Replacement
-
ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోమని న్యాకోనే చెప్పిందట!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు పాతరేసింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల నియామకాల్లో కనీస నిబంధనలు పాటించడంలేదు. గోప్యంగా ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కావాల్సిన వారికి పోస్టులు కట్టబెడుతోంది. తాజాగా ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (శాక్స్)లో వైద్య పోస్టులను ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వైద్య శాఖ భర్తీ చేయడం విమర్శలకు దారితీసింది. ఎయిడ్స్ రోగులకు చికిత్స అందించే యాంటి రెట్రోవైరల్ థెరఫీ (ఏఆర్టీ) సెంటర్స్‌లో మెడికల్ ఆఫీసర్(ఎంవో) పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వకుండానే హార్మోని కన్సల్టెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇదే విధానంలో మంగళవారం ముగ్గురు వైద్యులను నియమించారు. ఈ వ్యవహారంపై ‘నోటిఫికేషన్ ఇవ్వకుండా వైద్యుల నియామకమా?’ శీర్షికతో బుధవారం “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో న్యాకో మార్గదర్శకాలను అనుసరించే ఔట్‌సోర్సింగ్‌లో వైద్యులను నియమిస్తున్నామని శాక్స్ అధికారులు సమర్ధించుకున్నారు.వాస్తవానికి ఏఆర్టీ సెంటర్స్‌లో వైద్య, ఇతర సిబ్బంది పోస్టులను బహిరంగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని జాతీయ ఏఆర్టీ సేవల నిర్వహణ మార్గదర్శకాలు–2021లోనే న్యాకో స్పష్టంగా చెప్పింది. ఒక పోస్టుకు ఐదు దరఖాస్తులు దాటితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రతిభ కలిగిన వారిని నియమించాలని న్యాకో నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను అనుసరిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శాక్స్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేశారు. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో శాక్స్‌లో సమన్వయకర్తలు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది పోస్టులన్నింటినీ బహిరంగ నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వనించి, ఆర్ఓఆర్ పాటిస్తూ ప్రతిభ కలిగిన, అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు. రూ. లక్షల్లో వసూళ్లుకూటమి ప్రభుత్వం మాత్రం న్యాకో నిబంధనలంటూ ఔట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తోంది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న వైద్యులకు నెలకు రూ.72 వేల వేతనం ఉంటుంది. ఎన్హెచ్ఎం పరిధిలో ఇంతకంటే తక్కువ వేతనం ఇస్తున్నారు. దీంతో ఏఆర్టీ సెంటర్లలో వేతనం కొంత ఎక్కువ, పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వీటికి బహిరంగ నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ మంది యువ వైద్యులు ముందుకు వస్తారని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయినా, అర్హులకు అన్యాయం చేస్తూ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం అవుట్సోర్సింగ్ రూ. లక్షల్లో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక శాక్స్‌లో ఇదే తరహాలో క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో ఓ కీలక అధికారి బంధువుకు గుంటూరు జిల్లాలో ఓ పోస్టును కట్టబెట్టారు. -
పుజారాకు నిరాశ..!
లండన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా వచ్చే ఏడాది కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోడని గురువారం ససెక్స్ క్లబ్ వెల్లడించింది. పుజారా స్థానంలో ఆ్రస్టేలియా ఆటగాడు డేనియల్ హ్యూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.గత మూడేళ్లుగా ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారాను ఈసారి ఆ క్లబ్ రిటైన్ చేసుకోలేదు. ‘పుజారాను కాదని హ్యూస్‌ను ఎంపిక చేసుకోవడం కష్టమైన పనే. కానీ, హ్యూస్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. అంతేకాక టి20 మ్యాచ్‌లు కూడా ఆడతాడు. పుజారాకు సరైన ప్రత్యామ్నాయం అతడే అనిపించింది’ అని ససెక్స్ హెడ్ కోచ్ పాల్ ఫార్బస్ అన్నాడు. -
వోల్వో.. వద్దు
సాక్షి, హైదరాబాద్: గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగుకానున్నాయి. ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కో వోల్వో బస్సుకు నెలకు సగటున రూ.లక్షకు పైగా నిర్వహణ ఖర్చు వస్తోంది. పైగా చిన్న రిపేరు చేయాల్సి వచ్చినా.. కంపెనీకి తరలించాల్సి రావటం, ఒక్కో పనికి రూ.3–4 లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా 20 వరకు బస్సులను పక్కన పెట్టేసింది. త్వరలో మరికొన్నింటిని తుక్కు కింద మార్చబోతోంది. వాటి స్థానంలో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడపబోతోంది. సామర్థ్యానికి మించి నడపటంతోనే.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండటంతో ఆర్టీసీ కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చటం అనివార్యమైంది. రెండు దశాబ్దాల క్రితం గరుడ పేరుతో బస్సులు ప్రారంభించారు. ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంజ్, ఇసుజు కంపెనీల బస్సులు నడిపారు. ఆ తర్వాత మల్టీ యాక్సెల్ బస్సులను గరుడ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో వోల్వో, స్కానియా బస్సులు వాడారు. 2016–17లో కొత్త వోల్వో బస్సులు కొన్నారు. సాధారణంగా ఆ కంపెనీ బస్సులు ఏడెనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు చెబుతారు. అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు ఏర్పడతాయి. ఒక్కో బస్సు ధర రూ.1.3 కోట్ల వరకు ఉండటంతో వెంటవెంటనే కొత్తవి సమకూర్చటం కుదరదు. అంత ధర పెట్టి కొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చటానికి ఆర్టీసీ అధికారులకు మనస్కరించటం లేదు. దీంతో ఏకంగా 14 లక్షల నుంచి 15 లక్షల కి.మీ. వరకు తిప్పుతున్నారు. దీంతో ఆ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేస్తుంటారు. కానీ వోల్వో కంపెనీలో ఆయిల్ మార్చటం లాంటి చిన్నచిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిదిద్దాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్య తలిత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే. వారొచ్చి మరమ్మతు చేసి రూ.మూడు నాలుగు లక్షల బిల్లు వేసి వెళుతున్నారు. ఇది ఆర్టీసీ చేతి చమురు వదిలిస్తోంది. ఒక్కో బస్సుకు ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో 14 లక్షల కి.మీ. దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు ప్రారంభించింది. ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను వాటి బదులు తిప్పుతోంది. ఇటీవలే 16 లహరి బస్సులను వాటికి చేర్చింది. త్వరలో 40 వోల్వో బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మిగతా వాటిని దశలవారీగా ఆపేయనుంది. పోటీని తట్టుకోగలదా..? ప్రస్తుతానికి బహుళజాతి కంపెనీ బస్సులు కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంగళూరు, షిర్డీ, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆధునిక బస్సులు సమకూర్చుకుంటున్నాయి. ఆ కేటగిరీ బస్సులు ఆర్టీసీలో లేకపోవటం వెలితిగానే మారనుంది. ఇది ప్రయాణికుల ఆదరణపై ప్రభావం చూపే అవకాశముంది. అప్పటి పరిస్థితిని పరిశీలించి వాటిని కొనాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ఇప్పట్లో వాటిని కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించటం గమనార్హం. -
హిమాచల్ సీఎం రేసులో ప్రతిభా సింగ్? ఆమె నేపథ్యం ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో సీఎంను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖును తొలగించి, సీనియర్ నేత ప్రతిభా సింగ్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత ప్రతిభా సింగ్ దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య. వీరభద్ర సింగ్ ఆరుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిభా సింగ్ 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నాడు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2012లో ఆమె భర్త వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన లోక్‌సభకు రాజీనామా చేశారు. దీంతో 2013లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో నిలిచి, బీజేపీ నేత జైరామ్ ఠాకూర్‌ను ఓడించారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వేవ్‌లో బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ 39 వేలకు పైగా ఓట్ల తేడాతో ప్రతిభా సింగ్‌పై విజయం సాధించారు. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతిభా సింగ్ ఓటమితో నేతలంతా కంగుతిన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత 2021లో ప్రతిభా సింగ్ ఎన్నికల బరిలో విజయం సాధించారు. 2022, ఏప్రిల్ 26న, హైకమాండ్ ప్రతిభా సింగ్‌ను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ 32వ అధ్యక్షురాలిగా నియమించింది. ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 1956 జూన్ 16న జన్మించారు. ప్రతిభా సింగ్ వీరభద్ర సింగ్‌ను 1985లో వివాహం చేసుకున్నారు. ప్రతిభ అతనికి రెండవ భార్య. వీరభద్ర సింగ్ మొదటి భార్య కుమార్తె అభిలాషా కుమారి గుజరాత్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్‌ల కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పనిచేశారు. -
మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మహిళలకు హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 (33.3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జీఓ ఎంఎస్ 3ను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనిపక్షంలో వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం) ఇకపై ఉండబోదు. దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు 33.3 శాతం రిజర్వు చేస్తున్నప్పటికీ.. కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓఎంఎస్ 35 జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీతో పా టు ఇతర బోర్డులకు పంపించారు. దీంతో ఏదైనా నోటిఫికేషన్లో నిర్దేశించిన అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేని సందర్భంలో, అదే కమ్యూనిటీకి చెందిన పురుషులతో భర్తీ చేయ డం వల్ల పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉత్పన్నం కాదు. మహిళలకు నిర్దేశించిన పోస్టులు పురుషులతో భర్తీ చేస్తే... మహిళలకు దక్కాల్సిన 33.3% దక్కకుండా పోతాయనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా ప రిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది. -
ప్రజాపాలన తర్వాత నామినేటెడ్‌పై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులను ఖరారు చేసే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. మొదటి నుంచీ చర్చ జరుగుతున్న విధంగా సంక్రాంతి లోపు మొదటి దఫా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు తనను కలిసిన విలేకరులతో సీఎం రేవంత్ ఈ మేరకు తన మనసులో మాట చెప్పారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో తనతో ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో పలుకుబడి పనిచేయవని, పార్టీ కోసం కష్టపడ్డవారికి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా త్యాగం చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. తీవ్ర పోటీ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, సిఫారసులు తీసుకుని ఆరో తేదీ తర్వాత ముఖ్యమంత్రి కసరత్తు పూర్తి చేయనున్నారు. అనంతరం ఆ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపి అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత సంక్రాంతిలోపు ఈ పదవుల పందేరంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా, పదేళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. రాజకీయంగా గుర్తింపు ఉండే కీలక కార్పొరేషన్లతో పాటు ఇతర కార్పొరేషన్లకు చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల కోసం పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంత తయారయింది. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, పార్టీలో అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా సీఎం రేవంత్ ఈ పోస్టులపై మరింత స్పష్టత ఇస్తారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురూ!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. దాదాపు 9వేల ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) మూడు కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షల తాలుకూ ప్రశ్నాపత్రాల కీలను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారు. ఎల్బీనగర్లోని కళాశాలలో శిక్షణ తరగతులు గురుకుల కొలువులకు సంబంధించి 9 రకాల నోటిఫికేషన్లు జారీ చేయగా... ఇందులో దాదాపు 54 రకాల ఉద్యోగాలున్నాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ధ్రువపత్రాల పరిశీలనను నిశితంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరికి ధ్రువపత్రాల పరిశీలనపై ముందుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరిశీలనాధికారులకు ఈనెల 28, 29 తేదీల్లో ఎల్బీనగర్లోని గురుకుల కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. రెండ్రోజలు శిక్షణలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనపై అవగాహన కల్పిస్తారు. వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు మరోవైపు మహిళా రిజర్వేషన్లు, ఒకట్రెండు కేటగిరీల్లోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్డు పరిధిలో ఉండగా... వాటికి నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో వచ్చే నెల రెండో వారం కల్లా 1:2 జాబితాలు విడుదల చేసి... ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సైబర్ నిపుణులు కావాలి!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ నిపుణులను రంగంలోకి దించనుంది. ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు సైబర్ సాంకేతిక నిపుణులు కావాలంటూ కేంద్ర హోంశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు అంశాలకు సంబంధించి నిపుణులకు వారి అనుభవం ఆధారంగా నెలకు రూ.65 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనం ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నా రు. ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు https://tcil.net.in/ current &opening.php పై క్లిక్ చేసి అందు లోని వివరాలు చూడవచ్చని తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసే వీరికి కేంద్ర హోంశాఖకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. అర్హతలు, అనుభవం, వేతనం... సీనియర్ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్: ఉండాల్సిన స్కిల్స్..సైబర్ సెక్యూరిటీలో పనిచేసిన అనుభవం, సెక్యూరిటీ స్ట్రాటజీ, పాలసీ ఫార్ములేషన్, ప్లానింగ్. నెలకు వేతనం..రూ. 2,50,000 థ్రెట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్: ఉండాల్సిన స్కిల్స్..సెక్యూరింగ్ క్రిటికల్, సెన్సిటివ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెలకు వేతనం..రూ.1,60,000 డాటా ఎనలైటిక్స్ ప్రొఫెషనల్: నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్..యూపీఐ, ఐఎంపీఎస్, ఏఈపీఎస్ వంటి పేమెంట్స్ టెక్నాలజీపై అవగాహన, ఆర్బీఐ, ఇతర నిబంధనలపై అవగాహన..నెలకు వేతనం..రూ. 1,60,000. మాల్వేర్ రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్.. ఫిషింగ్ ఎటాక్స్, మాల్వేర్ ఎటాక్స్లపై పూర్తి అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్–టెలీకాం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఉండాల్సిన స్కిల్స్..4జీ, 5జీ వంటి టెలికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై, సిమ్‌బాక్స్, వీఓఐపీ వంటి అంశాల్లో అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 టెక్నికల్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. ఎంఎస్ ఎక్సెల్, ఫైనాన్స్ అంశాలపై అవగాహన ఉండాలి.. నెలకు వేతనం.. రూ.65,000 సైబర్ థ్రెట్ అనలిస్ట్: ఉండాల్సిన స్కిల్స్.. సోషల్ మీడియా అనాలసిస్, రిపోర్ట్ క్రియేషన్, క్రైం రీసెర్చ్‌లో అవగాహన..నెలకు వేతనం.. రూ.65,000 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. మోరాకో ప్రోగ్రామింగ్ ఎక్సెల్ ఆటోమైజేషన్లో అవగాహన.. నెలకు వేతనం..రూ.65,000 -
మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2023లో సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన ఇతర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ, విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. డీఎస్సీ ద్వారా 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, అయితే మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్ కాకుండా వర్టికల్ రిజర్వేషన్ పాటిస్తోందంటూ బోడ శ్రీనివాసులు సహా 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘డీఎస్సీలో మహిళలకు 33.33 శాతానికి బదులు 51శాతం పోస్టులను కేటాయించారు. గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను విద్యా శాఖ పాటించడం లేదు. ఉపాధ్యాయ నియామకాల్లో కూడా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. సమాంతర రిజర్వేషన్ పాటించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
3,282 వర్సిటీ పోస్టులకు నోటిఫికేషన్
రాజానగరం: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితో పాటు డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ తదితర ప్రతి పోస్టునూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీకి సోమవారం వచ్చిన హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వారిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో బోధిస్తున్నరన్నారు. వీరిలో సుమారు వెయ్యి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ (విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజుల నుంచి జీతాలు పొందేవారు) కింద పని చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రారని, వారి విధులకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన వారు ఓపెన్ రిక్రూట్మెంట్లో ఇతరులతో పాటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఇచ్చే 10 శాతం వెయిటేజీ మార్కులను ఏడాదికి ఒకటి చొప్పున లెక్కిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారన్నారు. వారి నుంచి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేస్తారని చెప్పారు. వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీని కోసం ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రెహమాన్ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భర్తీ ప్రక్రియను ప్రకటిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసమే ఇంటర్న్‌షిప్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోందనే ఉద్దేశంతోనే చదువుకునే సమయంలోనే ఇంటర్న్‌షిప్ చేయాలనే నిబంధన పెట్టామని ఆచార్య హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలుంటాయన్నారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయనే సమాచారాన్ని ఐఐసీ పోర్టల్‌లో ఉంచుతున్నామని వివరించారు. ఇవి కాకుండా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నమని చెప్పారు. ఏడాదికి 3.50 లక్షల మంది ఇంటర్న్‌షిప్ చేయాల్సి వస్తుండగా సుమారు 5 లక్షల అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
మొన్న రిజల్ట్..నిన్న వెరిఫికేషన్..నేడు జాబితా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు. అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్‌లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్ఎస్ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడ్రోజుల్లో మమ... డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. -
అధ్యాపకుల నియామకానికి చర్యలు
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఓయూ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) ఉపాధ్యక్షులు ప్రొ.మల్లేశం అధ్యక్షత వహించగా వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సమాకాలిన ఉన్నత విద్య సవాళ్లు–పరిష్కారాలు అనే అంశం పై మాట్లాడారు. నియామకాల అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని, తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పక్రియను ప్రారంభిస్తామన్నారు. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. సీపీఎస్, పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వ అధికారులతో చర్చించి అమలు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు ఉండాలని తన అభిప్రాయంగా వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సాధించిన అభివృద్ధిని అధ్యాపకులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు అప్పారావు, విద్యాసాగర్, చెన్నప్ప, మహేందర్‌రెడ్డి, మంగు, చలమల్ల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కాశీం, సూర్య ధనుంజయ్, లావణ్య, జమీల్, అలియాబేగం తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ అధ్యాపకుల సంఘం ఏర్పాటు వర్సిటీల అధ్యాపకుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడేందుకు 15 వర్సిటీల అధ్యాపకులతో నూతన సంఘాన్ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్–ఏయూటీఏ) పేరుతో ఏర్పాటు చేసినట్లు ప్రొ.మల్లేషం పేర్కొన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. -
ఏఎన్ఎం పోస్టులు 1520
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో ఏఎన్ఎం(మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్–ఫిమేల్) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయ్యింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలి. రాతపరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. పేస్కేల్ రూ. 31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ప్రాతిపదికన ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే ఈ రెండు పద్ధతుల్లో ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న దానిపై త్వరలో వెల్లడిస్తామని గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు రుసుము రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ తదితర కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. ఇవీ అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సు చేసి ఉండాలి. లేదా ఇంటర్లో మల్టీపర్పస్ హెల్త్ వర్క ర్ (ఫిమేల్) శిక్షణ కోర్సు పాసై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. నిర్ధారించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిపాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. లేదా గుర్తించిన ఆస్పత్రుల్లో ఏడాది అప్రెంటిషిప్ పూర్తి చేసి ఉండాలి. వారు తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే, ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. దరఖాస్తుదారులు 18 – 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. వివిధ వర్గాలకు సంబంధించి వారికి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ అనుభవమున్న వారు ధ్రువీకరణపత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఏ సేవలు అందించి ఉంటే, ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. అప్లోడ్ చేయాల్సినవి : అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నమో దు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, పదోతరగతి సర్టిఫికెట్, అర్హత సాధించిన కో ర్సులకు చెందిన సర్టిఫికెట్లు ఉండాలి. అనుభవ ధ్రు వీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే కులధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్–క్రిమీలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వే షన్ కోరేవారు తాజా ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫికెట్, ఎన్సీసీ ధ్రువీకరణపత్రం వంటివి అవసరాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ఏఎన్ఎం పోస్టులను జోన్లవారీగా భర్తీ చేస్తా రు. ఆయా జోన్ల అభ్యర్ధులకే 95% పోస్టులు కేటా యిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జోన్–1 (కాళేశ్వరం)లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు జిల్లాలు. జోన్–2 (బాసర)లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జోన్–3 (రాజన్న)లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జోన్–4 (భద్రాద్రి)లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జోన్–5(యాదాద్రి)లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం జోన్–6(చార్మినార్)లో మేడ్చల్ మల్కాజిగి రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జోన్–7(జోగులాంబ)లో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలున్నాయి. మొత్తం పోస్టులు: 1520 (ఫిమేల్) దరఖాస్తులు స్వీకరణ: వచ్చేనెల 25న ఉదయం 10:30 నుంచి దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5:30 వరకు పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ -
రష్యా నుంచి.. మరో ఎయిరిండియా విమానంలో తరలింపు
రష్యా: సాంకేతిక లోపం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో రష్యా మగడాన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోని ప్యాసింజర్లు మరియు సిబ్బందిని శాన్ ఫ్రాన్సిస్కో చేరవేసేందుకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్లైట్ ను ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. ఈ ఫ్లైట్ రష్యా మగడాన్ ఎయిర్ పోర్టు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణమైనట్లుగా ఎయిర్ ఇండియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణికుల అవస్థలు.. ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణమైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 777 కు గగనతలంలో ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం కారణంగా రష్యాలోని మగడాన్ ఎయిర్ పోర్టులో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 216 ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బందిని అప్పటికప్పుడు సమీప పట్టణంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. అయితే.. అక్కడ వారికి సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. మరో గత్యంతరం లేక నేల మీదే నిద్రకు ఉపక్రమించారు. దీనికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియా, మీడియాలోనూ వైరల్ అయ్యాయి. దీంతో ఎయిరిండియా నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులందరికీ ఊరట కలిగింది. ఫ్లైట్ బయలుదేరింది.. ఈ నేపథ్యంలో రష్యా మగడాన్ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన ఎయిర్ ఇండియా సాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో ఈ ఫ్లైట్ లోని పాసింజర్లకు మరోసారి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రిసీవ్ చేసుకునేందుకు అక్కడి ఎయిర్ పోర్టులో సహాయక సిబ్బంది సంఖ్యను పెంచి వారిని అప్రమత్తం చేసినట్లు కూడా వెల్లడించింది. UPDATE: AIR INDIA FLIGHT AI173D TAKES OFF FOR SAN FRANCISCO FROM MAGADAN Flight AI173D from Magadan, Russia (GDX) is now airborne for San Francisco (SFO), carrying all passengers and crew. The flight departed GDX at 1027 Hours on 08 June 2023 (local time) and is expected to… — Air India (@airindia) June 7, 2023 -
KL రాహుల్ అవుట్.. LSG లోకి కొత్త ప్లేయర్
-
పంజాబ్ కింగ్స్‌లో కీలక మార్పు.. గాయపడ్డ ఆల్‌రౌండర్ రీప్లేస్మెంట్ ఎవరంటే..?
పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. భుజం గాయంతో బాధపడుతూ సీజన్ మొత్తానికే దూరమైన యువ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బవా స్థానంలో పంజాబ్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గుర్నూర్ సింగ్ బ్రార్‌ను ఎంపిక చేసుకుంది పీబీఎస్కే యాజమాన్యం. బ్రార్‌ను బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకున్నట్లు పంజాబ్ యాజమాన్యం వెల్లడించింది. గత ఐపీఎల్ సీజన్ (2022) రెండు మ్యాచ్‌లు ఆడిన బవా.. ప్రస్తుత ఎడిషన్ ప్రారంభానికి ముందే గాయపడిన విషయం తెలిసిందే. (రాజ్ అంగద్ బవా) గుర్నూర్ సింగ్ బ్రార్ విషయానికొస్తే.. ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ 2022 డిసెంబర్లో పంజాబ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ తరఫున ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన బ్రార్ 120.22 స్ట్రయిక్‌రేట్‌తో 107 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 3.80 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. (గుర్నూర్ సింగ్ బ్రార్) ఇదిలా ఉంటే, రన్నింగ్ ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో కేకేఆర్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. 3 వికెట్లు పడగొట్టిన కేకేఆర్ పతనానికి బీజం వేసిన అర్షదీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్
IPL 2023: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్. గాయంతో టోర్నీకి దూరమైన కేన్ విలియమ్సన్ స్థానంలో లంక కెప్టెన్ దాసున్ షనకను ఎంపిక చేసింది. ఈ మేరకు గుజరాత్ టైటాన్స్ షనక ఎంపికను ఖరారు చేసింది. సీఎస్కేతో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ తీసుకునే క్రమంలో కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతని కుడి కాలు బెణికినట్లు తెలిసింది. ప్రస్తుతం చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్లిపోయిన విలియమ్సన్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడని గుజరాత్ పేర్కొంది. తాజాగా కేన్ మామ స్థానంలో షనకను రూ.50 లక్షల కనీస ధరకు తీసుకున్నట్లు తేలింది. ఇక లంక కెప్టెన్‌గా షనక తన జోరు కనబరుస్తున్నాడు. ఇటీవలే టీమిండియాతో జరిగిన టి20 సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 124 పరుగులు చేశాడు. వన్డే సిరీస్‌లోనూ 121 పరుగులతో లంక టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా షనకకు ఇదే తొలి ఐపీఎల్ కావడం విశేషం. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన షనక రైట్ ఆర్మ్ పేస్ బౌలింగ్‌తో వికెట్లు తీయగల నైపుణ్యం అతని సొంతం. కాగా షనక సారధ్యంలోనే లంక జట్టు 2022లో ఆసియా కప్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. దసున్ షనకతో కేన్ విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేస్తారంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో యూజర్లను ఆకట్టుకుంటోంది. చదవండి: నక్క తోక తొక్కిన వార్నర్.. రిషబ్ పంత్ వచ్చేశాడు.. ఫోటోలు వైరల్ Jason Roy 👉 KKR Dasuna Shanaka 👉 GT#IPL2023 #KKR #GT pic.twitter.com/btHydFHxh0 — SED KKR FAN (@KirketXpertt) April 4, 2023 -
రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ సంచలనం!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ పలు సర్జరీల అనంతరం కోలుకుంటున్నాడు. పంత్ కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలలకు పైగా పట్టే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అయితే పంత్ స్థానంలో మాత్రం ఇప్పటివరకు ఎవరిని ఎంపిక చేయని ఢిల్లీ ఫ్రాంచైజీ తాజాగా బెంగాల్ సంచలనం.. వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఒక జర్నలిస్ట్ తన ట్విటర్లో షేర్ చేశాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించాల్సి ఉంది. ఇక అభిషేక్ పోరెల్ బెంగాల్ తరపున 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 695 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో నాయకుడిగా వార్నర్‌కు ఘనమైన రికార్డు ఉంది. గతంలో ఎస్ఆర్హెచ్కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్ 67 మ్యాచ్‌ల్లో 35 విజయాలు అందుకున్నాడు. అంతేకాదు ఎస్ఆర్హెచ్కు 2016లో ఐపీఎల్ టైటిల్ కూడా అందించాడు. తాజాగా అతని నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి టైటిల్ కొట్టబోతుందని జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ''పంత్ ఐపీఎల్‌కు ఫిజికల్‌గా దూరమైనప్పటికి అతను మాతోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.. అతని టీషర్ట్ నెంబర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీపై ప్రత్యేకంగా ముద్రించాలనుకుంటున్నాం'' అంటూ పాంటింగ్ తెలిపాడు. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్‌ను ఎంపిక చేసినప్పటికి అతనికి తుది జట్టులో అవకాశం రావడం కష్టమే. దేశవాలీ క్రికెట్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక గతేడాది డిసెంబర్లో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యింది. దీంతో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు సర్జరీలు నిర్వహించగా ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు కూడా పంత్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎన్గిడి ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఫిల్ సాల్ట్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసోవ్, రిపాల్ పటేల్, అభిషేక్ పోరెల్ #BreakingNews: Bengal keeper batter Abhishek Porel is set to named @RishabhPant17 's substitute in @DelhiCapitals for this season. Done well in warm up games and more importantly only 21 years old who can be groomed.#IPL2023 — Kushan Sarkar (@kushansarkar) March 29, 2023 Update! #delhicapitals #rishabhpant #IPL2023 #IPL #T20Cricket #wolf777news pic.twitter.com/bZE6wQUYSB — Wolf777News (@Wolf777news) March 29, 2023 చదవండి: చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట -
మోసం చేసేందుకు సహాయపడ్డారు
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్‌తో (ఎఫ్ఆర్ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్ఆర్ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది. స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్ఆర్ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్‌ను రిలయన్స్‌కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్ఆర్ఎల్కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్‌కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్‌పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్‌తో కుమ్మక్కై ఎఫ్ఆర్ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్‌ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎల్ డీల్‌ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
ఉద్యోగ భర్తీల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం
ముషీరాబాద్: ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఖాళీల భర్తీపై రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ముషీరాబాద్‌లో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అ«ధ్యక్షతన నిరుద్యోగ మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు రాజీనామా చేసినా, సభ్యులు మరణించినా ఆరు నెలల్లోపు భర్తీ చేయాలని రాజ్యాంగం చెబుతుందన్నారు. అయితే ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన 10 నుంచి 20 ఏళ్ల వరకు భర్తీ చేయడం లేదన్నారు. అన్ని రాజకీయ పోరాటాలు ఏకమై పార్లమెంటులో బిల్లు పెట్టి ఖాళీలు ఏర్పడిన నెలలోపు భర్తీ చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. -
ఐపీఎల్ 2021: బెయిర్ స్టో స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ రెండో అంచె పోటీలకు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు దూరమవుతున్న సంగతి తెలిసిందే. జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్‌లు ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరంగా ఉండనున్నారు. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బెయిర్ స్టో స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ షెర్పెన్ రూథర్‌ఫోర్డ్‌ను తీసుకున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం సీపీఎల్‌లో ఆడుతున్న రూథర్‌ఫోర్ట్ త్వరలోనే దుబాయ్‌కు చేరుకోనున్నాడు. జానీ బెయిర్ స్టో స్థానంలో కరీబియన్ రైసర్ వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ టూ షెర్పెన్ రూథర్‌ఫోర్ట్ అంటూ కామెంట్ చేసింది. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు ఇక 2018లో వెస్టిండీస్ తరపున అరంగేట్రం చేసిన రూథర్‌ఫోర్ట్ 6 టీ20 మ్యాచ్‌లాడి 43 పరగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టీ20 మ్యాచ్‌లాడి 624 పరుగులు చేశాడు. కాగా ఇంతకముందు రూథర్‌ఫోర్డ్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశజనక ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కరోనాతో లీగ్ వాయిదా పడడానికి ముందు డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్కు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చదవండి: IPL 2021: కళ తప్పనున్న మలిదశ ఐపీఎల్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం -
ఓవరాక్షన్లో మెడల్‌ను గట్టిగా కొరికేశాడు, ఆపై..
సాధారణంగా ఒలింపిక్స్ మెడల్స్ సాధించి.. ఫొటోగ్రాఫర్ల ఫోజుల కోసం పంటిగాట్లు పెట్టినట్లు అథ్లెట్లు నటించడం చూస్తున్నదే. కానీ, ఓ మేయర్ అతి వల్ల జపాన్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అథ్లెట్ నుంచి మెడల్ అందుకుని.. కసితీరా పంటితో గాట్లు పెట్టాడు ఆయన. ఈ చర్యకతో ఆయనకి వ్యతిరేకంగా ఏడు వేల ఫిర్యాదులు రావడం విశేషం. సాఫ్ట్ బాల్ ప్లేయర్ మియూ గోటో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. సంబురాల్లో భాగంగా సొంత వూరు జపాన్ సెంట్రల్ సిటీ నయోగాలో జరిగిన ఓ ఈవెంట్‌కి ఆమె హాజరైంది. అక్కడే ఆ నగర మేయర్ టకాషి కవామురా అత్యుత్సహం ప్రదర్శించాడు. ఆమె నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకుని మెడలో వేసుకున్న కవామురా.. తన ముఖానికి ఉన్న మాస్క్ కిందకి లాగేసి మరీ ఆ గోల్డ్ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. మెడల్‌పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. ఈవెంట్ తర్వాత ఆ డ్యామేజ్ చూసి ఆందోళన చెందిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకుల్ని సంప్రదించింది. చదవండి: గ్రేటెస్ట్ జాబితాలో బల్లెం వీరుడి ప్రదర్శన ఇక టోక్యో నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ మెడల్ మార్పిడికి అయ్యే ఖర్చును ఐవోసీనే భరించబోతోంది. మరోవైపు కరోనా టైంలో మాస్క్ తీసేసి నిర్లక్క్ష్యంగా వ్యవహరించడం, పైగా ఆమె విజయాన్ని అగౌరవపర్చడం తీవ్ర నేరాలంటూ మేయర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ తరుణంలో తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరుకు టకాషి కవామురా క్షమాపణలు తెలియజేశాడు. ఆమెకు కృతజ్ఞతలు ఒక టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జమైకా హర్డ్లింగ్ అథ్లెట్ హన్స్లే పర్చమెంట్ 110 మీటర్ల రేసులో స్వర్ణం సాధించాడు. అయితే రేసుకి ముందు పొరపాటున వేరే వేదిక దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న వలంటీర్ ఒకామె.. జరిగిన పొరపాటును గుర్తించి సరైన వేదిక దగ్గరికి వెళ్లడం కోసం హన్స్లేకి డబ్బులిచ్చి మరీ సాయం చేసింది. View this post on Instagram A post shared by Hansle Parchment, OLY (@parchment_hansle) దీంతో డిస్క్వాలిఫైయింగ్ను తప్పించుకుని అతను అర్హత సాధించడం, ఆపై ఫైనల్ రేసులో గోల్డ్ సాధించాడు. ఇక తన విజయానికి మూల కారణమైన ఆ వలంటీర్‌ను వెతుక్కుంటూ వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు ఈ జమైకన్ అథ్లెట్. -
నోకియా వినియోగదారులకు బంపర్ ఆఫర్, ఎక్సేంజ్‌తో పాటు
హ్యాండ్సెట్ల రంగంలో తనదైన ముద్రవేసిన నోకియా.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. సామాన్యుల కోసం తక్కువ ధర, వన్ ఇయర్ రిప్లెస్ మెంట్ గ్యారెంటీతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా నోకియా సి20 పేరుతో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇటీవల బండకేసి బాదినా పగలని నోకియా ఎక్స్ఆర్20ని విడుదల చేసి అందర్ని ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు నోకియా సి20తో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. వాస్తవానికి ఈ ఫోన్ రెండునెలల క్రితమే విడుదల కావాల్సి ఉండగా..అప్ గ్రేడ్ తో పాటు ఇతర కారణాల వల్ల భారత్‌లో విడుదలవ్వడం ఆలస్యమైంది. అయితే తాజాగా ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ రెగ్యులర్ అప్డేట్లతో పాటు సాఫ్ట్వేర్లను క్లీన్ చేసున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు నోకియా సి 20 ప్లస్‌పై ఒక సంవత్సరం రీప్లేస్మెంట్ గ్యారెంటీని కూడా ఇస్తుంది. అంటే మీరు కొన్న నోకియా ఫోన్ సంవత్సరంలోపు ఉపయోగంలో లేకపోతే కొత్త ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ సందర్భంగా సీ20 ప్లస్‌లో నోకియా సి 1 ప్లస్,నోకియా సి30, తో పాటు 5జీ స్మార్ట్ ఫోన్ నోకియా ఎక్స్ ఆర్ 20ను త్వరలో విడుదల చేయనుంది. నోకియా సి20 ప్లస్ ధర నోకియా సి20 ప్లస్ 2జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ రూ. 8,999కే అందిస్తుండగా..3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ రూ. 9,999కే దక్కించుకోవచ్చు.జియో ఎక్స్ క్లూజీవ్ ప్రోగ్రాంలో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. కాకపోతే జియో సిమ్ కార్ట్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో ఆఫర్‌తో ఫస్ట్ వేరియంట్ ధర రూ .8,099, సెకండ్ వేరియంట్ రూ. 8,999 సొంతం చేసుకోవచ్చు. జియోఎక్స్‌క్లూజివ్ ప్రోగ్రామ్ కింద రూ .4,000 విలువైన ఆఫర్లు అందుబాటులోకి ఉండనున్నాయి. నోకియా సి 20 ప్లస్ స్పెసిఫికేషన్లు నోకియా సి 20 ప్లస్ 6.5-అంగుళాల హెచ్డి+ డిస్ప్లే,నాచ్ టాప్ 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 3జీబీ ర్యామ్‌తో ఆక్టా కోర్ యునిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్, 32జీబీ ఆన్‌బోర్డ్ మెమరీతో పాటు స్టోరేజీని పెంచుకుంనేందుకు ఎస్డీ మైక్రో కార్డ్‌లను యాడ్ చేసుకోవచ్చు.ఫోన్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)ను రన్ చేస్తుంది. మీరు గూగుల్ నుండి జిమెయిల్, యూట్యూబ్,మ్యాప్స్ ను ఉపయోగించుకోచ్చు. ఫోన్ వెనుక భాగంగా 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను డిజైన్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం, నాచ్ లోపల 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫోన్ రెండు సిమ్ కార్డ్ స్లాట్స్, ఎఫ్ఎం రేడియో, 4జీ VoLTE, వైఫై, బ్లూటూత్,3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌కు సపోర్ట్ చేస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వినియోగించుకునేలా 4950ఏఎంచ్ బ్యాటరీని అందిస్తున్నట్లు నోకియా ప్రతినిధులు తెలిపారు. -
అతని స్థానంలో ఆర్సీబీలోకి కొత్త ఆటగాడు..
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో ఆర్సీబీకి కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా రూపంలో షాక్ తగిలిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా ఉదృతమవుతున్న వేళ తాము ఐపీఎల్ ఆడలేమంటూ ఈ ఇద్దరు స్వదేశానికి వెళ్లిపోయారు. తాజాగా ఆర్సీబీ కేన్ రిచర్డ్సన్ స్థానంలో ముంబై ఇండియన్స్‌లో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న స్కాట్ కుగ్గెలీజ్న్ను జట్టులోకి తీసుకురానుంది. మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ కింద ఆర్సీబీ ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో ఒక జట్టు నుంచి మరో జట్టుకు బదిలీ అయిన తొలి ఆటగాడిగా స్కాట్ కుగ్లెలీజ్న్ నిలిచాడు. అయితే ఆడమ్ జంపా స్థానంలో ఆర్సీబీ ఇంకా ఎవరిని తీసుకోలేదు. ఇక కుగ్లెలీజ్న్ 2019 ఐపీఎల్ సీజన్లో తొలిసారి సీఎస్కే తరపున ఆడాడు. ఎన్గిడి స్థానంలో ఆడిన అతను రెండు మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. చదవండి: ఆ ఇద్దరికి కోచ్ అవసరం లేదు -
ఐఫోన్11 ఫోన్లకు స్క్రీన్ల రీప్లేస్మెంట్
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ తయారీ ఐఫోన్ 11 వినియోగదారులకు శుభవార్త. ఐఫోన్ 11 మోడల్ ఫోన్లకు స్ర్కీన్లను రీప్టేస్ చేయనున్నట్లు యాపిల్ ఇంక్ తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 11 మోడళ్లలో టచ్ స్ర్రీన్ సమస్యలు ఎదురవుతుండటంతో ఉచితంగా స్క్రీన్లను మార్పు చేయనున్నట్లు తెలియజేసింది. 2019 నవంబర్ నుంచి 2020 మే నెల మధ్యకాలంలో తయారైన ఐఫోన్ 11 మోడళ్లలో ఈ సమస్యలు ఎదురవుతున్నట్లు యాపిల్ ఇంక్ వెల్లడించింది. డిస్ప్లే మాడ్యూల్లో సమస్యల కారణంగా ఈ మోడల్ ఐఫోన్లు కొన్నింటిలో టచ్ సక్రమంగా పనిచేయడంలేదని వివరించింది. చెక్ చేసుకోవచ్చు ఐఫోన్ 11 మోడల్ వినియోగదారులు టచ్ స్క్రీన్ సమస్యలను పరిశీలించేందుకు వీలుగా యాపిల్ వివరాలు అందించింది. యూజర్లు ఫోన్ సీరియల్ నెంబర్ చెకర్ ద్వారా స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌కు అర్హమైనదీ లేనిదీ తెలుసుకోవచ్చని వెల్లడించింది. యాపిల్ వెబ్సైట్లో రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా సీరియల్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే వివరాలు కనిపించనున్నట్లు తెలియజేసింది. ఈ పరిధిలో మీ ఫోన్ ఉంటే యాపిల్ అధీకృత సర్వీసుల కేంద్రంలో ఉచితంగా స్క్రీన్‌ను రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది. ఒకవేళ ఇప్పటికే ఈ సమస్య కారణంగా సొంత ఖర్చులతో స్ర్రీన్ను మార్చుకున్నట్లయితే.. యాపిల్‌ను సంప్రదించడం ద్వారా రిఫండ్‌ను పొందవచ్చని తెలియజేసింది.