ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ 'హర్ష్ గోయెంకా' తన ఎక్స్ ఖాతాలో 'ముఖేష్ అంబానీ' నుంచి మూడు విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించారు. అంబానీతో జరిగిన పరస్పర చర్యల ద్వారా నేర్చుకున్న విషయాలు విజయానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
మూడు విషయాలు
పెద్ద కల - ఏదైనా సాధించాలంటే ముందుగా దాని గురించి కలలు కనండి. దాన్ని సహకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ''లక్ష్యంపై దృష్టి పెడితే అన్ని అడ్డంకులను అధిగమిస్తారు, అడ్డంకులను దృష్టిలో ఉంచుకుంటే, మీరు మీ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు'' అని అంబానీ అన్నారు.
శ్రమకు ప్రత్యామ్నాయం లేదు - లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. శ్రమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మీరు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలని కోరుకోవాలి. భారతదేశంలో మాత్రమే గొప్పవాళ్లుగా గుర్తించబడితే సరిపోదు.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాళ్ళుగా ఎదగాలి. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది.
సానుకూలంగా ఉండటం ముఖ్యం - జీవితంలో విజయం సాధించాలంటే సానుకూలత చాలా ముఖ్యం. విజయాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో పాటు తనపై నమ్మకం కూడా ఉండాలి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఓర్పుగా ఆలోచించాలి.
ఇదీ చదవండి: పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్
భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆసియాలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాపార ప్రపంచంలో విజయం సాధించడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 14వ స్థానంలో ఉన్న అంబానీ నికర విలువ 105 బిలియన్ డాలర్లు.
I have always learnt so much from my interactions with Mukesh Ambani. Let me share three of his life learnings with you’ll. pic.twitter.com/5p2zR1vWMj
— Harsh Goenka (@hvgoenka) October 5, 2024
Comments
Please login to add a commentAdd a comment