పుజారాకు నిరాశ..! | Australia player Daniel Hughes to replace Pujara In County Championship | Sakshi
Sakshi News home page

పుజారాకు నిరాశ..!

Published Fri, Aug 23 2024 11:10 AM | Last Updated on Fri, Aug 23 2024 2:51 PM

Australia player Daniel Hughes to replace Pujara In County Championship

లండన్‌: భారత టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా వచ్చే ఏడాది కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోడని గురువారం ససెక్స్‌ క్లబ్‌ వెల్లడించింది. పుజారా స్థానంలో ఆ్రస్టేలియా ఆటగాడు డేనియల్‌ హ్యూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.

గత మూడేళ్లుగా ససెక్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారాను ఈసారి ఆ క్లబ్‌ రిటైన్‌ చేసుకోలేదు. ‘పుజారాను కాదని హ్యూస్‌ను ఎంపిక చేసుకోవడం కష్టమైన పనే. కానీ, హ్యూస్‌ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. అంతేకాక టి20 మ్యాచ్‌లు కూడా ఆడతాడు. పుజారాకు సరైన ప్రత్యామ్నాయం అతడే అనిపించింది’ అని ససెక్స్‌ హెడ్‌ కోచ్‌ పాల్‌ ఫార్బస్‌ అన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement