సాక్షి, హైదరాబాద్: నిషా ముక్త్ తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అద్భుత ఫలితాలు సాధిస్తోందని న్యాబ్ డైరెక్టర్, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వెల్లడించారు. జూన్–జూలై నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దాడుల్లో టీఎస్ న్యాబ్ అధికారులు 196 కేసులు నమోదు చేసినట్లు గురువా రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా 196 కేసుల్లో 175 గంజాయి దందాకు సంబంధించినవే. ఈ కేసుల్లో అధికారులు 353 మందిని అరెస్టు చేశారు.
మరోపక్క 21 డ్రగ్స్ సంబంధిత కేసుల్లో 46 మందిని కటకటాల్లోకి పంపారు. వీరి వద్ద నుంచి స్వాదీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ.26,01,34,650గా నిర్థారించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు జూన్‌లో మూడు రోజుల పాటు మిషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
డ్రగ్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కీలక సమావేశం గత నెల 5న నిర్వహించారు. డ్రగ్స్ దందాకు చెక్ చెప్పడానికి డార్క్‌వెబ్ సహా ఆన్‌లైన్‌లో జరిగే అక్రమ లావాదేవీలు నిరోధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment