ప్రపంచ ధనవంతులలో ఒకరు, భారతీయ పారిశ్రామిక వేత్త 'ముకేశ్ అంబానీ' వ్యాపార సామ్రాజ్యం గురించి, వారి ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం ఎంత ఉంటుందో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసుకోవాలానే ఆసక్తి కూడా ఉండొచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2024 అక్టోబర్ 19 నాటికి ముఖేష్ అంబానీ 103 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని 15వ సంపన్న వ్యక్తిగా.. ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. అయితే ఈయన వ్యక్తిగత వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేశారు. ఈ వేతనం 2008 - 2009 ఆర్ధిక సంవత్సరం నుంచి కొనసాగుతోంది.
అంబానీ డ్రైవర్ జీతం
2017లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం ప్రకారం, అంబానీ డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ. 24 లక్షలన్నమాట. జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా కూడా డ్రైవర్‌కు లభిస్తాయి. 2017లోనే డ్రైవర్ జీతం రెండు లక్షలు అంటే.. ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
నిజానికి అంబానీ కారు డ్రైవ్ చేసివారు ప్రొఫెషనల్ డ్రైవర్లు. వీరికి డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది. లగ్జరీ కార్లను, బులెట్ ప్రూఫ్ కార్లను ఎలా డ్రైవ్ చేయాలి? వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి? అనే విషయాల గురించి కూడా బాగా అవగాహన ఉంటుంది. ఈ కారణంగానే సంపన్నుల డ్రైవర్లకు జీతాలు ఎక్కువగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment