Australia players
-
పుజారాకు నిరాశ..!
లండన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా వచ్చే ఏడాది కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోడని గురువారం ససెక్స్ క్లబ్ వెల్లడించింది. పుజారా స్థానంలో ఆ్రస్టేలియా ఆటగాడు డేనియల్ హ్యూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.గత మూడేళ్లుగా ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారాను ఈసారి ఆ క్లబ్ రిటైన్ చేసుకోలేదు. ‘పుజారాను కాదని హ్యూస్‌ను ఎంపిక చేసుకోవడం కష్టమైన పనే. కానీ, హ్యూస్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. అంతేకాక టి20 మ్యాచ్‌లు కూడా ఆడతాడు. పుజారాకు సరైన ప్రత్యామ్నాయం అతడే అనిపించింది’ అని ససెక్స్ హెడ్ కోచ్ పాల్ ఫార్బస్ అన్నాడు. -
క్రికెట్ ఆస్ట్రేలియాకు షాక్.. విదేశీ సిరీస్‌ల నుంచి ఏడుగురు ఔట్
సిడ్నీ: ఐపీఎల్ 2021లో ఆడిన అగ్రశ్రేణి ఆసీస్ క్రికెటర్లు వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి వైదొలుగుతూ, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు షాకిచ్చారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, సీఏ ఈ రెండు విదేశీ పర్యటనలను ఖరారు చేయగా, ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మాత్రం నిరాసక్తత కనబర్చారు . కొందరు వ్యక్తిగత కారణాలు సాకుగా చూపిస్తూ, మరికొందరు గాయాల నుంచి కోలుకోలేదని నివేదికలు సమర్పిస్తూ ఈ రెండు విదేశీ పర్యటనలకు డుమ్మా కొట్టారు. సీనియర్లు డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టాయినీస్‌లు వ్యక్తిగత కారణాల వల్ల తమను ఈ టూర్ కోసం పరిగణించవద్దని విజ్ఞప్తి చేయగా, స్టీవ్ స్మిత్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్‌లు ఐపీఎల్ సమయంలో తగిలిన గాయాల కారణంగా జట్టు నుంచి తప్పించమని అభ్యర్ధించారు. టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ నెలలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆటగాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చూపుతూ జట్టుకు దూరంగా ఉండటం సీఏను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, విండీస్, బంగ్లా టూర్ కోసం 18 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. ఆసీస్ జట్టు జూలై 9 నుంచి 24 మధ్య విండీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా, బంగ్లాదేశ్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై ఇంకా స్పష్టతరావాల్సి ఉంది. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆ దేశ ఆటగాళ్లు దూరం..?
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్‌కు ఆరంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. లీగ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లదేశ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనడం అనుమానంగా మారింది. ఈ పర్యటనలో ఆసీస్ ఐదు టీ20లు ఆడనుండగా, సిరీస్ పూర్తయ్యే సరికి ఐపీఎల్ సెకండాఫ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తవుతాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 13 మంది ఆసీస్ స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. వీరంతా లీగ్‌కు దూరమైతే టోర్నీ కళావిహీనంగా మారుతుంది. గాయాల బారినపడి ఇది వరకే చాలా మంది స్టార్లు లీగ్‌కు దూరం కాగా, కొత్తగా వీరు కూడా అందుబాటులో ఉండకపోతే, లీగ్ పునఃప్రారంభించి ఉపయోగం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్ పర్యటన విషయమై బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరిపి ఎలాగైనా పర్యటనను రద్దు చేసేలా చేస్తుందని పలువురు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు గట్టిగా నమ్ముతున్నారు. కాగా, కరోనా కారణంగా అర్దంతరంగా ఆగిపోయిన లీగ్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను కూడా రద్దు చేసుకుంది. లీగ్ నిర్వహణపై మే 29న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చదవండి: రాహుల్ వర్కౌట్లకు అతియా అదిరిపోయే రెస్పాన్స్.. -
క్రికెట్‌కు వాట్సన్ గుడ్‌బై
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వాట్సన్ చివరి మ్యాచ్ ఆడేశాడు. 2018 నుంచి ఓపెనర్‌గా చెన్నై విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వాట్సన్ ఆదివారం ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపు అనంతరం వాట్సన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న 39 ఏళ్ల వాట్సన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్ టోర్నమెంట్లలో ఆయా ఫ్రాంచైజీలకు ఆడుతున్నాడు. ఆదివారంతో ఇక అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు సీఎస్కే సహచరులతో వాట్సన్ చెప్పాడు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ వాట్సన్ ఉద్వేగానికి గురయ్యాడు. చెన్నై ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అతను అన్నాడు’ అని జట్టు వర్గాలు తెలిపాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై కన్నా ముందు రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వాట్సన్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లోనే కాకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్‌లీగ్, బిగ్‌బాష్ లీగ్‌లలో కూడా వాట్సన్ బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా వాట్సన్ తన టి20 కెరీర్లో 343 మ్యాచ్‌లు ఆడి 8,821 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 216 వికెట్లు కూడా పడగొట్టిన వాట్సన్ 101 క్యాచ్‌లు తీసుకున్నాడు. -
టి20 ప్రపంచ కప్ నిర్వహణపై ఆసీస్ దృష్టి
మెల్బోర్న్: కరోనా వైరస్ కారణంగా టోర్నీలన్నీ రద్దవుతున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం అక్టోబర్‌లో ఆసీస్ వేదికగా జరిగే టి20 ప్రపంచ కప్ మెగా టోర్నీపై దృష్టి సారించింది. ఈ మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరగాల్సిన క్రీడా ఈవెంట్లన్నీ రద్దయ్యాయి. అయితే వరల్డ్ కప్ నిర్వహణ సజావుగా సాగేట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. టోర్నీకి ఆతిథ్యమిచ్చే మైదానాలను సంరక్షించడంతో పాటు నిధులను పద్ధతి ప్రకారం కూడబెడుతున్నట్లు సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపారు. ‘కరోనా కారణంగా రాబోయే నెలల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. నిపుణుల సలహా మేరకు మేం నడచుకుంటున్నాం. ప్రపంచ కప్ నిర్వహణకు మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. అక్టోబర్ 18–23 వరకు జరిగే ప్రి క్వాలిఫయర్స్‌తో ప్రపంచకప్‌కు తెరలేస్తుంది. 24న ప్రధాన టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్ 15న ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్‌కూ ఆసీస్ ఆటగాళ్లు దూరం! ఒక వేళ ఐపీఎల్ జరిగితే అందులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనేది అనుమానంగా మారింది. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనేది ఆలోచించి... పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆటగాళ్లకు సీఏ చీఫ్ కెవిన్ సూచించారు. మొత్తం 17 మంది ఆసీస్ ప్లేయర్లు ఐపీఎల్లో భాగంగా ఉన్నారు. ఈ టోర్నీలో తమ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్షిస్తున్నట్లు అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి. ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను తమ కాంట్రాక్టులను వదులుకోమని సీఏ అడిగే అవకాశాలున్నట్లు కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌ను రద్దు చేసి లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ‘న్యూ సౌత్ వేల్స్’ జట్టును సీఏ విజేతగా ప్రకటించింది. -
వాతావరణం ఉద్విగ్నభరితం
సిడ్నీ టెస్టుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధం సిడ్నీ: అది తమ సహచరుడు కుప్పకూలిన చోటు... ఆ ఘటన జరిగిన తర్వాత వాళ్లెవరూ ఆ మైదానం ఛాయలకు కూడా పోలేదు. కానీ ఇప్పుడు నేరుగా టెస్టు మ్యాచ్ బరిలోకి దిగాల్సిన స్థితి. ఇప్పుడు ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా గంభీర వాతావరణం నెలకొంది. ఫిల్ హ్యూస్ మరణానంతరం వారు ఇప్పుడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో ఆడబోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మిషెల్ జాన్సన్, ‘ఫిల్ మరణం తర్వాత మాలో చాలా మంది ఇప్పుడే ఇక్కడికి వస్తున్నారు. గ్రౌండ్లో ఆడబోయే సమయంలో మా పరిస్థితి ఎలా ఉండబోతోందో చెప్పలేను. ముఖ్యంగా నాటి ఘటన చూసిన నలుగురు మరింతగా బాధ పడటం ఖాయం. అయితే కొద్ది రోజులుగా మా జట్టు దీనిని ఓర్చుకుంది. అదే తరహాలో బాగా ఆడి గెలుస్తాం’ అని అన్నాడు. మరో వైపు బిగ్‌బాష్ మ్యాచ్ కోసం ఇటీవలే ఈ మైదానంలో ఆడిన సిడిల్, కొద్ది సేపు ఆ బాధ వెంటాడుతుందని, హ్యూస్ కోసం ఈ మ్యాచ్‌లో బాగా ఆడతామని చెప్పాడు.