Galaxy Note7
-
'మా ఫోన్లను ఇలా వెనక్కు పంపండి'
బ్యాటరీ తయారీ లోపాలతో పేలిపోతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను కంపెనీ వెనక్కు తీసుకుంటోంది. ఇందుకోసం ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఫైర్ ప్రూఫ్ బాక్సులు, గ్లౌజులను సరఫరా చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. రెండు నెలల క్రితం మార్కెట్లోకి విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ నోట్7 ఫోన్లు పేలిపోతుండటం కంపెనీ రీప్లేస్ మెంట్ ను ప్రకటించింది. రిప్లేస్ చేసిన మోడళ్లు కూడా పేలిపోతుండటంతో గెలాక్సీ నోట్ 7 ఫోన్ల తయారీని నిలిపివేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకూ కొనుగోలు చేసిన ఫోన్లను తిరిగి పంపించడానికి ప్రత్యేకమైన బాక్సును కంపెనీ వినియోగదారులకు పంపనుంది. ఈ విషయాన్ని శాంసంగ్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ వార్తపై ట్విట్టర్ లో దుమారం రేగింది. ఈ బాక్సులైనా సరిగా పనిచేస్తాయా? వాటిని సరిగ్గా పరీక్షించి చూశారా? అంటూ ట్విట్లు వెల్లువెత్తాయి. ఫోన్ ను ఎలా ప్యాక్ చేసి పంపాలి అనే అంశంపై శాంసంగ్ అధికారికంగా ఓ వీడియోను యూట్యూబ్ లో ఉంచింది. -
శాంసంగ్ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయంటే..
టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లపై స్పందించింది. బ్యాటరీ ఎక్కువ మోతాదులో హీట్ అవుతుండటం వల్లే ఫోన్లు పేలిపోతున్నాయని పేర్కొంది. నోట్ 7కు అమర్చిన బ్యాటరీల్లో తయారీ లోపం కారణంగానే అవి ఎక్కువమోతాదులో హీట్ అవుతున్నట్లు తెలిపింది. పేలుళ్ల తర్వాత నోట్ 7 బ్యాటరీలపై చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలు వెల్లడైనట్లు పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 పేలి ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తమకు వినియోగదారుల రక్షణ ముఖ్యమని తన ప్రకటనలో పేర్కొన్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను స్వచ్చందంగా రీ ప్లేస్ చేస్తున్నట్లు చెప్పింది. వినియోగదారులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 2.5 మిలియన్ల నోట్ 7 ఫోన్లను శాంసంగ్ అమ్మింది. -
గెలాక్సీ నోట్7 షిప్మెంట్లకు షాక్
సియోల్ : ఓ వైపు గెలాక్సీ నోట్ 7 సప్లైను మించి డిమాండ్‌లో దూసుకెళ్తుండగా... మరోవైపు ఆ డివైజ్‌ల సరుకు రవాణా ఆలస్యం కానుందట. ప్రీమియం డివైజ్‌ల్లో అదనంగా నాణ్యతా నియంత్రణ పరీక్షలు చేపట్టనున్న నేపథ్యంలో గెలాక్సీ నోట్ 7 డివైజ్‌ల సరుకు రవాణాను జాప్యం చేయనున్నట్టు టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన టాప్-3 క్యారియర్స్(డివైజ్‌లను రవాణా చేసే సంస్థలు) ఎస్కే టెలికాం కంపెనీ లిమిటెడ్, కేటీ కార్పొ, ఎల్జీ అప్లస్ కార్పొలకు పూర్తిగా సరుకు రవాణా నిలిపివేసినట్టు తెలిపింది. ఉత్పత్తి నాణ్యతలో మరిన్ని పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలోనే గెలాక్సీ నోట్7ల సరుకు రవాణాను ఆలస్యం చేస్తున్నామని రాయిటర్స్‌కు పంపిన ఓ ప్రకటనలో శాంసంగ్ పేర్కొంది. అయితే ఫోన్లో లోపాలను శాంసంగ్ వెల్లడించలేదు. గెలాక్సీ నోట్7 ఫోన్ కస్టమర్ల నుంచి శాంసంగ్‌కు భారీగానే ఫిర్యాదులు వెళ్లాయట. ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్న సమయంలో పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయని కస్టమర్ల ఫిర్యాదులు చేశారని దక్షిణ కొరియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ నోట్7 క్వాలిటీ కంట్రోల్లో అదనంగా పరీక్షలు నిర్వహించాలని కంపెనీ భావించిందని రిపోర్టులు వెల్లడించాయి. గతేడాది కూడా గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌ను వినియోగదారులు ఆశించిన మేర సప్లై చేయక అమ్మకాల్లో నిరాశపరిచింది. మరోవైపు శాంసంగ్ పోటీ సంస్థ యాపిల్ వచ్చే వారంలోనే తన కొత్త ఫోన్లను ఆవిష్కరించనున్న నేపథ్యంలో సరుకురవాణా జాప్యం చేయడం అంతమంచిది కాదని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్7లో లోపాలను వెంటనే సవరించుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు గెలాక్సీ నోట్7 డివైజ్‌లు సరుకు రవాణా ఆలస్యం కానున్నట్టు వార్త బయటికి పొక్కగానే ఆ కంపెనీ షేర్లు ఢమాల్ మనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రెండు వారాల కనిష్టంలో నమోదయ్యాయి.