
నాగ్‌పూర్: శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 500 పరుగుల మార్క్‌ను దాటగా రోహిత్ అర్ధ సెంచరీ సాధించాడు. లంచ్ విరామం అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే రహానే(2) వికెట్‌ను భారత్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మతో కోహ్లి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఈ దశలో 193 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సుతో కోహ్లి 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిక్సుతో కోహ్లి 150 పరుగులు చేయడం విశేషమైతే.. ఇది అతనికి ఏడో 150 కావడం మరో విశేషం. అనంతరం రెచ్చిపోయిన ఈ జంట స్కోరు బోర్డు వేగాన్ని పెంచింది. 98 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 5 ఫోర్లు 1 సిక్సుతో కెరీర్‌లో 8వ హాఫ్ సెంచరీ సాధించాడు. టీ విరామ సమయానికి భారత్ స్కోరు 507/4. క్రీజులో కోహ్లి 170(223 బంతులు, 14 ఫోర్లు,1 సిక్సు), రోహిత్ 51(108 బంతులు, 5 ఫోర్లు 1 సిక్సు) లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment