driver posts
-
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతులలో ఒకరు, భారతీయ పారిశ్రామిక వేత్త 'ముకేశ్ అంబానీ' వ్యాపార సామ్రాజ్యం గురించి, వారి ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం ఎంత ఉంటుందో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసుకోవాలానే ఆసక్తి కూడా ఉండొచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2024 అక్టోబర్ 19 నాటికి ముఖేష్ అంబానీ 103 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని 15వ సంపన్న వ్యక్తిగా.. ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. అయితే ఈయన వ్యక్తిగత వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేశారు. ఈ వేతనం 2008 - 2009 ఆర్ధిక సంవత్సరం నుంచి కొనసాగుతోంది.అంబానీ డ్రైవర్ జీతం2017లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం ప్రకారం, అంబానీ డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ. 24 లక్షలన్నమాట. జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా కూడా డ్రైవర్‌కు లభిస్తాయి. 2017లోనే డ్రైవర్ జీతం రెండు లక్షలు అంటే.. ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి అంబానీ కారు డ్రైవ్ చేసివారు ప్రొఫెషనల్ డ్రైవర్లు. వీరికి డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది. లగ్జరీ కార్లను, బులెట్ ప్రూఫ్ కార్లను ఎలా డ్రైవ్ చేయాలి? వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి? అనే విషయాల గురించి కూడా బాగా అవగాహన ఉంటుంది. ఈ కారణంగానే సంపన్నుల డ్రైవర్లకు జీతాలు ఎక్కువగా ఉంటాయి. -
‘అన్నా చనిపోతున్నా’ అంటూ మెసేజ్ చేసి...
హైదరాబాద్: ‘నన్ను క్షమించు అన్నా..నేను చనిపోతున్నా..నేను ఫెయిల్ అయ్యాను’ అంటూ ఓ వ్యక్తి తన అన్నకు ఫోన్లో మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ మేడిపల్లికి చెందిన మాదారం సునీల్ (38)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఈయన సూర్యటవర్స్‌లోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే సంస్థలో అతని అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సంస్థ ఎండీని కారులో సూర్యటవర్‌లోని కార్యాలయం వద్ద డ్రాప్ చేశాడు. అదే సమయంలో ఆయన అన్న భోజనం చేద్దామని ఆహ్వానించగా సమాధానం చెప్పకుండా కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో వాట్సప్‌లో భార్య మొబైల్ ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. తెలిసిన వాళ్లు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడ ఆచూకీ దొరక లేదు. దీంతో బుధవారం రాత్రి మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసికున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
డ్రైవర్ కాదు.. ఓనర్ షర్మిల
సాక్షి, చైన్నె : డ్రైవర్‌గానే కాకుండా, పదిమంది యువతులకు ఉద్యోగాలు ఇచ్చే ఓనర్ స్థాయికి షర్మిల ఎదగాలని కాంక్షిస్తూ మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమల హాసన్ ఆమెకు ఒక కారును బహుమతిగా ఇచ్చారు. ఆయన సోమవారం షర్మిలకు డాక్యుమెంట్లు అందజేశారు. కోయంబత్తూరులో తొలి ప్రైవేటు బస్సు మహిళా డ్రైవర్‌గా షర్మిల(24) సుపరిచితురాలు. గతవారం ఆమె నడుపుతున్న బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి ఎక్కారు. ఆమెను అభినందించారు. బహుమతిగా చేతి గడియారం ఇచ్చారు. తర్వాత ఆమె డ్రైవర్ ఉద్యోగం ఊడింది. షర్మిల ఇటీవల కాలంగా సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీ కావడంతో ఆమె ప్రచారం కోసం పాకులాడుతున్నట్టుందని ఆ బస్సు యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో బస్సును గాంధీపురం బస్టాప్‌లో వదలి పెట్టి ఆమె వెళ్లి పోయారు. దీనిపై ఎంపీ కనిమొళి స్పందించారు. తాను ఆటో నడుపుకుంటానని షర్మిల చెప్పడంతో నగదు సాయంతోపాటు బ్యాంకు ద్వారా రుణ సాయం చేస్తానని కనిమొళి హామీ ఇచ్చారు. తక్షణం స్పందించిన కమల్‌హాసన్ షర్మిలకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ తక్షణం స్పందించారు. ఆమెను డ్రైవర్‌గానే పరిమితం చేయకుండా ఓనర్ స్థాయికి ఎదగాలని కాంక్షిస్తూ ఏకంగా ఒక కారును బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం షర్మిలను చైన్నెకి పిలిపించి కారుకు సంబందించిన పత్రాలను కమల్ అందజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ తొలి ప్రభుత్వ బస్సు డ్రైవర్ వసంత కుమారి, తొలి అంబులెన్స్ డ్రైవర్ వీరలక్ష్మీ అని గుర్తు చేశారు. తొలి ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా షర్మిల పేరుగడించారని గుర్తు చేశారు. డ్రైవర్ కావాలన్న తన కలను సాకారం చేసుకున్న షర్మిల భవిష్యత్తులో తనలాంటి యువతులకు ఆదర్శంగా ఉండటమే కాకుండా, పది మందికి ఉద్యోగాలు కల్పించే యజమాని స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. -
కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయింది?
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా అందరి మన్ననలు పొందుతున్న ఎం షర్మిల(24) శుక్రవారం రోడ్డున పడ్డారు. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లో ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది. కోయంబత్తూరులో బస్సు డ్రైవర్ షర్మిల ఇటీవల సెలబ్రటీ అయ్యారు. ఆమె ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు అనేక మంది మీడియా ముందుకొచ్చారు. తాము సైతం డ్రైవింగ్ నేర్చుకుని బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రటీగా మారిన షర్మిలను అభినందించేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడే వాళ్లు మరీ ఎక్కువే. డ్రైవర్‌గా ఆమె పనితీరును పరిశీలించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం కోయంత్తూరుకు వచ్చారు. కండక్టర్ తీరుతో.. షర్మిల నడిపే బస్సులో ఇదివరకు ఉన్న మగ కండక్టర్‌ను తొలగించి శుక్రవారం నుంచి కొత్తగా లేడీ కండక్టర్‌ను ఆ ట్రావెల్స్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే, ఆ లేడీ కండక్టర్ రూపంలో షర్మిలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన బస్సులోకి హఠాత్తుగా కనిమొళి ఆమెతో పాటు మరికొందరు ఎక్కడంతో షర్మిల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె పనితీరున స్వయంగా కనిమొళి వీక్షించి, అభినందించారు. అయితే, ఆ లేడీ కండక్టర్ టికెట్టుకు చిల్లర ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు ఆమెతో వచ్చిన వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. జాబ్ పోలేదు? తనకోసం కనిమొళి రావడంతో ఆ కండక్టర్‌ను షర్మిల వారించారు. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్‌లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ గాంధీపురం స్టాప్‌లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎంపీ కనిమొళి పట్ల మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేశారు. ఏదేమైనా తన కలల కొలువుకు దూరమైనట్టు బాధపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బస్సు యజమాని దురై కన్నా మాత్రం మరోలా స్పందించారు. వ్యక్తిగత పబ్లిసిటీ షర్మిలకు పెరిగిందని, అయినా, తాము భరిస్తున్నామని, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని బస్సు యాజమాని దురై కన్న పేర్కొన్నారు. ఈ వ్యవహారం కనిమొళి దృష్టికి చేరడంతో షర్మిలతో ఆమె వ్యక్తిగత సహాయకులు మాట్లాడినట్టు సమాచారం. -
రైడ్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం..స్పందించిన కంపెనీ
ఇటీవల ఆన్లైన్లో కారు లేదా బైక్ బుక్ చేసుకుని హాయిగా ఎక్కడికైనా సులభంగా ప్రయాణించేస్తున్నాం. అందులోకి ర్యాపిడో వచ్చాక మరింత ప్రయాణం సులభమైంది. సింగిల్‌గా వెళ్లాలంటే ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటే చాటు తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రయాణించవచ్చు. ఐతే ఇక్కడొక మహిళ కూడా అచ్చం అలానే ఆన్లైన్లో బైక్ బుక్‌చేసుకుంటే..ఆ ర్యాపిడో డ్రైవర్ నుంచి మహిళ ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ మేరకు ఆమె తనకు ఆ డ్రైవర్‌కు మధ్య సాగిన వాట్సాప్ మెసేజ్‌ల సందేశాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ ట్టిట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..హసన్పరీ అనే మహిళ బైక్ రైడ్‌ని బుక్ చేసుకుంటే..డ్రైవర్ పికప్ చేసుకుని రైడ్ పూర్తి అయిన తర్వాత ఆ వ్యక్తి మహిళకు పంపిన మెసేజ్‌లు చూసి ఒక్కసారిగా కంగుతింది. ఆ సందేశంలో తాను ఆమె వాయిస్, ఫ్రోఫైల్ ఫోటో చూశాకే పికప్ చేసుకోవడానికి వచ్చానని లేదంటే అసలు పికప్ చేసుకోవడానికి వచ్చే వాడని కాదని చెప్పాడు. దీంతో ఆ ర్యాపిడో డ్రైవర్ అనుచిత ప్రవర్తనకు మండిపడుతూ వెంటనే సదరు కంపెనీకి ఆ వాట్సాప్ సందేశాలను పంపించి మరీ ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన ర్యాపిడో కేర్ సదరు మహిళకు క్షమాపణలు చెప్పడమే గాక సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అతను తన వృత్తి ధర్మాన్ని పాటించడంలో సరైన విధానం లేకపోవడంతోనే అలా ప్రవర్తిచాడని అని వివరణ ఇచ్చుకుంది. అలాగే ఆ మహిళను తాను బుక్‌చేసుకున్న రైడ్ ఐడిని రిజష్టర్ మొబైల్ నెంబర్ ద్వారా మెసేజ్ చేయండి తక్షణమై సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చింది. ఐతే నెటిజన్లు మాత్రం ఆమె ధైర్యంగా సదరు డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినందుకు మెచ్చుకోవడమే గాక ఈ రోజుల్లో ర్యాషిడో డ్రైవర్లు కూడా సేఫ్ కాదంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతూ ట్వీట్ చేశారు. shared my location with a captain at @rapidobikeapp and this is what i get???? FUCK YOUR APP FUCK YOUR MEN FUCK MEN pic.twitter.com/EHLqd7lpt5 — husnpari (@behurababe) March 12, 2023 (చదవండి: ప్లాస్టిక్ బ్యాగ్‌లో చిధ్రమైన స్థితిలో తల్లి మృతదేహం..కూతురు అరెస్టు) -
ఐటీ జాబ్ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లు, భవనాలు, సంపద ఇలా ఏదో ఒకటి వార్తల్లో నిలుస్తూనే ఉండడం షరా మామూలే. అయితే ఒక్కోసారి సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి దగ్గర పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి విషయాలు కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డ్రైవర్ సాలరీపై సోషల్‌మీడియాలో ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2017లో ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు నెట్టింట ఓ వీడియో హల్చల్ చేస్తోంది. దీని ప్రకారం.. అంబానీ డ్రైవర్‌కు ఏడాదికి రూ.24 లక్షలు. ఐటీ రంగంలో కొన్ని కంపెనీల సీఈఓలకు, ఇతర సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ప్రస్తుత రోజుల్లో ఈ స్థాయి జీతం లభించడం లేదు. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. అయితే 2023లో అతని జీతం ఎంత అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారి ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. వామ్మో.. అంత సాలరీ ఎందుకు సెలబ్రిటీల కుటుంబానికి డ్రైవర్‌గా జీవితం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ ప్రపంచకుబేరుడు ఇంట్లో సిబ్బందిగా పనిచేయాలంటే.. వాళ్లు చేసే పనికి సంబంధించి ఎంతో నైపుణ్యం ఉండాల్సిందే. వివరాల ప్రకారం వీరిని ఒక ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకుంటారట. కేవలం వీరికి డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు సెలబ్రిటీల లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు అనుకూలంగా నడుచుకోవడం, యజమానుల వద్ద అనుసరించాల్సిన విధివిధానాలు, క్రమ శిక్షణ కూడిన ప్రవర్తనతో పాటు మరికొన్ని అంశాలతో కఠినమైన శిక్షణను కూడా అందిస్తారు. వీటితో పాటు లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలా నడపాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయని సమాచారం. అంతేకాకుండా ఏ తరహా రోడ్ల పై, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి ట్రైనింగ్ ఇస్తారు. ఇంత తతంగం ఉంది కనుకే వారి జీతం కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో సెలబ్రీటల ఇంట పని చేస్తున్న సిబ్బంది జీతాలు ఆకర్షణీయంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. చదవండి: ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే? -
పనితీరు బావుంటే డ్రైవర్ పోస్టు
సాక్షి, హైదరాబాద్: అస్తవ్యస్థ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అద్దె బస్సు డ్రైవర్ల ను దారిలో పెట్టేందుకు రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం అద్దె బస్సులను తగ్గించే పరిస్థితి లేనందున తప్పక వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి. దీంతో వాటిని నడుపుతున్న డ్రైవర్లను గాడిలో పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత కొన్నిరోజులుగా అద్దె బస్సులు వరసగా ప్రమాదాలకు గురవుతుండటంతో నిర్లక్ష్యంగా బస్సులు నడిపే వారి పై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతోపాటు, వారికి తాయిలం ప్రకటిస్తే పరివర్తన వస్తుందన్న అధికారుల సూచనకూ సానుకూలంగా స్పందించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించటమే సమస్యకు పరిష్కారంగా అధికారులు భావిస్తున్నారు. అద్దె బస్సులకు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారిలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా డ్రైవింగ్ చేసే వారిని భవిష్యత్‌లో ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్లుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ల నియామకాలు చేపట్టినప్పుడు, మెరుగైన పనితీరు కనబరిచిన అద్దె బస్సు డ్రైవర్లకు వెయిటేజీ మార్కుల రూపంలో ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తు న్నారు. 2012 తర్వాత ఆర్టీసీ డ్రైవర్లను నియమించలేదు. దీంతో దాదాపు 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్ల కొరతతో అధికారులు అద్దె బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తోంది. గతంలో మొత్తం ఆర్టీసీ బస్సుల్లో కేవలం 15 శాతం మాత్రమే ఉన్న వాటిని 20 శాతానికి పెంచేశారు. అద్దె బస్సు డ్రైవర్లకు వేతనాలు తక్కువగా ఉండటంతో నైపుణ్యం ఉన్న డ్రైవర్లు రావటం లేదు. దీంతో ఆటో, లారీ, ట్రాక్టర్ డ్రైవర్లు బస్సులు నడపడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో డ్రైవర్ల నియామకం చేపట్టేలా శాఖ యోచిస్తోంది. దీంతో అద్దె బస్సులను భద్రంగా నడిపిన డ్రైవర్లకు వెయిటేజీ ఇచ్చి రెగ్యులర్ డ్రైవర్లు్లగా నియమించుకోవాలనే ఆలోచనను అధికారులు మంత్రి ముందుంచారు. దీని సాధ్యాసాధ్యాలు చూసి నివేదిక ఇవ్వమని ఆయన ఆదేశించారు. అద్దె బస్సు డ్రైవర్లకు ఈ సంకేతం చేరితే ఆర్టీసీ ఉద్యోగం వస్తుందన్న ఆలోచనతో బస్సులను భద్రంగా నడిపే అవకాశం ఉంటుందనేది అధికారుల యోచన. -
బతుకు బండి లాగాలని..
గుంటూరు: మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. లేకుంటే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా భృతి చెల్లిస్తాం.. అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాటలు నీటి మూటగానే మిగిలాయి. పేదరికాన్ని జయిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ విద్యను పూర్తి చేసిన యువత రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక, కూలీ పనులు చేయడం చేతకాక ఏమి చేయాలో పాలు పోని అయోమయ స్థితిలో యువత కొట్టుమిట్టాడుతున్నారు. 7వ తరగతి విద్యార్హత ఉన్న డ్రైవర్ పోస్టుల కోసం డిగ్రీ ఆపై చదువులు చదివిన యువత పోటీ పడాల్సిన గత్యంతరం ఏర్పడింది. నిరుద్యోగ రక్కసి కోరల్లో నిరుద్యోగ యువత సతమతమౌతున్నారనడానికి హోంగార్డు డ్రైవర్ పోస్టులే నిదర్శనం. యువత పోటాపోటీ.. రాజధాని ప్రాంతమైన గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో మొత్తం 40 హోంగార్డు డ్రైవర్ పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత మొత్తం 600 దరఖాస్తులు అందాయి. వారిలో అర్హత ఉన్న 340 మందిని శనివారం పిలిపించగా వారిలో 274 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఎత్తు కొలతలు పరిశీలించి వారిలో 10 మంది నిబంధనల ప్రకారం ఎత్తు లేక పోవడంతో వెనక్కి పంపించి మిగిలిన వారికి రాత పరీక్ష నిర్వహించగా 84 మంది డ్రైవింగ్ టెస్ట్‌కు అర్హత సాధించారు. వారికి ఆదివారం జిల్లా ఉపరవాణాశాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు పీజీ, ఆరుగురు బీటెక్, పది మంది డిగ్రీ చదివారు. మిగిలిన వారంతా పది పాసైన వారు ఉన్నారు. కనీస విద్యార్హత 7వ తరగతి చదివిన వారు లేకపోవడం గమనార్హం. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి చివరిగా మెడికల్ టెస్ట్‌లు జరిపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ హోంగార్డు డ్రైవర్ పోస్టులకు యువత పోటీ పడ్డారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ఆరోపణలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. నాతోపాటు అదనపు ఎస్పీ, హోంగార్డు డీజీ కార్యాలయ సిబ్బందితో కలసి కమిటీ ఉంటుంది. ఎంపిక ప్రక్రియను వీడియా ద్వారా నమోదు చేశాం. అర్హులకు త్వరలో శిక్షణ ఇస్తాం. – సీహెచ్ విజయారావు, అర్బన్ ఎస్పీ ఎనిమిదేళ్లుగా డ్రైవర్‌గా చేస్తున్నా.. డిగ్రీ పూర్తి చేశాక ఏడాది పాటు ఖాళీగా ఉన్నాను. ఉద్యోగాల కోసం పలు చోట్లు ప్రయత్నించాను. ప్రయోజనం లేకపోవడంతో లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకొని 2008 నుంచి ప్రైవేటు వాహనాలకు డ్రైవర్‌గా చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాను. ఉద్యోగం వస్తే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. – కె.బాజి -
హోంగార్డు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో పోలీస్ విధులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులకు వాహనాల కేటాయింపు జరగడంతో మూడేళ్లుగా అర్బన్ జిల్లా పోలీసులు డ్రైవర్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించేందుకు హోంగార్డు పోస్టులో డ్రైవర్లను తీసుకునేందుకు అర్బన్ ఎస్పీ సిహెచ్.విజయారావు శ్రీకారం చుట్టారు. అర్బన్ జిల్లా పరిధికి చెందిన అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 40 హోంగార్డు పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అర్హతల వివరాలను బుధవారం ఎస్పీ వెల్లడించారు. అర్హతలు అర్బన్ జిల్లా పరిధిలోని గుంటూరు నగరంతోపాటు నల్లపాడు, మేడికొండూరు, పత్తిపాడు, వట్టిచెరుకూరు, చేబ్రోలు, కాకాని, మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని వారు మాత్రమే దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, 7వ తరగతి పాసై, కనీసం 160 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎలాంటి కేసులు లేకుండా, సత్ప్రవర్తన కలిగి ఉండి, ఆరోగ్యవంతులు అర్హులు. హెవీమోటరు వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు ఇలా.. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 8న ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేస్తారు. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యుర్థులు ఎస్పీ గుంటూరు అర్బన్ జిల్లా పేరుతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెల్లే విధంగా రూ.25 డీడీని తీసుకొని ప్రత్యేక కౌంటర్ వద్దకు వెళ్లాలి. అక్కడ డీడీ చూపితే విధుల్లో ఉండే అధికారులు దరఖాస్తు అందజేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటుగా విద్యార్హత, జనన ధ్రువీకరణ, స్థానికత, కుల ధ్రువీకరణ, లైసెన్స్, ఆధార్ జిరాక్స్ కాపీలతో పాటు మూడు పాస్‌పోర్టు ఫొటోలను జతచేసి అధికారులకు అందజేయాలి. సద్వినియోగం చేసుకోండి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తుల అందజేతలో ఎలాంటి తప్పులు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టినా విచారణలో పట్టుబడితే చర్యలు తప్పవు. అర్హులైన వారు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. –సిహెచ్.విజయారావు, అర్బన్ ఎస్పీ -
అగ్నిమాపక శాఖలో 1051 డ్రైవర్ పోస్టుల భర్తీ
► రాష్ట్ర డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ నర్సీపట్నం : అగ్నిమాపకశాఖలో 1051 డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని విపత్తులు, అగ్నిమాపకశాఖ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన నర్సీపట్నం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 అధునాతన ఫైర్ వాహనాలను కొనుగోలు చేశామన్నారు. 54 మీటర్ల ఎత్తులో ప్రమాదాలు జరిగితే నిరోధించడానికి హైడ్రాలిక్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అగ్నిమాపకశాఖలో వినూత్న మార్పులు తీసుకురావటం జరిగిందన్నారు. విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 50 మంది సిబ్బంది ఒరిస్సాలో శిక్షణ పొందారన్నారు. 25మంది ఫైర్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ప్రత్యేక శిక్షణ నిమిత్తం 50 మందిని నాగపూర్‌కు పంపిస్తున్నామన్నారు. అన్ని విధాలుగా అగ్నిమాపకశాఖను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. -
9,920 కండక్టర్, 14,657 డ్రైవర్ పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 9,920 కండక్టర్, 14,657 డ్రైవర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటి భర్తీ బాధ్యతను యాజమాన్యానికే అప్పగించింది. నేరుగా నియామకాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ జీవోను ఆధారంగా చేసుకుని ఒకట్రెండు రోజుల్లో రవాణా శాఖ మరో జీవో జారీ చేయనుంది. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందినే ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నారు. కాగా ఆర్టీసీలోని పోస్టులతోసహా మొత్తం 26,395 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. హోం, న్యాయ, రెవెన్యూ శాఖల్లోని 734 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, గిరిజన సంక్షేమ శాఖలో 898 టీచర్ పోస్టులు. బేవరేజెస్ కార్పొరేషన్లో 175 పోస్టులు భర్తీ చేస్తారు. ఖాళీలు తెలుసుకుని ఫీజు చెల్లించండి సాక్షి, హైదరాబాద్: వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ముందుగా తమ విభాగంలో ఖాళీలు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయం సూచించింది. రోస్టర్ పాయింట్ ప్రకారం తమ విభాగం(రిజర్వేషన్) కోటాలో ఖాళీలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తు రుసుం చెల్లించాలని కోరింది.