
నాగ్‌పూర్: శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 404 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 199 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక 312/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి, పుజారాలు లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
తొలుత కెప్టెన్ కోహ్లి 130 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మూడో వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జంటను దసున్ షనక విడగొట్టాడు. యార్కర్ బంతితో పుజారా143 (362బంతులు,14 ఫోర్లు)ను బోల్తా కొట్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానేతో కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 404/3. క్రీజులో కోహ్లి 123(161 బంతులు, 13 ఫోర్లు), రహానే 0(5 బంతులు) బ్యాటింగ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment