
అరోరా స్థానంలోకి కెన్ మియాచి
టోక్యో: సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలిగిన నికేశ్ అరోరా స్థానాన్ని కెన్ మియాచి భర్తీ చేయనున్నారు. గ్రూప్ జపాన్ టెలికమ్యూనికేషన్స్ కార్యకలాపాల హెడ్‌గా ఉన్న మియాచి..సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీవోవోగా పగ్గాలు చేపడతారని బ్యాంక్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి మియాచికి సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌లో 1,101,230 షేర్లు ఉన్నాయి. కాగా అరోరా సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడె ంట్ పదవికి రాజీనామా చేసి రోజు గడవక ముందే బ్యాంక్ నుంచి కెన్ మియాచి నియామక ప్రకటన వెలువడటం గమనార్హం.