దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్ట్: దీని గురించి తెలుసా? | What Is Digital Arrest Scam And How To Stay Safe | Sakshi
Sakshi News home page

డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసా?: తెలుసుకోకపోతే మోసపోతారు..

Published Sun, Oct 6 2024 10:41 AM | Last Updated on Sun, Oct 6 2024 12:20 PM

What Is Digital Arrest Scam And How To Stay Safe

టెక్నాలజీ పెరుగుతుండటంతో.. సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే.. డిజిటల్ అరెస్ట్. ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

డిజిటల్ అరెస్ట్
మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.

ఇప్పటికే సైబర్ మోసగాళ్ల భారిన పది ఎంతోమంది లెక్కకు మించిన డబ్బును కోల్పోయారు. ఈ జాబితాలో నోయిడాకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పూజా గోయెల్ (రూ.60 లక్షలు మోసపోయారు), దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్‌కి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు (రూ. 93 లక్షలు), వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్‌ మొదలైనవారు ఉన్నారు.

ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి?
మీకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి భయపెడితే.. ఏ మాత్రం భయపడకుండా మీరే వారిని క్రాస్ క్వశ్చన్ చేయకండి. ఏదైనా డబ్బు అడిగినా.. లేదా భయపెట్టినా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా సంబంధిత అధికారులను కలిసి జరిగిన విషయాన్ని గురించి వివరించండి.

ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే.. హర్ష్ గోయెంకా

ఇటీవల పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో తెలియచేయడానికి ఒక ఆడియో క్లిప్ కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement