
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) వంటి వాటిలో ఫీచర్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ 'జీమెయిల్' కోసం ఓ అప్డేట్ తీసుకొచ్చింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అప్డేట్ చేసింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? దీనివల్ల ఉపయోగాలేంటి? అనే వివరాలు.. ఈ కథనంలో చూసేద్దాం.
ఇప్పటి వరకు జీమెయిల్ లాగిన అయ్యే సమయంలో.. వినియోగదారు గుర్తింపును ధృవీకరించడానికి గూగుల్ ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్‌లను ఎస్ఎమ్ఎస్ రూపంలో రిజిస్టర్ మొబైల్ నెంబరుకు పంపించేది. కానీ త్వరలో ఈ విధానానికి గూగుల్ స్వస్తి పలకనుంది. దీనికి బదులుగా క్యూఆర్ కోడ్‌ను తీసుకురానుంది. దీనిని వినియోగదారులు వివరాలను మరింత భద్రంగా ఉంచడానికి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత.. మీకు ఆరు అంకెల అథెంటికేషన్ కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్ వస్తుంది. కాబట్టి మీరు మీ ఫోన్ కెమెరాతో ఆ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఎస్ఎమ్ఎస్ ఆధారిత మోసాలు తగ్గుతాయి. సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్న తరుణంలో గూగుల్ ఈ నిరన్యం తీసుకుంది.
జీమెయిల్ లాగిన్ విధానంలో మార్పు క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుందని మాత్రం చెబుతున్నారు. కానీ ఇది ఎప్పుడు అమలులోకి వస్తుందనే వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. బహుశా వీలైనంత త్వరగానే ఈ అప్డేట్ రావొచ్చని సమాచారం.
ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment