మీడియాతో మాట్లాడుతున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైకి చెందిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ. 16లక్షల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని, ముంబై గ్యాంగ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఒక విదేశీయుడు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చారని, అయితే స్పెషల్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయని పేర్కొన్నారు. రూ. 16లక్షల కొకైన్, ఎండీఎం,ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కీలకమైన నిందితుడు నైజీరియన్ టోనీ పరారీలో ఉన్నాడని తెలిపారు. ముంబై అడ్డాగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, పలు రాష్ట్రాల్లో ఏజంట్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు.
ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో గుర్తించామని, వారిలో మార్పు రావటం లేదని తెలిపారు. కొనుగొలు చేసిన ఆరుగురిని గుర్తించామని పేర్కొన్నారు. సెక్షన్ 27 ప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. తల్లిదండ్రులతో సంప్రదించి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. చాలా మంది డ్రగ్స్ కన్జూమర్స్ ఉన్నారుని గుర్తిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment