టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపీఐ యాప్స్ వినియోగం బాగా పెరిగింది. దీంతో చాలా మంది జేబులో డబ్బు పెట్టుకోవాలన్న సంగతే మరచిపోయారు. ఎక్కడికెళ్లినా స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. కిరాణా కొట్టులో వస్తువులు కొనే దగ్గర నుంచి షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసే వరకు అన్నీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు.
కొంతమంది సైబర్ నేరగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్‌ల ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగలిస్తున్నారు. ఇది ఆ తరువాత రోజుల్లో ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది.
యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే అది యూజర్లను ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ చెల్లించాల్సిన పేమెంట్ ఎంటర్ చేసి చెల్లిస్తారు. కానీ సైబర్ నేరగాళ్ళకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసిన తరువాత అది కూడా వేరొక వెబ్‌సైట్‌కి కనెక్ట్ చేస్తుంది. ఈ వెబ్‌సైట్ సాధారణంగా నిజమైన వెబ్‌సైట్ మాదిరిగానే కనిపిస్తుంది. అందులో యూజర్ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయమని చెబుతుంది. దీనిని నమ్మి వినియోగదారుడు సమాచారం ఎంటర్ చేస్తే.. వివరాలన్నీ కూడా స్కామర్‌కు వెళ్ళిపోతుంది.
యూజర్ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న స్కామర్ అకౌంట్ నుంచి డబ్బు కాజేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా యూపీఐ పిన్ ఎంటర్ చేయమని చెబుతారు.. ఇదేగానీ జరిగితే యూజర్ పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ
ఇలాంటి స్కామ్ నుంచి తప్పించుకునే మార్గాలు!
- బహిరంగ ప్రదేశాల్లో ఉండే క్యూఆర్ కోడ్‌లను ఎట్టి పరిస్థితుల్లో స్కాన్ చేయకూడదు.
- క్యూఆర్ కోడ్‌లు మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం లేదా ఇమెయిల్ రూపంలో వస్తే వాటిని స్కాన్ చేయకూడదు.
- సోషల్ మీడియాలో కనిపించే క్యూఆర్ కోడ్‌ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి.
- లింక్‌ను కలిగి ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేముందు, యూఆర్ఎల్ చెక్ చేసుకోవాలి.
- క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తే.. అలాంటి వాటిని విస్మరించడం మంచిది.
- ఇలాంటి మోసాలను నివారించడానికి బిల్డ్ ఇన్ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.
- మీ డిజిటల్ అకౌంట్స్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment