'మా ఫోన్లను ఇలా వెనక్కు పంపండి' | Samsung's latest invention: a fireproof box for Note 7 returns | Sakshi
Sakshi News home page

'మా ఫోన్లను ఇలా వెనక్కు పంపండి'

Published Thu, Oct 13 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

'మా ఫోన్లను ఇలా వెనక్కు పంపండి'

'మా ఫోన్లను ఇలా వెనక్కు పంపండి'

బ్యాటరీ తయారీ లోపాలతో పేలిపోతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను కంపెనీ వెనక్కు తీసుకుంటోంది. ఇందుకోసం ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఫైర్ ప్రూఫ్ బాక్సులు, గ్లౌజులను సరఫరా చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. రెండు నెలల క్రితం మార్కెట్లోకి విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ నోట్7 ఫోన్లు పేలిపోతుండటం కంపెనీ రీప్లేస్ మెంట్ ను ప్రకటించింది.
 
రిప్లేస్ చేసిన మోడళ్లు కూడా పేలిపోతుండటంతో గెలాక్సీ నోట్ 7 ఫోన్ల తయారీని నిలిపివేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకూ కొనుగోలు చేసిన ఫోన్లను తిరిగి పంపించడానికి ప్రత్యేకమైన బాక్సును కంపెనీ వినియోగదారులకు పంపనుంది. ఈ విషయాన్ని శాంసంగ్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ వార్తపై ట్విట్టర్ లో దుమారం రేగింది.
 
ఈ బాక్సులైనా సరిగా పనిచేస్తాయా? వాటిని సరిగ్గా పరీక్షించి చూశారా? అంటూ ట్విట్లు వెల్లువెత్తాయి. ఫోన్ ను ఎలా ప్యాక్ చేసి పంపాలి అనే అంశంపై శాంసంగ్ అధికారికంగా ఓ వీడియోను యూట్యూబ్ లో ఉంచింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement