India-Srilanka
-
లంకతో రూపీలో వాణిజ్యం
కొలంబో: శ్రీలంక రూపీ–భారత్ రూపీ మధ్య వాణిజ్యాన్ని ప్రారంభించినందుకు ఎస్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. శ్రీలంక నుంచి లంకన్ రూపీ–భారత్ రూపీలో నేరుగా వాణిజ్యం ప్రారంభించిన తొలి విదేశీ బ్యాంక్‌గా ఎస్బీఐ నిలిచినట్టు చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో మంత్రి సీతారామన్ పర్యటిస్తుండడం తెలిసిందే. నార్తర్న్ ప్రావిన్స్ గవర్నర్ పీఎస్ఎం చార్లెస్‌తో కలసి జాఫ్నా ప్రాంతంలో ఎస్బీఐ రెండో శాఖను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా, భారత హై కమిషనర్ (శ్రీలంక) గోపాల్ బాగ్లే కూడా పాల్గొన్నారు. ఎస్బీఐ ప్రారంభించిన ఈ నూతన సేవ వల్ల శ్రీలంక దిగుమతిదారులు అమెరికా డాలర్లపై ఆధారపడాల్సిన ఇబ్బంది తప్పుతుందని మంత్రి చెప్పారు. ఇది శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు సాయంగా ఉంటుందన్నారు. జాఫ్నా బ్రాంచ్ ద్వారా నార్తర్న్ ప్రావిన్స్‌లో వ్యాపారాలకు ఎస్ బీఐ మద్దతుగా నిలుస్తుందని చెప్పనారు. మంత్రి సీతారామన్ గురువారం ట్రింకోమలేలోనూ ఎస్బీఐ శాఖను ప్రారంభించడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రధాని దినేష్ గుణవర్ధనేతో మంత్రి సీతారామన్ సమావేశమయ్యారు. -
భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక
భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 11వ తేదీనే ఈ నౌక శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఈ నౌక రాకను అడ్డుకోవాల్సిందిగా శ్రీలంకలోని రణిల్ సింఘె ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది. 2020లో లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నిఘా నౌకతో అవి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ ఆందోళనల్ని చైనా కొట్టి పారేస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే సర్వసాధారణంగా జరిగే పరిశోధనలనే యువాన్ వాంగ్ 5 చేస్తుందని అంటున్నారు. భారత రక్షణ ప్రమాదంలో పడుతుందా ? యువాన్ వాంగ్ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలదు. భారత్ మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్ వాంగ్ సిరీస్‌లో మూడో జనరేషన్‌కు చెందిన ట్రాకింగ్ నౌక ఇది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంకలోని హంబన్‌టొట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్‌లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు. కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్లోకి రావడం వల్ల భారత్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్‌టొటలో ఆగుతున్నామని చైనా చెబుతోంది. అయితే జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సముద్ర గర్భంలో సర్వేలు నిర్వహించే సత్తా కూడా ఈ నౌకకి ఉంది. దీనివల్ల జలాంతర్గాముల గుట్టు మట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా కంపెనీ అధీనంలో హంబన్‌టొట పోర్టు శ్రీలంక రేవు పట్టణంలో చైనా నౌక ఉన్నంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక పోర్ట్ అథారిటీ చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేసన్ సిస్టమ్‌ని ఆఫ్‌లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని అంటోంది. అయితే హంబన్‌టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 120 కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకి తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇది భారత్‌కు మరింత ఆందోళన పెంచుతోంది.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కనుసన్నల్లోనే ఈ నౌక నడుస్తుందని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటుకి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్‌టొట ఉంది. ఆసియా, యూరప్ మధ్య నిత్యం 36 వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది.ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది. డ్రాగన్ కొత్త ఎత్తులు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలను తీరుస్తామన్న చెప్పుకొని డ్రాగన్ దేశం తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహీందా రాజపక్స దేశం విడిచిపోయిన పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. 350 కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి కూడా శ్రీలంక చాలా అప్పులు చేసింది. 2005–2017 మధ్యలో 1500 కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత్ ప్రాభవాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. శ్రీలంక కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పు తేవడానికి కావల్సిన మాట సాయాన్ని చైనా నుంచి ఆశిస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎవరినీ నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువాన్ వాంగ్ 5 ► చైనాలోని జియాంగ్నన్ షిప్‌యార్డ్‌లో నిర్మాణం ► 2007 నుంచి విధుల్లోకి ► పొడవు 222 మీటర్లు – ► వెడల్పు 25.2 మీటర్లు ► నౌకలో అత్యంత ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థ ► నింగి నేల నీరు అన్నింటిపై నిఘా పెట్టే సామర్థ్యం ► గత నెలలో చైనా లాంగ్ మార్చ్ ► 5బీ రాకెట్ ప్రయోగంపై నిఘా – నేషనల్ డెస్క్, సాక్షి -
నా శ్వాస.. ధ్యాస.. సంద్రమే!
దేన్ని చూసి భయపడతామో దానితోనే తలపడితే... ధైర్యం విజయసోపానాలతో స్వాగత సత్కారం చేస్తుంది. నీళ్లను చూసి భయపడిన ఆ నీళ్లతోనే ఫైట్ చేసింది రికార్డులను కొల్లలుగా కొల్లగొడుతోంది. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఈ నీటి మెరుపుతో ముచ్చటించిన విశేషాలు ఇవి. వయసు మీద పడుతున్నకొద్దీ ఆడవారిలో సహజంగా ఓ భయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనేది ఆ భయం వెనక దాగున్న వాస్తవం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, అందుకు తగిన సాధన విషయంలో అంతగా శ్రద్ధ ఉండదు. ఈ విషయాన్ని తన సంభాషణలో తొలుతగా ప్రస్తావించిన శ్యామల పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. సోషియాలజీ విభాగంలో పట్టభద్రురాలైన శ్యామల నీళ్లు తనతో స్నేహం చేసిన తొలినాళ్ల గురించి చెబుతూ– ‘‘నేను యానిమేషన్ మూవీస్ కి ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్‌గా ఉండేదాన్ని. దీంట్లో నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాను. బిజినెస్ క్లోజ్ చేశాను. మైండ్‌ను మరోవైపుకు మళ్లించాల్సిన అవసరం అది. అప్పుడు స్విమ్మింగ్ ఎంచుకున్నాను. ఎవరైనా నీళ్లలో ఈత నేర్చుకోవాలనుకున్నప్పుడు ముందు వెయిట్‌లాస్, ఫిట్నెస్ గురించో ఆలోచిస్తారు. కానీ, నేను ఒక లక్ష్యం ఉండాలనుకున్నాను. అయితే, నీళ్లంటే విపరీతమైన భయం ఉండేది. నాలుగేళ్ల క్రితం సమ్మర్ టైమ్‌లోనే మొదటిసారి స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాను. ఆ రోజు నీళ్లలో దిగినప్పుడు వచ్చిన వణుకు నాకు ఇప్పటికీ గుర్తే. కొన్ని రోజుల్లో ఏడు అడుగుల దూరం డైవింగ్ బోర్డ్ నుంచి జంప్ చేసినప్పుడు వణికిపోయాను. కానీ, మూడు నెలల్లోనే పోటీలో పాల్గొనేంతగా సాధన చేశాను. మొదటిసారే కాంస్య పతకం వచ్చింది’’ అని తెలిపిన శ్యామల యుద్ధంలో దిగేంతవరకే భయం. దిగితే ఎంతటివారినైనా ఓడించాల్సిందేననే తపనను కనబర్చింది. సంద్రంవైపు గురి నాటి నుంచి పాల్గొన్న ప్రతీ పోటీలో మెడల్స్, అవార్డ్స్ వరిస్తూనే ఉన్నాయి. అప్పుడే ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన వారి గురించిన వార్తలు కంటబడ్డాయి. ఆ విషయాన్ని శ్యామల ప్రస్తావిస్తూ ‘నేనూ సముద్రాన్ని ఈదుతాను.. అని స్నేహితులతో మాట్లాడినప్పుడు వాళ్లు నా వయసు గురించి ప్రస్తావించారు. పాతికేళ్లలోపైతే ఓకే కానీ, నలభై ఏళ్లు దాటాక చాలా కష్టం అన్నారు. ఆ కష్టాన్ని నేను ఛాలెంజింగ్‌గా తీసుకోవాలనుకున్నాను. వయసు అనే అడ్డంకిని దాటాలనుకున్నాను. అయితే, ఇంగ్లిష్ ఛానెల్ కన్నా మన దేశంతో కలిసి ఉన్న సముద్రం అయితే బాగుంటుందనుకున్నాను. అప్పుడే నాకు రామసేతు దృష్టిలోకి వచ్చింది. అక్కణ్ణుంచి నా ప్రయత్నం, ప్రయాణం ఆగలేదు. నిరంతరం సాధన. దానికి తోడు ఇప్పటి వరకు ఎవరైనా రామసేతును క్రాస్ చేశారా.. అనే శోధన. అలాంటి వారి కోసం అన్వేషణ.. నిరంతరం సాగుతూనే ఉంది. అప్పుడే రామసేతును క్రాస్ చేసిన రాజా త్రివేది గురించి తెలిసింది. ఆయన్ని సంప్రదించినప్పుడు ప్రోత్సహించి, తగు సూచనలు ఇచ్చారు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచన, ఏడాది క్రితమే పూర్తి చేయాలనుకున్నాను. కానీ, కోవిడ్ కారణంగా మరో ఏడాది పట్టింది’ అంటూ సముద్రంపై తను గురిపెట్టిన లక్ష్యాన్ని వివరించారు. సముద్రమంత సాధన! స్త్రీ, పురుషులు ఎవరైనా వారు చేసే పనుల ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది. ఈ విషయం గురించి అడిగితే.. ‘నిజమే, కానీ జీవితంలో మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి’ అంటారు శ్యామల. మా వారు ‘ఏం ఫర్వాలేదు. నువ్వు తిరిగి వస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది’ అన్నారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌కి ‘ఇండియా,–శ్రీలంక ఫ్రెండ్షిప్ స్విమ్మింగ్’ అని పేరు పెట్టాం. ఫెడరేషన్ వాళ్లు ఒక అబ్జర్వేటర్, మహారాష్ట్ర నుంచి ఒక అబ్జర్వేటర్ వచ్చారు. కుటుంబ సభ్యులతో శ్యామల క్రూలో 14 మందిమి వెళ్లాం. ఒక డాక్టర్, ఫీడింగ్‌కి సాయం చేయడానికి ఫ్రెండ్‌ని తీసుకెళ్లాను. ఉదయం 4 గంటలకు స్విమ్మింగ్ స్టార్ట్ అయ్యింది. రీచ్ అయ్యేసరికి సాయంకాలం 5:35 గంటలు అయ్యింది. స్విమ్మింగ్ మొదలయ్యే క్షణం నుంచి ధనుష్కోటికి చేరుకునే క్షణం వరకు నా మదిలో ఒకటే ఆలోచన స్విమ్.. స్విమ్.. అంతే! 13 గంటల 43 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నాను. ఈ పాక్ జలసంధి ని బులా చౌదరి 13 గంటలు 55 నిమిషాల్లో ఈది రికార్డ్‌లో ఉన్నారు. ఆ రికార్డ్‌కి దరిదాపుల్లో వెళ్లగలనా అనుకున్నాను. కానీ, ఆ రికార్డ్‌ను ్ర»ే క్ చేయాలనే సంకల్పం నన్ను ముందు నిలబెట్టింది’ అని వివరిస్తున్నప్పుడు విజయం తాలూకు ఆనందం ఆ కళ్లలో కనిపించింది. ధైర్యం వెన్నుదన్ను సముద్రాన్ని దూరం నుంచి చూడటం ఓ ఆహ్లాదం. కానీ, సముద్రాన్ని ఈదడం అంటే.. ‘షార్క్స్ ఉంటాయి. ఏ క్షణమైనా అవి దాడి చేయవచ్చు. మింగేయచ్చు. ఇలా వీటి గురించి భయపెట్టి కొందరు కిందటేడాది స్విమ్మర్స్ ఆలోచనను మార్చేశారు. కానీ, చావో రేవో తేల్చుకోవాలనుకున్నాను. ఏమీ సాధించకుండా ఉండేదానికన్నా ఒక ధీరలాగా పోరాడైన పోవాలనుకున్నాను. అందుకే భయానికి ఏ మాత్రం తావివ్వలేదు. నేను గమనించిందేంటంటే స్విమ్మర్స్ని షార్క్స్ దాడి చేసిన ఘటనలైతే ఏమీ లేవు. ఈ రికార్డ్‌లో భాగంగా నీళ్లలో ఉన్నంతసేపు ఏదీ పట్టుకోకూడదు, దేనినీ ముట్టుకోకూడదు. శ్రీలంక నుంచి స్విమ్ చేస్తున్నప్పుడు అక్కడి నీళ్లలో సులువు అనిపించింది. అది క్రాస్ చేసి ఇండియాలోకి ఎంటరయ్యేటప్పుడు ముఖ్యంగా చివరి 3 గంటలు చాలా కష్టమనిపించింది. గట్టి అలలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడా కష్టమంతా మర్చిపోయాను. సక్సెస్ ను ఆనందిస్తున్నాను’ అని స్విమ్మింగ్ పూల్ నుంచి సముద్రాన్ని జయించిన విజయ ప్రవాహం గురించి వివరిస్తూనే ఉన్నారు శ్యామల. ఒక దారి మూసుకుపోతే దేవుడు వేయి అవకాశాల దారులను మన ముందుంచుతాడు. ఏ దారిలో వెళ్లినా లక్ష్యం వైపుగా గురి ఉంటే విజయం వరించి తీరుతుంది. 47 ఏళ్ల వయసులో 30 మైళ్ల పాక్ జలసంధిని 13 గంటల 43 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించిన శ్యామల విజయం ఒక్కనాటితో కాదు నిరంతర సాధనతో, పట్టుదలతో ఆమె సొంతమైంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చెత్తగా ఆడి...చిత్తుగా ఓడి
భారత్ ఇంకా ‘పరుగు’ మొదలు పెట్టలేదు. ధావన్ డకౌట్! పర్లేదు... మరో ఓపెనర్ రోహిత్ ఉన్నాడు. జట్టు స్కోరు 2. అప్పుడే అతనూ (2) అవుట్! దీనికే బెంబేలెందుకు... మిడిలార్డర్ ఉందిగా. టీమ్ స్కోరు సంఖ్యగా మారలేదు. అంకె (8)లోనే ఉండగా మరో వికెట్ దినేశ్ కార్తీక్ డకౌట్! అయితే మాత్రం... ధోనికి ముందు పాండే, ఆ వెనక పాండ్యా ఉన్నారుగా. హతవిధి... పాండే (2), శ్రేయస్ (9) అవుట్! సగం వికెట్లు 16 పరుగులకే ఫటాఫట్!! ఇక పర్లేదంటే కుదరదు. జాగ్రత్తగా ఆడాలనుకుంటుండగానే పాండ్యా (10), భువనేశ్వర్ (0) ఖేల్‌ఖతం. భారత్ 29/7. కనీసం జాగ్రత్త పడే అవకాశం కూడా ఇవ్వలేదు లంక బౌలర్లు. ధోని అర్ధసెంచరీ పుణ్యామాని స్కోరు వంద పరుగులు దాటింది. లేదంటే లంక బౌలర్ల ధాటికి మరో అత్యల్ప స్కోరు ఖాయమయ్యేది. ఇంత చెత్తగా, చిత్రంగా ఆడినా... చిత్తుగా ఓడినా... చరిత్రలో మరో చెత్త స్కోరు నుంచి బయటపడటమే ఈ మ్యాచ్‌లో భారత్‌కు దక్కిన ఊరట! ధర్మశాల: రోహిత్ శర్మ కొత్త కెప్టెనే అయినా... సారథిగా చాలా అనుభవముంది. ఐపీఎల్లో విజయవంతమైన నాయకుడనే పేరుంది. టీమ్ ఫామ్‌లో ఉంది. వన్డేల్లోనూ నంబర్‌వన్ దిశగా ఆడుగులేస్తోంది. లంకను వారి సొంతగడ్డపైనా వణికించింది. ఇప్పుడు ఇక్కడా టెస్టుల్లో ఓడించింది. కానీ ధర్మశాలలో ఇదేం ఆట. అదేం స్కోరు. ఒక దశలో భారత్ స్కోరు (29/7) చూస్తే చిత్తు స్కోరుకు, చెత్త ఆటకు చిరునామా అయ్యేదనిపించింది. ధోని (87 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటంతో పరువు నిలబెట్టుకుంది. కానీ మొత్తానికి ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడింది. మూడు వన్డేల సిరీస్‌ను పరాభవంతో ప్రారంభించింది. ఈ టోర్నీలో 0–1తో వెనుకబడింది. రెండో వన్డే 13న మొహాలీలో జరగనుంది. ‘సింహళ సీమర్లు’ సురంగ లక్మల్ (4/13), నువాన్ ప్రదీప్ (2/37), మాథ్యూస్ (1/8), పెరీరా (1/29) ఒక్కసారిగా గర్జించారు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ మీద దెబ్బ తీశారు. తేరుకునేలోపే తేలిగ్గా ఆలౌట్ చేశారు. లంక సింహనాదానికి ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 38.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. మొత్తం జట్టులో ధోనితో పాటు కుల్దీప్ యాదవ్ (19; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (10; 2 ఫోర్లు)లవే రెండంకెల స్కోర్లు. మిగతా వారివి సింగిల్ డిజిట్లే. ఇందులో నలుగురువి డకౌట్లు. అనంతరం శ్రీలంక 20.4 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 114 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ తరంగ (46 బంతుల్లో 49; 10 ఫోర్లు) రాణించగా, మాథ్యూస్ (42 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు), డిక్వెలా (24 బంతుల్లో 26 నాటౌట్; 5 ఫోర్లు) అజేయంగా నిలిచారు. శ్రీలంక సీమర్ లక్మల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అసలు ఇది నెం.1 అడుగేనా... టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా... వన్డేల్లోనూ నంబర్‌వన్ కోసం ఈ సిరీస్‌లో అడుగు వేసింది. కానీ పడరాని పాట్లతో ఆశ్చర్యకర ఆటతీరుతో ఈ మ్యాచ్‌లో ఓడింది. తొలుత టాస్ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కానీ జట్టు పరుగుల ఖాతా తెరువకుండానే ధావన్ (0), 2 పరుగుల వద్ద రోహిత్ (2) అవుటయ్యారు. తొలుత ధావన్ ఎల్బీ అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించగా... బౌలర్ మాథ్యూస్ డీఆర్ఎస్ ద్వారా ఫలితం రాబట్టాడు. లక్మల్ అద్భుతమైన బంతికి రోహిత్... డిక్వెలాకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. లక్మల్ 10–4–13–4 ఏకధాటిగా వేసిన 10 ఓవర్ల స్పెల్‌తో లక్మల్ భారత్‌ను అదే పనిగా కుంగదీశాడు. దినేశ్ కార్తీక్ (0)ను, మనీశ్ పాండే (2)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో 16 పరుగులకే సగం జట్టు నిష్క్రమించింది. ధోనిని నిలబెట్టి అవతలివైపు నుంచి వికెట్ల పనిపట్టారు. దీంతో హార్డిక్ పాండ్యా (10), భువనేశ్వర్ (0)ల ఆట కూడా ముగిసింది. పాండ్యాను ప్రదీప్, భువీని లక్మల్ అవుట్ చేశారు. భారత్ స్కోరు 29/7. పీకల్లోతు కష్టం కాదు... కొలమానమే లేని కష్టాల్లో టీమిండియా. ఈ దశలో ధోని నిలబడ్డాడు. కుల్దీప్తో కలిసి ఇన్నింగ్స్‌ను వందదాకా నడిపించాడు. 112 స్కోరు వద్ద ధోని వికెట్ తీసిన పెరీరా భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రాణించిన తరంగ కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక కూడా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద గుణతిలక (1)ను బుమ్రా అవుట్ చేయగా... తిరిమన్నె (0)ను భువనేశ్వర్ డకౌట్ చేశాడు. 19 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. అప్పటికి పరుగు మాత్రమే చేసిన తరంగ బుమ్రా బౌలింగ్‌లో అవుటై నిష్క్రమించే పనిలో పడ్డాడు. అతని క్యాచ్‌ను గల్లీలో దినేశ్ కార్తీక్ చక్కగా అందుకున్నప్పటికీ బంతి ‘నోబాల్’ అయింది. దీంతో బతికి పోయిన తరంగ ఆ తర్వాత యథేచ్చగా ఆడుకున్నాడు. మాథ్యూస్‌తో మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించాక తన అర్ధసెంచరీకి పరుగు దూరంలో పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత మాథ్యూస్‌కు జతయిన డిక్వెలా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఇద్దరు కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. తెలిసిందా ధోని విలువేంటో... ఇపుడంటే కోహ్లి పెళ్లి మాయలో పడి ధోని ఊసెత్తడం లేదు కానీ... ఈ మధ్య కాలంలో అదేపనిగా విమర్శకులు ధోనిపై నిర్ణయం తీసుకోవాలని సెలక్టర్లకు, వైదొలగాలని ఈ మాజీ చాంపియన్ కెప్టెన్‌కు ఉచిత సలహాలిచ్చారు. ఇలాంటి విమర్శలెదురైనపుడల్లా కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మాజీ సారథికి అండగా నిలిచారు. అతనిలో క్రికెట్ ఆడే సత్తా ఉందని, జట్టును గెలిపించే ఆటగాడని కితాబిస్తూ వచ్చారు. ఆదివారం కూడా అదే జరిగింది... కానీ ‘గెలిపించే’ది సాధ్యపడకపోయినా... క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందని ధోని తొలివన్డేలో తన బ్యాట్‌తో నిరూపించాడు. అతనే గనక కుల్దీప్తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించకపోయి వుంటే షార్జా చెత్త రికార్డు చెరిగి కొత్త చెత్త రికార్డు వచ్చేది. 2000 సంవత్సరంలో షార్జాలో లంక చేతిలో భారత్ 54 పరుగులకే ఆలౌటైంది. సచిన్, గంగూలీ, యువరాజ్ వంటి హేమా హేమీలున్న జట్టే అత్యల్ప స్కోరుకు తలవంచింది. ఇప్పుడు ధోని ఉండటంతో ఆ ప్రమాదం తప్పింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) డిక్వెలా (బి) లక్మల్ 2; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) మాథ్యూస్ 0; శ్రేయస్ (బి) ప్రదీప్ 9; దినేశ్ కార్తీక్ ఎల్బీడబ్ల్యూ (బి) లక్మల్ 0; మనీశ్ పాండే (సి) మాథ్యూస్ (బి) లక్మల్ 2; ధోని (సి) గుణతిలక (బి) పెరీరా 65; హార్దిక్ పాండ్యా (సి) మాథ్యూస్ (బి) ప్రదీప్ 10; భువనేశ్వర్ (సి) డిక్వెలా (బి) లక్మల్ 0; కుల్దీప్ (స్టంప్డ్) డిక్వెలా (బి) ధనంజయ 19; బుమ్రా (బి) పతిరన 0; చహల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (38.2 ఓవర్లలో ఆలౌట్) 112. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–8, 4–16, 5–16, 6–28, 7–29, 8–70, 9–87, 10–112. బౌలింగ్: లక్మల్ 10–4–13–4, మాథ్యూస్ 5–2–8–1, ప్రదీప్ 10–4–37–2, తిసారా పెరీరా 4.2–0–29–1, అకిల ధనంజయ 5–2–7–1, సచిత్ పతిరన 4–1–16–1. శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) ధోని (బి) బుమ్రా 1; తరంగ (సి) ధావన్ (బి) హార్దిక్ పాండ్యా 49; తిరిమన్నె (బి) భువనేశ్వర్ 0; మాథ్యూస్ నాటౌట్ 25; డిక్వెలా నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20.4 ఓవర్లలో 3 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–7, 2–19, 3–65. బౌలింగ్: భువనేశ్వర్ 8.4–1–42–1, బుమ్రా 7–1–32–1, హార్దిక్ పాండ్యా 5–0–39–1. ► ఈ మ్యాచ్ ద్వారా ముంబై క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డే ఫార్మాట్లో బరిలోకి దిగిన 219వ క్రికెటర్‌గా అతను గుర్తింపు పొందాడు. మాజీ కెప్టెన్ ధోని చేతుల మీదుగా శ్రేయస్ టోపీని అందుకున్నాడు. ► స్వదేశంలో తొలుత బ్యాటింగ్‌కు దిగాక భారత్ చేసిన అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా సొంతగడ్డపై భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. 1986లో కాన్పూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే భారత్ 78 పరుగులకు ఆలౌటైంది. ► భారత్‌పై ఓ జట్టు 13 మెయిడిన్ ఓవర్లు వేయడం ఇదే తొలిసారి. వన్డేల్లో భారత జట్టు 16 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. గతంలో జింబాబ్వేపై 1983 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 17 పరుగులకు ఐదు వికెట్లు చేజార్చుకుంది. ► ఆరేళ్ల తర్వాత భారత్ ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాట్స్‌మన్ ఖాతా తెరవకుండా అవుటయ్యారు. గతంలో ఏకైకసారి 2011 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నలుగురు భారత ఆటగాళ్లు డకౌటయ్యారు. భారత్ తరఫున వన్డేల్లో గరిష్టంగా 18 బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్. గతంలో ఈ రికార్డు ఏక్నాథ్ సోల్కర్ (17 బంతులు–1974లో ఇంగ్లండ్‌పై) పేరిట ఉంది. పేస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రహానేను తప్పించడం తప్పే. టీమ్ మేనేజ్మెంట్ అతన్ని పర్ఫెక్ట్ ఓపెనర్‌గా చూసింది. అందువల్లే మిడిలార్డర్లో ఆడించలేకపోయాం. ఈ మ్యాచ్‌లో మేం మరో 70–80 పరుగులు చేయాల్సింది. చెత్త బ్యాటింగ్ వల్లే ఓడాం. ఓ విధంగా మా అందరికీ ఇది కనువిప్పు. ధోని ఆట నన్నేమీ ఆశ్చర్యపర్చలేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సమర్థుడు ధోని. ఈ మ్యాచ్‌లో లంక పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. – రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
భారత ఆటగాళ్లు ఎందుకు మాస్కులు ధరించలేదు.?
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించడంపై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తనదైన శైలిలో స్పందించారు. ఒకే మైదానంలో ఆడుతున్న ఇరు జట్లలో టీమిండియా ప్లేయర్లు ఎందుకు మాస్కులు ధరించలేదని పరోక్షంగా లంక ప్లేయర్ల డ్రామాను ప్రస్తావించారు. రెండో రోజు ఆటలో కాలుష్యంతో మైదానంలో గాలి పీల్చుకోలేకపోతున్నామని, మ్యాచ్ నిలిపివేయాలని పదేపదే లంక ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం భరత్ అరుణ్ మీడియాతో ముచ్చటించారు.‘ భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు రోజులుగా మాస్క్ లేకుండానే బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్‌పై దృష్టి సారించి తమ జట్టు పట్టు సాధించింది. మైదానంలో ఇరు జట్లకు ఒకే పరిస్థితి ఉంది. అయినా లంక ప్లేయర్లు మాత్రమే మాస్కులు ధరించి మ్యాచ్ నిలిపేయాలని కోరారు. కాలుష్యం ఎక్కడైనా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేయదు. ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్ల బాధ్యత. వేదికలతో ఆటగాళ్లకు సంబంధంలేదు.’అని పరోక్షంగా లంక ఆటగాళ్లకు చరకలంటించారు. ఈ ఘటనపై లంక బోర్డు బీసీసీఐని వివరణ కోరినట్లు.. కాలుష్యం ఎక్కువగా ఉన్న ఢిల్లీని షెడ్యూల్లో ఎందుకు చేర్చినట్లు ప్రశ్నించిందని వార్తలొచ్చాయి. ఇక అంతకు ముందు లంక ప్లేయర్లు పదేపదే మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో చిరాకెత్తిన కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను 536 పరుగుల వద్ద డిక్లెర్ ఇచ్చి లంకను బ్యాటింగ్ ఆహ్వానించాడు. అయితే భారత ఆటగాళ్లు మాస్క్‌లు ధరించకుండా ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న భారత్‌ను నిలువరించలేక లంక ఈ డ్రామాకు తెరలేపిందని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. -
రోహిత్ 50.. భారత్ 500
నాగ్‌పూర్: శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 500 పరుగుల మార్క్‌ను దాటగా రోహిత్ అర్ధ సెంచరీ సాధించాడు. లంచ్ విరామం అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే రహానే(2) వికెట్‌ను భారత్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మతో కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ దశలో 193 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సుతో కోహ్లి 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిక్సుతో కోహ్లి 150 పరుగులు చేయడం విశేషమైతే.. ఇది అతనికి ఏడో 150 కావడం మరో విశేషం. అనంతరం రెచ్చిపోయిన ఈ జంట స్కోరు బోర్డు వేగాన్ని పెంచింది. 98 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 5 ఫోర్లు 1 సిక్సుతో కెరీర్లో 8వ హాఫ్ సెంచరీ సాధించాడు. టీ విరామ సమయానికి భారత్ స్కోరు 507/4. క్రీజులో కోహ్లి 170(223 బంతులు, 14 ఫోర్లు,1 సిక్సు), రోహిత్ 51(108 బంతులు, 5 ఫోర్లు 1 సిక్సు) లు ఉన్నారు. -
‘ఇక కోహ్లికి ఆకాశమే హద్దు’
కోల్‌కతా: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ప్రపంచరికార్డు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై కోచ్ రవిశాస్త్రి , మాజీ కెప్టెన్ గంగూలీలు ప్రశంసలు జల్లు కురిపించారు. తొలి టెస్ట్మ్యాచ్లో కోహ్లి(104) సెంచరీ బాది అన్నిఫార్మట్లలో కలిపి 50 శతకాల రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ‘కోహ్లికి ఇక ఆకాశమే హద్దు, అతనో అద్భుతమైన ఆటగాడు. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేయడానికి సగం దూరం వచ్చాడు. కోహ్లి ఈ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉంది.’ అని లంకతో తొలి టెస్టు డ్రా అనంతరం ఓ ప్రమోషన్ ఈవేంట్లో రవిశాస్త్రి కోహ్లిని కొనియాడాడు. ‘ఇది ఒక మైమరిపించే ఇన్నింగ్స్. కోహ్లి ఒక మంచి నాయకుడు. అదే అతన్ని చాలా దూరం తీసుకెళ్తుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక సచిన్(100) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్ కోహ్లినే. ఇక ప్రపంచ బ్యాట్స్మెన్లల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన లిస్టులో సచిన్(100) తొలిస్థానంలో ఉండగా.. రికీపాంటింగ్(71) సంగక్కర(63), జాక్వస్ కల్లీస్(62), జయవర్ధనే(54), హషీమ్ ఆమ్లా(54) బ్రియాన్ లారా(53) తర్వాత కోహ్లి(50) 8వ స్థానంలో నిలిచాడు. -
అటెన్షన్ ప్లీజ్.. వన్డే సమయాల్లో మార్పు!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-శ్రీలంకల మధ్య డిసెంబర్10 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు సంబంధించి తొలి రెండు వన్డేల సమయాన్ని బీసీసీఐ సవరించింది. చలి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధర్మశాల, మొహాలీలో జరిగే వన్డేల సమయాన్ని మార్చినట్లు ప్రకటించింది. తొలి రెండు వన్డేలూ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గం.కు ప్రారంభమవుతాయని తెలిపింది. ‘హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెచ్పీసీఏ), పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. ఈ మేరకు సవరించిన సమయం ప్రకారం డిసెంబర్ 10న ధర్మశాలలో తొలి వన్డే, డిసెంబర్ 13న మొహాలీలో రెండో వన్డే జరుగుతాయి’ అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక విశాఖ వేదికగా జరిగే మూడో వన్డే.. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరగనుంది. -
డిన్నర్ టేబుల్‌పైనే భారత ఓపెనర్ల వ్యూహరచన?
కోల్‌కతా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లు తమ వ్యూహాలను కెప్టెన్ కోహ్లితో కలిసి డిన్నర్ టేబుల్‌పైనే రచించారు. మూడో రోజు ఆటలో ఆధిక్యం సాధించిన లంకను దెబ్బ కొట్టేందుకు కెప్టెన్ కోహ్లి డిన్నర్ సమయంలో ఓపెనర్లతో కలిసి ప్రణాళిక సిద్దం చేశారు. ఈ విషయాన్ని ధావన్ ‘బాయ్స్‌తో గొప్ప డిన్నర్ .. నాలుగో రోజు ఆట మా వైపు తిప్పుకునేందుకు వ్యూహాన్ని రచించాం’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ప్రణాళిక దగ్గట్టు టీమిండియా లంక తొలి ఇన్నింగ్స్‌ను 294 పరుగులకే కట్టడి చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. అర్ధసెంచరీలతో మెరిసిన ఈ జంట తొలి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శిఖర్ ధావన్(94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. రాహుల్(73) నాటౌట్‌గా నిలిచాడు. Had great dinner with boys....looking forward for 4th day of d game tomorrow and turn it to our side!! 🤗🙏🏼 A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Nov 18, 2017 at 9:14am PST -
‘పుజారా.. యూ ఆర్ మిష్టర్ డిపెండబుల్’
సాక్షి, హైదరాబాద్: ‘యూ ఆర్ న్యూ మిష్టర్ డిపెండబుల్’ అంటూ టీమిండియా టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ చతేశ్వర పుజారాను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓ వైపు వికెట్లు పడుతున్న తన దైన శైలిలో ఆడుతూ పుజారా అర్ధ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఏ మాత్రం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై తన మార్క్ బ్యాటింగ్‌తో టెస్ట్ కెరీర్లో 16 అర్ధ సెంచరీ సాధించిన పుజారాపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక పుజారా హాఫ్ సెంచరీకి డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా సభ్యులు నిలబడి ప్రశంసించడం విశేషం. ఈ అర్ధ సెంచరీకి 117 బంతులాడిన పుజారా 10 ఫోర్లు కొట్టడం మరో విషేశం. ఒకప్పుడు మిష్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అయితే యూ ఆర్ న్యూ డిపెండబుల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. పుజారా హాఫ్ సెంచరీని ప్రశంసిస్తూ బీసీసీఐ ‘ఓపిక, భరోసా.. పుజారా 16వ హాఫ్‌సెంచరీ’ అని ట్వీట్ చేసింది. Patient and poised - @cheteshwar1 gets to his 16th Test 50 #INDvSL pic.twitter.com/AlBe0NzZKm — BCCI (@BCCI) November 18, 2017 That's why @cricketaakash call him Cheteshwar "dependable" pujara ✌✌@BCCI @cricketaakash — Kamalkant Jangir (@Kamalkantkakku7) 18 November 2017 -
‘నెగ్గాలంటే నాణ్యమైన పేసర్లు ఉండాలి’
కోల్‌కతా: వచ్చే ఏడాది విదేశీగడ్డపై జరిగే పర్యటనల్లో భారత్ విజయవంతం అవ్వాలంటే ఐదారుగురు మన్నికైన పేస్‌బౌలర్లు జట్టులో ఉండాలని ఇటీవల రిటైరయిన బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయ పడ్డాడు. టెస్టుల్లో ప్రస్తుతం ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఆడకపోయినా నాణ్యమైన పేసర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారని టీమ్ రిజర్వ్‌బెంచ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇతర ఫార్మాట్లలోనూ ఇది కొనసాగాలని అభిప్రాయపడ్డాడు. భారత్–శ్రీలంక తొలిటెస్టు సందర్భంగా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న నెహ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. వచ్చే జనవరిలో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లను దక్షిణాఫ్రికా గడ్డపై ఆజట్టుతో టీమిండియా ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో విరాట్ కోహ్లిసేన పర్యటించనుంది. మరోవైపు తొలిటెస్టు వేదికైన ఈడెన్‌పై నెహ్రా మాట్లాడుతూ.. వికెట్ చాలా బాగుందని, వర్షం కారణంగానే మైదానంలో తేమ నెలకొందని పేర్కొన్నాడు. ఈ వికెట్లో స్వింగ్, బౌన్స్, సీమ్ ఉన్నాయని తెలిపాడు. వర్షం కారణంగానే బంతి అనూహ్యంగా స్పందిస్తుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లి ఔటైన తీరే దీనికి నిదర్శమని, దీనిపై బ్యాట్స్‌మెన్ ఏమీ చేయలేరని పేర్కొన్నాడు. ఇది బౌలర్లకు కూడా ఇబ్బందికరమేనని తెలిపాడు. మరోవైపు ఈమ్యాచ్‌లో టాస్ నెగ్గి ఉంటే భారత్ ఫీల్డింగ్‌ను ఎంచుకుని ఉండేదని, అప్పుడు లంక జట్టు 50–60 పరుగుల మధ్య ఆలౌటై ఉండేదని వ్యాఖ్యానించాడు. 200–220 పరుగులు ఇక్కడ చాలా మంచి స్కోరని అభిప్రాయపడ్డాడు. ఈడెన్‌లో మాదిరే దక్షిణాఫ్రికాలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉంటాయని, ఆ పర్యటనకు ముందు ఇలాంటి వికెట్‌పై ఆడడం భారత్‌కు ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డాడు. సఫారీగడ్డపై ఆడనుండడంతో భారతేమీ ఒత్తిడికి గురికాబోదని, ఆజట్టులో డేల్ స్టెయిన్, కగిసో రబడలాంటి పేసర్లుంటే మన జట్టులో కోహ్లి లాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. -
పాండ్యా అలసిపోయాడా.. కోహ్లీ ఘాటు సమాధానం
కోల్‌కతా : న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం ఎక్కువగా చర్చించింది ఇద్దరు భారత క్రికెటర్ల గురించే కాగా, ఒకరు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మరో ప్లేయర్ హార్ధిక్ పాండ్యా. రిటైర్ అవ్వాలంటూ ధోనికి లక్ష్మణ్, అగార్కర్ లు సూచించగా.. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ లు ధోనికి మద్ధతు తెలిపారు. మరోవైపు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో తొలి రెండు టెస్టులకుగానూ హార్ధిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం విమర్శలకు దారితీసింది. కెరీర్ ఆరంభంలోనే విశ్రాంతి అవసరమా.. అంత ఎక్కువగా పాండ్యా అలసిపోయాడా అన్న ప్రశ్నలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. కోల్‌కతాలో కోహ్లీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 'యువ ఆల్ రౌండర్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయం. ప్రతి క్రికెటర్ ఏడాదిలో 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలడు. అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే అతడికి విశ్రాంతి అవసరమే. ఈ నేపథ్యంలోనే పాండ్యాకు కాస్త విశ్రాంతి ఇచ్చాం. ఇంకా చెప్పాలంటే.. నేను కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. నాకు కూడా ప్రస్తుతం కాస్త విరామం కావాలి. అయితే లంకతో సిరీస్‌ను మేం తేలికగా తీసుకోవడం లేదు. అందుకే ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమని భావించి ఈ సిరీస్ నుంచి నేను తప్పుకోలేదంటూ' వివరించాడు. రేపు (గురువారం) ఇక్కడి ఈడెన్ గార్డెన్లో శ్రీలంక, భారత్ జట్లు తొలి టెస్టులో తలపడనున్నాయి. ఇప్పటివరకూ భారతగడ్డ మీద టీమిండియాపై లంక ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా నెగ్గకపోవడం పర్యాటక జట్టుకు ప్రతికూలాంశం. కాగా వరుస సిరీస్ విజయాలు సాధిస్తూ టెస్టుల్లో నెం1 ర్యాంకుతో జోరు మీదున్న కోహ్లీ సేనను ఓడించడం లంక ఆటగాళ్లకు పెను సవాలేనని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. -
‘అసలు ముందుంది ముసళ్ల పండుగ’
సాక్షి, కోల్‌కతా: శ్రీలంక సిరీస్ అనంతరం అత్యంత కఠినమైన సిరీస్ దక్షిణాఫ్రికాతో ఉందని, ఆ సిరీస్ దృష్ట్యా లంక సిరీస్ చాల ముఖ్యమని టీమిండియా టెస్టుల వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డారు. ఈనెల 16న శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘టెస్టుల్లో నెం1 ర్యాంకులో ఉన్నాం. ప్రతిసిరీస్ మాకు ముఖ్యమే. ప్రతీది గెలవాలనుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులు మాకు బాగా తెలుసు. వచ్చే ఏడాది ప్రారంభంలో కఠినమైన సిరీస్ దక్షిణాఫ్రికా పర్యటన ఉంది. అక్కడ రెండు నెలలపాటు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాం. ఇది చాలా కఠినమైన సిరీస్. దీంతో ఈ పర్యటన ముందు లంకతో జరుగుతున్న సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ముఖ్యమే. దక్షిణాఫ్రికా పరిస్థితులు పూర్తిగా విభిన్నం. దీనికి ఈ సిరీస్‌లోనే సిద్ధమవుతాం. లంకను తక్కువ అంచనా వేయడం లేదు. శ్రీలంక టీమ్‌ను గౌరవిస్తాం. మా బలాలపైనే పూర్తిగా దృష్టి సారించాం. ఆటగాళ్లంతా అన్ని ఫార్మట్లకు దగ్గట్లు సిద్దం అవుతున్నారు. ఒత్తిడి, అలసటను తగ్గించుకోవడానికి మసాజ్, ఈత, ఐస్ బాత్ సెషన్స్‌లో పాల్గొంటున్నాం. టీమ్ మేనేజ్మెంట్ మా ఫిట్‌నెస్‌పై కేర్ తీసుకుంటుంది.’ అని రహానే పేర్కొన్నారు. -
భారత్-శ్రీలంక సిరీస్ షెడ్యూల్..
సాక్షి, హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ తొలిమ్యాచ్ నవంబర్16న ఈడెన్‌గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఏడేళ్ల క్రితం భారత్‌లో పర్యటించిన లంక మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా 0-2తో సీరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో లంకలో పర్యటించిన భారత్ టెస్టు, వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్‌చేసింది. ఇక ఎకైక టీ20లో కూడా విజయం భారత్‌నే వరించింది. అయితే ఈ సిరీస్ అనంతరం లంక మంచి ప్రదర్శనతో పాక్‌పై టెస్ట్ సిరీస్ నెగ్గింది. దీంతో భారత్‌లో జరిగే మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు రసవత్తరంగా సాగనున్నాయి. ♦ టెస్టు షెడ్యూల్ తొలి టెస్టు: నవంబర్ 16 నుంచి 20 వరకు; వేదిక: ఈడేన్ గార్డెన్స్, కోల్‌కతా రెండో టెస్టు: నవంబర్ 24 నుంచి 28 వరకు; వేదిక: వీసీఏ స్టేడియం, జమ్తా, నాగ్‌పూర్ మూడో టెస్టు: డిసెంబర్ 2 నుంచి 6 వరకు ; వేదిక: ఫిరోజ్ షా కోట్లా, న్యూఢిల్లీ ♦ వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే: డిసెంబర్ 10; వేదిక: హెచ్పీసీఏ స్టేడియం, ధర్మశాల రెండో వన్డే: డిసెంబర్ 13; వేదిక పీసీఏ స్టేడియం, మోహాలీ, చంఢీఘర్ మూడో వన్డే: డెసెంబర్ 17; వేదిక ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్టణం ♦ టీ20 సిరీస్ షెడ్యూల్: తొలి టీ20: డిసెంబర్ 20; బారాబతి స్టేడియం, కటక్ రెండో టీ20: డిసెంబర్ 22; హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్ మూడో టీ20: డిసెంబర్ 24: వాంఖడే స్టేడియం, ముంబై ♦ జట్లు: భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, విజయ్, శిఖర్ ధావన్, చతేశ్వర పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్రజడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్‌షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్‌శర్మ శీల్రంక: దినేశ్ చండిమల్( కెప్టెన్), డిక్వెల్లా, లాహిరు గామెజ్, కరుణరత్నే, మాథ్యూస్, సదీరా సమరవిక్రమా, దసన్ శనకా, లాహీరు తిరుమణ్నే, ధనంజయ డిసిల్వా, విశ్వ ఫెర్నాండో, రంగనా హెరాత్, సురంగ లక్మల్, దిర్లువన్ పెరేరా, లక్షణ్ సందకన్, రోషన్ సిల్వా -
లంక సిరీస్‌కు ధోని వద్దు.!
సాక్షి, న్యూఢిల్లీ: టీ20ల నుంచి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తప్పుకోవాలని సూచించిన మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ల సరసన మరో మాజీ క్రికెటర్ చేరాడు. త్వరలో దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటనను దృష్టిలో ఉంచుకోని శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు ధోనిని ఎంపికచేయవద్దని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. టీ20ల్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే జట్టు కార్యచరణను శ్రీలంకతో జరిగే సిరీస్‌లోనే రూపోందించాలని ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు తెలిపాడు. శ్రీలంక సిరీస్‌కు ఎంపికచేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జట్టును ఎంపికచేయాలన్నాడు. శ్రీలంకతో జరిగే టీ20లకు ధోని స్థానంలో యువ క్రికెటర్లను పరీక్షించాలని సెలక్టర్లకు సూచించాడు. గత కొద్ది రోజులుగా ధోని బ్యాటింగ్‌లో వేగం తగ్గిందని, వేగంగా ఆడే యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారని వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ధోని నెమ్మదిగా ఆడటంతో అతనిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే సునీల్ గవాస్కర్, కెప్టెన్ కోహ్లిలు ధోని వెనకేసుకు రాగా ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భారత్‌కు చేరిన లంక జట్టు టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20, మూడు టెస్టులు ఆడేందుకు లంక జట్టు బుధవారం భారత్‌కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 16న కొల్కతాలో ప్రారంభంకానుంది. -
శ్రీలంక పర్యటన ప్రత్యేకం: కోహ్లి
కొలంబో: శ్రీలంకను అన్ని ఫార్మాట్లలోనూ వైట్ వాష్ చేయడం చాలా ప్రత్యేకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన ఏకైక టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా పర్యటనను క్లీన్‌స్వీప్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని, ఈ ఘనత జట్టు మొత్తానికి చెందుతుందని విజయానంతరం కోహ్లి తెలిపారు. ఈ పర్యటనలో తమ రిజర్వ్ బెంచ్ సత్తా చాటిందన్నారు. కేఎల్ రాహుల్, అజింక్యా రహానేల స్థానాల మార్పు, ధావన్‌ను తప్పించి యువ క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్‌కు జట్టులో చోటుకల్పించడం వంటి ప్రయోగాలు ఫలించాయని పేర్కొన్నారు. ఆటగాళ్లందరూ తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని కొనియాడారు. తన ఆటతీరు సంతృప్తిని ఇచ్చిందన్న కోహ్లి అన్ని ఫార్మట్లకు దగ్గట్టు బ్యాటంగ్ శైలిని మార్చుకుంటున్నాని, అన్ని ఫార్మట్లు ఆడటమే నా అభిమతమని చెప్పుకొచ్చారు. ఈ సిరీస్‌లో కోహ్లి రెండు వరుస సెంచరీలతో అత్యధిక సెంచరీ పట్టికలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీపాంటింగ్ సరసన చేరారు. టీ20ల్లో కోహ్లి(82) అర్ధసెంచరీతో మరో ఘనతను సొంతం చేసుకున్నారు. చేజింగ్‌లో అత్యధిక పరుగుల చేసిన టీ20 క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశారు. ఇప్పటికే టెస్టుసిరీస్ 3-0, వన్డే 5-0తో కోహ్లిసేన క్లీన్‌స్వీప్ చేసింది. మెత్తం 9-0తో పర్యటననే వైట్ వాష్ చేసింది. -
లంకపై భారత్ క్లీన్‌స్వీప్
-
లంకపై భారత్ క్లీన్‌స్వీప్
♦ సెంచరీ సాధించిన కోహ్లి ♦ అర్ధ సెంచరీతో మెరిసిన జాదవ్ కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ, కేదార్‌జాదవ్ అర్ధసెంచరీతో రాణించడంతో చివరి మ్యాచ్‌లో సైతం భారత్ సునాయసంగా గెలుపొందింది. లంక నిర్ధేశించిన 239 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని రహానే(5) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రోహిత్ శర్మ(16) కూడా త్వరగా అవుటవ్వడంతో క్రీజులో ఉన్న కోహ్లి, పాండేతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించిననంతరం పాండే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో కోహ్లికి అండగా నిలిచాడు. ఈ దశలో 107 బంతుల్లో 8 ఫోర్లతో కెరీర్లో 30 వ సెంచరీ సాధించిన కోహ్లి వన్డేల్లోఅత్యధికంగా సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్ పాటింగ్(30) సరసన చేరాడు. ఇక రెండు పరుగుల విజయ దూరంలో ఉండగా జాదవ్ అవుటవ్వడంతో ధోని క్రీజులోకి వచ్చాడు. చెరో సింగిల్‌తో మ్యాచ్ భారత్ వశమైంది. ఇక లంక బౌలర్లలో మలింగ, పుష్పకుమార, డిసిల్వా, ఫెర్నాండోలు తలో వికెట్ తీశారు. భువీ విజృంభణ.. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకపై భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. పదునైన బంతులతో చెలరేగి పోయిన భువీ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. భువనేశ్వర్ దెబ్బకు లంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. భువీకి జతగా బూమ్రా రెండు వికెట్లతో మెరవడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ కు తలో వికెట్ దక్కింది. -
క్రికెట్ జూదంలా మారింది: మాజీ క్రికెటర్
కొలంబో: ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లంక క్రికెట్ బోర్డును జూదగాళ్లు నడిపిస్తున్నారని ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘ప్రస్తుతం శ్రీలంక జట్టు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటోంది. మా దేశ క్రికెట్ బోర్డు పరిపాలనా విభాగంలో లోపాలున్నాయి. క్రికెట్‌ని జూదగాళ్లు నడిపిస్తున్నారు. దీంతో క్రికెట్ జూదగాళ్ల ఆటలా మారింది. వరుస పరాజాయాలకు ఆటగాళ్లు కారణం కాదు. దయచేసి వారిని నిందించవద్దు’ అని రణతుంగ అభిమానులను కోరారు. ప్రస్తుతం బోర్డులో ఉన్న సభ్యుల్లో ఏ ఒక్కరికీ క్రికెట్ ఆడిన అనుభవం లేదని, ఇది చాల విచారించతగిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డును నడిపించడానికి వారు అర్హులు కాదని, దీనివల్లనే తప్పులు జరుగుతున్నాయని రణతుంగ లంక బోర్డుపై మండిపడ్డారు. రెండు రోజుల క్రితం భారత్ అభిమానులను ఉద్దేశించి రణతుంగా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో 2011 వరల్డ్‌కప్ ఫైనల్ ఫిక్సయిందని ఈ మ్యాచ్‌పై పూర్తి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. -
కోహ్లితో సరదాగా రోహిత్..
కొలంబో: శ్రీలంకపై నాలుగో వన్డే విజయానంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు సరదాగా ముచ్చటించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఈ కెప్టెన్, వైస్ కెప్టెన్లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ 168 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మైక్ పట్టుకొని కామెంటేటర్ అవతారమెత్తారు. మ్యాచ్ విశేషాలను కోహ్లితో ముచ్చిటించారు. ఈ వీడియోని ‘ఒక ఫ్రేమ్‌లో ఇద్దరు రాక్‌స్టార్స్’ అనే క్యాప్షన్‌తో బీసీసీఐ ట్వీట్ చేసింది. రోహిత్ మ్యాచ్ గెలిచినందుకు కోహ్లిని అభినందిస్తూ.. నీవు నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు అద్భుతంగా రాణిస్తుందని కితాబిచ్చారు. దీనికి కోహ్లి బదులుగా ‘ధన్యవాదాలు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నందకు అద్బుతంగా ఉంది. నిజానికి భారత జట్టు మంచి ప్రదర్శన కనబర్చడానికి ఆకలితో ఉంది. అదే ఈ విజయాన్ని సులువు చేసింది.’ అని కోహ్లి అభిప్రాయపడ్డారు. కేవలం నేను ఫీల్డింగ్ మాత్రమే సెట్ చేశాను. మిగతా పని అంతా వారే చేశారని ఆటగాళ్లను కొనియాడారు. కొలంబో పిచ్ చాల తేమగా ఉండటంతో 16 ఓవర్ వరకు వేగంగా పరుగులు చేయలేకపోయామన్నారు. స్కోరు బోర్డును చూడకుండా బ్యాటింగ్‌ను అస్వాదించామని చెప్పుకొచ్చారు. సపోర్ట్ స్టాఫ్ మద్దతు గురించి రోహిత్ ప్రశ్నించగా.. వారి మద్దతు ఎనలేనిదని, 2014లో ఆస్ట్రేలియాలో వారి మద్దతుతోనే తొలిసారి కెప్టెన్ అయ్యానని, అప్పడు ర్యాంకింగ్‌లో భారత్ 7 స్థానంలో ఉందని, ఇప్పుడు అదే సపోర్ట్ స్టాఫ్‌తో నెం.1 సాధించామని హెడ్ కోచ్ రవిశాస్త్రిని ఉద్దేశించి కోహ్లి పేర్కొన్నారు. వారు జట్టు ఆటగాళ్లకు ప్రత్యేకమని, వారితో పనిచేయడం సంతోషంగా ఉందని, మేమంతా ఒక కుటుంబ సభ్యులమని తెలిపారు. VIDEO: Two rockstars, one frame - Rendezvous with @imVkohli & @ImRo45 - by @RajalArora https://t.co/PyXAZWNXCL #SLvIND pic.twitter.com/5VLbNEExG7 — BCCI (@BCCI) 1 September 2017 -
శ్రీలంకపై భారత్ ఘన విజయం
-
సెంచరీకి రహానే భార్య ఫిదా..
కొలంబో: టెస్టుల్లో నిలకడలేమి ఆటతో సతమతమైన భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఎట్టకేలకు గాడిన పడ్డాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాది తన సత్తా చాటాడు. టెస్టుల్లో17 ఇన్నింగ్స్‌ల అనంతరం కెరీర్లో తొమ్మిదో సెంచరీ నమోదు చేశాడు. ఈ వైస్ కెప్టెన్సీ అడదడఫా అర్ధ శతకాలు సాధించినా సెంచరీ మాత్రం చేయలేదు. ఇక ఈ శతకంతో అతని భార్య రాధిక అనందానికి అవధులు లేవు. సెంచరీ అనంతరం ఆమె కెరీంతలు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోను బీసీసీఐ అధికారిక ట్వీటర్లో ‘ఇక ఆమె అజింక్యా టెస్టు కెరీర్లో అద్భుత సెంచరీ సాధించడాని చెప్పుకుంటుందని’ క్యాప్షన్‌గా ట్వీట్ చేసింది. రహానే తన చివరి 17 ఇన్నింగ్స్‌లో కేవలం మూడు సార్లు మాత్రమే అర్ధ సెంచరీకిపైగా పరుగులు చేసాడు. Finally! She said, after @ajinkyarahane88 gets to a well-made 9th Test century #TeamIndia #SLvIND pic.twitter.com/l1HlAM95x2 — BCCI (@BCCI) 3 August 2017 -
40 టెస్టుల తర్వాత తొలి వికెట్..
కొలంబో: భారత-శ్రీలంక మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 344/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 92వ ఓవర్లో కరుణరత్నే వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న పుజారా(133) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఇప్పటి వరకు 40 టెస్టులాడిన ఈ లంక ఆటగాడికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం. బ్యాట్స్‌మన్ అయిన కరుణరత్నే అప్పుడప్పుడు పార్ట్‌టైమ్ బౌలర్ అవతారమెత్తుతాడు. ఇంత వరకు కనీసం 10 ఓవర్లు కూడా వేయని కరుణరత్నే బౌలింగ్‌లో పుజారా అవుటవ్వడం మరో విశేషం. -
టాస్ నెగ్గిన కోహ్లి సేన..
కొలంబో: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో కోహ్లి సేన టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. జ్వరంతో గాలె టెస్టుకు దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగిరాగా.. అభినవ్ ముకుంద్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. శ్రీలంక జట్టులో మూడు మార్పులు జరిగాయి. దనుష్క, కుమార, అసెలాలు గాయాలతో దూరమవ్వగా వారి స్థానంలో శ్రీలంక కెప్టెన్ చండిమల్,మలింద పుష్పకుమార, ధనుంజయా డెసిల్వాలు జట్టులోకి వచ్చారు. తొలి టెస్టు విజయంతో భారత్ ఉత్సాహంగా ఉండగా.. సొంత గడ్డపై ఓటమి చెందడంతో శ్రీలంకపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను కాపాడుకోవాలని శ్రీలంక భావిస్తోంది. తుది జట్లు: భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, జడేజా, పాండ్యా, ఉమేశ్, షమీ. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్వెలా, డెసిల్వా పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్. -
వీడియో గేమ్‌తో విరాట్ సేన సంబరాలు..
గాలే: శ్రీలంక పర్యటనలో బోణి కొట్టిన విరాట్ సేన వినూత్నంగా విజయ సంబరాలు చేసుకుంటోంది. భారత్- శ్రీలంక టెస్టు సిరీస్‌లో భాగంగా గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్, పుజరా అజయ సెంచరీలు.. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత్ అలవోకగా విజయం సాధించింది. రెండు సంవత్సరాల క్రితం ఇదే మైదానంలో ఓడిన భారత్ కు ప్రతీకారం తీరడంతో ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫుట్‌బాల్ ఫిఫా వీడియో గేమ్‌లు ఆడుతూ పండుగ చేసుకున్నారు. దీన్ని రోహిత్ శర్మ సెల్ఫీతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘విజయాన్ని ఫిఫా వీడియో గేమ్‌తో ఆస్వాదిస్తున్నాము’ అని ట్వీట్ చేశాడు. రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆడకపోయినప్పటికీ బాయ్స్ గొప్ప ప్రారంభం ఇచ్చారు అంటూ ప్రశంసించాడు. రాహుల్ తీసిన సెల్ఫీలో భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, పుజార, వృద్ధిమాన్ సాహా,రాహుల్‌లు ఉన్నారు . రోహిత్ శ్రీలంక బోర్డర్ ప్రెసిడెంట్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడినప్పటికీ తుది జట్టులో స్థానం దక్కలేదు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చి రాణించాడు. ఇక భారత జట్టుపై మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్‌లు ప్రశంసల జల్లు కురిపించారు. రెండో టెస్టు ఆగస్టు 3 నుంచి కొలంబోలో ప్రారంభంకానుంది. Victory tastes as good when we play FIFA 😉#PostMatchFifaSession #Mates pic.twitter.com/092iBHFV1x — Rohit Sharma (@ImRo45) July 29, 2017 -
కుప్పకూలిన శ్రీలంక.. భారత్‌కు భారీ ఆధిక్యం
శ్రీలంక 291 ఆలౌట్ గాలె: భారత్-శ్రీలంక తొలి టెస్టులో మూడో రోజు ఆటలో లంక 291 పరుగులకే కుప్పకూలింది. లంచ్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసిన లంక బ్యాట్స్‌మెన్ మరో రెండు పరుగులు జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో కుమారా(2) క్లీన్ బౌల్డ్ కావడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డ అసేల గుణరత్నే మ్యాచ్‌కు దూరం కావడంతో లంక 10 మందితోనే బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. ఇక ఒంటరి పోరాటం చేసిన పెరీరా (92 నాటౌట్) శతకం చేజారింది. ఓవర్‌నైట్ స్కోరు 154/5తో లంక బ్యాట్స్‌మెన్ మాథ్యూస్(54 బ్యాటింగ్), దిల్రువన్ పెరీరా(6 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ఆరంభించారు. ఆచితూచి ఆడిన వీరిద్దరు జట్టు స్కోరు రెండు వందలు దాటించారు. అనంతరం జడేజా బౌలింగ్‌లో సెంచరీ దిశగా దూసుకెళ్లున్న మాథ్యూస్ (89) స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. జడ్డూ వేసిన 59 ఓవర్లో మాథ్యూస్ విరాట్ కోహ్లీకి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ 6 వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన లంక కెప్టెన్ హెరాత్ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకో లేకపోయాడు జడేజా వేసిన 66 ఓవర్లో రహానే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ప్రదీప్ కూడా పాండ్యా బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో శ్రీలంక 280 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. మరో 11 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ 309 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత బౌలర్లలో జడేజా(3), షమీ(2), పాండ్యా, ఉమేశ్, అశ్విన్ తలో వికెట్ దక్కిచ్చుకున్నారు. -
గంగూలీ.. నీ షర్ట్ తీయకు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో గురువారం భారత్-శ్రీలంక మ్యాచ్‌లో కామెంటేటర్స్ మధ్య ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్స్‌గా వ్యవహరించిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్లు పాత విషయాలను గుర్తుచేస్తూ నవ్వులు పూయించారు. మ్యాచ్ మధ్యలో కెమెరాలు బిగ్ స్క్రీన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ను చూపించడంతో మైక్ అథేర్టెన్ గంగూలినీ ఉద్దేశించి ‘ఫ్లింటాఫ్ గ్రౌండ్లో ఉన్నాడు. నీవు షర్ట్‌ను తీసి తిప్పకు అని సరదాగా వ్యాఖ్యానించాడు’. దీనికి గంగూలీ ‘నీవు ఎక్కువగా ఆలోచించకు’ అని సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా గ్రౌండ్ అంతా నవ్వులు పూసాయి. లార్డ్స్ మైదానంలో జరిగిన 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలుపొందడంతో అప్పుడు కెప్టెన్‌గా ఉన్న గంగూలీ బాల్కనీలో చొక్కా విప్పి విజయాన్ని అస్వాదించాడు. ఈ సన్నివేశం భారత క్రికెట్ చరిత్రలో మధుర ఘట్టంగా నిలిచింది. ఇది ఆండ్రూ ఫ్లింటాప్పై రివేంజ్‌గా దాదా అలా చేశాడని అప్పట్లో అందరూ అభిప్రాయపడ్డారు. అంతకు ముందు భారత్‌తో ఒక వన్డే మ్యాచ్‌లో ఫ్లింటాఫ్ చివరి ఓవర్ బౌలింగ్ చేసి భారత్‌కు కావల్సిని పరుగులను కట్టడిచేసి ఇంగ్లండ్‌కు విజయాన్నందించాడు. దీంతో మైదానంలోనే ఫ్లింటాఫ్ చొక్కా విప్పి తిరిగాడు. ఇది అప్పట్లో వివాదం అయింది. ఈ సన్నివేశాలను దృష్టిలో ఉంచుకొని మైక్ అథర్టన్ పై వ్యాఖ్యాలు చేశాడు. -
గెలుస్తామనుకోలేదు: మాథ్యూస్
లండన్: భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర చేసిన సూచనలే గెలుపుకు కారణమయ్యాయని ఆ జట్టు కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు. గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మాథ్యూస్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగామని, ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఒత్తిడిలో ఉన్న మేము భారత్‌తో మ్యాచ్ గెలుస్తామనుకోలేదన్నాడు. కానీ సాయశక్తుల పోరాడాలని, స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు మాథ్యూస్ తెలిపాడు. గత కొద్దీ కాలముగా విజయాలు లేని మాకు ఈ విజయం ఊరటనిచ్చిందన్నాడు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు సంగక్కర యువ ఆటగాళ్లకు బ్యాటింగ్‌లో మెళుకవలు సూచించాడని, వాటిని యువ ఆటగాళ్లు అమలుపరిచారని అదే గెలుపుకు కారణమైందని మాథ్యూస్ తెలిపాడు. కుసాల్ మెండీస్(89) రాణించడానికి సంగక్కర బ్యాటింగ్ సూచనలే కారణమన్నాడు. మెండీస్, గుణతిలకాల 159 పరుగుల భాగస్వామ్యం కీలకమని ఈ యువ ఆటగాళ్లను కొనియాడాడు. స్వేచ్ఛగా దూకుడుగా ఆడామని అదే గెలిపించిందని అభిప్రాయపడ్డాడు. తొడ నరాలు పట్టుకొని బాధపడుతున్న కుసాల్ పెరారా(47)ను కెప్టెన్‌గా రిటైర్డ్ హాట్‌గా పంపిచానని, ఆసమయంలో ఫలితం గురించి ఆలోచించలేదన్నాడు. ఫలితం వేరేలా ఉంటే నాపై విమర్శలు వస్తాయని తెలుసని, కానీ కఠిన పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపుతో సెమీస్ రేసులో ఉన్నామని, తర్వాతి మ్యాచ్‌కు కూడా ఇదే ప్రణాళిక అమలు చేస్తామన్నాడు. గెలుపుపై ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతామని మాథ్యూస్ పేర్కొన్నాడు. -
భారత్-శ్రీలంక మధ్య ‘అణు’బంధం
న్యూఢిల్లీ: భారత్-శ్రీలంక మధ్య ‘అణు’బంధం చిగురించింది. రెండు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మధ్య సోమవారమిక్కడ జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య సంబంధా లు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య జాలర్ల అంశాన్ని సామరస్యంగా, మానవతా దృక్పథంతో పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డాయి. చర్చల అనంతరం మోదీ, సిరిసేన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పౌర అణు ఒప్పందం రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి మరో ప్రతీక. శ్రీలంక ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం మొదటిసారి. దీనివల్ల అనేక రంగాల్లో రెండుదేశాల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. శ్రీలంక-భారత్ మ ధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అనేక అంశాలు ఉమ్మడి నిర్ణయాలతో ముడివడి ఉన్నాయి. దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత సిరిసేన తొలిసారి భారత్‌కు వచ్చినందుకు సం తోషం. జాలర్ల విషయంలో అర్థవంతమైన చర్చలు జరిగాయి. 2 దేశాల మధ్య మత్స్యకార సంఘాలను ప్రోత్సహిస్తాం.’అని మోదీ చెప్పారు. -
తెలుగు తేజం సెంచరీ
అహ్మదాబాద్: సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో తెలుగు తేజం అంబటి రాయుడు చెలరేగాడు. తొలిసారిగా సెంచరీ కొట్టాడు. 118 బంతులకు పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వివిఎస్ లక్ష్మణ్ తరువాత తెలుగు క్రీడాకారుడు సెంచరీ చేయడం ఇదే. పదేళ్ల క్రితం వివిఎస్ లక్ష్మణ్ పాకిస్తాన్‌పై సెంచరీ చేశాడు. **