సాక్షి, హైదరాబాద్: మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు కేసుల్లో భాగంగా రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసిన చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇదిలా ఉండగా.. వివాదాస్పద వ్యాఖ్యలు, డ్రగ్స్‌పై కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మతపరమైన వ్యాఖ్యలను సహించేది లేదు. ఇప్పటికే ఇద్దరిపై పీడీయాక్ట్ పెట్టామన్నారు. ఈ క్రమంలోనే స్మాష్ అనే సోషల్ మీడియా యాక్షన్ స్వ్కాడ్‌ను ఏర్పాటు చేశాము. సోషల్ మీడియాలోని ప్రతీ పోస్టుపై నిఘా ఉంటుంది.
డ్రగ్స్ కేసులో పెద్ద నెట్‌వర్క్‌ను అరెస్ట్ చేశాము. డార్క్‌నెట్ వెబ్‌సైట్ ద్వారా ముఠా పనిచేస్తోంది. ఈ ముఠా క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నది. ఇంటికి వచ్చే కొరియర్స్‌ను పేరెంట్స్ పరిశీలించాలి. డ్రగ్స్ వినియోగంలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. 600 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చాము. డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాము అని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల్లో బీజేపీ పోటీపై ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment