగర్ ప్రింట్ మొబైల్ డివైజ్ ద్వారా 1.22 లక్షల మంది వేలిముద్రలను సేకరించి డేటాబేస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో 7,273 మంది పాత నేరస్తులను గుర్తించినట్లు వెల్లడించారు. సదస్సులో ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్ మాథుర్, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్, రాష్ట్ర ఐపీఎస్‌లు, సీఐడీ అధికారులు పాల్గొన్నారు. -
ఆ డబ్బుకు అన్ని లెక్కలున్నాయి: పార్థసారధి
తన భార్య వద్ద స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి అన్ని లెక్కలు ఉన్నాయని మాజీ మంత్రి కె.పార్థసారథి వెల్లడించారు. ఆయన శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్‌సభ అభ్యర్థి రూ. 70 లక్షలు వరకు ఖర్చు చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల ఖర్చు కోసం కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్లో కొంత మొత్తం నగదు జమ చేయాలని, మరి కొంత మొత్తాన్ని సొంతంగా నిర్వహిస్తున్న కనస్ట్రక్షన్ కోసం చేసిన బకాయిలు చెల్లించడానికి తీసుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పార్థసారథి సతీమణి కమల హైదరాబాద్ నుంచి నగదుతో విజయవాడకు బయలుదేరారు. వనస్థలిపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా కమల వద్ద ఉన్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి కె.పార్థసారథి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.