ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. ఆరోగ్యం కూడా అంతే వేగంగా క్షిణిస్తోంది. కావున మెడిసిన్స్ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే ఈ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కొంతమందికి అవి నకిలీ ముందుకు అయుండొచ్చని సందేహం వస్తుంది. అలాంటి అనుమానాలకు చెక్ పెట్టటానికి క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
క్యూఆర్ కోడ్..
నివేదికల ప్రకారం.. సుమారు 300 మందుపైన క్యూఆర్ కోడ్ వేయాలని 'డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా' (DCJI) ఫార్మా కంపెనీలను ఆదేశించింది. కావున నిర్దేశిత మందులపైన క్యూఆర్ లేదా బార్ కోడ్ తప్పనిసరి అయింది. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఆ మెడిసిన్ గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చు.
క్యూఆర్ లేదా బార్ కోడ్ కలిగిన మందుల జాబితాలో యాంటీ బయాటిక్స్, కార్డియాక్ పిల్స్, పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్‌లు, యాంటీ డయాబెటిక్స్, యాంటీ డయాబెటిక్స్ మిక్స్‌టార్డ్, గ్లైకోమెట్-జిపి, యాంటీబయాటిక్స్ ఆగ్మెంటిన్, మోనోసెఫ్, గ్యాస్ట్రో మెడిసిన్ వంటివి ఉన్నాయి.
ఫార్మా రిటైల్ మార్కెట్‌లో దాదాపు రూ. 50,000 కోట్ల విలువైన అధికంగా అమ్ముడవుతున్న 300 కంటే ఎక్కువ మందులపై క్యూఆర్ కోడ్ రానుంది. ఈ క్యూఆర్ కోడ్ అమలు చేయడంలో ఏదైనా అవకతవకలు జరిగితే భారీ జరిమానా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని డసీజేఐ ఆదేశించింది.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ కొత్త ఇయర్‌బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మెడిసిన్ డీటెయిల్స్..
నిజానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనం తీసుకున్న మెడిసిన్ వివరాలను తెలుసుకోవచ్చు. అంటే దాని జనరల్ నేమ్, బ్రాండ్ నేమ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ పేరు, బ్యాచ్ నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, తయారీదారు లైసెన్స్ నెంబర్ వంటివి ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి
ప్రభుత్వం నకిలీ మందులను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ విధానం మీద కృషి చేయగా ఈ రోజు (2023 ఆగష్టు 01) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టాన్ని సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment