40 టెస్టుల తర్వాత తొలి వికెట్..
40 టెస్టుల తర్వాత తొలి వికెట్..
Published Fri, Aug 4 2017 11:00 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM
కొలంబో: భారత-శ్రీలంక మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 344/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 92వ ఓవర్లో కరుణరత్నే వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న పుజారా(133) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు.
ఇప్పటి వరకు 40 టెస్టులాడిన ఈ లంక ఆటగాడికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. బ్యాట్స్‌మన్ అయిన కరుణరత్నే అప్పుడప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్ అవతారమెత్తుతాడు. ఇంత వరకు కనీసం 10 ఓవర్లు కూడా వేయని కరుణరత్నే బౌలింగ్‌లో పుజారా అవుటవ్వడం మరో విశేషం.
Advertisement
Advertisement