Pujara
-
పుజారాకు నిరాశ..!
లండన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా వచ్చే ఏడాది కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోడని గురువారం ససెక్స్ క్లబ్ వెల్లడించింది. పుజారా స్థానంలో ఆ్రస్టేలియా ఆటగాడు డేనియల్ హ్యూస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.గత మూడేళ్లుగా ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారాను ఈసారి ఆ క్లబ్ రిటైన్ చేసుకోలేదు. ‘పుజారాను కాదని హ్యూస్‌ను ఎంపిక చేసుకోవడం కష్టమైన పనే. కానీ, హ్యూస్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడు. అంతేకాక టి20 మ్యాచ్‌లు కూడా ఆడతాడు. పుజారాకు సరైన ప్రత్యామ్నాయం అతడే అనిపించింది’ అని ససెక్స్ హెడ్ కోచ్ పాల్ ఫార్బస్ అన్నాడు. -
BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్‌గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్‌లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 67 పరుగుల లీడ్‌తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్‌కుమార్ వైశాఖ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్‌లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్‌కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్‌ను దెబ్బకొట్టారు. -
పుజారాపై వేటు... యశస్వికి చోటు
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్లో కీలక పరిణామం... సుదీర్ఘ కాలంగా జట్టులో కీలక సభ్యుడిగా, పలు చిరస్మరణీయ విజయాల్లో ముందుండి నడిపించిన చతేశ్వర్ పుజారాపై సెలక్టర్లు విశ్వాసం కోల్పోయారు. వచ్చే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ను (డబ్ల్యూటీసీ 2023–2025) దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ చేయబోతున్న మార్పుల్లో భాగంగా అందరికంటే ముందుగా పుజారాపై వేటు పడింది. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం శుక్రవారం ప్రకటించిన భారత జట్టులో పుజారాకు చోటు దక్కలేదు. అతనితో పాటు ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు. వీరి స్థానాల్లో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, పేసర్ ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల ఈ టీమ్‌లోకి మరో పేస్ బౌలర్ నవదీప్ సైనీ కూడా ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించిన అజింక్య రహానే తన స్థానం నిలబెట్టుకోవడంతో పాటు వైస్ కెపె్టన్‌గా కూడా ఎంపిక కావడం విశేషం. భిన్న వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్ తన స్థానం నిలబెట్టుకోగా... గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ పేర్లను పరిశీలించలేదు. మొహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా, జనవరి 2021 తర్వాత మళ్లీ టెస్టు ఆడని సైనీకి మరో చాన్స్ దక్కింది. భారత్, విండీస్ మధ్య జూలై 12–16, జూలై 20–24 మధ్య డొమినికా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లలో రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. అనూహ్య ఎంపికలేమీ లేకుండా... వెస్టిండీస్‌తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మాత్రం ఎలాంటి ఆశ్చర్యకర ఎంపికలు లేవు. భారత్ ఆడిన గత 4 వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ సంజు సామ్సన్ తిరిగి జట్టులోకి ఎంపిక కావడమే చెప్పుకోదగ్గ విశేషం. ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో తొలి బంతికే వెనుదిరిగి చెత్త రికార్డు నమోదు చేసినా... సూర్యకుమార్ యాదవ్‌కు మళ్లీ అవకాశం దక్కింది . స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది. ఎంపిక చేసిన 17 మందితో పాటు గాయాల నుంచి కోలుకొని బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందు బాటులోకి వస్తే 20 మందితో వచ్చే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక సాగినట్లు అర్థమవుతోంది. భారత్, విండీస్ మధ్య జూలై 27, 29, ఆగస్ట్ 1 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి. రంజీల్లో సత్తా చాటి... ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యశస్వి ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా ఘనంగా ఉండటం అతనికి టెస్టు టీమ్‌లో అవకాశం క ల్పించింది. 26 ఇన్నింగ్స్‌లలోనే అతను 80.21 సగటుతో 1845 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లలో 213, 144 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కూడా రిజర్వ్‌గా అతను ఇటీవల జట్టుతో పాటు లండన్ వెళ్లాడు. ఫస్ట్‌క్లాస్‌లో 42.19 సగటు ఉన్న రుతురాజ్ రికార్డు గొప్పగా లేకపోయినా, అతని టెక్నిక్ టెస్టు ఫార్మాట్‌కు పనికొస్తుందని భావించి సెలక్టర్లు గత కొంతకాలంగా అతడిపై దృష్టి పెట్టారు. గత మూడు రంజీ సీజన్లలో బెంగాల్ రెండుసార్లు ఫైనల్ వెళ్లడంలో పేసర్ ముకేశ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా రాణించిన అతను 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 21.55 సగటుతో 149 వికెట్లు తీశాడు. ఈ ముగ్గురిలో రుతురాజ్ ఇప్పటికే భారత్ తరఫున ఒక వన్డే, 9 టి20లు ఆడగా మిగతా ఇద్దరు ఇంకా అరంగేట్రం చేయలేదు. టెస్టు జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ. వన్డే జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్. -
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్..!
-
డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్.. పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు..?
వరుసగా రెండో సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యల్లో భాగంగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనలు చేస్తున్న ఆటగాళ్లపై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. త్వరలో ప్రారంభంకాబోయే విండీస్ టూర్ కోసం టీమిండియాలో సమూల మార్పుల చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. వీరి స్థానంలో యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ పలు మార్పులకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉండవచ్చని సమాచారం. టీ20ల్లో రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మోహిత్ శర్మలకు దాదాపుగా ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. విండీస్ టూర్లో సీనియర్ల గైర్హాజరీలో వీరికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని బోర్డు యోచిస్తున్నట్లు వినికిడి. ఇదే విండీస్ టూర్లో వన్డేల కోసం పలువురు ఆటగాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేయవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో శిఖర్ ధవన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ధవన్‌కు వయసు పైబడుతుండటంతో వరల్డ్‌కప్‌కు ముందు వీలైనన్ని అవకాశాలు కల్పించాలన్నది బీసీసీఐ యోచనగా తెలుస్తోంది. కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది. విండీస్ పర్యటన వివరాలు.. తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్‌గా ఈ ఐదుగురు క్రికెటర్లు -
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
టీమిండియాలో గుజరాతీ క్రికెటర్ల హవా.. ఒకప్పటి కర్ణాటకలా..!
క్రికెట్ తొలినాళ్లలో భారత జట్టు మహారాష్ట్ర క్రికెటర్లతో, ప్రత్యేకించి ముంబై క్రికెటర్లతో నిండి ఉండేదన్నది జగమెరిగిన సత్యం. రుస్తొంజీ జంషెడ్జీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, గులాబ్రాయ్ రాంచంద్, ఏక్నాథ్ సోల్కర్, బాపు నాదకర్ణి, ఫరూక్ ఇంజనీర్, దిలీప్ సర్దేశాయ్, పోలీ ఉమ్రిగర్.. ఆతర్వాత 70,80 దశకాల్లో అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, బల్విందర్ సంధూ, రవిశాస్త్రి.. 90వ దశకంలో సంజయ్ మంజ్రేకర్, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ.. 2000 సంవత్సరానికి ముందు ఆతర్వాత జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్.. ఇలా దశకానికి కొందరు చొప్పున టీమిండియా తరఫున మెరుపులు మెరిపించారు. వీరిలో గవాస్కర్, సచిన్, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని దిగ్గజ హోదా పొందారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. భారత క్రికెట్‌కు మహారాష్ట్ర కాంట్రిబ్యూషన్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్రికెట్ తొలినాళ్లలో భారత జట్టులో సగం ఉన్న మహా క్రికెటర్ల సంఖ్య రానురాను ఒకటి, రెండుకు పరిమితమైంది. మహారాష్ట్ర తర్వాత టీమిండియాకు అత్యధిక మంది క్రికెటర్లను అందించిన ఘనత ఢిల్లీకి దక్కుతుంది. దేశ రాజధాని ప్రాంతం నుంచి మోహిందర్ అమర్నాథ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్లు టీమిండియా తరఫున మెరిశారు. వీరిలో కోహ్లి విశ్వవ్యాప్తంగా పాపులారిటీ పొంది క్రికెట్ దిగ్గజంగా కొనసాగుతున్నాడు. మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత టీమిండియాకు అత్యధిక మంది స్టార్ క్రికెటర్లను అందించిన రాష్ట్రంగా కర్ణాటక గుర్తింపు పొందింది. 90వ దశకంలో ప్రత్యేకించి 1996వ సంవత్సరంలో టీమిండియాలో కర్ణాటక ప్లేయర్ల హవా కొనసాగింది. ఆ ఏడాది ఒకానొక సందర్భంలో ఏడుగురు కర్ణాటక ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, దొడ్డ గణేష్, డేవిడ్ జాన్సన్ టీమిండియాకు ఒకే మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించారు. 1996-2004, 2005 వరకు టీమిండియాలో కర్ణాటక ఆటగాళ్ల డామినేషన్ కొనసాగింది. ప్రస్తుతం అదే హవాను గుజరాత్ ఆటగాళ్లు కొనసాగిస్తున్నారు. ఒకానొక సందర్భంలో కర్ణాటక ఆటగాళ్లు సగానికిపై టీమిండియాను ఆక్రమిస్తే.. ఇంచుమించు అదే రేంజ్లో ప్రస్తుతం గుజరాతీ ఆటగాళ్ల డామినేషన్ నడుస్తోంది. ప్రస్తుత భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్.. టెస్ట్ స్టార్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా, ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ బౌలర్ హర్షల్ పటేల్, లేటు వయసులో సంచలన ప్రదర్శనలతో టీమిండియా తలుపు తట్టిన వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ గుజరాత్ ప్రాంతవాసులే. వీరిలో కొందరు దేశావాలీ టోర్నీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆ ప్రాంతం గుజరాత్ కిందకే వస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 కోసం, ఆతర్వాత ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం తాజాగా ఎంపిక చేసిన భారత జట్టును ఓసారి పరిశీలిస్తే.. టెస్ట్ జట్టులో నలుగురు (పుజారా, జడేజా, అక్షర్, ఉనద్కత్), వన్డే జట్టులో నలుగురు (హార్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్, ఉనద్కత్) గుజరాతీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో హార్ధిక్ టీమిండియా వైస్ కెప్టెన్ కాగా.. మిగతా ముగ్గురు స్టార్ క్రికెటర్ల హోదా కలిగి ఉన్నారు. -
వందో టెస్ట్.. బౌండరీ కొట్టి టీమిండియాను గెలిపించిన పుజారా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెరీర్లో వందో టెస్ట్ ఆడిన పుజారా (31 నాటౌట్).. బౌండరీ కొట్టి మరీ టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. In his 1️⃣0️⃣0️⃣th Test, @cheteshwar1 finishes off the chase in style 🙌🏻#TeamIndia secure a 6️⃣-wicket victory in the second #INDvAUS Test here in Delhi 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8@mastercardindia pic.twitter.com/Ebpi7zbPD0 — BCCI (@BCCI) February 19, 2023 ముఖ్యంగా భారత స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/68, 7/42), రవిచంద్రన్ అశ్విన్ (3/57, 3/59) పట్టపగ్గాలు లేకుండా విజృంభించారు. వీరిలో మరీ ముఖ్యంగా జడేజా రెండో ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఆసీస్ వెన్ను విరిచాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. జడేజా ధాటికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. For his magnificent all-round performance including a brilliant 7⃣-wicket haul, @imjadeja receives the Player of the Match award 🏆#TeamIndia win the second #INDvAUS Test by six wickets 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8@mastercardindia pic.twitter.com/rFhCZZDZTg — BCCI (@BCCI) February 19, 2023 ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హెడ్ (43), లబూషేన్ (35) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. ఈ ఇన్నింగ్స్‌లో జడేజా ఏకంగా ఐదుగురిని క్లీన్‌బౌల్డ్ చేయడం ఆసక్తికర విషయం. అనంతరం 115 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా రోహిత్ (31), కేఎల్ రాహుల్ (1), కోహ్లి (20), శ్రేయస్ అయ్యర్ (12) వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. పుజారాతో పాటు శ్రీకర్ భరత్ (23) క్రీజ్‌లో నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ బౌలర్లలో లయోన్ 2, మర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు చాపచుట్టేయగా.. భారత్ 262 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. అక్షర్ (74), కోహ్లి (44), అశ్విన్ (37)లు టీమిండియాను గట్టెక్కించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఆసీస్ బౌలర్లలో లయోన్ 5, కున్నేమన్, మర్ఫీ చెరో 2 వికెట్లు, కమిన్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
పుజారాపై పగపట్టిన లియోన్.. వందో టెస్ట్ అన్న కనికరం కూడా లేకుండా..!
Nathan Lyon-Pujara: కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా స్టార్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారాపై ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ పగపట్టాడు. న్యూఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పుజారాను డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపిన లియోన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్న లియోన్.. తన కెరీర్లో ఓ బ్యాటర్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన రికార్డును సవరించుకున్నాడు. లియోన్ తన టెస్ట్ కెరీర్లో పుజారాను అత్యధికంగా 11 సార్లు ఔట్ చేయడం ద్వారా తన బాధిత బ్యాటర్ల జాబితాలో పుజారాకు తొలిస్థానం కల్పించాడు. వందో టెస్ట్ ఆడుతున్నాడన్న కనికరం కూడా లేని లియోన్.. పుజారాను బాగా ఇబ్బంది పెట్టి వికెట్ల ముందు (ఎల్బీడబ్ల్యూ) దొరికించుకున్నాడు. లియోన్ బాధిత బ్యాటర్ల జాబితాలో పుజారా తర్వాత అజింక్య రహానే రెండో స్థానంలో ఉన్నాడు. లియోన్ రహానేను 10 సార్లు ఔట్ చేశాడు. ఆ తర్వాత సువర్ట్ బ్రాడ్ (9), బెన్ స్టోక్స్ (9), మొయిన్ అలీ (9), అలిస్టర్ కుక్ (8), టిమ్ సౌథీ (8) లను లియోన్ టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు ఔట్ చేశాడు. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతుంది. తొలి రోజు భారత బౌలర్ల విజృంభణతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే ఆసీస్ స్పిన్నర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా లియోన్ బంతిని గింగిరాలు తిప్పుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే కేఎల్ రాహుల్ (17)ను పెవిలియన్‌కు పంపిన లియోన్.. ఆ తర్వాత రోహిత్ శర్మ (32), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4)లను వరుసగా ఔట్ చేశాడు. ఆతర్వాత కోహ్లి (36), జడేజా (26) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా.. ఈ సారి టాడ్ మర్ఫీ విజృంభించాడు. జడ్డూను మర్ఫీ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. జడేజా ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 125/5గా ఉంది. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 138 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్కోంబ్ (72) అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఛాటోగ్రామ్ వేదికగా బుధవారం(డిసెంబర్14) ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దూరమయ్యారు. వీరి స్థానంలో అభిమాన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, నవ్‌దీప్ సైనీను బీసీసీఐ ఎంపిక చేసింది. అదే విధంగా 12 ఏళ్ల తర్వాత పేసర్ జయదేవ్ ఉనద్కట్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించున్నాడు. ప్రస్తుతం ఛాటోగ్రామ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చమటోడుస్తున్నారు. సౌరభ్ కుమార్‌కు తుది జట్టులో ఛాన్స్ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. బంగ్లాతో తొలి టెస్టుకు ఆల్‌రౌండర్ కోటాలో సౌరభ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్-'ఎ'తో అనధికార టెస్టు సిరీస్‌లో కూడా సౌరభ్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్లో కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌కు చోటు దక్కనుంది. జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉండనున్నాడు. అయితే మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తొలి టెస్టుకు పక్కన పెట్టే అవకాశం ఉంది. అక్షర్ స్థానంలో సౌరభ్ కుమార్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. ఇక పేసర్ల కోటాలో శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ చోటు దక్కే ఛాన్స్ ఉంది. తొలి టెస్టుకు భారత తుది జట్టు(అంచనా): శుబ్మాన్ గిల్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, సౌరబ్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్. ఉమేష్ యాదవ్ -
'ఆ ఇద్దరిలో ఒకరిని టీమిండియా ఓపెనర్‌గా పంపండి'
జూలై1న ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు టీమిండియా ఓపెనర్‌గా ఛతేశ్వర్ పుజారా లేదా హనుమ విహారీని పంపాలని భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే తాజాగా నిర్వహించిన టెస్ట్టులో కూడా రోహిత్‌కు పాజిటివ్ గానే తేలింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యచ్‌కు రోహిత్ దూరమయ్యే అవకాశాలు సృష్టంగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో శుభ్‌మాన్ గిల్ జోడిగా భారత ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పుజరా, హునుమా విహారి, మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్ వంటి వారు ఓపెనింగ్ రేసులో ఉన్నారు. "వార్మప్ మ్యాచ్‌లో కేఎస్ భరత్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని మనకు తెలుసు. కానీ అతనికి ఉన్న అనుభవం తక్కువ. ఇక రోహిత్‌కు బ్యాకప్‌గా జట్టులో చేరిన మయాంక్‌కు తగినంత ప్రాక్టీస్ చేసే అవకాశం లభించలేదు. కాబట్టి రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడు అందుబాటులో లేకపోతే.. పుజారా లేదా విహారి లాంటి అనుభం ఉన్న ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది. విహారి ఇప్పటికే రెండు సార్లు భారత్ తరపున ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ముఖ్యంగా ఇది కీలక మ్యాచ్ కాబట్టి అనుభవం ఉన్న ఆటగాళ్లకి అవకాశం ఇస్తే మంచింది"అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs IND: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" -
మరో డబుల్ సాధించిన పుజారా.. 28 ఏళ్ల కిందటి రికార్డు సమం
పేలవ ఫామ్ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పట్టించుకోలేదన్న కసితో రగిలిపోతున్న పుజారా.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ 2022లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో ససెక్స్‌కు ఆడుతున్న అతను.. 3 మ్యాచ్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు (201*, 203), ఓ సెంచరీ (109) సాయంతో ఏకంగా 531 పరుగులు సాధించాడు. తాజాగా డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్) ద్విశతకం బాదిన పుజారా.. తన జట్టును పటిష్టమైన స్థితిలో ఉంచాడు. ఈ క్రమంలో అతను 28 ఏళ్ల కిందటి ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. కౌంటీ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ తర్వాత రెండు డబుల్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కాగా, ససెక్స్‌తో జరుగుతున్న డివిజన్-2 మ్యాచ్‌లో టాస్ గెలిచిన డర్హమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ససెక్స్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పుజారా (334 బంతుల్లో 203; 24 ఫోర్లు) డబుల్ సెంచరీతో సత్తా చాటడంతో ససెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 538 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఈ క్రమంలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన డర్హమ్.. నాలుగో రోజు (మే 1) తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టపోకుండా 245 పరుగులు చేసింది. ఓపెనర్లు సీన్ డిక్సన్ (148 నాటౌట్), అలెక్స్ లీస్ (84 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్ -
హార్ధిక్, గబ్బర్లకు భారీ షాక్.. రహానే, పుజారాలకు డిమోషన్
BCCI Contracts: 2021-22 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు చుక్కెదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు 'ఎ ప్లస్' గ్రేడ్‌ను నిలబెట్టుకోగా.. టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మలు తమ ‘ఎ’ గ్రేడ్‌ను కోల్పోయి ‘బి’ గ్రేడ్‌లోకి పడిపోయారు. గాయాల కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డేలు మాత్రమే పరిమితమైన శిఖర్ ధవన్లు ఏకంగా ‘ఎ’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు దిగజారగా.. మయాంక్ అగర్వాల్, సాహాలు ‘బి’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు పడిపోయారు. ఇప్పటివరకు ‘సి’ గ్రేడ్‌లో ఉన్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ‘బి’ గ్రేడ్ దక్కగా.. కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు ఏకంగా కాంట్రక్ట్నే కోల్పోయారు. బీసీసీఐ ఈ ఏడాదికి గాను 27 మందితో సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకోగా.. రోహిత్, కోహ్లి, బుమ్రాలు 'ఎ ప్లస్' గ్రేడ్‌లో.. అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీలు ‘ఎ’ గ్రేడ్‌లో.. పుజారా, రహానే, అక్షర్, శార్ధూల్, శ్రేయస్, సిరాజ్, ఇషాంత్‌లు ‘బి’ గ్రేడ్‌లో.. ధవన్, ఉమేశ్, భువనేశ్వర్, హార్ధిక్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, విహారి, చహల్, సూర్యకుమార్ యాదవ్, సాహా, మయాంక్‌లు ‘సి’ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో 'ఎ ప్లస్' కేటగిరీలో ఉన్నవాళ్లకు ఏటా రూ.7 కోట్లు, ‘ఎ’ కేటగిరీ ప్లేయర్లకు రూ.5 కోట్లు, ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, ‘సి’ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు రూ.1కోటి పారితోషికంగా లభించనుంది. చదవండి: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన పుజారా.. టీ20 తరహాలో..!
Cheteshwar Pujara: చాలాకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ.. శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటును సైతం కోల్పోయిన నయా వాల్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. తన సహజ శైలికి విరుద్ధంగా భారీ షాట్లతో అలరించాడు. టీ20 తరహాలో 109.64 స్ట్రైక్‌రేట్‌తో రెచ్చిపోయాడు. 83 బంతుల్లో సిక్సర్, 16 ఫోర్ల సాయంతో 91 పరుగులు సాధించి 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపర్చిన పుజరా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఫాలో ఆన్ ఆడిన తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (275), రహానే (129) అద్భుత శతకాలతో చెలరేగడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు కుప్పకూలడంతో ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర జట్టును స్నెల్ పటేల్ (98), పుజారా (91), కెప్టెన్ ఉనద్కత్ (32 నాటౌట్) ఆదుకోవడంతో మ్యాచ్ ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసి ఓటమి గండం నుంచి గట్టెక్కింది. చదవండి: చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు! -
Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు..
Virat Kohli On Purane Future: దక్షిణాఫ్రితో టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పరోక్షంగా వెనకేసుకొచ్చాడు. మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం 'పురానే(పుజారా, రహానే)'ల భవిష్యత్తుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు భారత సారధి బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పురానే భవిష్యత్తుని నిర్ణయించడం తన పని కాదని, జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన వారి విషయంలో నా జోక్యం ఏంటని విలేకరులను ఎదురు ప్రశ్నించాడు. సెలక్టర్లు వారిద్దరిని జట్టులో ఎంపిక చేస్తే మాత్రం మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని బదులిచ్చాడు. సీనియర్లుగా వారి అనుభవం జట్టుకి చాలా అవసరమని పురానేలకు పరోక్షంగా తన మద్దతు తెలిపాడు. కాగా, గతేడాది కాలంగా పుజారా, రహానేలు వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో వీరి ప్రదర్శన మరింత దిగజారింది. మూడు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరు చేసిన పరుగులతో పోలిస్తే.. టీమిండియాకి ఎక్స్‌ట్రాల రూపంలో ఎక్కువ పరుగులు వచ్చాయి. మూడు టెస్ట్‌ల్లో కలిపి దక్షిణాఫ్రికా బౌలర్లు 136 ఎక్స్‌ట్రాలు సమర్పించారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. Opponents drops Rahane's catch, Pujara drops opponents catch but our management drops neither of them. — Heisenberg ☢ (@internetumpire) January 14, 2022 సీనియర్ల గైర్హాజరీలో యువ జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. అన్నీ రంగాల్లో అద్భుతంగా రాణించి హాట్ ఫేవరెట్ అయిన టీమిండియాకు ఊహించని షాకిచ్చింది. మరోవైపు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత్ మాత్రం ఆశించిన మేరకు రాణించలేక చతికిలబడింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమై, సిరీస్ కోల్పోవడానికి పరోక్ష కారణమైంది. కేఎల్ రాహుల్, పంత్ మినహా ఒక్కరు కూడా సెంచరీ సాధించలేకపోయారు. సీనియర్ ఆటగాళ్లైన పుజారా, రహానేలు కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులను ఈ సిరీస్‌లోనే ఎదుర్కొన్నారు. Rahane and Pujara are the major reason for India's loss. — Rahul(Astrologer)Contact for 100% wrong prediction (@rahulpassi) January 14, 2022 పేలవ ఫామ్‌లో ఉన్న 'పురానే'కు వరుస అవకాశాలు ఇచ్చిన టీమిండియా యాజమాన్యం తగిన మూల్యమే చెల్లించుకుంది. ఈ ఇద్దరు బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపరిచారు. కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లను జారవిడిచి జట్టు విజయావకాశాలను దెబ్బకొట్టారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు వీరిపై విరుచుకుపడుతున్నారు. టీమిండియా సిరీస్ కోల్పోవడానికి వీరే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. #INDvSA High time Rahane and Pujara should be dropped off permanently from the test team squad! Dey got ample amount of chances to prove themselves! Gill, Hanuman Vihari, Shreyas Iyer we have dem waiting since forever! Its high tym now! — Angel Anki 🇮🇳 (@angel_ank1) January 14, 2022 'పురానే'కు వరుస అవకావాలు ఇస్తున్న టీమిండియా మేనేజ్మెంట్ ఇకనైనా మేల్కోవాలని.. పుజారా, రహానేల కథ ముగిసిందని.. శ్రేయస్ అయ్యర్, విహారి, శుభ్‌మన్ గిల్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, కేప్‌టౌన్ టెస్ట్‌లో రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 43,9 పరుగులు చేశాడు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో రాణించకపోగా మ్యాచ్ కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లు జారవిడిచారు. చదవండి: లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి -
లడ్డు లాంటి క్యాచ్ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి
Pujara Drops Simple Catch Of Keegan Petersen: దక్షిణాఫ్రికా గడ్డపై తొట్టతొలి టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజేతులా జారవిడిచింది. నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్‌లో పేలవ ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్‌ను ప్రత్యర్ధికి వదులుకుంది. ప్రత్యర్ధికి 212 పరుగుల ఫైటింగ్ టార్గెట్ నిర్ధేశించినప్పటికీ సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయడం ద్వారా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. నాలుగో రోజు ఆట కీలక దశలో(126/2) కీగన్ పీటర్సన్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ బ్యాట్ అంచును ముద్దాడిన బంతి, నేరుగా పూజారా చేతుల్లో ల్యాండైంది. అయితే పూజారా వదిలేసాడు. ఇది చూసిన కోహ్లి మిన్నకుండిపోయాడు. కాగా, పుజారా.. పీటర్సన్ క్యాచ్ వదిలేసే సమయానికి దక్షిణాఫ్రికా.. విజయానికి ఇంకా 83 పరుగుల దూరంలో ఉండింది. పీటర్సన్ కీలక ఇన్నింగ్స్(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) ఆడి టీమిండియాకు విజయాన్ని దూరం చేశాడు. కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..? -
IND Vs SA 3rd Test: పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్.. నిరాశతో వెనుదిరిగిన పుజారా
Keegan Petersen Stunning Catch: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్ మూడో రోజు ఆటలో అద్భుతం చోటు చేసుకుంది. సఫారీ ఆటగాడు కీగన్ పీటర్సన్.. పక్షిలా గాల్లోకి ఎగురుతూ రెప్పపాటులో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కీలక మ్యాచ్‌లో తప్పక రాణిస్తాడని భావించిన పుజారా.. పీటర్సన్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగాడు. మూడో రోజు తొలి ఓవర్ రెండో బంతికే మార్కో జన్సెన్ బౌలింగ్‌లో పుజారా ఔటయ్యాడు. ఫలితంగా భారీ స్కోర్‌పై కన్నేసిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలినట్లైంది. Keegan Petersen with a magnificent catch on the second ball of the day😍 #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/zqcAtMahSi — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 ఇదిలా ఉంటే, 57 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(127 బంతుల్లో 28; 4 ఫోరు).. తన సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతుండగా.. రిషబ్ పంత్(60 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడుతున్నాడు. లంచ్ సమయానికి భారత్ 143 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. చదవండి: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు -
ఆ భారత ఆటగాళ్లకు ఇదే చివరి ఛాన్స్..లేదంటే
భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రహానే గోల్డెన్ డక్ కాగా, పుజారా ఈ సారి కేవలం 3 పరుగులకే పెవియన్ చేరాడు. అయితే దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టు ఎంపిక చేసే ముందే వీరిద్దరి చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా విదేశాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా ఈ సీనియర్ ఆటగాళ్లకి చోటు దక్కింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేక పోతున్నారు. తొలి టెస్ట్‌లో రహానే 48 పరుగులతో ఫర్వాలేదనిపించిన, తర్వాత తేలిపోయాడు. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వాఖ్యలు చేశాడు. ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ వీళ్లిద్దరికి చాలా కీలకం అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే యువ ఆటగాళ్లు రాణిస్తుండంతో, వీళ్లు జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని అతడు తెలిపాడు. "పుజారా, రహానే ఇద్దరూ వారి టెస్ట్ కెరీర్‌ను కాపాడుకోవడానికి రెండో ఇన్నింగ్స్ కీలకం. తదపరి ఇన్నింగ్స్‌లో ఏదో ఒక స్కోర్ సాధించి జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే వారు జట్టులో తమ స్ధానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీళ్లకు శ్రేయస్ అయ్యర్ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: SA vs IND: రాహుల్‌కి వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా? -
అతి త్వరలో అతన్ని టీమిండియా నుంచి సాగనంపడం ఖాయం..!
Pujara Will Be Rested Soon Says Sarandeep Singh: గతకొంత కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై భారత మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుజారా వైఫల్యాల పరంపర ఇలాగే కొనసాగితే అతి త్వరలో జట్టు నుంచి సాగనంపడం ఖాయమని హెచ్చరించాడు. అతని స్థానాన్ని ఆక్రమించేందుకు శ్రేయస్ అయ్యర్ లాంటి నైపుణ్యం గల ఆటగాళ్లు కాసుకు కూర్చున్నారని, ఇకనైనా అలస్యం వీడకపోతే కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదముందని అలర్ట్ చేశాడు. గతకొంత కాలంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్, అడపాదడపా మయాంక్ అగర్వాల్ మినహా టీమిండియాలో ఎవ్వరూ పెద్దగా రాణించడం లేదని, పుజారాతో పాటు రహానే, కోహ్లిలు సైతం ఫామ్‌ని అందుకునేందుకు ప్రయత్నించాలని, లేకపోతే చాలామంది మహామహులకు పట్టిన గతే వీరికి పడుతుందని హితబోధ చేశాడు. ఈ సందర్భంగా భారత బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించిన శరణ్‌దీప్.. టీమిండియాదే టెస్ట్ సిరీస్ అని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై కూడా అతను స్పందించాడు. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసిన శరణ్‌దీప్.. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అతను ఈ మేరకు వ్యాఖ్యానించాడు. చదవండి: కోహ్లితో పోలిస్తే అతను బెటర్.. వన్డే కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక సరైందే..! -
ఆ ముగ్గురు ఆటగాళ్లకి ఇదే చివరి ఛాన్స్!
టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు దక్షిణాఫ్రికా పర్యటనే చివరి అవకాశం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఇషాంత్‌కు స్ధానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే తుది జట్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం చాలా కష్టం. ఇప్పటి వరకు 105 టెస్ట్‌ల్లో తన సేవలను భారత జట్టుకు అందించాడు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌ల రూపంలో ఇషాంత్‌కు జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. ఇషాంత్‌తో పాటు జట్టు సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పూజారా భవిష్యత్తు కూడా ఈ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. "భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా రహానె తొలగింపు ఇషాంత్‌కు ఒక స్పష్టమైన హెచ్చరిక వంటిది. సీనియర్ ఆటగాడిగా ఇషాంత్ మరింత రాణించాలి. పుజారా విషయంలో కూడా ఇదే నిజం. పుజారా చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. అతడు ప్రస్తుతం ఫామ్‌లో లేడు. కానీ ఒక సీనియర్ ఆటగాడిగా కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని జట్టు ఆశిస్తోంది. ఒకవేళ వారు ఈ సిరీస్‌లో అద్బుతంగా రాణిస్తే, తమ టెస్ట్ కెరీర్‌ను పొడిగించుకోగలరు" అని బీసీసీఐ అధికారి ఒకరు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ -
కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..?
Senior Indian Cricketers Revolted Against Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక గల కారణాలపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. వర్క్ లోడ్ కారణంగా పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఈ విషయమై ఓ ప్రముఖ వార్తా పత్రిక తాజాగా ఓ కథనం ప్రచురించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ పూర్తైన నాటి నుంచి టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, రహానే, పుజారాలు కోహ్లిపై అసంతృప్తిగా ఉన్నారని, ఆ ముగ్గురే కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారని, దీన్ని పరిగణలోకి తీసుకునే కోహ్లి ప్రమేయం లేకుండా టీమిండియా టీ20 ప్రపంచకప్ బృందం ప్రకటించబడిందని, ఇది నచ్చకే కోహ్లి టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని ఆ కథనంలో పేర్కొనబడింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి పుజారా, రహానే, అశ్విన్‌లను బాధ్యులని చేస్తూ.. కోహ్లి నోరుపారేసుకోవడంతో వివాదం మొదలైందని, అది కాస్తా చినికిచినికి గాలివానలా మారి కోహ్లి టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టిందని ప్రచురించింది. అలాగే, టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లి వన్డే కెప్టెన్సీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఇలా తొలిసారి.. -
షమీ, పుజారా ఫిట్.. రోహిత్ శర్మ డౌట్..!
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌కు ముందు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. నాలుగో టెస్ట్ సందర్భంగా రోహిత్ 353 నిమిషాల పాటు క్రీజ్‌లో గడపడం వల్ల అతని తొడలు ఎర్రగా కమిలిపొయాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో థై ప్యాడ్స్ రాసుకోవడం.. ఇంగ్లండ్ బౌలర్ల బంతులు బలంగా తాకడం వల్ల రోహిత్ రెండు తొడలకు గాయాలయ్యాయి. ఇదే మ్యాచ్‌లో రోహిత్ మోకాలి గాయం కూడా తిరగబెట్టింది. దీంతో ఆఖరి టెస్ట్ సమయానికి రోహిత్ ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. రోహిత్ గాయాల తీవ్రతపై బీసీసీఐ సైతం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం రోహిత్ గాయాన్ని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ గాయం తీవ్రమైతే అతని స్థానంలో పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్‌లలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతనితో పాటు నాలుగో టెస్ట్‌లో చీలమండ గాయానికి గురైన పుజారా సైతం పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుధవారం టీమిండియా సాధనలోనూ షమీ పాల్గొన్నాడు. దీంతో శుక్రవారం ప్రారంభమయ్యే అయిదో టెస్ట్‌కు షమీ, పుజారా అందుబాటులో ఉండనున్నాడు. గత మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేని సిరాజ్ స్థానంలో షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న రహానేపై వేటు తప్పేలా లేదు. ఇదే జరిగితే అతని స్థానంలో సూర్యకుమార్ టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయం. కాగా, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో నిలిచిన కోహ్లీ సేన సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. ఆఖరి టెస్ట్‌లో గెలిచినా.. డ్రా చేసుకున్న సిరీస్ భారత్ కైవసం చేసుకోనుంది. 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. చదవండి: ఇంగ్లండ్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే -
గాయం వేధిస్తున్నా పెయిన్ కిల్లర్ తీసుకుని మరీ ఆడాడు..
ఓవల్: గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతూ వస్తున్న టీమిండియా నయా వాల్ పుజారా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నట్లు కనపిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో సెంచరీకి చేరువగా వెళ్లిన పుజారా.. ప్రస్తుతం జరుగుతున్న ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధసెంచరీ(61) సాధించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, తాజా ఇన్నింగ్స్ సందర్భంగా పుజారా కాలి మడమ గాయంతో బాధపడ్డాడు. వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో అతని మడమ మడత పడటంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో మధ్యమధ్యలో పెయిన్ కిల్లర్‌ను తీసుకుంటూ మరీ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. టీమిండియా పటిష్ట స్థితికి చేరిన అనంతరం రాబిన్సన్ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇదే ఓవర్లో భారత్ రోహిత్ వికెట్‌ను కూడా కోల్పోయింది. Cheteshwar Pujara rolls his ankle over. After receiving treatment, he is back on his feet and continues to bat💪💪#ENGvIND pic.twitter.com/yLsam8DpRu — BCCI (@BCCI) September 4, 2021 ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్ ఒక్కడే అత్యధికంగా ఇలా..! -
టీమిండియా క్రికెటర్ భార్య వెటకారం.. కోహ్లి, రహానేలపై సెటైర్లు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. ఈ ఫోటో 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా తీసింది. ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైనా, రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ స్టోరీలో మయంతి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా.. ఇంగ్లండ్‌లో ఆండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లా కాదని, దానికి తన భర్తలా సపరేట్ టాలెంట్ ఉండాలని పరోక్షంగా కోహ్లి, రహానే, పుజారాపై సెటైర్లు వేసినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మయంతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్ యాంకర్ మయంతి లాంగర్‌ను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడిన బిన్నీ.. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు. టీమిండియా తరుపున 6 టెస్ట్‌లు ఆడిన అతను.. ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో బిన్నీ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం స్టువర్ట్ బిన్నీ(6/4) పేరిటే నమోదై ఉన్నాయి. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన బిన్నీ.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లే(6/12) రికార్డును బ్రేక్ చేశాడు. చదవండి: అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్ -
పుజారాను తప్పించి సూర్యకుమార్‌కు అవకాశం ఇవ్వండి..
ముంబై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హెడింగ్లే వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్ కోసం టీమిండియాలో ఓ కీలక మార్పు చేయాలని భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ డిమాండ్ చేశాడు. ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న టీమిండియా నయా వాల్ పుజారాను తప్పించి, డాషింగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 70 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచిన పుజారా స్థానంలో సూర్యకుమార్‌ను తుది జట్టులో ఆడిస్తే భారత విజయావకావాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డాడు. పుజారా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ భారత టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి తెస్తున్నాడని, అతని స్థానంలో వేగంగా పరుగులు చేయగల సూర్యను ఆడిస్తే టపార్డర్పై భారం తగ్గుతుందని పేర్కొన్నాడు. పుజారా సహా రహానే కూడా ప్రస్తుతం ఫామ్ లేమితో సతమవుతున్నారని, ఆడిన మ్యాచ్‌ల్లో కూడా నిదానంగా పరుగులు చేస్తూ జట్టుకు నిరుపయోగంగా మారారని విమర్శించాడు. పుజారా, రహానే క్లాస్ ప్లేయర్లే అయ్యిండొచ్చు కానీ, సూర్యకుమార్ ఓ మ్యాచ్ విన్నర్ అని ఆకాశానికెత్తాడు. సూర్యకుమార్ వేగంగా పరుగులు సాధించడంతో పాటు మిడిలార్డర్లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పగల సమర్ధుడని కితాబునిచ్చాడు. అందుకే పుజారా, రహానేల్లో ఒకరిపై వేటు వేసి సూర్యకుమార్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. కాగా, ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకుని.. ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్లో ఉన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఇంగ్లండ్‌లోని భారత్ జట్టుతో చేరారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుబట్టి మరీ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను ఇంగ్లండ్‌కి పిలిపించాడు. అయితే, లార్డ్స్ టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దాంతో పృథ్వీ షా మూడో టెస్టులో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే పుజారా స్లో ఇన్నింగ్స్‌లపై గుర్రుగా ఉన్న టీమిండియా మేనేజ్మెంట్.. సూర్యకుమార్ యాదవ్‌కి టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ డ్రాగా ముగియగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 1-0తో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చదవండి: ఫవాద్ ఆలామ్ అజేయ శతకం.. పటిష్ట స్థితిలో పాక్ -
రసపట్టులో.. భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు
తొలి టెస్టులో చివరి రోజు వర్షం శాసించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా... రెండో టెస్టులో మాత్రం భారత్, ఇంగ్లండ్ జట్లలో ఒక జట్టు గెలుపు రుచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పుజారా, రహానే మొండి పట్టుదలతో ఆడి ఆదుకునే ప్రయత్నం చేయగా... మార్క్ వుడ్, మొయిన్ అలీ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉండగా... ఆఖరి రోజు భారత్‌ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్ చేయడంపై ఇంగ్లండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి లార్డ్స్ టెస్టులో చివరిదైన ఐదో రోజు ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం ఖాయమనిపిస్తోంది. లండన్: మూడో రోజు ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించింది. నాలుగో రోజు మ్యాచ్‌పైనే పట్టు సాధించే పరిస్థితిని సృష్టించుకుంది. ఆతిథ్య జట్టు పేస్–స్పిన్‌ల కలబోత భారత్‌ను కష్టాలపాలు చేసింది. పేసర్ మార్క్ వుడ్ (3/40) ‘టాప్’ లేపగా... స్పిన్నర్ మొయిన్ అలీ (2/52) పాతుకుపోతున్న భారత ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో అజింక్య రహానే (146 బంతుల్లో 61; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 45; 4 ఫోర్లు) జట్టును ఆదుకునేందుకు చేసిన పోరాటం ఆఖరిదాకా నిలువలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ చేతిలో ఒక బ్యాట్స్‌మనే ఉన్నాడు. మిగతా వాళ్లంతా బౌలర్లే! వణికించిన వుడ్ భారత ఓపెనింగ్ జోడీ రాహుల్–రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్ పేస్‌కు వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ సీమర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్ తన వరుస ఓవర్లలో రాహుల్ (5), రోహిత్ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)లను పెవిలియన్ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్ కరన్ ఔట్ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... 56/3 స్కోరు వద్ద మనోళ్లు లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రహానే అర్ధసెంచరీ తర్వాత భారత్ ఆత్మరక్షణలో పడింది. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. దాంతో పరుగుల వేగం మందగించింది. దీంతో ఈ రెండో సెషన్లో 28 ఓవర్లు ఆడినా కూడా భారత్ 50 పరుగులు చేయలేకపోయింది. ఓవర్‌కు 2 పరుగుల రన్‌రేట్‌తో ఎట్టకేలకు 51 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరుకుంది. వికెట్ కాపాడుకున్న ప్రయోజనం నెరవేరడంతో 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. ఆఖరి సెషన్లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే ఫిఫ్టీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్ వుడ్ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్ చేశాడు. తర్వాత మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో సెషన్ భారత్‌కు మళ్లీ ముప్పు తెచ్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391; భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) మొయిన్ అలీ 61; పంత్ (బ్యాటింగ్) 14; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175. బౌలింగ్: అండర్సన్ 18–6–23–0, రాబిన్సన్ 10–6–20–0, వుడ్ 14–3–40–3; స్యామ్ కరన్ 15–3–30–1, మొయిన్ అలీ 20–1–52–2, రూట్ 5–0–9–0. -
278 బంతుల్లో 37 నాటౌట్.. బౌలర్లకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా లెజెండ్
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, ద వాల్ రాహుల్ ద్రవిడ్ డిఫెన్స్‌కు పెట్టింది పేరు. అతని తర్వాత ఆ స్థానాన్ని టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఆక్రమించాడు. అయితే వీరిద్దరి డిఫెన్స్‌ను తలదన్నేలా, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హాషీమ్ ఆమ్లా. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక కౌంటీ క్రికెట్లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 278 బంతులను ఎదుర్కొన ఆమ్లా.. 37 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. ఈ క్రమంలో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుకు తెచ్చాడు. ఆమ్లా డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌తో సర్రే జట్టు ఓటమి నుంచి బయటపడింది. Hashim Amla has played one of the great first-class innings - 37* off 278!balls to secure a draw for Surrey against Hampshire. An epic performance. pic.twitter.com/QfBF388UDl — Derek Alberts (@derekalberts1) July 7, 2021 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది. కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 213 బంతుల్లో 174 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సర్రే కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. ఇందులో హషీమ్ ఆమ్లా చేసిన 29 పరుగులే అత్యధికం. దీంతో ఫాలో ఆన్ ఆడిన సర్రే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాల్లో పడింది. ఆఖరి రోజు 6/2తో ఆట ఆరంభించిన ఆ జట్టు మరో 3 పరుగులకే మూడో వికెట్ కోల్పోయింది. నాలుగో స్థానంలో దిగిన ఆమ్లా తన క్లాస్ ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు. ఆఖరి రోజంతా క్రీజులో నిలబడ్డ ఆయన.. బౌన్సర్లు, యార్కర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ క్రికెట్లోని క్లాస్‌ను ప్రత్యర్ధులకు రుచి చూపించాడు. Hashim Amla batting on 5 runs in 114 deliveries for Surrey. Pujara bhai Wada Wau Wau moment for England series loading. — Silly Point (@FarziCricketer) July 7, 2021 తొలి 100 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన ఆమ్లా.. హాంప్‌షైర్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంత కఠినంగా బంతులేసినా.. ఊరించినా అస్సలు వికెట్ చేజార్చుకోలేదు. తాను ఆడిన 125వ బంతికి తొలి బౌండరీ కొట్టిన ఈ మిస్టర్ డిఫెన్స్.. 13.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరో పక్క వికెట్లు పడుతున్నా.. ఆమ్లా క్రీజులో నిలవడంతో సర్రే మ్యాచ్ ముగిసే సమయానికి 122/8తో నిలిచింది. దీంతో ఆ జట్టు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఈ క్రమంలో ఆమ్లా ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రికార్డును తిరగరాశాడు. 40లోపు పరుగులు(37*) సాధించేందుకు అత్యధిక బంతులను(278) ఎదుర్కొన్న క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఆమ్లా ఆడిన ఈ మాస్టర్ క్లాస్ డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. నయా వాల్ చతేశ్వర్ పుజారా మాదిరిగా ఆమ్లా కూడా జట్టును రక్షించాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Most balls faced in a first-class innings of less than 40: 278 HM Amla (37*) Surrey v Hampshire Southampton 2021 277 TE Bailey (38) England v Australia Leeds 1953 (where balls faced are known) — Andrew Samson (@AWSStats) July 7, 2021 -
తొలి పరుగు కోసం 36 బంతులు.. పుజారాపై మీమ్స్ వర్షం
సౌతాంప్టన్: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఆటతీరు ఈ మధ్య భారత అభిమానులకు మింగుడు పడటం లేదు. అతను అసలైన టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. కొన్ని సార్లు పరగులు చేయడానికి మరీ ఎక్కువ బంతులు తీసుకోవడం.. జట్టు ప్రయోజనాలకు తగ్గట్టుగా ఆడకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ పుజారా మరోసారి ప్రత్యర్థి బౌలర్లతోపాటు అభిమానుల సహనాన్ని పరీక్షించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ (34), శుభ్‌మన్ గిల్ (28) శుభరంభం ఇచ్చారు. ఓపెనర్లు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పుజారా తొలి పరుగు చేయడానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మరో ఫోర్ కొట్టిన అతడు చివరికి 54 బంతుల్లో 8 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా, పుజారా ఇన్నింగ్స్‌పై ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. Pujara reminds me of this inning, and Non- striker is Virat 😭 pic.twitter.com/GCmXWJ01Fr — Liv 💫 (@Virat_Mamta) June 19, 2021 Pujara in first sessionpic.twitter.com/0BIZheNSfv — వేటగాడు (@rao_4005) June 19, 2021 New Zealand players' strategy to get Pujara out in the #WTCFinal2021pic.twitter.com/AsvJMXMeb8 — BufferedStart (@BufferedStart) June 17, 2021 చదవండి: WTC Final: 250కి పైగా పరుగులు చేస్తే టీమిండియాదే పై చేయి.. -
అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్
సిడ్నీ: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనో పటిష్టమైన రాతి గోడ అని, బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులను సైతం అతను అడ్డుకోగల సమర్ధుడని, నేటి తరంలో అలాంటి క్లాస్ ఆటగాడిని చూడలేదని కొనియాడాడు. క్రీజులో అతను చూపించే ఓపికకు ఎంతటి బౌలర్ అయినా దండం పెట్టాల్సిందేనని ఆకాశానికెత్తాడు. గబ్బా టెస్ట్‌లో అతను మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రత్యక్షంగా చూశానని, ఓ ఎండ్‌లో పుజారా, మరో ఎండ్‌లో పంత్‌ను చూడటం విచిత్రంగా అనిపించిందని వెల్లడించాడు. తాజాగా ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌తో ఆయన మాట్లాడుతూ.. పుజారాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పుజారాతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదని, అయినా అతని గురించి ఎంతో తెలుసన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. ఇటీవల తమతో జరిగిన సిరీస్‌లో పుజారా అంత ప్రభావం చూపలేడని తొలుత భావించామని, కానీ సిడ్నీ, గబ్బా టెస్ట్‌ల్లో అతను బ్యాటింగ్ చేసిన తీరు చూసి అవాక్కయ్యామని తెలిపాడు. ముఖ్యంగా నాలుగో టెస్ట్‌లో పుజారా తన దేహానికి బంతులు తగిలించుకున్న విధానాన్ని చూస్తే ఎంతటివారైనా సలామ్ అనాల్సిందేనని అన్నాడు. భీకరమైన బంతులు శరీరాన్ని గాయపరిస్తే, పంటి బిగువన నొప్పిని భరించాడన్నాడు. అతనిలా జట్టు ప్రయోజనాల కోసం దెబ్బలు తగిలించుకున్న ఆటగాడిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. రాతి గోడపైకి బంతిని సంధిస్తే ఎలా ఉంటుందో, అతని డిఫెన్స్ కూడా అదేలా ఉంటుందని కొనియాడాడు. కాగా, టీమిండియా ఆటగాళ్ల అత్యద్భుత పోరాట పటిమ కారణంగా ఆసీస్‌తో జరిగిన సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో పుజారా అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బంతులు దేహానికి తగులుతున్నా గోడలా నిలబడి, టీమిండియాకు అపురూపమైన విజయాన్ని అందించాడు. చదవండి: ICC RANKINGS: రెండో ర్యాంక్ నిలబెట్టుకున్న కోహ్లీ -
పుజారా ఆన్ ఫైర్.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్
ముంబై: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ ఎడిషన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా సన్నద్ధమవుతున్నాడు. తనపై టెస్ట్ క్రికెటర్‌గా ఉన్న ముద్రను తొలగించుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగా సహచర ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ, పుజారా ఆన్ ఫైర్ అనిపిస్తున్నాడు. నెట్స్‌లో అతను భారీ షాట్లు ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Puji was on fire 🔥@cheteshwar1 #csk pic.twitter.com/CNbPXi786q — Ravi Desai 🇮🇳 Champion CSK 💛🏆 (@its_DRP) March 30, 2021 చాలా కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న పుజారా టీ20 క్రికెట్ ఎలా ఆడుతాడో అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆయన భారీ షాట్లతో విరుచుకుపడటం అభిమానులను అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. 2014 తర్వాత పుజారా ఐపీఎల్ ఆడబోతుండటం ఇదే తొలిసారి. ఐపీఎల్ 2021 కోసం నిర్వహించిన వేలంలో పుజారాను చెన్నై కనీస ధరను(రూ.50లక్షలు) వెచ్చించి దక్కించుకుంది. పుజారా తన ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో మొత్తం 30 మ్యాచ్‌లు ఆడగా, 99.74 స్ట్రయిక్ రేట్‌తో 390 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ(51) కూడా ఉంది. కాగా, టీమిండియా తరఫున 85 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా.. ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడకపోవడం విశేషం. ఇదిలా ఉండగా ముంబై వేదికగా ఏప్రిల్ 10న జరిగే మ్యాచ్‌లో చెన్నై జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. చదవండి: ఈ రూల్స్ అప్పుడుంటే సచిన్, గంగూలీలకు అవకాశాలు వచ్చేవి కావు.. -
దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్..
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాలు చెరో స్థానం కోల్పోయి ఐదు, ఏడు ర్యాంకులకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు చెరో అర్ధ శతకం సాధించినప్పటికీ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కోల్పోయారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఇంగ్లాండ్ సారథి జో రూట్(218) రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకోగా, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుత్నున్నారు. మరో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్, కివీస్ ఆటగాడు హెన్రీ నికోల్స్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, ఆసీస్ ఓపెనర్ వార్నర్‌లు తలో స్థానాన్ని మెరుగుపరచుకొని ఆరు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేయడంతో తొలిసారిగా 700 రేటింగ్ పాయింట్లు సాధించి 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా, మరో ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, బూమ్రాలు చెరో స్థానాన్ని మెరుగుపరచుకొని ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
పుజారాకు అశ్విన్ సవాల్..!
చెన్నై: అగ్రశ్రేణి స్పిన్నర్‌గా భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించినా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ సత్తాపై అనేక మార్లు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. తాజా సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా గడ్డపై అతను విఫలమైన విషయాన్ని పదే పదే అందరూ గుర్తు చేశారు. విదేశాల్లో రాణించలేడనే అపవాదూ అతనిపై ఉండేది. ఒక దశలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్, ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీలు కూడా అతనికంటే మెరుగైన వారని కథనాలు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌లో 28.83 సగటుతో 12 వికెట్లు తీసిన అశ్విన్ జట్టు సిరీస్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ పోరులో టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్‌ను అవుట్ చేసే విషయంలో తన ఆలోచనల గురించి చెప్పిన అశ్విన్... పనిలో పనిగా ఇతర స్పిన్నర్లతో తనను పోల్చడంపై ఘాటుగా స్పందించాడు. ‘ఒక మ్యాచ్‌కు ముందు నేను సొంతంగా హోమ్ వర్క్ చేసుకుంటాను. ఎనిమిది గంటల పాటు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వీడియోలు చూస్తాను. ఆపై మ్యాచ్‌లో ఎక్కడ, ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో నిర్ణయించుకుంటా. టిమ్ పైన్‌ను మెల్బోర్న్లో అలాగే అవుట్ చేశా. స్మిత్‌ను ఎవరు అవుట్ చేస్తారనే దానిపై బాగా చర్చ జరిగింది. ఎవరూ నా గురించి మాట్లాడనే లేదు. ఆసీస్ గడ్డపై స్మిత్ ఎప్పుడూ స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుట్ కాలేదు. నేను దానిని మార్చాలనుకున్నా. ప్రపంచంలో నన్ను నేను అత్యుత్తమ బౌలర్‌గా భావించుకుంటా. అలాగే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలని కోరుకుంటా. కోహ్లితో తలపడలేను కాబట్టి స్మిత్‌తో తలపడ్డా. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేశా’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. లయన్, అలీలతో పోలుస్తూ తనను మరీ ‘మైక్రోస్కోప్’ కింద ఉంచి పరీక్షించారని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్‌కంటే లయన్ ప్రదర్శన బాగుండగా... 2018 సౌతాంప్టన్ టెస్టులో అలీ వికెట్లు తీసిన చోట అశ్విన్ విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘లయన్గానీ అలీగానీ సరిగ్గా ఆఫ్ స్టంప్ బయట బంతులు వేస్తున్నప్పుడు కామెంటరీ బాక్స్ నుంచి వార్న్ వాటిని అద్భుతంగా వర్ణించినంత మాత్రాన నేను అలాగే బౌలింగ్ చేయాలని ఏమీ లేదు. వారు భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. నేను ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్‌కు బౌలింగ్ చేస్తున్నాను. గత సిరీస్‌లో అడిలైడ్‌లో నా పొత్తికడుపులో గాయమైనా సరే పట్టుదలగా ఆడి ఆరు వికెట్లు తీశాను. కానీ మ్యాచ్ ముగిశాక నాకంటే లయన్ ఎంత బాగా బౌలింగ్ చేశాడో అందరూ చెప్పుకున్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. లయన్ మంచి బౌలరే. అతనంటే నాకు గౌరవం ఉంది. కానీ నా ఆలోచనలు వేరు. ఇకపై లయన్‌తో పోటీ పడటంకంటే స్మిత్‌తో తలపడటం ముఖ్యమని అర్థం చేసుకున్నా’ అని అశ్విన్ వివరించాడు. అర మీసంతో ఆడతా! సహచరుడు పుజారాకు అశ్విన్ సరదాగా సవాల్ విసిరాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మొయిన్ అలీతో పాటు మరే స్పిన్నర్ బౌలింగ్‌లోనైనా పుజారా పిచ్‌పై ముందుకు దూసుకొచ్చి బౌలర్ తల మీదుగా భారీ షాట్ ఆడితే తాను సగం మీసం తీసేస్తానని... అలాగే మైదానంలో మ్యాచ్ ఆడతానని అశ్విన్ వ్యాఖ్యానించాడు. -
‘అతన్ని ఔట్ చేసే మార్గం కోసం అన్వేషణ’
సిడ్నీ: 2018-19 సీజన్లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ సిరీస్‌లో టీమిండియా ఆటగాడు చతేశ్వర పుజారా నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో (ఏడు ఇన్నింగ్స్‌ల్లో) 521 పరుగులు సాధించి భారత్ టెస్టు సిరీస్‌ను గెలవవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో పుజరా అత్యధిక వ్యక్తిగత స్కోరు 193 కాగా మూడు సెంచరీలు సాధించాడు. అయితే ఈసారి అలా కానివ్వని అంటున్నాడు ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్. ప్రస్తుతం నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్‌కు పుజారా బెంగ పట్టుకుంది. దానిలో భాంగా పుజారా బ్యాటింగ్‌పై కసరత్తు చేస్తున్నాడు కమిన్స్. ఈ సీజన్లో చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లాల్సి ఉండటంతో పుజారా బ్యాటింగ్ గురించి ఆలోచిస్తున్నాడు కమిన్స్. (నీకు.. 3డీ కామెంట్ అవసరమా?: గంభీర్) ‘సాధ్యమైనంత వరకూ పుజారా క్రీజ్‌లో ఉండటానికి యత్నిస్తాడు. సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేసినా ఎక్కడ ఆందోళన లేకుండా క్రీజ్‌లో ఉంటాడు. అది అతనిలో ప్రత్యేకత. పుజారాను ఔట్ చేయడానికి మార్గాలు అన్వేషించాలి. గత ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా బ్యాటింగ్‌తో అలరించాడు. అందుకోసం పిచ్‌లను మార్చాల్సిన అవసరం ఏమీ లేదు.. దేన్నీ తయారు చేయాల్సిన అవసరం లేదు. మా బౌలింగ్ బలంతోనే పుజారాను త్వరగా ఔట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వికెట్ బౌన్స్‌కు అనుకూలిస్తే మా వద్ద మరిన్ని ఆప్షన్లు ఉంటాయి. చూద్దాం. ఏమి జరుగుతుందో’ అని కమిన్స్ తెలిపాడు. తాను ఆడే ప్రతీ టెస్టు నుంచి ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి యత్నిస్తూ ఉంటానన్నాడు. ‘ప్రతీ సిరీస్‌కు మెరుగు పడుతూ ముందుకు సాగడమే నా లక్ష్యం. టెస్టు క్రికెట్ అనేది చాలా కొత్త పాఠాలను నేర్పుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టెస్టు క్రికెట్ అనేది ఘోరంగా సాగుతుంది. ప్రత్యర్థి జట్లు మొత్తం రోజంతా బ్యాటింగ్ చేస్తే, మరొక సందర్భంలో వారు బ్యాటింగ్‌ను కుప్పకూల్చడం వంటిది జరుగుతూ ఉంటుంది’ అని కమిన్స్ తెలిపాడు. (ధోనిని ఏనాడు అడగలేదు: రైనా) ఐపీఎల్ -13వ సీజన్లో భాగంగా గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అతని కనీస ధర రెండు కోట్లు ఉండగా, రూ. 15.50 కోట్లు వెచ్చించీ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) దక్కించుకుంది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంచితే, భారత స్పెషలిస్టు టెస్టు ప్లేయర్‌గా ముద్ర సంపాదించుకున్న చతేశ్వర పుజారా.. ఐపీఎల్ ఆడి దాదాపు ఆరేళ్ల అవుతుంది. టెస్టు ఆటగాడిగా ముద్ర పడిన పుజారాను కొనుగోలు చేయడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ముందుకు రావడం లేదు. దాంతో తిరిగి ఐపీఎల్ ఆడాలనుకుంటున్న పుజారా కల నెరవేరడం లేదు. తాను పరిస్థితులకు తగ్గట్టు ఆడతానని పదే పదే చెప్పుకుంటున్నా పుజారాపై ఆసక్తి కనబరచడం లేదు. -
అర్పిత్ సెంచరీ: సౌరాష్ట్ర 384/8
రాజ్‌కోట్: అర్పిత్ వసవాడా (287 బంతుల్లో 106; 11 ఫోర్లు) అద్భుత సెంచరీ... చతేశ్వర్ పుజారా (237 బంతుల్లో 66; 5 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్... వెరసి బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 206/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 160 ఓవర్లలో 8 వికెట్లకు 384 పరుగులు చేసింది. తొలి రోజు అస్వస్థత కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పుజారా రెండో రోజు మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అర్పిత్‌తో కలిసి పుజారా సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ రెండు సెషన్లపాటు ఆడటంతోపాటు ఆరో వికెట్‌కు 380 బంతుల్లో 142 పరుగులు జోడించారు. గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన అర్పిత్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాడు. ఓవరాల్‌గా రెండో రోజు సౌరాష్ట్ర 79.1 ఓవర్లు ఆడి మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. చివరి సెషన్లో అర్పిత్, పుజారా అవుటైనా అప్పటికే బెంగాల్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం చిరాగ్ జానీ (44 బంతుల్లో 13 బ్యాటింగ్), ధర్మేంద్ర సింగ్ జడేజా (22 బంతుల్లో 13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
గ్లౌస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో పుజారా ఒప్పందం
లండన్: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీల్లో గ్లౌస్టర్‌షైర్‌తో జతకట్టాడు. ఏప్రిల్‌లో మొదలయ్యే ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు 32 ఏళ్ల భారత బ్యాట్స్‌మన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12 నుంచి మే 22 వరకు అతను నాలుగురోజుల మ్యాచ్‌లు 6 ఆడతాడు. పుజారా కౌంటీలాడటం ఇదేం కొత్తకాదు. గతంలో డెర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. -
సెంచరీతో చెలరేగిన హనుమ విహారి
0, 1, 0... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగేందుకు అవకాశం ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో చేసిన స్కోర్లు ఇవి. నిజానికి కివీస్ ఎలెవన్‌తో ఈ మ్యాచ్‌ను ఓపెనర్ల సామర్థ్యానికి పరీక్షగా భావించగా... కాస్త పచ్చిక ఉన్న పిచ్‌పై ముగ్గురూ అందులో విఫలమయ్యారు. అసలు టీమిండియా తుది జట్టులో ఉంటాడా లేదా అనే సందేహమున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి మాత్రం సెంచరీతో సత్తా చాటాడు. విహారికి తోడుగా సీనియర్ పుజారా కూడా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు మోస్తరు స్కోరు సాధించింది. కెప్టెన్ కోహ్లి మాత్రం బ్యాటింగ్‌కు దూరంగా ఉండిపోవడమే శుక్రవారం ఆటలో విశేషం. హామిల్టన్: పిచ్‌పై కాస్త బౌన్స్, మరికాస్త స్వింగ్ కలగలిస్తే భారత బ్యాట్స్‌మెన్ తడబడతారనేది గతంలో చాలా సార్లు రుజువైంది. అయితే కోహ్లి సారథ్యంలోని ప్రస్తుత జట్టు వాటికి అతీతమని, ఎక్కడైనా రాణించగలదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై మాత్రం పెను సవాల్ ఎదురు కానుందని ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే తేలిపోయింది. కివీస్ ద్వితీయ శ్రేణి బౌలర్లను కూడా సమర్థంగా మన బ్యాట్స్‌మెన్ ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78.5 ఓవర్లలో 263 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (182 బంతుల్లో 101 రిటైర్డ్ అవుట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అజేయంగా నిలిచాడు. పుజారా (211 బంతుల్లో 93; 11 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకోగా... ఇతర బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ కనీసం 20 పరుగులు కూడా దాటలేకపోయారు. విహారి, పుజారా ఐదో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. టపటపా... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కుగ్లీన్ వేసిన తొలి ఓవర్లోనే అనూహ్యంగా పైకి లేచిన బంతిని ఆడలేక పృథ్వీ షా (0) షార్ట్‌లెగ్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత కుగ్లీన్ బౌలింగ్‌లోనే ఆఫ్‌స్టంప్‌పై దూసుకొచ్చిన బంతిని ఆడి మయాంక్ (1) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని, వాటిని జాగ్రత్తగా ఆడాలంటూ వ్యాఖ్యానించిన శుబ్‌మన్ గిల్ (0) ఈ ఇన్నింగ్స్‌లో షార్ట్ పిచ్ బంతినే ఆడలేక గల్లీలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనుభవజ్ఞుడైన రహానే (18) కూడా నీషమ్ వేసిన స్వింగ్ బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం ఆశ్చర్యపరచింది. భారీ భాగస్వామ్యం... భారత్ స్కోరు 38/4గా నిలిచిన దశలో పుజారా, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేసినా వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారు. తాను ఆడిన తొలి 80 బంతుల్లో పుజారా ఒకే ఫోర్ కొట్టాడు. పిచ్ సాధారణంగా మారిపోయిన తర్వాత ఇద్దరూ చక్కటి షాట్లు ఆడారు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో విహారి కొట్టిన మూడు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అర్ధసెంచరీ చేసేందుకు పుజారాకు 153 బంతులు, విహారికి 132 బంతులు పట్టాయి. అయితే ఆ తర్వాత సెంచరీ అందుకునేందుకు విహారి మరో 48 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. మరో వైపు పుజారా మాత్రం సెంచరీకి చేరువలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా... శతకం పూర్తి కాగానే విహారి రిటైర్డ్ అవుట్‌గా తప్పుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు మిగిలిన సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసే ప్రయత్నంలో భారత బ్యాట్స్‌మన్ వెంటవెంటనే అవుటయ్యారు. 18 పరుగుల వ్యవధిలో చివరి నలుగురు బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) రవీంద్ర (బి) కుగ్లీన్ 0; మయాంక్ (సి) క్లీవర్ (బి) కుగ్లీన్ 1; పుజారా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 93; గిల్ (సి) సీఫెర్ట్ (బి) కుగ్లీన్ 0; రహానే (సి) బ్రూస్ (బి) నీషమ్ 18; విహారి (రిటైర్డ్ అవుట్) 101; పంత్ (సి) కుగ్లీన్ (బి) సోధి 7; సాహా (సి) క్లీవర్ (బి) గిబ్సన్ 0; అశ్విన్ (ఎల్బీ) (బి) సోధి 0; ఉమేశ్ (నాటౌట్) 9; జడేజా (సి) అలెన్ (బి) సోధి 8; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (78.5 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–0; 2–5; 3–5; 4–38; 5–233; 6–245; 7–246; 8–246; 9–250; 10–263. బౌలింగ్: కుగ్లీన్ 14–2–40–3; టిక్నర్ 15–3–37–0; మిషెల్ 7–1–15–0; నీషమ్ 13–3–29–1; గిబ్సన్ 10–1–26–2; సోధి 14.5–0–72–3; రవీంద్ర 5–1–30–0. ఓపెనింగ్ చేసేందుకు సిద్ధం! హామిల్టన్: విహారి కెరీర్ 7 టెస్టు మ్యాచ్‌లే కావచ్చు. కానీ తనకు టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు అవకాశం ఇచ్చినా దానిని వృథా చేయలేదు. ఎక్కడైనా, ఏ స్థానంలోనైనా ఆడగలనని ఈ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ నిరూపించాడు. ఏడాది క్రితం మెల్బోర్న్ టెస్టులో అనూహ్యంగా అతడిని ఓపెనర్‌గా పంపారు. 8, 13 పరుగులే చేసినా... తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు 80 నిమిషాల పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడం జట్టుకు పనికొచ్చింది. అతని ఈ ప్రదర్శనను కెప్టెన్ కోహ్లి స్వయంగా ప్రశంసించాడు. ఇప్పుడు అలాంటిదే మరో అవకాశం అతని కోసం ఎదురు చూస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ముగ్గురు ఓపెనర్లూ విఫలం కాగా, ఓపెనర్లకు ఉండే సమర్థవంతమైన టెక్నిక్‌తో విహారి సెంచరీ చేయడం అతనికి కొత్త అవకాశాన్ని సృష్టించింది. దీనిపై స్పందించిన విహారి ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. ‘ఒక ఆటగాడిగా ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సన్నద్ధమయ్యాను. టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు నాతో ఏమీ చెప్పలేదు. ఎవరూ మాట్లాడలేదు. అయితే గతంలో చెప్పినట్లు జట్టు అవసరాల దృష్ట్యా ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధం. కొన్ని సార్లు జట్టు కూర్పు గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. దాని వల్ల బాధ పడకూడదు. స్వదేశంలో ఆడినప్పుడు మన జట్టు ఐదుగురు బౌలర్లతో దిగుతుంది కాబట్టి ఒక బ్యాట్స్‌మన్‌ను తప్పించాల్సిందే. నాకు తుది జట్టులో చోటు దక్కకపోవడానికి అదే కారణమని భావిస్తున్నా’ అని శుక్రవారం మీడియా సమావేశంలో విహారి వ్యాఖ్యానించాడు. -
సౌరాష్ట్ర సాధించెన్
లక్నో: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర అద్భుతం చేసింది. ఉత్తరప్రదేశ్‌తో ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏకంగా 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్ చేరింది. తద్వారా 2008–09 సీజన్లో సర్వీసెస్‌పై అసోం నెలకొల్పిన అత్యధిక పరుగుల ఛేదన రికార్డు (371 పరుగులు)ను బద్దలు కొట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు వెనుకబడినా... రెండో ఇన్నింగ్స్‌లో తేరుకుని సెమీస్ గడపతొక్కింది. లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 195/2తో శనివారం చివరి రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్రను ఓపెనర్ హార్విక్ దేశాయ్ (259 బంతుల్లో 116; 16 ఫోర్లు) కెరీర్లో తొలి శతకంతో ముందుకు నడిపించాడు. అయితే, అతడితో పాటు మక్వానా (7) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (110 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (109 బంతుల్లో 73 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సంయమనం చూపారు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న వీరు ఐదో వికెట్‌కు అజేయంగా 136 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించింది. కనీసం ‘డ్రా’ చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన ఉత్తరప్రదేశ్ ఉసూరుమంటూ వెనుదిరిగింది. విదర్భ మరోసారి... సొంతగడ్డ నాగ్‌పూర్‌లో ముగిసిన మరో క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ ఇన్నింగ్స్ 115 పరుగులతో ఉత్తరాఖండ్‌పై గెలుపొంది సెమీస్ చేరింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (274 పరుగులు)తో విదర్భ సెమీస్ బెర్త్ ముందే ఖాయమైంది. నామమాత్రమైన రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 152/5తో శనివారం ఆట కొనసాగించిన ఉత్తరాఖండ్... టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ (5/23), ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆదిత్య సర్వాతె (5/55) ధాటికి ఏడు పరుగులకే మిగతా ఐదు వికెట్లూ కోల్పోయి 159 పరుగులకే ఆలౌటైంది. ఈనెల 24న మొదలయ్యే సెమీఫైనల్స్‌లో కేరళతో విదర్భ; కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడతాయి. -
‘ఆసీస్’ ద్రాక్ష అందిందిలా..
41/4... అడిలైడ్‌లో తొలి టెస్టు గంటన్నర గడిచిందో లేదో టీమిండియా స్కోరిది. ఓపెనర్ల పేలవ ఫామ్... కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్య వైఫల్యం... వైస్ కెప్టెన్ అజింక్య రహానే సైతం చేతులెత్తేయడంతో ఇంకేముంది? అంతా పాత కథే అనుకున్నారు. ఎన్నో అంచనాలు, మరెన్నో విశ్లేషణలు, ఇంకెన్నో ఆశలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్... ‘కొత్త చరిత్ర’ సృష్టించడం అటుంచి, ‘పాత చరిత్ర’నే పునరావృతం చేస్తుందని భావించారు. కానీ, ఇక్కడి నుంచి కథ మారింది. సరిగ్గా నెల రోజులు తిరిగేసరికి సిరీస్ దాసోహమైంది. దీని వెనుక పుజారా నిలకడ, బుమ్రా అద్భుతాలు, కోహ్లి వెన్నుదన్నుతో పాటు ‘టాస్’ రూపంలో అదృష్టం కూడా వెంట నడిచింది. ఫలితంగా, ఇంతకాలం అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఆసీస్‌లో సిరీస్ విజయం మన సొంతమైంది. దేశ క్రికెట్లో సువర్ణాధ్యాయం నమోదైంది. జట్టు సమష్టిగా సాధించిన ఈ ఘనతలో ఓ ఐదు అంశాలు కీలకంగా నిలిచాయి. అవేంటంటే! సాక్షి క్రీడా విభాగం : అది 2003–04 సిరీస్. నాలుగు టెస్టు మ్యాచ్‌లకు గాను మొదటిది ‘డ్రా’ కాగా, రెండో దాంట్లో భారత్ గెలుపొంది... ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి ఆధిక్యంలో నిలిచింది. కానీ, మూడో టెస్టులోఓడటంతో గణాంకాలు సమమయ్యాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన చివరి టెస్టులో టీమిండియా కంగారూలకు 443 పరుగుల అతి భారీ లక్ష్యం విధించింది. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో ఐదో రోజు మైదానంలో దిగిన ఆసీస్... ఓ దశలో 196/4తో నిలిచింది. అప్పటికింకా 40 ఓవర్ల ఆట మిగిలుంది. ప్రత్యర్థి ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసి మన బౌలర్లు ఊపు మీదున్నారు. టీమిండియా విజయం ఖాయం అనుకుంటున్న ఇలాంటి స్థితిలో కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న నాటి కెప్టెన్ స్టీవ్ వా (159 బంతుల్లో 80), సైమన్ కటిచ్ (96 బంతుల్లో 77 నాటౌట్)తో కలిసి గోడ కట్టాడు. ఓవర్లన్నీ కరగదీసి... ‘డ్రా’గా ముగించాడు. అలా, అప్పుడు సిడ్నీలో త్రుటిలో చేజారిన ‘చారిత్రక విజయం’ సరిగ్గా పదిహేనేళ్లకు, అదేచోట, అటుఇటుగా అవే తేదీల్లో ఖాయమైంది. టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకుకు తాము అర్హులమేనని కోహ్లి సేన సగర్వంగా చెప్పుకొనేలా చేసింది. ఈ గొప్పదనంలో ఎవరి పాత్ర ఏంటంటే..? అహో పుజారా... 521 పరుగులు, 74.22 సగటు, మూడు శతకాలు, ఒక అర్ధ శతకం! సిరీస్‌లో పుజారా గణాంకాలివి. అడిలైడ్‌లో టాపార్డర్ కుప్పకూలిన సందర్భంలో, మెల్బోర్న్లో జట్టుకు అత్యవసర సమయంలో, సిడ్నీలో ఆధిక్యాన్ని పెంచాల్సిన స్థితిలో పుజారా చేసిన శతకాలను పోల్చేందుకు ఏ గణాంకాలూ సాటి రావు. అతడు విఫలమైన పెర్త్‌లోనే టీమిండియా ఓడటం గమనార్హం. దీన్నిబట్టి విజయంలో తన పాత్రేమిటో చెప్పేయొచ్చు. అపరిమిత సహనం, చెక్కుచెదరని ఏకాగ్రత, సడలని డిఫెన్స్‌తో ఆసీస్ పేసర్ల బంతులను కాచుకున్న విధానం, క్రీజు వదిలి ముందుకొచ్చి స్పిన్నర్ లయన్‌ను దెబ్బకొట్టిన తీరు, ఇంత గొప్ప విజయంలో భాగమైనా కాసింతైనా గర్వం లేని నైజం కొత్త కుర్రాళ్లకు అచ్చమైన టెస్టు పాఠమే. ఇక అనేకానేక కారణాలతో జట్టులో చోటు కుర్చీలాటగా మారిన పరిస్థితుల్లో ఈ ఒక్క పర్యటన పుజారాను ఎక్కడికో తీసుకెళ్లింది. మరోవైపు ఈ సిరీస్‌తో కోహ్లికి తాను సమఉజ్జీనని చాటుకున్నాడు. తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆటతో ఇకపై ఏ సిరీస్‌కూ తప్పించే ఆలోచనే రాకుండా చేశాడు. భళా బుమ్రా... సొంతగడ్డపై ఆసీస్ పేసర్లే తేలిపోతే, జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 21 వికెట్లు (సిడ్నీలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ మినహా) పడగొట్టి ప్రత్యర్థి పనిపట్టాడు. అతడి 140 కి.మీ. నిలకడైన వేగం, వైవిధ్య శైలి, తెలివైన బౌలింగ్ ముందు కంగారూ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. మెల్బోర్న్లో కేవలం 115 కి.మీ. వేగంతో బుమ్రా సంధించిన బంతిని షాన్ మార్‡్ష వంటి సీనియర్ సైతం ఆడలేకపోయాడు. పాదాలను చితగ్గొట్టే పదునైన యార్కర్లు బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాయి. సుదీర్ఘ స్పెల్స్ వేయడంతో పాటు జట్టుకు కావాల్సిన సందర్భాల్లో వికెట్లు తీస్తూ బుమ్రా పైమెట్టులో నిలిచాడు. అతడి ఆరు వికెట్ల ప్రదర్శనే మెల్బోర్న్ టెస్టును భారత్ పరం చేసింది. ఈ పర్యటనతో ప్రపంచంలో ఎలాంటి పిచ్‌పైనైనా తాను రాణించగలనని బుమ్రా చాటాడు. లయన్ జూలు విదిల్చకుండా... కోహ్లిలాంటి బ్యాట్స్‌మన్‌ను పదేపదే ఔట్ చేస్తూ, అడిలైడ్, పెర్త్‌లో ఏకంగా 16 వికెట్లు నేలకూల్చి కలవరపెట్టాడీ ఆఫ్ స్పిన్నర్. ఇతడి జోరు చూస్తే భారత్ ఆశలకు గండికొట్టేవాడిలానే కనిపించాడు. కానీ, మెల్బోర్న్లో లయన్ జూలు పీకేశారు భారత బ్యాట్స్‌మెన్. అతడిని వ్యూహాత్మకంగా, ప్రణాళిక ప్రకారం ఎదుర్కొన్నారు. ఓవర్లకు ఓవర్లు వేసినా వికెట్ దక్కకుండా చేసి చివరకు ఎటూ పాలుపోని స్థితికి తీసుకొచ్చారు. దీంతో చివరి రెండు టెస్టుల్లో 328 పరుగులిచ్చి ఐదే వికెట్లు పడగొట్టగలిగాడు. ‘టాస్’ కూడా మేలు చేసింది... ఏ దేశంలోనైనా ఈ కాలంలో టెస్టు విజయానికి సగం మార్గం టాస్‌తోనే పడుతోంది. ఇంగ్లండ్‌లో భారత్‌ను వెక్కిరించిన టాస్ ఈసారి మాత్రం కరుణించింది. పెర్త్ మినహా అన్నిచోట్లా కోహ్లినే టాస్ నెగ్గగా... బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి భారత్ మంచి స్కోర్లతో మ్యాచ్‌ను లాగేసుకుంది. కుర్రాళ్ల తోడ్పాటు... యువ పృథ్వీ షా గాయంతో దూరమై, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమై, ఓపెనింగ్ రెండు స్థానాలూ ఖాళీగా కనిపించిన స్థితిలో కొత్త కుర్రాళ్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఇన్నింగ్స్‌ను ఆరంభించి జట్టును కాపాడారు. సిరీస్ 1–1తో ఉన్న స్థితిలో మెల్బోర్న్లో దాదాపు తొలి సెషన్ అంతా నిలిచి టీమిండియా ఆశలు నిలిపారు. ఆపద సమయంలో వీరు చూపిన సంయమనాన్ని స్కోర్లతో కొలవలేం. భిన్న నేపథ్యాల నుంచి నేరుగా క్రీజులో అడుగుపెట్టినా, ఏమాత్రం బెదురు లేకుండా ఆడారు. మయాంక్ తనదైన దూకుడుతో లయన్‌ను దెబ్బకొట్టిన తీరు చెప్పుకోదగ్గది. చివరి టెస్టులో అగర్వాల్ ఇన్నింగ్స్ శతకానికి పూర్తిగా అర్హమైనది. ఇక విహారి అప్పగించిన బాధ్యతను సమర్థంగా నెరవేర్చి తాను జట్టు మనిషినని చాటుకున్నాడు. సిడ్నీలో చక్కటి షాట్లతో అలరించాడు. -
మొదటి రోజు...మనదే జోరు
టీమిండియా చారిత్రక విజయానికి బలమైన పునాది పడింది... దశాబ్దాల కల నెరవేరేందుకు చక్కటి మార్గం దొరికింది... భారత క్రికెట్‌కే కలికితురాయిగా నిలిచే గెలుపును సొంతం చేసుకునేందుకు సరైన ఆరంభం లభించింది. దానిపై కొత్త అధ్యాయం లిఖించే దిశగా కోహ్లి సేన అడుగులు వేస్తోంది. ఆడుతున్నది సిడ్నీలోనా? లేక సొంతగడ్డ పైనా? అన్నట్లుగా సాగిన బ్యాటింగ్ సురక్షిత స్థితికి చేర్చింది. చతేశ్వర్ పుజారా అజేయ శతకం, యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ దూకుడైన అర్ధ శతకంతో మన జట్టును పైమెట్టున నిలిపారు. ఇకచేయాల్సింది.. ఈ పట్టును మరింత బిగించడం! శుక్రవారం స్కోరును ప్రత్యర్థి అందుకోలేనంతగా పైపైకి తీసుకెళ్లడం. పుజారాకు తోడుగా క్రీజులో ఉన్న ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి, ఆ తర్వాత వచ్చే పంత్, జడేజా ఆ బాధ్యతను సమర్థంగా నెరవేరిస్తే చాలు... మిగతా పని బౌలర్లు చూసుకుంటారు. సిడ్నీ : వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా (250 బంతుల్లో 130 బ్యాటింగ్; 16 ఫోర్లు) మరోసారి సెంచరీ బాదడం, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 77; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో సిడ్నీ టెస్టును తొలి రోజే టీమిండియా తనవైపు తిప్పుకొంది. వీరిద్దరితో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (58 బంతుల్లో 39 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియాతో గురువారం ఇక్కడ ప్రారంభమైన నాలుగో టెస్టులో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) పేలవ ఫామ్ కొనసాగగా, కెప్టెన్ విరాట్ కోహ్లి (59 బంతుల్లో 23; 4 ఫోర్లు), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (55 బంతుల్లో 18; 1 ఫోర్) భారీ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ (2/51) రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, కమిన్స్, లయన్ ఆకట్టుకోలేకపోయారు. మయాంక్ మళ్లీ... భారత్‌ను టాస్ రూపంలో అదృష్టం వరించింది. దీంతో మరో ఆలోచన లేకుండా కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ, శుభారంభం మాత్రం దక్కలేదు. రెండు ఫోర్లు కొట్టిన రాహుల్... ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే హాజల్‌వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో షాన్మార్కు క్యాచ్ ఇచ్చాడు. ఇక్కడినుంచి మయాంక్, పుజారా ఇన్నింగ్స్‌ను నడిపించారు. పుజారా 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేసింది. అంపైర్ తిరస్కరించగా రివ్యూకు వెళ్లింది. అయితే రీప్లేలో బ్యాట్‌కు బంతి తగల్లేదని తేలింది. లంచ్ సమయానికి భారత్ స్కోరు 69/1కు చేరింది. విరామం అనంతరం స్టార్క్ బంతిని కవర్స్‌లో బౌండరీకి పంపి మయాంక్ అర్ధశతకం (96 బంతుల్లో) అందుకున్నాడు. మరింత దూకుడు చూపిన అగర్వాల్.. లయన్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు సిక్స్‌లు బాదాడు. ఈసారి సెంచరీ చేయడం ఖాయం అనుకుంటున్న దశలో లయన్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో స్టార్క్‌కు చిక్కాడు. రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా–కోహ్లి జోడి సులువుగా పరుగులు సాధించింది. ఈ క్రమంలోనే లబషేన్ ఓవర్లో ఫోర్‌తో పుజారా అర్ధ సెంచరీ (134 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. 177/2తో భారత్ టీ బ్రేక్‌కు వెళ్లింది. మూడో సెషన్ తొలి ఓవర్లోనే కోహ్లి ఔటయ్యాడు. లెగ్‌సైడ్ వెళ్తున్న హాజల్‌వుడ్ బంతిని వెంటాడిన అతడు కీపర్ పైన్‌కు క్యాచ్ ఇచ్చాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జత చేశారు. రహానే సౌకర్యవంతంగానే కనిపించినా... తప్పించుకోలేనట్లుగా స్టార్క్ సంధించిన అద్భుతమైన బౌన్సర్ అతడి ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం విహారి... పుజారాకు మంచి సహకారం అందిం చాడు. బ్యాక్‌ఫుట్‌పై గల్లీ దిశగా, స్క్వేర్ డ్రైవ్‌తో, కవర్స్‌లో చక్కటి షాట్లతో ఫోర్లు కొట్టాడు. మరోవైపు స్టార్క్ బంతిని ఫైన్లైగ్లో బౌండరీకి పంపి పుజారా శతకం (199 బంతుల్లో) అందుకున్నాడు. రెండో కొత్త బంతిని సైతం సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఐదో వికెట్‌కు అభేద్యంగా 75 పరుగులు జోడించి రోజును ముగించారు. శతేశ్వర్ పుజారా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లు ఒక్కోసారి ఒక్కో ఆటగాడిని కెరీర్ ఉన్నత స్థాయిలో నిలుపుతాయి. ఈ శతాబ్దంలో భారత్ విషయానికొస్తే... 2003–04లో రాహుల్ ద్రవిడ్, 2014–15లో విరాట్ కోహ్లి ఇలానే మెరిశారు. ప్రస్తుత సిరీస్‌లో ఆ వంతు చతేశ్వర్ పుజారాకు వచ్చింది. నమ్మకమైన బ్యాట్స్‌మనే అయినా, పెద్దగా అంచనాల్లేకుండానే ఆస్ట్రేలియా వచ్చిన అతడు టెస్టు టెస్టుకు మరింత ఎత్తుకు ఎదిగాడు. ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. అన్నీ ఉత్తమమే అయినా, సిడ్నీలో చేసిన తన కెరీర్ 18వ శతకం మిగతావాటి కంటే గొప్ప. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన అతను రోజంతా నిలిచి జట్టును భద్రమైన స్థితికి చేర్చాడు. పనిలోపనిగా తనపై వచ్చే ప్రధాన విమర్శ అయిన ‘తక్కువ స్ట్రయిక్ రేట్’ను సవరించాడు. గురువారం అన్ని ప్రధాన భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్న పుజారా జట్టు మొత్తం స్కోరులో దాదాపు 45 శాతం పరుగులు చేయడం విశేషం. ముందు క్రీజులో కుదురుకుని... పిచ్‌పై పేస్, బౌన్స్‌ను అర్ధం చేసుకున్నాక స్కోరింగ్ రేట్‌ను పెంచిన తీరు ముచ్చటగొలిపింది. ఇందులో అతడి ఆటను మూడు భాగాలుగా చెప్పుకోవాలి. ఓవైపు పేసర్లు సహా స్పిన్నర్ లయన్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు పిండుకుంటున్న యువ బ్యాట్స్‌మన్ మయాంక్‌కు అండగా నిలుస్తూ లంచ్ వరకు 59 బంతుల్లో 16 పరుగులే చేసిన పుజారా... కోహ్లి జత కలిశాక ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నాడు. ముఖ్యంగా మూడు ఫోర్లతో లబషేన్ బౌలింగ్‌పై పుజారా విరుచుకుపడిన తీరు టి20 తరహా దూకుడును తలపించింది. లంచ్–టీ మధ్య అతడు 79 బంతుల్లోనే 45 పరుగులు చేయడం గమనార్హం. టీ తర్వాత కోహ్లి, రహానే ఔటైన పరిస్థితుల్లోనూ విహారితో కలిసి సడలని పట్టుదల చూపాడు. క్రీజు వదిలి ముందుకొస్తూ లయన్‌ను ఎదుర్కొన్న తీరు పుజారా ఇన్నింగ్స్‌లో హైలైట్. దీంతో లయన్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డాడు. చతేశ్వర్ ధాటికి... ఏరికోరి తీసుకున్న రెండో స్పిన్నర్ లబషేన్తో ఆసీస్ వరుసగా ఓవర్లు వేయించే సాహసం చేయలేకపోయింది. కొసమెరుపు: సాధారణంగా శతకం తర్వాత పెద్దగా సంబరాలు జరుపుకోకుండా బ్యాట్ పైకెత్తి సావధానమైన అభివాదం చేయడం పుజారా శైలి. సిడ్నీలో మాత్రం దానికి భిన్నంగా... అమితానంద భావోద్వేగంతో గాల్లోకి పంచ్ ఇవ్వడం అతని దృష్టిలో ఈ ఇన్నింగ్స్ ప్రాధాన్యతను చూపిస్తోంది. నలుపు బ్యాండ్లతో... సిడ్నీ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్లు భుజాలకు నలుపు రంగు బ్యాండ్లను ధరించి మైదానంలోకి దిగారు. బుధవారం కన్నుమూసిన ప్రముఖ కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌కు సంతాప సూచకంగా భారత క్రికెటర్లు... ఇటీవల మరణించిన ఆసీస్ మాజీ క్రికెటర్ బిల్ వాట్సన్‌కు నివాళిగా ఆ జట్టు ఆటగాళ్లు బ్యాండ్లు ధరించి తమ గౌరవాన్ని ప్రదర్శించారు. మరో వైపు ‘పింక్ టెస్టు’కు మద్దతుగా విరాట్ కోహ్లి కూడా తన గ్లవ్, బ్యాట్ గ్రిప్‌లతో పాటు బ్యాట్‌పై ఉన్న ‘ఎంఆర్ఎఫ్’ లోగోను కూడా గులాబీ రంగులోకి మార్చి బ్యాటింగ్‌కు రావడం అందరినీ ఆకర్షించింది. మైదానంలో మరో ‘వా’ ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా సిడ్నీ మైదానంలోనే భారత్‌తో తన ఆఖరి టెస్టు ఆడి సరిగ్గా 15 ఏళ్లయింది. ఇప్పుడు మరో ‘వా’ ఇక్కడే ఆసీస్ జట్టు సభ్యుడిగా మైదానంలో కనిపించాడు. నాలుగో టెస్టు కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన ‘ఎమర్జెన్సీ ఫీల్డర్ల’ జాబితాలో స్టీవ్ వా తనయుడు అస్టిన్ వా కూడా ఉన్నాడు. టెస్టు తుది జట్టులో స్థానం దక్కని ఆటగాడిని వెంటనే దేశవాళీ క్రికెట్ కోసం పంపించి... స్థానిక క్రికెటర్లను జట్టు అదనపు సభ్యులుగా తీసుకోవడం ఆస్ట్రేలియాతో తరచుగా జరిగేదే. సబ్‌స్టిట్యూట్‌గా కూర్చున్న అస్టిన్ విరామం సమయంలో మైదానంలోకి వచ్చి తమ ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాడు. అస్టిన్ అండర్–19 ప్రపంచకప్ ఆడాడు. భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నందుకు నిరాశగా ఉంది. అయితే నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఇవే తప్పులు పునరావృతం చేయరాదని భావిస్తున్నా. లయన్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని ముందే అనుకున్నా. ఆ వ్యూహం బాగా పని చేసింది. అయితే వికెట్ అప్పగించడం మాత్రం బాధగా అనిపిస్తోంది. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ చాలా పదునుగా ఉంది. వారు వరుసగా బౌన్సర్లతో ఇబ్బంది పెడుతూ ఆడే అవకాశమే ఇవ్వలేదు. పరుగులు వేగంగా రాకపోయినా పర్వాలేదు కానీ వికెట్ మాత్రం ఇవ్వరాదని నేను, పుజారా పట్టుదలగా నిలబడ్డాం. ప్రస్తుతం మా జట్టు పటిష్ట స్థితిలో ఉందని చెప్పగలను’ - మయాంక్ అగర్వాల్ -
అడిలైడ్ అందేందుకు ఆరు వికెట్లు
అడిలైడ్: పట్టును మరింత బిగిస్తూ, పై చేయిని కొనసాగిస్తూ, ప్రత్యర్థి వికెట్లను ఒకదాని వెంట ఒకటి పడగొడుతూ అడిలైడ్ టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. మ్యాచ్‌ను పూర్తి నియంత్రణలోకి తీసుకుని, ప్రత్యర్థికి పరాజయం తప్పదనే పరిస్థితి కల్పించింది. బ్యాట్స్‌మెన్ బాధ్యత నెరవేర్చడంతో 323 పరుగుల కఠిన లక్ష్యం విధించి... బౌలర్లు మరింత మెరుగ్గా రాణించడంతో నాలుగో రోజు ఆట ముగిసేసరికి 104 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఆత్మరక్షణలోకి నెట్టింది. గెలవాలంటే కోహ్లి సేన ఆరు వికెట్లు పడగొట్టాల్సి ఉండగా, ఆతిథ్య జట్టు మరో 219 చేయాలి. క్రీజులో ఉన్న షాన్ మార్‡్ష (92 బంతుల్లో 31 బ్యాటింగ్; 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్) మినహా మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేనందున ‘డ్రా’గా ముగించాలన్నా వారు సోమవారమంతా ఆడాల్సి ఉంటుంది. అశ్విన్ (2/44) స్పిన్‌తో పాటు, ప్రభావవంతంగా బంతులేస్తున్న షమీ (2/15), ఇషాంత్, బుమ్రాలను తట్టుకుని నిలవడం ఏమంత సులువు కాదు. కాబట్టి... కంగారూల కథ చివరి రోజు రెండో సెషన్‌లోపే ముగిసేలా కనిపిస్తోంది. అంతకుముందు 151/3తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 307 పరుగులకు ఆలౌటైంది. భారత్ చివరి 4 వికెట్లు 4 పరుగులకే చేజార్చుకుంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (204 బంతుల్లో 71; 9 ఫోర్లు); అజింక్య రహానే (147 బంతుల్లో 70; 7 ఫోర్లు) అర్ధశతకాలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. రిషభ్ పంత్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. ఆసీస్ బౌలర్లలో లయన్ (6/122) ఆరు వికెట్లు పడగొట్టగా, స్టార్క్ (3/40)కు మూడు వికెట్లు దక్కాయి. అద‘రహానే’... టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లి, పుజారా తర్వాత నమ్మదగ్గ బ్యాట్స్‌మన్ అయిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే చాలా రోజుల తర్వాత చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు బాగా అవసరమైన సమయంలో పుజారాతో కలిసి నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. ఉదయం సెషన్‌ను వీరిద్దరూ నింపాదిగా ప్రారంభించారు. వ్యక్తిగత స్కోరు 40తో బరిలో దిగిన పుజారా కాసేపటికే అర్ధశతకం (140 బంతుల్లో) అందుకున్నాడు. 17 పరుగుల వద్ద ఉండగా అంపైర్ క్యాచ్ ఔట్ ఇచ్చినా సమీక్ష కోరి రహానే బయటపడ్డాడు. తర్వాత నుంచి అతడు వేగం పెంచాడు. అయితే, లంచ్‌కు కొద్దిగా ముందు పుజారాను లయన్ పెవిలియన్ పంపి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అర్ధ శతకం (111 బంతుల్లో) పూర్తి చేసుకుని రహానే ఊపుమీదుండగా... సహకరించాల్సిన స్థితిలో రోహిత్‌శర్మ (1) మరింత పేలవంగా ఔటయ్యాడు. క్రీజు వదలి ముందుకొచ్చిన అతడు సిల్లీ పాయింట్లో సులువైన క్యాచ్ ఇచ్చాడు. పంత్ ఔటయ్యాక అశ్విన్ (5)ను స్టార్క్ పెవిలియన్‌కు పం పాడు. స్కోరును సాధ్యమైనంత పెంచే ఉద్దేశంతో రివర్స్ స్వీప్‌నకు యత్నించిన రహానే... స్టార్క్‌కు చిక్కాడు. తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి షమీ (0) వెనుదిరిగాడు. ఏడు బంతుల వ్యవధిలో ఈ మూడు వికెట్లు పడిపోయాయి. ఇషాంత్ (0)ను పెవిలియన్ పంపి స్టార్క్ భారత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆసీస్... ఆపసోపాలు ఒకరికి ఇద్దరు బ్యాట్స్‌మెన్ నిలిస్తేనే ఛేదించగలిగే భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ఇషాంత్ మొదటి ఓవర్లోనే చుక్కలు చూపాడు. రెండో బంతికే ఓపెనర్ అరోన్ ఫించ్ (11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కానీ, బ్యాట్స్‌మన్ సమీక్ష కోరగా నోబాల్‌గా తేలింది. తర్వాత వంతుగా వచ్చిన షమీ... ఇంకా కట్టుదిట్టంగా బంతులేశాడు. అశ్విన్‌కు 9వ ఓవర్లో బంతినివ్వడం ఫలితమిచ్చింది. అతడి బౌలింగ్‌లో ఫించ్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే రీప్లేలో బంతి ఫించ్ బ్యాట్‌కు తాకలేదని తేలింది. ఫించ్ సమీక్ష కోరి ఉంటే బతికిపోయేవాడు! కంగారూలు 28/1తో టీకి వెళ్లారు. విరామం అనంతరం హారిస్ (26)ను వెనక్కు పంపి షమీ బ్రేక్ ఇచ్చాడు. మరోసారి క్రీజులో పాతుకుపోయేందుకు యత్నిస్తున్న ఉస్మాన్ ఖాజా (8)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. మార్‡్షకు కొద్దిసేపు తోడ్పాటు అందించిన హ్యాండ్స్కోంబ్(14)... షమీ బౌలింగ్‌లో పుల్ చేయబోయి మిడ్ వికెట్లో పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. జట్టు 84/4తో నిలిచిన సందర్భంలో మార్‡్ష, హెడ్ జోడీ 12 ఓవర్లపైగా వికెట్ కాపాడుకుని రోజును ముగించింది. సోమవారం ఇదీ సీన్... అడిలైడ్‌లో 315 పరుగులే ఇప్పటివరకు ఆసీస్‌కు అత్యధిక ఛేదన. అది కూడా 1902లో ఇంగ్లండ్‌పై సాధించింది. 323 లక్ష్యాన్ని అందుకుని వారిప్పుడు ఈ రికార్డును తిరగరాయాలంటే సోమవారం మార్‡్ష, హెడ్ సామర్థ్యానికి మించి ఆడాలి. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో మార్‡్ష టచ్‌లోకి వచ్చాడు. హెడ్ తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేశాడు. వీరితో పాటు టిమ్ పైన్ ఒక సెషన్ అయినా నిలవాల్సి ఉంటుంది. భారత పేస్ త్రయం, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌ను ఎదుర్కొంటూ ఇదేమంత సులువు కాదు. పంత్ పటాకా... భారత ఇన్నింగ్స్‌లో కాసేపే అయినా, రిషభ్ పంత్ ఆట హైలైట్‌గా నిలిచింది. లంచ్ నుంచి రాగానే పంత్... లయన్‌పై విరుచుకుపడి మూడు ఫోర్లు, సిక్స్ బాదాడు. స్వే్కర్ లెగ్ దిశగా అతడు కొట్టిన సిక్స్‌కు బంతి డగౌట్ రూఫ్‌పై పడింది. కానీ, మరుసటి ఓవర్ తొలి బంతికే లయన్ తన ఆట కట్టించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 250 ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 235 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 44; విజయ్ (సి) హ్యాండ్స్కోంబ్ (బి) స్టార్క్ 18; పుజారా (సి) ఫించ్ (బి) లయన్ 71; కోహ్లి (సి) ఫించ్ (బి) లయన్ 34; రహానే (సి) స్టార్క్ (బి) లయన్ 70; రోహిత్ శర్మ (సి) హ్యాండ్స్కోంబ్ (బి) లయన్ 1; పంత్ (సి) ఫించ్ (బి) లయన్ 28; అశ్విన్ (సి) హారిస్ (బి) స్టార్క్ 5; ఇషాంత్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 0; షమీ (సి) హారిస్ (బి) లయన్ 0; బుమ్రా (0 నాటౌట్); ఎక్స్‌ట్రాలు 36; మొత్తం (106.5 ఓవర్లలో ఆలౌట్) 307. వికెట్ల పతనం: 1–63, 2–76, 3–147, 4–234, 5–248, 6–282, 7–303, 8–303, 9–303, 10–307. బౌలింగ్: స్టార్క్ 21.5–7–40–3; హాజల్‌వుడ్ 23–13–43–1; కమిన్స్ 18–4–55–0; లయన్ 42–7–122–6; హెడ్ 2–0–13–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఫించ్ (సి) పంత్ (బి) అశ్విన్ 11; హారిస్ (సి) పంత్ (బి) షమీ 26; ఖాజా (సి) రోహిత్ (బి) అశ్విన్ 8; షాన్ మార్‡్ష (31 బ్యాటింగ్); హ్యాండ్స్కోంబ్ (సి) పుజారా (బి) షమీ 14; హెడ్ (11 బ్యాటింగ్); ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (49 ఓవర్లలో 4 వికెట్లకు) 104. వికెట్ల పతనం: 1–28, 2–44, 3–60, 4–84. బౌలింగ్: ఇషాంత్ 8–3–19–0; బుమ్రా 11–5–17–0; అశ్విన్ 19–4–44–2; షమీ 9–3–15–2; విజయ్ 2–0–7–0. హారిస్ వికెట్ తీసిన షమీ ఉత్సాహం -
హ్యాట్సాఫ్ పుజారా...
టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో, ఎంతటి ఓపికతో ఇన్నింగ్స్‌ను నిర్మించాలో చతేశ్వర్ పుజారా మళ్లీ చేసి చూపించాడు. 40 డిగ్రీల వేడి వాతావరణంలో ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయే వరకు, బంతి మెత్త బడిపోయే వరకు పట్టుదలగా నిలవడం... ఆ తర్వాత పరుగులు రాబట్టి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడం ఎలాగో ‘చింటూ’కు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో. కోహ్లి కెప్టెనయ్యాక దూకుడు అనే మాటకు అర్థమే మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ధాటిగా ఆడటమే విజ యానికి బాటలు వేస్తుందనే నమ్మకం జట్టులో పాతుకుపోయింది. ఇలాంటి స్థితిలో పుజారాను కూడా పదే పదే పక్కన పెట్టేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ ఏమాత్రం సంకోచించలేదు. రెండేళ్ల క్రితమైతే వెస్టిండీస్‌లో కేవలం ‘స్ట్రయిక్‌రేట్’ పేరు తో పుజారాను కాదని రోహిత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటన తొలి టెస్టులోనూ అతడిని ఆడించలేదు. కానీ టెస్టు జట్టులో పుజారా తన విలువను మరోసారి ప్రదర్శించాడు. సరిగ్గా మూడు నెలల క్రితం ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్‌లో జరిగిన నాలుగో టెస్టు తరహాలోనే పుజారా మళ్లీ ఒక్కడే నిలిచి జట్టును ఆదుకున్నాడు. నాటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 273 పరుగులు చేయగా పుజారా132 నాటౌట్. తర్వాతి అత్యధిక స్కోరు 46 పరుగులు మాత్రమే. చివరి రెండు వికెట్లకు 78 పరుగులు జోడిస్తే పుజారా అందులో 54 పరుగులు చేశాడు. ఇప్పుడు అడిలైడ్ టెస్టులో ఎనిమిది, తొమ్మిది వికెట్లకు కలిపి 61 పరుగులు జత చేస్తే వాటిలో పుజారా 51 పరుగులు చేశాడంటే టెయిలెండర్లతో కలిసి కూడా ఇన్నింగ్స్‌ను నడిపించగల సామర్థ్యం పుజారాకు ఉందని అర్థమవుతుంది. రెండో ఓవర్ చివరి బంతికి రాహుల్ వెనుదిరిగిన తర్వాత పుజారా క్రీజ్‌లోకి వచ్చాడు. లంచ్ వరకు అతి జాగ్రత్తగా అతని ఇన్నింగ్స్ సాగింది. మరో ఎండ్‌లో రోహిత్ ధాటిని ప్రదర్శిస్తున్నా తనకే సొంతమైన శైలిలోనే అతను ఆడాడు. నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకోవాల్సిన తరుణంలో అభేద్యమైన డిఫెన్స్‌నే నమ్ముకోవడంతో తొలి సెషన్ ముగిసేసరికి 62 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. లంచ్ తర్వాత కూడా ఇదే ఆట సాగడంతో ఒక దశలో వరుసగా 29 బంతుల పాటు పుజారా సింగిల్ కూడా తీయలేదు! ఆరో వికెట్‌గా పంత్ వెనుదిరిగే సమయానికి భారత్ స్కోరు 127 కాగా పుజారా 119 బంతుల్లో చేసింది 35 పరుగులే. ఈ దశలో తమ చేతుల్లోకి ఆట వచ్చేసిందని ఆస్ట్రేలియా భావించింది. కానీ పుజారా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. అదే పట్టుదలతో రెండో సెషన్ కూడా ముగించిన అతను కొద్దిసేపటి తర్వాత 153వ బంతికి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు అశ్విన్ ఔటయ్యే సమయానికి పుజారా స్కోరు 72 పరుగులు కాగా... టెయిలెండర్లతో కలిసి సెంచరీ అసాధ్యమని అనిపించింది. కానీ ఇషాంత్, షమీ అతనికి అండగా నిలిచారు. 89 పరుగుల వద్దనుంచి పుజారాలో కొత్త ఆట కనిపించింది. హాజల్‌వుడ్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో హుక్ షాట్‌తో సిక్సర్, పుల్ షాట్‌తో ఫోర్ రాబట్టి అతను 99కి చేరుకున్నాడు. సెంచరీకి చేరువైన దశలో అతనినుంచి ఇలాంటి ఆట అనూహ్యంగా అనిపించింది. తర్వాతి ఓవర్లో రెండు పరుగులు తీయడంతో అతని అద్భుత సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా స్టార్క్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాదడం విశేషం. తర్వాతి ఓవర్ కోసం స్ట్రయికింగ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ కావడంతో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌కు ముగింపు లభించింది. ఇన్నింగ్స్ ఆసాంతం పుజారా ఆట చూస్తే అతడిని ఔట్ చేయడానికి రనౌట్ తప్ప మరో మార్గం లేదనిపించింది. టెస్టు జట్టులో అందరూ దూకుడుగా ఆడేవారు ఉండాల్సిన అవసరం లేదని పుజారా అమూల్య ఇన్నింగ్స్‌ను చూస్తే ఎవరైనా చెప్పగలరు. సిరీస్ తొలి రోజే భారత్ పరువు పోకుండా అతని ఆట కాపాడింది. మ్యాచ్ గమనం ఎలా సాగినా ఆసీస్ గడ్డపై చతేశ్వర్ తొలి సెంచరీ మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. అదృష్టం కలిసొచ్చి... 89 పరుగుల వద్ద హాజల్‌వుడ్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయి పుజారా పైన్‌కు క్యాచ్ ఇచ్చాడు. చిన్న శబ్దం రావడంతో బౌలర్, కీపర్ అన్యమనస్కంగా అప్పీల్ చేశారు గానీ ఇతర సహచరులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆసీస్ రివ్యూ చేయలేదు. తర్వాతి రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలింది. ఫలితంగా బతికిపోయిన పుజారా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. -
ఒక్కడే... ఒక వైపు
‘ఒక్కడు’ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడం... అనవసర షాట్లతో ప్రధాన వికెట్లు టపటపా కూలడం... అందివచ్చిన అనుకూలతలను కాలదన్నుకోవడం... కాస్తోకూస్తో పోరాటంతో రోజును ముగించి పరువు దక్కించుకోవడం...! దశాబ్దాలుగా విదేశాల్లో టీమిండియా తీరే ఇది. అదే పాత కథను ఆస్ట్రేలియాలో మరోసారి అచ్చుగుద్దినట్లు దించేసింది. కాకపోతే... ఈసారి కథానాయకుడు మారాడు. ఇటీవలి కాలంలో ఆ ‘ఒక్కడు’గా నిలుస్తున్న విరాట్ కోహ్లి స్థానంలోకి అద్వితీయ శతకంతో చతేశ్వర్ పుజారా వచ్చాడు. కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి... ఆట ఆసాంతం తానే అయి అహో అనిపించాడు. 41/4తో ఉన్న జట్టును కష్టాల గట్టు దాటించాడు. తొలి టెస్టు మొదటి రోజే ప్రత్యర్థి పట్టు బిగించకుండా చూశాడు. మనది పైచేయి కాకున్నా... స్వల్ప స్కోరుకే పరిమితం అవకుండా కాపాడాడు. అడిలైడ్: అనుకున్నంత సులువేం కాదని టీమిండియాకు అర్థమయ్యేలా ప్రారంభమైంది ఆస్ట్రేలియా పర్యటన. పరుగులు సులువుగా వచ్చే పిచ్‌పై కాసేపు ఓపిక పట్టలేక పోయిన బ్యాట్స్‌మెన్... ప్రత్యర్థి బౌలర్లకు వికెట్లు బహుమతిగా ఇచ్చేశారు. కానీ, చెక్కుచెదరని ఏకాగ్రత, సహనంతో ఆడిన చతేశ్వర్ పుజారా (246 బంతుల్లో 123; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో 16వ సెంచరీతో ముప్పు తప్పించాడు. దీంతో గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ 250/9తో రోజును ముగించి ఫర్వాలేదనిపించింది. రోహిత్‌శర్మ (61 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (38 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), రవిచంద్రన్ అశ్విన్ (76 బంతుల్లో 25; 1 ఫోర్) పుజారాకు సహకారం అందించారు. ఏడో వికెట్‌కు పుజారా, అశ్విన్ జత చేసిన 62 పరుగులే భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. లంచ్ విరామం అనంతరం కాసేపు సయమనం చూపిన రోహిత్... ఇన్నింగ్స్ గాడిన పడుతున్న దశలో ఔటయ్యాడు. ఉన్నంతసేపు ఇబ్బంది లేకుండా ఆడిన వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను లయన్ చక్కటి బంతితో ఔట్ చేశాడు. ఈ స్థితిలో పుజారా, అశ్విన్ ఆదుకున్నారు. అశ్విన్‌ను కమిన్స్, ఇషాంత్ (4)ను స్టార్క్ డగౌట్ చేర్చారు. షమీ (6 బ్యాటింగ్)తో పుజారా 9వ వికెట్‌కు 40 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.ఆసీస్ బౌలర్లలో కమిన్స్ (2/49), హాజల్‌వుడ్ (2/52), స్టార్క్ (2/63), లయన్ (2/83)లకు రెండేసి వికెట్లు దక్కాయి. మన ఇన్నింగ్స్ దాదాపు ముగిసినందున, శుక్రవారం కంగారూ బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు ఎంతమేరకు నిలువరిస్తారో చూడాలి. టాప్–4 టపటపా ఆసీస్ నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొనేంత ఫామ్‌లో లేని ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) అందుకుతగ్గ స్కోరుకే ఔటయ్యారు. హాజల్‌వుడ్ బంతిని డ్రైవ్ చేయబోయి రాహుల్, స్టార్క్ బౌలింగ్‌ను కాచుకోలేక విజయ్ పెవిలియన్ చేరారు. కమిన్స్ ఓవర్లో గల్లీలో ఉస్మాన్ ఖాజా పట్టిన కళ్లుచెదిరే క్యాచ్ కెప్టెన్ కోహ్లి (3) ఇన్నింగ్స్ ముగించింది. లయన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడంతో పాటు కుదరుకున్నట్లు కనిపించిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే (13) దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి మూల్యం చెల్లించుకున్నాడు. వాస్తవానికి ఈ బంతులేవీ వికెట్ తీసేంత గొప్పవి కాకున్నా బ్యాట్స్‌మెన్ దృక్పథం లోపంతోనే ఔటయ్యారు. 41/4తో నిలిచిన జట్టు కనీసం వందైనా దాటుతుందా అనే అనుమానాలు తలెత్తిన ఈ స్థితిలో పుజారాకు జత కలిసిన రోహిత్ దూకుడే జవాబు అన్నట్లు కనిపించాడు. టీ మిండియా 56/4తో లంచ్‌కు వెళ్లింది. రోహిత్.. మరీ ఇలానా? క్రీజులో కుదురుకుని, కొన్ని పరుగులూ చేసి, బౌలర్లు కూడా ప్రభావవంతంగా లేని సమయంలో అనవసరంగా ఔటైన రోహిత్‌శర్మ... తన టెస్టు స్థాయిపై విమర్శలు కొనితెచ్చుకున్నాడు. ఆఫ్ స్పిన్ సైతం వేయగల యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారిని కాదని మరీ స్థానం దక్కించుకున్న అతడు ఈసారి కొంత మెరుగ్గానే కనిపించాడు. హిట్టింగ్తో స్కోరు పెంచుతాడనే ఉద్దేశంలో తీసుకున్నందుకు తను న్యాయం చేస్తున్నట్లే కనిపించాడు. కమిన్స్ ఓవర్లో కళ్లుచెదిరే సిక్స్‌తో ఔరా అనిపించాడు. లయన్నూ అదే తరహాలో శిక్షించబోయి... లాంగాన్‌లో మార్కస్ హారిస్ పొరపాటుతో ఆరు పరుగులు పొందాడు. తనను తాను నియంత్రించుకోకుండా, మరుసటి బంతికే అదే తరహాలో భారీ షాట్‌కు యత్నించి హారిస్‌కే క్యాచ్ ఇచ్చాడు. ‘నా అత్యుత్తమ ఐదు ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి. మా బ్యాట్స్‌మెన్ మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది. అయితే తొలి రెండు సెషన్లలో ఆస్ట్రేలియా చాలా బాగా బౌలింగ్ చేసింది. తేలికైన బంతులు పడే వరకు క్రీజ్‌లో ఓపిగ్గా నిలబడాలని నాకు తెలుసు. బయటికి కనిపిస్తున్న విధంగా పిచ్ బ్యాటింగ్‌కు మరీ అనుకూలంగా ఏమీ లేదు. 250 మంచి స్కోరే. ఎందుకంటే టర్న్ కూడా కనిపిస్తోంది కాబట్టి బ్యాటింగ్ సులభం కాదు. అశ్విన్ దీనిని ఉపయోగించుకోగలడు. సిక్సర్లు కొట్టడాన్ని కూడా సాధన చేస్తున్నా కాబట్టి నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. కొన్ని సార్లు విదేశాల్లో నేను విఫలమైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఈ సిరీస్‌కు సరైన సన్నద్ధతతో వచ్చాను. రెండో ఇన్నింగ్స్‌లో అందరం బాగా ఆడతామనే నమ్మకముంది’ – పుజారా -
తెలుగు రాష్ట్రాల్లోకి ‘హోమ్’ టీవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్ఈడీ టీవీల విపణిలోకి ఇటీవల ప్రవేశించిన కొత్త బ్రాండ్ ‘హోమ్’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. కంపెనీ 12 రకాల మోడళ్లను రూ.10,990–64,990 ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. 365 రోజులపాటు రీప్లేస్మెంట్ వారంటీ ఉంది. 4కే హెచ్డీ స్మార్ట్ టీవీలు రూ.29,990 నుంచి, 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీల శ్రేణి రూ.34,990 నుంచి అందుబాటులో ఉంది. మొబైల్స్ రిటైల్ దుకాణాల్లో ఈ టీవీలు లభిస్తాయి. హ్యాండ్సెట్స్ పంపిణీ, విక్రయం, ఏవియేషన్ తదితర వ్యాపారాల్లో ఉన్న గుజరాత్‌కు చెందిన రూ.2,500 కోట్ల పూజారా గ్రూప్ హోమ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తోంది. శామ్సంగ్ ప్యానెళ్లను దిగుమతి చేసుకుని నోయిడాలోని ప్లాంటులో టీవీల అసెంబ్లింగ్ చేపడుతున్నామని హోమ్ ఇండియా ఎండీ రాహిల్ పూజారా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొబైల్ కంటే చవకగా టీవీలు అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో యూనిట్.. భాగ్యనగరిలో అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హోమ్ పంపిణీదారు సీవోఎస్‌ఆర్ వెంచర్స్ సీఈవో రమేశ్ బాబు చెప్పారు. ఏడాదిలో ఇది కార్యరూపంలోకి వస్తుందన్నారు. నోయిడా ప్లాంటు సామర్థ్యం నెలకు 50,000 యూనిట్లు. మరో 50,000 యూనిట్ల సామర్థ్యాన్ని దీనికి జోడిస్తున్నారు. విస్తరణకు రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కంపెనీ డైరెక్టర్ అహ్మద్ జియా తెలిపారు. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీలోకి సైతం హోమ్ ప్రవేశిస్తోంది. -
ఎల్ఇడి టీవీలను లాంచ్ చేసిన పూజారా గ్రూప్
-
ఆసక్తికరంగా మారిన నాలుగో టెస్టు
-
పుజారా సూపర్ సెంచరీ
టెస్టు క్రికెట్లో తన విలువేమిటో చతేశ్వర్ పుజారా మరోసారి చూపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో, సహచరులంతా వెనుదిరిగిన వేళ ఒక్కడే నిలబడి ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేశాడు. మొయిన్ అలీ తెలివైన బౌలింగ్, మన బ్యాట్స్‌మెన్ స్వయంకృతం కలగలిపి ఒక దశలో ఆధిక్యం కోల్పోయేలా కనిపించిన భారత్.... విదేశీ గడ్డపై పుజారా చిరస్మరణీయ సెంచరీతో కోలుకుంది. రెండు రోజుల ఆట తర్వాత ఇరు జట్లు దాదాపు సమంగా నిలిచిన స్థితిలో నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. సౌతాంప్టన్: ఒక దశలో భారత్ స్కోరు 142/2... క్రీజ్‌లో పుజారాతో పాటు కోహ్లి ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం అప్పటికే 92 పరుగులకు చేరుకుంది. భారీ ఆధిక్యం సునాయాసంగా లభిస్తుందని అనిపించింది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి స్కోరు 195/8కు చేరుకుంది. మరో 51 పరుగులు వెనుకబడి ఉండగా, 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో చతేశ్వర్ పుజారా (257 బంతుల్లో 132 నాటౌట్; 16 ఫోర్లు) పట్టుదలగా నిలబడి శతకంతో చెలరేగాడు. ఇషాంత్‌తో తొమ్మిదో వికెట్‌కు 32, బుమ్రాతో పదో వికెట్‌కు 46 పరుగుల చొప్పున జత చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 273 పరుగులకు ఆలౌటై 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. చివరి రెండు వికెట్లకు భారత్ 78 పరుగులు జోడిస్తే అందులో పుజారా చేసినవే 54 ఉన్నాయి. దాదాపు ఆరు గంటల పాటు క్రీజ్‌లో నిలిచిన పుజారా కెరీర్లో 15వ సెంచరీ సాధించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ (5/63) ఐదు వికెట్లతో చెలరేగగా, బ్రాడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కీలక భాగస్వామ్యం... ఓవర్‌నైట్ స్కోరు 19/0తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొందరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బ్రాడ్ చక్కటి బౌలింగ్‌కు 13 పరుగుల వ్యవధిలో రాహుల్ (19), ధావన్ (23) ఔటయ్యారు. ఈ దశలో మరోసారి జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన బాధ్యత పుజారా, కోహ్లిపై పడింది. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనడంతో లంచ్ సమయానికి భారత్ స్కోరు వంద పరుగులకు చేరింది. విరామం తర్వాత వీరిద్దరు వేగం పెంచి చకచకా పరుగులు సాధించారు. 100 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తయింది. అయితే కరన్ ఈ జోడీని విడదీయడంతో భారత్ పతనం ప్రారంభమైంది. దూరంగా వెళుతున్న బంతిని వెంటాడిన కోహ్లి స్లిప్‌లో కుక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రహానే (11) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. స్టోక్స్ బౌలింగ్‌లో రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ రివ్యూలో అది ‘నోబాల్’గా కనిపించింది. దీనిపై పూర్తిగా స్పష్టత లేకున్నా... టీవీ అంపైర్ మాత్రం ఇంగ్లండ్‌కు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ దశలో మొయిన్ అలీ 14 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. 29 బంతులాడిన రిషభ్ పంత్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, పాండ్యా (4) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాత రివర్స్ స్వీప్ ఆడబోయి అశ్విన్ (1), తర్వాతి బంతికి షమీ (0) క్లీన్ బౌల్డయ్యారు. ఇషాంత్ (14) అండగా నిలవడంతో పుజారా స్కోరును ముందుకు నడిపించాడు. ఇషాంత్ ఔటైన తర్వాత బుమ్రా (6) సహకారంతో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి భారత్‌కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. 119 కోహ్లి టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో గావస్కర్ (117) తర్వాత తక్కువ ఇన్నింగ్స్ (119)లలో ఈ మైలురాయి చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 5 వేల నుంచి 6 వేల పరుగులకు చేరుకునేందుకు కోహ్లి 14 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకోవడం విశేషం. -
అది అతని శైలి కాదు: గావస్కర్
ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టు కోసం ఎంపిక చేసిన పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. అలాంటిది టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టర్న్ ఉన్న పిచ్‌పై టీమిండియా వికెట్ నష్టపోకుండా 50 పరుగులు దాటగానే రూట్ తన నిర్ణయం సరైందా కాదా అనే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఓపెనర్లు రాహుల్, ధావన్లిద్దరు సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ఆఫ్‌స్టంప్ ఆవల పడ్డ బంతుల జోలికి పోకుండా శరీరానికి దగ్గరగా ఆడుతూ చక్కటి ఆరంభం అందించారు. లార్డ్స్ టెస్టు హీరో వోక్స్ చెలరేగడంతో ఆ మరుసటి గంటలోనే ఇంగ్లండ్ పోటీలోకి వచ్చింది. అతను ధావన్‌తో పాటు, రాహుల్‌ను పెవిలియన్ పంపాడు. స్కోరింగ్ రేట్ గురించి గందరగోళానికి గురైన పుజారా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. హుక్ షాట్‌కు యత్నించి లంచ్‌కు ముందు డీప్ స్క్వేర్ లెగ్‌లో చిక్కాడు. ఇది అతని సహజసిద్ధ శైలి కాదు. తన షాట్ల ఎంపికను మార్చుకునే క్రమంలో పుజారా చేసిన తప్పిదం. టెస్టుల్లో 4 వేలకు పైగా పరుగులు సాధించిన ఓ బ్యాట్స్‌మన్ కొత్తగా తన శైలిని మార్చుకొని ఆడిన షాట్ అది. క్రీజులో గంటలకొద్ది పాతుకుపోవడం పుజారా గొప్పతనం. దాని వల్ల అవతలి ఎండ్‌లో ఉన్న ఆటగాడు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లి, రహానే భాగస్వామ్యం మరోసారి భారత్‌ను మంచి స్థితిలోకి తెచ్చింది. వీరిద్దరు సాధికారికంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 300లకు పైగా స్కోరు చేస్తే భారత్ ఈ మ్యాచ్‌పై పట్టు బిగించొచ్చు. -
‘ఓపెనింగ్’ మార్పుకు సమయం
టెస్టుల్లో క్రీజులో పాతుకుపోయి... కొత్త బంతి దాడిని కాచుకుంటూ... వీలునుబట్టి బౌలర్ల లయను దెబ్బతీస్తూ... ఒకవిధంగా మిడిలార్డర్లోని మేటి బ్యాట్స్‌మెన్‌కు రక్షణ కవచంగా నిలిచేది ఓపెనింగ్ జోడి! ప్రత్యర్థిపై ఆదిలోనే ఆధిపత్యం చూపుతూ, జట్టు మానసికంగా పైచేయి సాధించడంలో వీరిదే ప్రధాన పాత్ర. అయితే మిగతా జట్లలో ఒకరు విఫలమైతే మరొకరు నిలదొక్కుకుంటూ కొంతలో కొంత నయం అనిపిస్తున్నారు. కానీ, టీమిండియా విషయంలో మాత్రం ‘ముగ్గురు’ ఓపెనర్లూ మూకుమ్మడిగా చేతులెత్తేస్తున్నారు. ఏ ఇద్దరిని ఆడించినా, ఆటగాడి మార్పు తప్ప ఆటతీరు మారడం లేదు. సాక్షి క్రీడా విభాగం ఓపెనర్లకు ఉండాల్సిన కనీస లక్షణాలు భారత ఆరంభ జోడీలో లోపించాయి. దీంతో కీలక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చాలా ముందుగానే క్రీజులోకి రావాల్సి వస్తోంది. బర్మింగ్‌హామ్, లార్డ్స్ టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి 25 ఓవర్లలోపే బ్యాటింగ్‌కు దిగాడు. కొత్త బంతి విపరీతంగా స్వింగ్ అయ్యే ఇంగ్లండ్‌లో, వందల కొద్దీ ఓవర్లు ఆడాల్సిన ఐదు రోజుల మ్యాచ్‌కు ఇది ఎంతమాత్రం సరైన తీరు కాదు. కోహ్లి, పుజారా, రహానే విఫలమైతే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించే వారే లేకుండా పోతారు. ఇక్కడే(నా) పోటాపోటీ... మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్... స్వదేశంలో టెస్టు సిరీస్ అంటే వీరిలో ఎవరిని తప్పించి, ఎవరిని ఆడించాలి అనేది టీమిండియాకు పెద్ద తలనొప్పి. అదే విదేశాలకు వచ్చేసరికి మాత్రం ఒకరివెంట ఒకరి వైఫల్యంతో అసలు ఎవరిని ఆడించాలో తెలియని డైలమా. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో, ప్రస్తుత ఇంగ్లండ్ టూర్లో ఇదే విషయం మళ్లీమళ్లీ స్పష్టమైంది. అయినా శుభారంభం మాత్రం కలే అవుతోంది. విజయ్–ధావన్ ద్వయం తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుదురుగానే కనిపించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో వైఫల్యంతో ఆ ప్రదర్శన మరుగునపడింది. ఇక రాహుల్‌ది మరో తరహా కథ. భారత్‌లో భారీ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతూ, విదేశాల్లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో ఆడిన నాలుగు టెస్టుల్లో అతడు కనీసం అర్ధ శతకమైనా చేయలేకపోవడమే దీనికి నిదర్శనం. విజయ్‌కి ఏమైంది టెస్టుల్లో టీమిండియా నంబర్‌వన్ ఓపెనర్ మురళీ విజయ్. వాస్తవంగా చూస్తే ఇటీవల ఎక్కువగా నిరాశపరుస్తోంది అతడే. కానీ, డిఫెన్స్‌తో పాటు విదేశీ రికార్డు మెరుగ్గా ఉండటం విజయ్ను కాపాడుతోంది. ఈ తమిళనాడు బ్యాట్స్‌మన్... సఫారీ టూర్లో ఆకట్టుకోలే కపోయాడు. అయినప్పటికీ తనపై భరోసా ఉంచారు. బౌలర్ల వలలో పడకుండా వారి సహనాన్ని పరీక్షించే విజయ్ ఇటీవల దానికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఫుట్‌వర్క్ కూడా మునుపటిలా లేకపోవడంతో వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఈ పరిస్థితుల నుంచి విజయ్ తొందరగా బయటపడాల్సిన అవసరం ఉంది. లేదంటే... తననూ పక్కనపెట్టక తప్పదు. యువతరం తలుపు తడుతోంది... విజయ్ వయసు 34. ధావన్‌కు 32 దాటుతున్నాయి. వీరిద్దరిపై మరెంతో కాలం ఆధారపడలేం. ఇప్పటికే కొత్తవారిని పరీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా తెరపైకి వస్తున్నారు. ఇటీవల జంటగా రాణిస్తున్నారు. వీరితోపాటు ప్రియాంక్ పాంచల్, ఫైజ్ ఫజల్, ఆర్.సమర్ధ్లు సైతం పరిశీలించదగినవారే. మరోవైపు దశాబ్ద కాలంలో భారత్ తరఫున టెస్టు ఓపెనర్లుగా అరంగేట్రం చేసింది నలుగురే. వీరిలో అభినవ్ ముకుంద్ ఒక్కడే ప్రస్తుత జట్టులో లేడు. ధావన్, విజయ్... తర్వాత రాహుల్ ఆశలు రేకెత్తించడంతో మరొకరి గురించి ఆలోచన రాలేదు. ఇప్పుడు మాత్రం కొత్తవారిని పరీక్షించక తప్పదనేలా ఉంది. అందులోనూ ఎడమచేతి వాటం ఓపెనర్ అయితే మరీ ఉపయోగం. కానీ, దేశవాళీల్లో ఫైజ్ ఫజల్ మినహా మరో నాణ్యమైన ఆటగాడు కనిపించడం లేదు. అయితే, అతడికి 33 ఏళ్లు. ఈ కోణంలో చూస్తే 28 ఏళ్ల ముకుంద్‌కు అవకాశాలివ్వొచ్చు. నేను రెడీ: రోహిత్ ముంబై: సంప్రదాయ ఫార్మాట్లోనూ ఓపెనింగ్‌కు సిద్ధం అంటున్నాడు వన్డే, టి20ల ఓపెనర్ రోహిత్‌శర్మ. టెస్టుల్లో విజయ్, ధావన్, రాహుల్‌ల వరుస వైఫల్యాలతో టీమిండియా సతమతం అవుతున్న వేళ తననూ పరీక్షించి చూడాలన్నట్లుగా మాట్లాడాడు. గురువారం ఇక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్... ‘నాకెప్పుడూ టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం రాలేదు. మేనేజ్మెంట్ కోరితే మాత్రం అందుకు సిద్ధం. దేశం తరఫున వన్డేల్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తానని ఎప్పు డూ ఊహించలేదు. అయినా అది అలా జరిగిపోయింది. టెస్టుల్లోనూ అవకాశం వస్తే కాదనేది లేదు. నిరూపించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తా’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో ఆడాలనేది తన కోరికని... అయినా అది తన చేతుల్లో లేదని రోహిత్ వివరించాడు. -
పుజారా బచన్
విజయమో, వీర విహారమో అని బుధవారం వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా పైకి బ్యాటింగ్‌కి దిగింది ఇండియన్ టీమ్. ఫస్ట్ ఫస్టే దక్షిణాఫ్రికా ఫట్ ఫట్‌మని రెండు వికెట్లు పడగొట్టేసింది. చేతేశ్వర్ పుజారా బ్యాటు పట్టుకుని వచ్చాడు. ప్రతి బంతినీ ఇలా టచ్ చేసి అలా వదిలేస్తున్నాడు. యాభై బాల్స్‌కి ఒక్క రన్‌ను కూడా తీయలేకపోయాడు! 54వ బంతి దగ్గర పుజారా ఫస్ట్ రన్ రికార్డ్ అయింది. ఆ ఒక్క రన్నుకే ఇండియన్ ఫ్యాన్స్ పెద్ద రిలీఫ్ ఫీలయ్యారు! ఆ వెంటనే ట్విట్టర్ పరుగులు తీసింది. రకరకాలుగా అతడిపై సెటైర్లు వేసింది. ఒకరైతే.. యంగ్ అమితాబ్, ఓల్డ్ అమితాబ్ ఫొటోలను పక్కపక్కన ఉంచి కింద కాప్షన్ పెట్టారు. ‘పుజారా బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు’ అని యంగ్ ఫొటోకి, ‘పుజారా ఫస్ట్ రన్ కొట్టినప్పుడు’ అని ఓల్డ్ ఫొటోకి క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు. సిరీస్ పోయిన మ్యాచ్‌ని సీరియస్‌గా ఆడి సాధించేదేముంది అనుకున్నాడో ఏమో పుజారా! ట్విట్టర్ మాత్రం.. పుజారాను సాధించి సాధించి వదిలింది. -
హమ్మయ్యా.. ఒక్క పరుగు చేశాడు..!
జొహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరుదైన మూడో టెస్టు మ్యాచ్‌లో పరుగులు చేయడానికి భారత బ్యాట్స్‌మన్ చెమటోడ్చుతున్నారు. ఓపెనర్లు మురళీ విజయ్ 32 బంతుల్లో ఎనిమిది పరుగులు, లోకేష్ రాహుల్ డకౌట్లు వెంటనే వెనుదిరగడంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ కోహ్లి, పుజారాలు భుజానికెత్తుకున్నారు. విజయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తొలి పరుగు చేయడానికి 54 బంతులు తీసుకున్నాడు. లుంగీ ఎంగిడి వేసిన ఓవర్లో బంతిని స్క్వేర్ వైపు నెట్టిన పుజారా తొలి పరుగును నమోదు చేశాడు. క్రీజులోకి వచ్చిన 90 నిమిషాల తర్వాత ఒక్క పరుగు చేసిన పుజారాపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. కాగా, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 24 పరుగులు, పుజారా 66 బంతుల్లో 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, ఫిలాండర్లకు చెరో వికెట్ పడగొట్టారు. -
‘కోహ్లిలా ఆడటం చాలా కష్టం’
నాగ్‌పూర్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన కెప్టెన్ విరాట్ కోహ్లిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సహచర ఆటగాడు నాగ్‌పూర్ సెంచరీ హీరో చతేశ్వర పుజారా కూడా కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తాడు. మ్యాచ్ అనంతరం కోహ్లిలా వేగంగా ఇతర బ్యాట్స్‌మన్ పరుగులు ఎందుకు చేయలేకపోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు.. కోహ్లిలా ఇతరులు ఆడటం చాల కష్టమని పుజారా అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లి కెరీర్ ఆరంభం నుంచే అన్ని ఫార్మట్లలో రాణించాడు. ఇతర క్రికెటర్లు అతనిలా రాణించలేదు. కోహ్లి ఆత్మవిశ్వాసమే అతన్ని ఇలా ఆడేలా చేసింది. గత మూడేళ్ల నుంచి కోహ్లి కొనసాగించిన స్ట్రైక్ రేట్‌ను ఇతర ఆటగాళ్లు కొనసాగించడం చాల కష్టం. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించిన ఈ పిచ్‌పై అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ భారీ స్కోరు చేశామని’ పుజారా తెలిపాడు. గంటలకొద్ది క్రీజులో గడపడంపై.. ఫిట్నెస్తోనే గంటలకొద్ది క్రీజులో ఆడగలుగుతున్నాను. గత రెండన్నరేళ్లుగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక ధృష్టి సారించాను. దీంతోనే అలవోకగా సింగిల్స్, డబుల్స్ తీయగలుగుతున్నాను. దీనికి గత సిరీస్ అనుభవాలు, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ కూడా ఉపయోగపడిందని భావిస్తున్నా. ఓవర్సీస్ కండీషన్లో రాణించేలా బ్యాటింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాను. దక్షిణాఫ్రికా పర్యటనలో రాణిస్తానని పుజారా ఆశాభావం వ్యక్తం చేశాడు. -
లంచ్ బ్రేక్ సమయానికి భారత స్కోర్ 404/3
నాగ్‌పూర్: శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 404 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 199 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక 312/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి, పుజారాలు లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. తొలుత కెప్టెన్ కోహ్లి 130 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మూడో వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జంటను దసున్ షనక విడగొట్టాడు. యార్కర్ బంతితో పుజారా143 (362బంతులు,14 ఫోర్లు)ను బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానేతో కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 404/3. క్రీజులో కోహ్లి 123(161 బంతులు, 13 ఫోర్లు), రహానే 0(5 బంతులు) బ్యాటింగ్ చేస్తున్నారు. -
కోహ్లి కంటే పుజారా గ్రేట్..: గంభీర్
న్యూఢిల్లీ: శ్రీలంకతో టెస్టు సిరీస్ విజయానంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర పుజారే అని కితాబివ్వగా.. భారత మాజీ ఓపెనర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మరో అడుగు ముందుకు వేసి పుజారాను ప్రశంసించాడు. ఈ టెస్టు బ్యాట్స్‌మన్.. కోహ్లి, ఓపెనర్ శిఖర్ ధావన్‌ల కంటే స్థిరమైన ఆటగాడని చెప్పుకొచ్చాడు. ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ.. మనం అంతగా టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఈ కారణంగానే పుజారాకు సరైన గుర్తింపు రాలేదని అభిప్రాయపడ్డాడు. వన్డే, టీ20 ఆటగాళ్లనే ప్రజలు ఆదరిస్తున్నారని, ఈ తెల్లబంతి ఆటగాడు.. ఎర్రబంతి ఆటలోకి వస్తే టాప్ బ్యాట్స్‌మన్‌గా ఖచ్చితంగా గుర్తింపు పొందుతాడని కొనియాడాడు. కోహ్లి, ధావన్‌ల కంటే ఈ నయావాల్‌కు స్థిరంగా ఆడే అవకాశం ఉందని గంభీర్ చెప్పుకొచ్చాడు. పుజారా ఒకే ఫార్మట్ ఆడటం ద్వారా బ్యాటింగ్ శైలి మారకుండా రాణిస్తున్నాడని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. ఇక పుజారా టెస్టు ఫార్మాట్‌కు సిద్దమైనట్లు షార్ట్ ఫార్మట్‌కు సిద్దం కావడం కొంత కష్టమేనని తెలిపాడు. వన్డే, టీ20ల్లో విఫలమైతే ఒత్తిడితో టెస్టుల్లో రాణించలేమని ఇది పుజారాకు కలిసొచ్చే విషయమని గంభీర్ పేర్కొన్నాడు. ఇదే పరిస్థితి కోహ్లి, ధావన్‌కు ఎదరవుతుందని తెలిపాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ పుజారాకు చాల సహాయం చేసిందన్న గంభీర్.. ఇంగ్లండ్ గడ్డపై బంతిని ఎదుర్కొవడం చాల కష్టమని ఈ అనుభవం శ్రీలంక పర్యటనలో పుజారాకు కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు. -
40 టెస్టుల తర్వాత తొలి వికెట్..
-
40 టెస్టుల తర్వాత తొలి వికెట్..
కొలంబో: భారత-శ్రీలంక మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 344/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 92వ ఓవర్లో కరుణరత్నే వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న పుజారా(133) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఇప్పటి వరకు 40 టెస్టులాడిన ఈ లంక ఆటగాడికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. బ్యాట్స్‌మన్ అయిన కరుణరత్నే అప్పుడప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్ అవతారమెత్తుతాడు. ఇంత వరకు కనీసం 10 ఓవర్లు కూడా వేయని కరుణరత్నే బౌలింగ్‌లో పుజారా అవుటవ్వడం మరో విశేషం. -
భారత్ తొలి ఇన్నింగ్స్ 344/3
-
‘నయా వాల్’ మరోసారి...
∙ పుజారా అజేయ సెంచరీ ∙ రహానే శతకం ∙ భారత్ తొలి ఇన్నింగ్స్ 344/3 ∙ శ్రీలంకతో రెండో టెస్టు కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్ చెలరేగుతోంది. చతేశ్వర్ పుజారా (225 బంతుల్లో 128 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి తన క్లాస్ ఆటతో అభిమానులను సమ్మోహనపరుస్తూ వరుసగా రెండో సెంచరీతో సత్తాను చాటుకున్నాడు. అతనికి తోడు అజింక్యా రహానే (168 బంతుల్లో 103 బ్యాటింగ్; 12 ఫోర్లు) కూడా ఈ ఫార్మాట్లో తన లయను అందుకున్నాడు. ఆరంభంలో కాస్త ఇబ్బందిపెట్టిన లంక బౌలర్లను ఈ జోడి అద్భుత నైపుణ్యంతో ఎదుర్కొన్న తీరు ఆమోఘం. వీరిద్దరి అజేయ శతకాలతో జట్టు తొలి రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో గురువారం తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో మూడు వికెట్లకు 344 పరుగులు చేసింది. పుజారా, రహానే మధ్య ఇప్పటికే నాలుగో వికెట్‌కు అజేయంగా 211 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (82 బంతుల్లో 57; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ ధావన్ (37 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ కోహ్లి (29 బంతుల్లో 13; 2 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. హెరాత్, పెరీరాలకు చెరో వికెట్ దక్కింది. తొలి సెషన్ ధావన్ వేగం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈసారి శుభారంభం దక్కలేదు. అయితే ధావన్ ప్రారంభం నుంచే దూకుడు కనబరిచాడు. రెండో ఓవర్లోనే సిక్సర్ బాదిన తను దాదాపుగా బంతికో పరుగు చొప్పున వేగంగా ఆడడంతో జట్టు 52 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. అయితే పెరీరా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ధావన్ ఎల్బీగా వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పుజారా, రాహుల్ ఆచితూచి ఆడడంతో స్కోరు నెమ్మదించింది. 72 బంతుల్లో ఓ ఫోర్‌తో రాహుల్ అర్ధ సెంచరీ సాధించాడు. మరో వికెట్ పడకుండా జట్టు లంచ్ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 28, పరుగులు: 101, వికెట్లు: 1 రెండో సెషన్ : పుజారా క్లాస్ బ్రేక్ తర్వాత మూడో ఓవర్లోనే జోరు మీదున్న రాహుల్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 31వ ఓవర్లో రాహుల్ కవర్లో షాట్ ఆడగా పరుగు కోసం పిలిచిన పుజారా అంతలోనే వెనక్కి వెళ్లాడు. అప్పటికి కాస్త ముందుకు వచ్చిన రాహుల్ తిరిగి వెనక్కి వెళ్లినా కీపర్ డిక్వెల్లా వికెట్లను పడగొట్టాడు. దీంతో రెండో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లి.. హెరాత్ బౌలింగ్‌లో వైడ్ బంతిని ఆడబోయి క్యాచ్ అవుటయ్యాడు. ఈదశలో పుజారాకు రహానే జత కలవడంతో లంకకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 104 బంతుల్లోనే వంద పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరిచిన అనంతరం ఈ జోడి టీ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 30, పరుగులు: 137, వికెట్లు: 2 చివరి సెషన్ పుజారా, రహానే శతకాలు టీ విరామం అనంతరం పుజారా జోరును ప్రదర్శించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ 164 బంతుల్లో కెరీర్లో 13వ శతకాన్ని అందుకున్నాడు. అయితే 112 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన పుజారా ఆ తర్వాత 50 పరుగులను కేవలం 52 బంతుల్లోనే సాధించడం తన వేగాన్ని సూచిస్తోంది. ఇక 80 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్న రహానే 151 బంతుల్లో కెరీర్లో తొమ్మిదో సెంచరీ సాధించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన ఈ జోడి తొలి రోజును విజయవంతంగా ముగించింది. డీఆర్ఎస్ ద్వారా రహానే రెండుసార్లు ఎల్బీ నుంచి లబ్ధి పొందడం విశేషం. ఓవర్లు: 32, పరుగులు: 106, వికెట్లు: 0 వైద్య పరీక్షల కోసం స్వదేశానికి రోహిత్ గత నవంబర్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రొటీన్ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం భారత్‌కు చేరుకున్నాడు. ⇒3 సెహ్వాగ్ (79), గావస్కర్ (81) తర్వాతవేగంగా (84 ఇన్నింగ్స్) 4 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్ పుజారా. ⇒ 6 రాహుల్ వరుసగా చేసిన అర్ధ సెంచరీల సంఖ్య. గతంలో గుండప్ప విశ్వనాథ్, ద్రవిడ్ ఇలాగే వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించారు. -
రహానే, పుజారా జోరు.. లంక బేజారు
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత బ్యాట్స్మెన్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు సెంచరీలతో చెలరేగారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి భారీ దిశగా సాగుతోంది. వైరల్ ఫీవర్ కారణంగా తొలి టెస్టు ఆడని ఓపెనర్ లోకేశ్ రాహుల్ (92 బంతుల్లో 57: 7ఫోర్లు) కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (37 బంతుల్లో 35: 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడే క్రమంలో పెరీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం లభించింది. లంక కెప్టెన్ చండీమల్ మెరుపు ఫీల్డింగ్‌తో రాహుల్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ కోహ్లీ(13) త్వరగా పెవిలియన్ బాటపట్టాడు. కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకొచ్చిన రహానేతో కలిసి పుజారా ఇన్నింగ్స్ నిర్మించాడు. తొలిటెస్టులో సెంచరీ చేసిన పుజరా కొలంబో టెస్టులోనూ ఇన్నింగ్స్‌కు గోడలా నిలిచాడు. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ బ్యాటింగ్ కొనసాగించిన పుజారా 164 బంతుల్లో శతకం పూర్తిచేశాడు. పుజారా (225 బంతుల్లో 128 నాటౌట్: 10 ఫోర్లు, 1 సిక్స్) కు ఇది 13వ టెస్టు సెంచరీ. అనంతరం రహానే (168 బంతుల్లో 103 నాటౌట్: 12 ఫోర్లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా డబుల్ సెంచరీ (211) భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఈ జంటను విడతీసేందుకు లంక బౌలర్లు ఎంతగానో శ్రమించినా ఫలితం దక్కలేదు. తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. -
పుజారా అరుదైన ఘనత
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా సెంచరీ నమోదు చేశాడు. 164 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని సత్తా చాటుకున్నాడు. తన కెరీర్ లో యాభైవ టెస్టు ఆడుతున్న పుజారా అరుదైన ఘనతను సైతం సొంతం చేసుకున్నాడు. యాభై టెస్టులో శతకం సాధించిన ఏడో భారత ఆటగాడిగా పుజరా గుర్తింపు పొందాడు. ఓవరాల్ గా 36 ఆటగాడిగా పుజరా నిలిచాడు. ఇది పుజరాకు 13వ టెస్టు సెంచరీ కాగా, శ్రీలంకపై మూడో సెంచరీ. మరొకవైపు అజింక్యా రహానే హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(57) హాఫ్ సెంచరీ సాధించగా, ధావన్(35) ఫర్వాలేదనిపించాడు. కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(13) నిరాశపరిచాడు. -
50వ టెస్టులోనూ మెరుగ్గా రాణిస్తా: పుజారా
శ్రీలంకతో జరగబోయే రెండో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు భారత స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా తెలిపాడు. ఈ మ్యాచ్ అతడి కెరీర్లో 50వ టెస్టు కానుంది. ‘ఇప్పటిదాకా నా కెరీర్ అద్భుతంగా సాగింది. దేశం తరఫున 50వ టెస్టు ఆడబోతుండటం గర్వంగా అనిపిస్తోంది. కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే తదుపరి మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తాననే నమ్మకముంది. కెరీర్లో గాయాలు కూడా నన్ను తీవ్రంగా బాధించాయి’ అని పుజారా అన్నాడు. -
ఐదో రోజు ఆట ఆశించలేం
సునీల్ గావస్కర్ తొలి టెస్టులో ప్రస్తుతం భారత్ పటిష్టస్థితిలో ఉంది. 600 పరుగుల భారీస్కోరు చేయడంతో పాటు, ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో సగం వికెట్లు నేలకూల్చడంతో భారీ ఆధిక్యం ఖాయమైంది. ఇక మాథ్యూస్ ఒక్కడిని అవుట్ చేస్తే చాలు. మ్యాచ్ జరిగే కొద్దీ బంతి స్పిన్‌కు అనుకూలించే అవకాశముంది. తొలిరోజు లంక తమ ప్రదర్శన పట్ల బహుశా నిందించుకొని ఉంటుంది. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ పేలవంగా సాగింది. ధావన్ భారీ సెంచరీ వారి చెత్త ఫీల్డింగ్ చలవే! దీంతో పాటు భారత్ స్కోరుకు పుజారా సెంచరీ బాగా ఉపయోగపడింది. అయితే లంక రెండో రోజు ఫీల్డింగ్‌లో మెరుగుపడకపోయినా... బౌలింగ్ మాత్రం బాగుంది. నువాన్ ప్రదీప్, లాహిరు కుమార చక్కగా బౌలింగ్ చేశారు. నిజానికి వీరి జోరుతో లంచ్ తర్వాత 600 అసాధ్యంగా కనిపించింది. కానీ అరంగేట్రం హీరో హార్దిక్ పాండ్యా మెరుపు అర్ధసెంచరీతో ఆ స్కోరు సాధ్యమైంది. అయితే ఇది కూడా మిస్ ఫీల్డింగ్ వల్లే సాధ్యపడింది. 4 పరుగుల వద్ద పాండ్యా ఇచ్చిన క్యాచ్ కరుణరత్నే జారవిడవడంతో బతికిపోయిన అతను యథేచ్ఛగా ఆడాడు. షమీ మొదట బ్యాటింగ్‌లో తర్వాత బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇక రెండో రోజు ముకుంద్ మెరుపు వేగంతో స్పందించి తరంగను రనౌట్ చేయడం అద్భుతంగా అనిపించింది. మూడో రోజు మాథ్యూస్ సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే గౌరవప్రదమైన స్కోరు చేయగలుగుతుంది. అయినా ఐదో రోజు దాకా మ్యాచ్ సాగాలంటే ఇదేమాత్రం సరిపోదు! -
లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా
-
ధావన్ ధమాకా...
►మెరుపు సెంచరీతో చెలరేగిన శిఖర్ ధావన్ ►పుజారా అజేయ శతకం ►భారత్ 399/3 ►శ్రీలంకతో తొలి టెస్టు భారత టాప్ ఆర్డర్ గాలేలో గర్జించింది. శ్రీలంకతో మొదలైన తొలి టెస్టులో సెంచరీల మోత మోగించింది. ఓపెనర్ శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా లంక బౌలర్ల భరతం పట్టారు. ఈ ధాటిని తట్టుకోలేని ఆతిథ్య బౌలర్లు ప్రేక్షకపాత్ర వహించారు. 90 ఓవర్ల పాటు చెమటోడ్చినా... మూడు వికెట్లకు మించి పడగొట్టలేకపోయారు. దీంతో తొలి రోజే కోహ్లి సేన తమ ఖాతాలో భారీ స్కోరును జమ చేసుకుంది. గాలే: లంకలో ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) శివమెత్తాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (247 బంతుల్లో 144 బ్యాటింగ్; 12 ఫోర్లు) కదం తొక్కాడు. బుధవారం మొదలైన తొలి టెస్టులో వీరిద్దరు శ్రీలంక బౌలర్లను అడ్డూ అదుపే లేకుండా చితక్కొట్టారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోజంతా కష్టపడిన లంక బౌలర్లు భారత్ బ్యాటింగ్ ధాటిని ఏ దశలోనూ నిలువరించలేకపోయారు. సెషన్‌కో వికెట్ చొప్పున కేవలం మూడే వికెట్లు తీయగలిగారు. ధావన్, పూజారాలిద్దరూ కలిసి 46.4 ఓవర్లలో రెండో వికెట్‌కు 253 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్ అభినవ్ ముకుంద్ (26 బంతుల్లో 12; 2 ఫోర్లు), కెప్టెన్ కోహ్లి (8 బంతుల్లో 3) విఫలమయ్యారు. శిఖర్ 10 పరుగుల తేడాతో ‘డబుల్’ సెంచరీని చేజార్చుకున్నా... కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఈ ముగ్గురి వికెట్లను నువాన్ ప్రదీప్ (3/64) పడగొట్టాడు. మిగతా బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం మినహా చేయగలిగిందేమీ లేకపోయింది. పుజారాతో పాటు రహానే (39 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సెషన్–1: ముకుంద్ ఫ్లాప్... టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకోగా... రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధావన్‌కు తొలి టెస్టులో మరో అదృష్టం కూడా కలిసొచ్చింది. ముందుగా జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ప్రదీప్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ముకుంద్... డిక్వెలాకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. గత ఎనిమిది ఇన్నింగ్స్ లలో ముకుంద్‌కు ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. ఈ దశలో పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరుస్తున్న ధావన్ 31 పరుగుల వద్ద బతికిపోయాడు. లహిరు కుమార వేసిన ఓవర్లో బంతి శిఖర్ బ్యాట్ అంచును తాకుతూ రెండో స్లిప్‌లో ఉన్న గుణరత్నే చేతుల్లోకి వెళ్లగా అతను నేలపాలు చేశాడు. దీంతో ‘లైఫ్’ వచ్చిన ధావన్ భారీ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. లంచ్ విరామానికి ముందే 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. జట్టు స్కోరు కూడా వంద పరుగులు దాటింది. ఓవర్లు: 27, పరుగులు: 115, వికెట్లు: 1 సెషన్–2: ధావన్ విశ్వరూపం దీన్ని రెండో సెషన్ అనేకంటే శిఖర్ సెన్సేషన్ అంటేనే అతికినట్లు సరిపోతుంది. క్రీజులో పాతుకుపోయిన పుజారాతో కలిసి ధావన్ లంక బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వేగం పెంచిన ఈ ఓపెనర్ అదును చిక్కిన బంతిని వదల్లేదు. బౌండరీ లైనే ముచ్చట పడే షాట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతను టెస్టుల్లో ఐదో సెంచరీ చేశాడు. 16 ఫోర్ల సాయంతో 110 బంతుల్లోనే వన్డేను తలపించేలా శతకాన్ని సాధించాడు. తర్వాత కాసేపటికి పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత ధావన్ వేగం పెంచాడు. దీంతో 41వ ఓవర్లోనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. పుజారా తెలివిగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ధావన్‌కే అవకాశమిచ్చాడు. ఈ జోరుతో ధావన్ 147 బంతుల్లో 150 పరుగులు చేసి... డబుల్ సెంచరీ దిశగా పయనించాడు. లంక బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని మాత్రం విడగొట్టలేకపోయారు. టీ విరామానికి ముందు ‘డబుల్’కు చేరువైన ధావన్ ఎట్టకేలకు ప్రదీప్ బౌలింగ్‌లో మిడాఫ్‌లో ఉన్న మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. దీంతో కోహ్లి క్రీజ్‌లోకి వచ్చాడు. ఓవర్లు: 28, పరుగులు 167, వికెట్లు: 1 సెషన్–3: కోహ్లి వైఫల్యం ఈ సెషన్ మొదలైన రెండో ఓవర్లోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మూడు పరుగులకే నిష్క్రమించాడు. ఇతను ప్రదీప్ బౌలింగ్‌లోనే కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అంపైర్ తిరస్కరించడంతో లంక ‘రివ్యూ’కు వెళ్లింది. ఇందులో కోహ్లి అవుటైనట్లు తేలడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత నిలకడగా ఆడే రహానే... పుజారాకు జతయ్యాడు. వీళ్లిద్దరూ నింపాదిగా ఆడారు. ఈ క్రమంలో చతేశ్వర్ పుజారా 173 బంతుల్లో 8 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 12వ సెంచరీ. శ్రీలంక 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి తీసుకుంది. అయితే అప్పటికే భారత బ్యాట్స్‌మెన్ జోరుకు నీరుగారిన లంక బౌలర్లు ఈ కొత్త∙బంతితోనూ రాణించలేక పోయారు. పైగా పుజారా, రహానే మొండిగా ఆడటంతో ఆట నిలిచే వరకు మరో వికెట్‌ను తీయలేకపోయారు. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు వీళ్లిద్దరూ 113 పరుగులు జోడించారు. దీంతో ఆతిథ్య బౌలర్లు నిరాశగా మైదానాన్ని వీడారు. ఓవర్లు: 35 పరుగులు: 117, వికెట్లు: 1 హార్దిక్ పాండ్యా 289 వన్డేల్లో ఆకట్టుకుంటున్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున 289వ టెస్టు క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా పాండ్యా టోపీని అందుకున్నాడు. 2003లో ఇర్ఫాన్ పఠాన్ తర్వాత భారత్ తరఫున టెస్టు ఆడుతున్న బరోడా రంజీ క్రికెటర్ హార్దిక్ పాండ్యానే కావడం విశేషం. ⇒ 4 లంచ్, టీ సెషన్ మధ్యలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా శిఖర్ ధావన్ (126) గుర్తింపు పొందాడు.కాంప్టన్ (173–ఇంగ్లండ్; 1954లో పాక్‌పై)...హ్యామండ్ (150–ఇంగ్లండ్;1933లో న్యూజిలాండ్‌పై), మెక్‌క్యాబ్ (127–ఆస్ట్రేలియా; 1938లో ఇంగ్లండ్‌పై) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ⇒ 2 వీరేంద్ర సెహ్వాగ్ (133–శ్రీలంకపై ముంబైలో 2009లో) తర్వాత భారత్ తరఫున ఒకే సెషన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ శిఖర్ ధావన్. ⇒190 టెస్టుల్లో ధావన్కిదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు ఆసీస్‌పై 187 పరుగులు చేశాడు. అంతేకాకుండా 190ల్లో అవుటైన ఏడో భారత క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. ⇒399 లంకగడ్డపై ఓ పర్యాటక జట్టు, విదేశీ గడ్డపై తొలి రోజు భారత్ చేసిన అత్యధిక స్కోరు కూడా ఇదే. ⇒ 3 భారత్ తరఫున ఇద్దరు ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఓపెనర్లుగా రావడం ఇది మూడోసారి. గతంలో గంభీర్–ఇర్ఫాన్ పఠాన్ (2005లో శ్రీలంకపై); గంభీర్–ముకుంద్ (2011లో ఇంగ్లండ్‌పై) ఇలా చేశారు. ⇒2 టెస్టు మ్యాచ్ తొలి రోజున భారత్ చేసిన రెండో అత్యధిక స్కోరు 399/3. శ్రీలంకతో 2009లో కాన్పూర్‌లో జరిగిన టెస్టులో తొలి రోజున భారత్ 2 వికెట్లకు 417 పరుగులు చేసింది. ⇒ 30 ఈ మ్యాచ్‌తో ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 50వ టెస్టులో బరిలోకి దిగాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 30వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. గాయంతో గుణరత్నే అవుట్ గాలే: శ్రీలంక బ్యాట్స్‌మన్ అసెలా గుణరత్నే గాయంతో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మొదటి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా అతని ఎడమ చేతి బొటనవేలికి తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత దృష్ట్యా అతన్ని హుటాహుటిన సర్జరీ కోసం కొలంబోకు తరలించారు. దాంతో ఈ టెస్టులో శ్రీలంక రెండు ఇన్నింగ్స్‌లలోనూ పది మంది బ్యాట్స్‌మెన్‌తో ఆడాల్సి ఉంటుంది. ఈ సిరీస్ కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో కుటుంబసభ్యులతో మెల్బోర్న్లో గడపాలనుకున్నాను. అక్కడే ప్రాక్టీస్ చేసి వన్డే సిరీస్‌కల్లా ఫిట్‌గా ఉండాలనేదే నా ప్రణాళిక. కానీ విధి మాత్రం భిన్నమైన ప్రణాళికను నా ముందుంచింది. హాంకాంగ్‌లో సెలవులు గడపుతున్నపుడు విజయ్ గాయపడ్డాడని, అతని స్థానంలో నన్ను ఎంపిక చేశారని పిలుపు వచ్చింది. టెస్టు జట్టులో తిరిగి వచ్చేందుకు చెమటోడ్చుతున్న సమయంలో అనుకోకుండా ఈ అవకాశం వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. నిజానికి లంక పర్యటనకు ముందు చాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడాను. ఇప్పుడదే ఆత్మవిశ్వాసంతో, అదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నా. మ్యాచ్ కోసం నెట్స్‌లోనూ అదే ఆలోచనతో కష్టపడ్డాను. గాలేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడం ఆనందంగా ఉంది. – శిఖర్ ధావన్ శిఖర్ ధావన్ సెంచరీ ఇలా ⇒పరుగులు 190 ⇒బంతులు 168 ⇒సింగిల్స్ 66 ⇒ఫోర్లు 31 ⇒సిక్సర్లు 0 ⇒స్ట్రయిక్ రేట్ 113.09 -
లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా
గాలె: శ్రీలంకతో జరుగుతున్న గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా భారీ శతకాలతో రాణించడంతో తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి విరాట్ కోహ్లీ సేన 3 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) విధ్వంసం సృష్టిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడినా తృటిలో డబుల్ సంచరీ చేజార్చుకున్నాడు. వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా లంక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి పుజారా (144 నాటౌట్; 247 బంతుల్లో 12 ఫోర్లు), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (39 నాటౌట్; 94 బంతుల్లో 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ముకుంద్ (12), కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. లంక బౌలర్ ప్రదీప్ కే ఈ మూడు వికెట్లు దక్కాయి. రహానే, పుజారా రెండోరోజు సాధ్యమైనంత ఎక్కువ ఓవర్లు ఆడితే భారత్ సులువుగా భారీ స్కోరు చేసి డిక్లేర్ ఇచ్చే అవకాశం ఉంది. -
పుజారా సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
గాలే: శ్రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా శతకం సాధించాడు. 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. ఇన్నింగ్స్ 67వ ఓవర్లో లంక బౌలర్ కుమార వేసిన ఐదో బంతిని మిడాన్ వైపు ఆడి రెండు పరుగులు తీయడంతో పుజారా సెంచరీ మార్కు చేరుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 27 పరుగుల వద్ద ముకుంద్(12) వికెట్ ను కోల్పోవడంతో పుజారా బ్యాటింగ్ కు దిగాడు. ఓ వైపు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా, మరోవైపు వన్ డౌన్ ఆటగాడు పుజారా ఆచితూచి ఆడాడు. 80 బంతుల్లో అర్థ శతకం చేసిన పుజారా.. ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) ఔటయ్యాక మరీ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డుకు పరుగులు జోడించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) మాత్రం నిరాశపరిచినా, అనంతరం క్రీజులోకొచ్చిన అజింక్య రహానే సహకారంతో సెంచరీ చేశాడు. పరుగులు చేసేందుకు రహానే ఇబ్బంది పడుతున్నా పుజారా మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా లంక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 71 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 328పరుగులు చేసిన టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. -
ఐపీఎల్‌ను టీవీల్లో కూడా చూడటం లేదు: పుజారా
రాజ్‌కోట్: దేశమంతా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫీవర్‌లో ఉండగా టెస్టు క్రికెటర్ పుజారా మాత్రం ఐపీఎల్‌ను టీవీలో కూడా చూడడం లేదని చెబుతున్నాడు. వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయని విషయం తెలిసిందే. ‘ప్రాక్టీస్ లేకుంటే ఫిట్నెస్ శిక్షణతో రోజంతా గడిచిపోతుంది. 24 గంటలు క్రికెట్‌కే అంకితం కాలేము. సాయంత్రాలు కుటుం బం... లేకపోతే స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే టీవీలో ఐపీఎల్ చూడలేకపోతున్నాను’ అని పుజారా తెలిపాడు. -
ఐపీఎల్ ను చూడటం లేదు..
రాజ్‌కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ మ్యాచ్‌లను కనీసం టీవీల్లో కూడా వీక్షించడం లేదని అంటున్నాడు భారత క్రికెటర్ చటేశ్వర పుజారా. ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నాడు.' నా రోజు వారీ షెడ్యూల్ ఫిట్నెస్ ట్రైయినింగ్ తో ఆరంభమవుతుంది. అలా అని 24 గంటలు క్రికెట్ కే కేటాయించను. అటు కుటుంబం, ఇటు ఫ్రెండ్స్ కి సమాన సమయం కేటాయిస్తుంటాను. ఆ కారణం చేతనే ఐపీఎల్ మ్యాచ్‌లను టీవీల్లో వీక్షించడం లేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్నా'అని పుజరా పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో చటేశ్వర పుజారను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. అతనిపై టెస్టు ఆటగాడనే ముద్ర ఉండటంతో పుజారాను తీసుకునేందుకు ఎవరూ మొగ్గు చూపలేదు. ఆ వేలానికి వారానికి ముందు తన ఆటను ట్వంటీ 20లకు సరిపడా మార్చుకున్నానంటూ పుజారా స్సష్టం చేసినప్పటికీ అతనికి నిరాశే ఎదురైంది. ఆ క్రమంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లను పుజారా వీక్షించకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
పుజారా మరో రికార్డు
-
పుజారా మరో రికార్డు
ధర్మశాల: ఆసీస్ తో జరిగిన మూడో టెస్టులో భారత ఆటగాడు చటేశ్వర పుజారా ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులను ఆడిన స్వదేశీ ఆటగాడి రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 525 బంతులు ఆడిన పుజారా.. రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న 495 బంతుల రికార్డును అధిగమించాడు. కాగా, చివరిదైన నాల్గో టెస్టులో పుజారా మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో పుజారా(57;151బంతుల్లో 6 ఫోర్లు) అర్థ శతకం సాధించాడు. తద్వారా ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పుజారా నిలిచాడు. తాజా హాఫ్ సెంచరీతో 2016-17 సీజన్ లో పుజారా సాధించిన టెస్టు పరుగులు 1316. దాంతో గౌతం గంభీర్(1269) రికార్డును పుజారా బ్రేక్ చేశాడు. 2008-09 సీజన్లో గంభీర్ అత్యధిక పరుగుల్ని నమోదు చేసిన రికార్డును సాదించాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆ రికార్డును పుజారా సవరించాడు. అయితే ఈ టెస్టు మ్యాచ్ కు దూరంగా ఉన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక సీజన్ అత్యధిక పరుగుల్లో మూడో స్వదేశీ ఆటగాడిగా ఉన్నాడు. ఈ సీజన్ లో కోహ్లి నమోదు చేసిన పరుగులు 1252. మరొకవైపు ఓవరాల్‌గా ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(1483 పరుగులు ) తొలి స్థానంలో ఉన్నాడు. -
పుజారా హాఫ్ సెంచరీ
ధర్మశాల:గత టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న భారత ఆటగాడు చటేశ్వర పుజరా.. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 132 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో పుజారా అర్ధ శతకం నమోదు చేశాడు. మురళీ విజయ్ అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన పుజారా మరొకసారి నిలకడను ప్రదర్శించాడు. కేఎల్ రాహుల్ తో కలిసి 87పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే రాహుల్(60) రెండో వికెట్ గా అవుటైన తరువాత రహానేతో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఆ క్రమంలోనే పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో 57.0 ఓవర్లు ముగిసే సరికి భారత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. -
13 ఏళ్ల వయస్సు నుంచే అలవాటైంది..
సుదీర్ఘ ఇన్నింగ్స్‌లపై చతేశ్వర్ పుజారా ధర్మశాల: రాంచీ టెస్టులో 500కు పైగా బంతులను ఎదుర్కొని పుజారా చేసిన డబుల్ సెంచరీ అపూర్వం. అయితే ఈ సహనం తనకు 13 ఏళ్ల చిన్నవయస్సు నుంచే అలవాటైందని చెబుతున్నాడు. ‘ఓపిగ్గా ఆడడమనేది నా కఠినశ్రమతోనే అలవడింది. నాకు ఎనిమిదేళ్ల వయస్సున్నప్పటి నుంచే క్రికెట్ ఆడడం ప్రారంభించాను. 13 ఏళ్లప్పుడు తొలిసారిగా రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. అప్పటి నుంచి ఈ ఫార్మాట్లో ఆడుతూనే ఉన్నాను. దేశవాళీల్లో నిరంతరం ఆడిన అనుభవంతో పాటు కఠిన ప్రాక్టీస్ కూడా ఓపిగ్గా ఆడేందుకు తోడ్పడింది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతోనే ఇలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్ నమోదవుతాయి’ అని పుజారా అన్నాడు. గ్రేడ్ ‘ఎ’లో చేరడంపై తను స్పందించడానికి నిరాకరించాడు. ప్రస్తుతం సిరీస్ మధ్యలో ఉన్నామని, కాంట్రాక్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నాడు. ధర్మశాల బౌన్సీ వికెట్‌పై తమకెలాంటి ఆందోళన లేదని, ఇక్కడ గతంలోనూ చాలా క్రికెట్ ఆడామని గుర్తుచేశాడు. సిరీస్ పోటాపోటీగా సాగుతున్నప్పటికీ దురదృష్టవశాత్తూ మ్యాచ్‌కు సంబంధం లేని విషయాలపై మీడియా దృష్టి పెడుతోందని పుజారా అన్నాడు. కోహ్లిని ట్రంప్‌తో పోల్చడం బాధించిందన్నాడు. ‘అలాంటి కామెంట్స్ శోచనీయం. కోహ్లికి మేం పూర్తిగా మద్దతునిస్తున్నాం. క్రికెట్‌కు తను గొప్ప అంబాసిడర్‌లాంటి వాడు’ అని పుజారా స్పష్టం చేశాడు. -
చింటూగాడు...
టెస్టు క్రికెట్లో బ్యాట్స్‌మన్ స్ట్రయిక్ రేట్‌కు ఉండే విలువ ఏపాటిది? కానీ దూకుడు, కొత్త తరహా క్రికెట్ అంటూ కొత్తగా కెప్టెన్‌గా వచ్చిన సమయంలో హడావిడి చేసిన కోహ్లి కూడా పుజారా స్ట్రయిక్ రేట్‌ను ప్రశ్నించాడు. వేగం పెంచుకోమని సలహా ఇచ్చాడు. ఆడితే రోహిత్ శర్మలా ధాటిగా ఆడాలంటూ పోలిక తెచ్చి మరీ వెస్టిండీస్ సిరీస్‌లో అతడిని ఒక టెస్టులో పక్కన పెట్టారు. అంతకు కొన్నాళ్ల క్రితమే పచ్చికతో నిండిన కొలంబో వికెట్‌పై సహచరులు అంతా చేతులెత్తేసిన వేళ... 456 నిమిషా లు క్రీజ్‌లో నిలిచి అద్భుత సెంచరీతో టెస్టును గెలిపించినప్పుడు ఎవరికీ స్ట్రయిక్ రేట్ గుర్తుకు రాలేదు. వన్డేల్లో జట్టులో లేని, టి20ల్లో ఎవరూ పట్టించుకోని పుజారా కేవలం వేగం కోసం వెంపర్లాడి ఉంటే ఎటూ కాకుండా పోయేవాడు. కానీ అతను తన శైలిలోనే అందరికీ సమాధానం ఇచ్చాడు. అలసట లేకుండా గంటల పాటు కఠోర సాధన చేయడం అలవాటుగా మార్చుకున్న పుజారా టెస్టు క్రికెటర్‌గా తన విలువేమిటో మైదానంలోనే చూపించాడు. పదకొండు గంటలకు పైగా అదే పట్టుదలతో, ఏకాగ్రతతో ఒకే పని మీద మనసు లగ్నం చేయడం ఎంత మందికి సాధ్యమవుతుంది? కానీ రాంచీలో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒక గొప్ప బ్యాట్స్‌మన్ లక్షణాలను చూపిం చింది. 500కు పైగా బంతులు ఆడి అతను చూపించిన సహనం ముందు ఎన్నో రికార్డులు అలా తలవంచాయి. చతేశ్వర్ పుజారాకు భారీ స్కోర్లు చేయడం కొత్త కాదు. అండర్–14 స్థాయి నుంచే అతను ట్రిపుల్ సెంచరీలు బాదాడు. సెంచరీ చేసి వచ్చిన తర్వాత కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోకుండా మ్యాచ్ నడుస్తుండగానే నెట్స్‌లో ప్రాక్టీస్‌కు వెళ్లిపోవడం అతనికి తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ నుంచే వచ్చిన అలవాటు. శతకంతో సంతృప్తి చెందకుండా మరింత భారీ స్కోరు చేయడంపైనే అతని దృష్టి. ద్రవిడ్ వారసుడు అంటూ జట్టులోకి వచ్చిన పుజారా దాదాపు ఏడున్నరేళ్ల కెరీర్లో ఎన్నో సార్లు పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. దుర్బేధ్యమైన డిఫెన్స్, టెక్నిక్ ఉన్నా కూడా సిడ్నీ టెస్టులో, చివరకు బంగ్లాదేశ్‌తో టెస్టులో కూడా తుది జట్టులోకి పుజారాను తీసుకునేందుకు కోహ్లి ఆసక్తి చూపించలేదు. కానీ ఈ హోమ్ సీజన్లో భారత్ సాధించిన వరుస విజయాల్లో అతను ఎంత కీలక పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత టెస్టులోనే ఆసీస్ పని పట్టిన ‘చింటూ’ ఇప్పుడు మళ్లీ వారికి నరకం చూపించాడు! ఈ సీజన్లో ఆడిన 12 టెస్టులలో పుజారా 66.26 సగటుతో 1,259 పరుగులు చేయడం విశేషం. ఇక మరో టెస్టు ముగిస్తే ఇతర ఆటగాళ్లంతా ఐపీఎల్ వినోదం, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ... ఇలా మరో లోకంలోకి వెళ్లిపోతారు. ఈ సౌరాష్ట్ర క్రికెటర్ మాత్రం ఎప్పటిలాగే ధ్యానమునిలా రాజ్‌కోట్‌లో తన అకాడమీలో ఉచితంగా శిక్షణ పొందుతున్న అనేక మంది యువ క్రికెటర్ల మధ్యలో ఒకడిగా మారిపోయి నిర్విరామంగా సాధనలో మునిగిపోతాడు. మరో టెస్టు సిరీస్ వచ్చినప్పుడే అతను మళ్లీ అందరికీ గుర్తుకొస్తాడు. – సాక్షి క్రీడావిభాగం -
ఇదే నా బెస్ట్ సెంచరీ: సాహా
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ సాధించిన భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కెరీర్లో ఇదే నా బెస్ట్ సేంచరీ అని అభిప్రాయపడ్డాడు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో నాల్గోరోజు సాహా 233 బంతుల్లో 117 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేరీర్లో ఇప్పటి వరకు సాధించిన నాల్గు సెంచరీల్లో ఇదే అత్యుత్తమమైనదిగా అభివర్ణించాడు. పుజారాతో 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినందుకు గర్వంగా ఉందన్నాడు. మా భాగస్వామ్యం నెమ్మదిగా మొదలై పుజారా డబుల్ సెంచరీ, నేను శతకం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఇప్పుడు నా బ్యాటింగ్ మెరుగుపడినట్లు భావిస్తున్నాని చెప్పాడు. కానీ నా బ్యాటింగ్ శైలి ఏ మాత్రం మార్చలేదన్నాడు. ఎక్కువగా స్వీప్ షాట్లు ఆడనాని, ఆటలో ఉన్న నా సందేహాలను నివృత్తి చేసుకోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపాడు. నాకు జట్టు మద్దతు ఇస్తుందనీ, ఇది నాపై మంచి ప్రభావం చూపుతుందన్నాడు. పుజారా ఎంతో ఓపికతో ఆడాడని, అతనికి డబుల్ సెంచరీలు చేయడం సర్వసాధారణమని చెప్పాడు. పుజారా డొమెస్టిక్ క్రికెట్లో ఎన్నోసార్లు 200-300 పరుగులు సాధించాడని సాహా తెలిపాడు. పుజారా ఒక వైపు సహచరులు ఔటవుతున్న చక్కటి షాట్లతో బ్యాటింగ్ చేశాడని, దీంతో ఓ మంచి భాగస్వామ్యం నమోదు చేశామని పేర్కొన్నాడు. ఆసీస్ బౌలర్ హజల్‌వుడ్ స్లేడ్జింగ్కు పాల్పడ్డాడని మేము మాత్రం స్పందించలేదని తెలిపాడు. హాజల్‌వుడ్ తనతో ఎదో చెప్పాలని ప్రయత్నిస్తే.. వెనక్కి వెళ్లి బౌల్ చేయమన్నట్లు సూచించానన్నాడు. అయితే పుజారా, సాహా భాగస్వామ్యం, జడేజా మెరుపు బ్యాటింగ్‌తో భారత్ ఆసీస్‌పై 152 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 603/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆసీస్ 23 పరుగులకు రెండు వికెట్లు కోల్పొయింది. -
జడేజా ఆల్ రౌండ్ షో.. భారత్ పైచేయి
-
జడేజా ఆల్ రౌండ్ షో.. భారత్ పైచేయి
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు నాలుగోరోజు భారత్ పైచేయి సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 360/6తో స్టార్ట్ చేసిన భారత్.. ఓ వైపు బ్యాటింగ్ లో ఆదివారం 3 వికెట్లు కోల్పోయి 243 అదనపు పరుగులు స్కోరు బోర్డుకు జతచేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ కు దిగిన ఆసీస్ పతనాన్ని జడేజా ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ బ్యాట్స్ మన్లకు పరీక్ష పెట్టాడు. బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడేజా(55 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆపై బౌలింగ్ లో రెండు వికెట్లు తీశాడు. ఆట నిలిపివేసే సమయానికి ఆసీస్ 7.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 23 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ (14), నైట్ వాచ్ మెన్ నాథన్ లియోన్ (2)లను భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టించాడు. భారత్ ఇంకా 129 పరుగుల ఆధిక్యంలో ఉంది. పుజారా డబుల్ 'వంద'నం.. సాహా సెంచరీ ఓవర్ నైట్ స్కోరు 130తో ఉన్న చతేశ్వర్ పుజారా నాలుగో రోజు ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆసీస్ పై రెండో డబుల్ సెంచరీని సాధించాడు. అనంతరం పుజారా(525 బంతుల్లో 202; 21 ఫోర్లు) ఏడో వికెట్ గా లియోన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పుజారాతో కలిసి సెంచరీ వీరుడు వృద్ధిమాన్ సాహా (233 బంతుల్లో 117; 8 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్ కు రికార్డు స్థాయిలో 199 పరుగుల భారీ భాగస్వాయ్యాన్ని అందించాడు. జడేజా మెరుపు ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ (55 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచాడు. ఓకీఫ్ బౌలింగ్ లో ఉమేశ్ యాదవ్(16) ఇచ్చిన క్యాచ్ ను వార్నర్ పట్టడంతో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ 603 పరుగుల వద్ద భారత తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. -
పుజారా సరికొత్త రికార్డు..
రాంచీ: భారత టాపార్డర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్ లో భారత్ తరపున అత్యధిక బంతులను ఆడిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 525 బంతుల సుదీర్ఘ ఇన్నింగ్స్ తో అత్యధిక బంతులను ఎదుర్కొన్న భారత్ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా ద వాల్ రాహుల్ ద్రవిడ్ 495 బంతుల రికార్డును పుజారా అధిగమించాడు. 2004లో రావల్పిండిలో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో ద్రవిడ్ ఈ ఫీట్ ను సాధించాడు. ఆ తరువాత ఇంతకాలానికి ఆ ఘనతను నయా వాల్ పుజారా బద్ధలుకొట్టడం ఇక్కడ విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 390 బంతులను ఆడిన తరువాత పుజారా తన వ్యక్తిగత 'అతి పెద్ద' ఇన్నింగ్స్ ను సవరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే ఈ రోజు ఆటలో పుజారా-సాహాలు కదం తొక్కారు. పుజారా డబుల్ సెంచరీ సాధిస్తే, సాహా సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, పుజారా(202;21 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించిన తరువాత ఏడో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై సాహా(117;233 బంతుల్లో8 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. -
పుజారా 'అతి పెద్ద' ఇన్నింగ్స్!
రాంచీ: భారత క్రికెట్ జట్టు నయా వాల్ చటేశ్వర పుజారా సరికొత్త మైలురాయిని నమోదు చేశాడు. తన టెస్టు కెరీర్ లో బంతులు పరంగా అతి పెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఘనతను పుజారా తాజాగా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 390 బంతులను ఎదుర్కొన్న పుజారా తన పాత 'అతి పెద్ద' ఇన్నింగ్స్ ను సవరించాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 391 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 150 పరుగుల మార్కును పుజారా చేరాడు. ఈ క్రమంలోనే తన టెస్టు కెరీర్ లో సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడిన ఘనతను కూడా సాధించాడు. అంతకుముందు 2012లో ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ లో జరిగిన టెస్టులో పుజారా 389 బంతులు ఆడి అజేయంగా 206 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకూ అతని 'అతి పెద్ద' ఇన్నింగ్స్. మరొకవైపు 2013లో హైదరాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పుజారా 341 బంతుల్లో 204 పరుగులు చేశాడు. ఈ రెండింటిలో పుజారా డబుల్ సెంచరీలు సాధించినప్పటికీ బంతులు పరంగా మాత్రం ప్రస్తుత ఇన్నింగ్స్ కంటే అవి తక్కువ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరొకవైపు భారత్ గడ్డపై నాలుగు వందలకు పైగా బంతులను ఎదుర్కొన్ననాల్గో స్వదేశీ ఆటగాడిగా పుజారా నిలిచాడు. తొలి స్థానంలో సునీల్ గవాస్కర్ (472 బంతులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంచితే, పుజారా బాధ్యతాయుత ఇన్నింగ్స్ కు తోడు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ జట్టు 159.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది. ఈ జోడి వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచింది. -
ఆసీస్ కు అడ్డుగోడగా పుజారా