టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లపై స్పందించింది. బ్యాటరీ ఎక్కువ మోతాదులో హీట్ అవుతుండటం వల్లే ఫోన్లు పేలిపోతున్నాయని పేర్కొంది. నోట్ 7కు అమర్చిన బ్యాటరీల్లో తయారీ లోపం కారణంగానే అవి ఎక్కువమోతాదులో హీట్ అవుతున్నట్లు తెలిపింది. పేలుళ్ల తర్వాత నోట్ 7 బ్యాటరీలపై చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలు వెల్లడైనట్లు పేర్కొంది.
గెలాక్సీ నోట్ 7 పేలి ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తమకు వినియోగదారుల రక్షణ ముఖ్యమని తన ప్రకటనలో పేర్కొన్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను స్వచ్చందంగా రీ ప్లేస్ చేస్తున్నట్లు చెప్పింది. వినియోగదారులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 2.5 మిలియన్ల నోట్ 7 ఫోన్లను శాంసంగ్ అమ్మింది.
శాంసంగ్ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయంటే..
Published Fri, Sep 9 2016 7:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
Advertisement
Advertisement