కోల్‌కతా: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ప్రపంచరికార్డు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై కోచ్ రవిశాస్త్రి , మాజీ కెప్టెన్ గంగూలీలు ప్రశంసలు జల్లు కురిపించారు. తొలి టెస్ట్‌మ్యాచ్‌లో కోహ్లి(104) సెంచరీ బాది అన్నిఫార్మట్లలో కలిపి 50 శతకాల రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.
‘కోహ్లికి ఇక ఆకాశమే హద్దు, అతనో అద్భుతమైన ఆటగాడు. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేయడానికి సగం దూరం వచ్చాడు. కోహ్లి ఈ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉంది.’ అని లంకతో తొలి టెస్టు డ్రా అనంతరం ఓ ప్రమోషన్ ఈవేంట్‌లో రవిశాస్త్రి కోహ్లిని కొనియాడాడు. ‘ఇది ఒక మైమరిపించే ఇన్నింగ్స్. కోహ్లి ఒక మంచి నాయకుడు. అదే అతన్ని చాలా దూరం తీసుకెళ్తుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఇక సచిన్(100) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్ కోహ్లినే. ఇక ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన లిస్టులో సచిన్(100) తొలిస్థానంలో ఉండగా.. రికీపాంటింగ్(71) సంగక్కర(63), జాక్వస్ కల్లీస్(62), జయవర్ధనే(54), హషీమ్ ఆమ్లా(54) బ్రియాన్ లారా(53) తర్వాత కోహ్లి(50) 8వ స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment