తొలిరోజే ‘కొట్టేశారు’! | Pujara, Kohli tons puts hosts on top | Sakshi
Sakshi News home page

తొలిరోజే ‘కొట్టేశారు’!

Published Fri, Nov 18 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

తొలిరోజే ‘కొట్టేశారు’!

తొలిరోజే ‘కొట్టేశారు’!

కోహ్లి, పుజారా సెంచరీలు
భారత్ 317/4 ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

అరంగేట్రం టెస్టు ద్వారా వైజాగ్ భారత్‌కు సిరీస్‌లో బోణీ అందించేలా ఉంది. తొలి రోజు సాయంత్రం సెషన్‌లోనే బంతి బౌన్‌‌సలో విపరీతమైన మార్పు వచ్చేసింది. ఏ బంతి బౌన్‌‌స అవుతుందో... ఏ బంతి కిందికి వెళుతుందో అర్థం కాని తరహాలో అప్పుడప్పుడూ బంతి తిరుగుతోంది. ముందుగా ఉన్న అంచనా ప్రకారమే రెండో రోజే బంతి తిరిగిందంటే ఇక మ్యాచ్‌లో భారత్‌ను నిలువరించడం ఇంగ్లండ్‌కు దాదాపుగా అసాధ్యమే.

టాస్ గెలిచి, బ్యాటింగ్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే... రెండో టెస్టుకు ముందు అంచనా ఇది. అనుకున్నట్లే జరిగేలా ఉంది. టాస్ గెలిచిన కోహ్లి ముందుండి శతకంతో జట్టును నడిపిస్తే... పుజారా సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. ఫలితంగా తొలి రోజే భారత్ దాదాపుగా మ్యాచ్‌పై పట్టు సాధించింది.

విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఆరంభంలో రెండు వికెట్లు... ఆ తర్వాత ఓ మంచి భాగస్వామ్యం... భారీ స్కోరు దిశగా భారత్... మన దగ్గర టెస్టు క్రికెట్ సాంప్రదాయం ఇది. వైజాగ్‌లోనూ ఇదే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సువర్ణావకాశాన్ని భారత బ్యాట్స్‌మెన్ వినియోగించుకున్నారు. కోహ్లి (241 బంతుల్లో 151 బ్యాటింగ్; 15 ఫోర్లు), పుజారా (204 బంతుల్లో 119; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో... ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీస్కోరు దిశగా సాగుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 4 వికెట్లకు 317 పరుగులు చేసింది. విజయ్ (20), రాహుల్(0) విఫలమైనా... కోహ్లి, పుజారా మూడో వికెట్‌కు 226 పరుగులు జోడించి జట్టును నిలబెట్టారు. రహానే (23) నిలబడలేకపోయాడు.  కోహ్లితో పాటు అశ్విన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.  ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

సెషన్ 1: ఆరంభంలో వికెట్లు
ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. గంభీర్ స్థానంలో రాహుల్, మిశ్రా స్థానంలో జయంత్ జట్టులోకి వచ్చారు. అటు ఇంగ్లండ్ జట్టులో వోక్స్ స్థానంలో అండర్సన్‌ను తీసుకున్నారు. ఆడిన రెండో బంతికే బౌండరీతో విజయ్ భారత ఇన్నింగ్‌‌సను ధాటిగా ప్రారంభించాడు. అరుుతే రెండో ఓవర్లోనే బ్రాడ్ బౌలింగ్‌లో  రాహుల్ థర్డ్‌స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో మూడు బౌండరీలతో, ఆకట్టుకునే షాట్లతో విజయ్ మంచి ఫామ్‌లో కనిపించాడు. అరుుతే అండర్సన్ షార్ట్ బాల్‌ను అంచనా వేయలేక గల్లీలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ ఐదు ఓవర్లలో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోరుుంది. కోహ్లి ఖాతా తెరవడానికి ఎనిమిది బంతులు తీసుకున్నా... అండర్సన్ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించాడు. కోహ్లి, పుజారా కలిసి ఆచితూచి ఆడుతూనే అడపాదడపా బౌండరీలతో ఎలాంటి సమస్య లేకుండా ఈ సెషన్‌ను ముగించారు.
ఓవర్లు: 28 పరుగులు: 92 వికెట్లు: 3

సెషన్ 2: సూపర్ భాగస్వామ్యం
లంచ్ తర్వాత తొలి బంతినే బౌండరీకి పంపిన కోహ్లి... 87 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో పుజారా 113 బంతుల్లో ఈ మార్కును చేరుకున్నాడు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో పుల్‌షాట్ ఆడాడు. అరుుతే లాంగ్‌లెగ్‌లో రషీద్ క్యాచ్ వదిలేశాడు. మరో ఎండ్‌లో పుజారా అద్భుతంగా ఆడాడు. అన్సారీ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, ఫోర్ కొట్టాడు. మొరుున్ అలీ వేసిన ఒకే ఓవర్లో భారత ద్వయం మూడు ఫోర్లు కొట్టారు. ఈ సెషన్‌లో కోహ్లితో పోలిస్తే పుజారా కాస్త దూకుడుగా ఆడాడు. ఈ ఇద్దరి అద్భుత భాగస్వామ్యంతో ఈ సెషన్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఓవర్లు: 28.2  పరుగులు: 118 వికెట్లు: 0


సెషన్ 3: సెంచరీలు పూర్తి
టీ విరామం తర్వాత కొద్దిసేపటికి రషీద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో పుజారా 184 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు కోహ్లి కూడా 154 బంతుల్లో ఈ మార్కు ను చేరుకున్నాడు. కోహ్లితో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించిన పుజారా... అండర్సన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లికి జత కలిసిన రహానే కూడా బాగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన ఈ ఇద్దరూ... అడపా దడపా బౌండరీలతో ఇన్నింగ్‌‌సను నడిపించారు. ఈ క్రమంలోనే కోహ్లి 238 బంతుల్లో 150 మార్కును చేరుకున్నాడు. 89వ ఓవర్లో ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. ఇది వెంటనే ఫలితాన్ని ఇచ్చింది. అండర్సన్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ బయటకు వెళుతున్న బంతిని ఆడి రహానే కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోహ్లి, అశ్విన్ కలిసి జాగ్రత్తగా ఆడారు.
ఓవర్లు: 33.4 పరుగులు: 107 వికెట్లు: 2

 ‘క్లాసిక్’ పుజారా
‘వావ్... పుజారా సిక్సర్‌తో సెంచరీ చేయడాన్ని నేను చూశాను. ఇది నిజమే కదా...’ వైజాగ్‌లో భారత క్రికెటర్ సెంచరీ పూర్తి కాగానే వినిపించిన మాట ఇది. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చతేశ్వర్ పుజారా తన శైలికి కాస్త దూకుడును రంగరించి ఓ క్లాసిక్ ఇన్నింగ్‌‌స ఆడాడు. ఇన్నింగ్‌‌స మొత్తంలో ఎక్కడా తడబాటు లేదు. ఎలాంటి లైఫ్‌లూ రాలేదు. ఇంగ్లండ్ పేసర్లు షార్ట్‌బాల్స్ సాంధించినా, స్పిన్నర్లు వైవిధ్యం చూపించినా ఎక్కడా తను మాత్రం ఓపికను కోల్పోలేదు.

ఆడిన తొలి బంతికే ఖాతా తెరిచిన పుజారా కుదురుకునేందుకు బాగానే సమయం తీసుకున్నాడు. ఉదయం సెషన్ అంతా నెమ్మదిగా ఆడాడు. కానీ లంచ్ తర్వాత ఒక దశలో కోహ్లిని మించిన వేగంతో పరుగులు చేశాడు. మొరుున్ అలీ బౌలింగ్‌లో ఒక ఎల్బీ అప్పీల్‌పై ఇంగ్లండ్ రివ్యూకు వెళ్లింది. కానీ అందులో పుజారా నాటౌట్‌గా తేలింది. ఒక దశలో ప్రతి ఓవర్లోనూ తను బౌండరీ కొట్టాడు. ఈ ఇన్నింగ్‌‌సలో తను 90ల్లో కూడా ఏ మాత్రం జోరు తగ్గించలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్పిన్నర్లు కుదురుకోకుండా చూడటంలో తను సఫలీకృతమయ్యాడు. మొత్తం ఇన్నింగ్‌‌స అంతా చూడచక్కటి షాట్లతో కనువిందు చేసిన పుజారా... ఒకే ఒక్క చెత్త షాట్ ఆడి దానికే అవుటయ్యాడు. అన్నట్లు ఈ మూడు శతకాలు సాధించిన మూడు స్టేడియాలకూ అది తొలి టెస్టు కావడం విశేషం.

3 పుజారాకు వరుసగా మూడు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ.

14  ఈ టెస్టు ద్వారా 50 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కోహ్లికి ఇది 14వ సెంచరీ. స్వదేశంలో ఐదోది కాగా... ఇంగ్లండ్‌పై ఇది రెండో సెంచరీ.
భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన 286వ ఆటగాడు జయంత్ యాదవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement