► రాష్ట్ర డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ
నర్సీపట్నం : అగ్నిమాపకశాఖలో 1051 డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని విపత్తులు, అగ్నిమాపకశాఖ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ కె.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన నర్సీపట్నం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 అధునాతన ఫైర్ వాహనాలను కొనుగోలు చేశామన్నారు. 54 మీటర్ల ఎత్తులో ప్రమాదాలు జరిగితే నిరోధించడానికి హైడ్రాలిక్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అగ్నిమాపకశాఖలో వినూత్న మార్పులు తీసుకురావటం జరిగిందన్నారు. విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే 50 మంది సిబ్బంది ఒరిస్సాలో శిక్షణ పొందారన్నారు. 25మంది ఫైర్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ప్రత్యేక శిక్షణ నిమిత్తం 50 మందిని నాగపూర్‌కు పంపిస్తున్నామన్నారు. అన్ని విధాలుగా అగ్నిమాపకశాఖను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు.
అగ్నిమాపక శాఖలో 1051 డ్రైవర్ పోస్టుల భర్తీ
Published Sat, Aug 19 2017 11:11 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM
Advertisement
Advertisement