![Rohit Sharma Wife Ritika Sajdeh Epic Reaction Over His Knock Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/11/555_0_0.jpg.webp?itok=JXQOU2rj)
Rohit Sharma- Rithika Sajdeh: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే తన భర్త అద్భుత ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘లవ్ యూ రోహిత్’’ అంటూ ప్రేమను కురిపించారు. కాగా రితికా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే.
తన వృత్తిగత, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అప్‌డేట్లు పంచుకోవడంతో పాటు ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో రోహిత్ శర్మ బ్యాట్ ఝులిపించిన విషయం తెలిసిందే.
కెప్టెన్ రికార్డు
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 212 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది తొలి శతకం. అదే విధంగా ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టా స్టోరీలో రోహిత్ శర్మ ఫొటో పంచుకున్న రితికా.. ఫింగర్స్ క్రాస్డ్ ఎమోజీని జత చేశారు. వీటికి రీప్లేస్‌మెంట్ పంపించు అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
కాగా రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న ప్రతిసారి రితికా ఫింగర్స్ క్రాస్ చేసి.. తమకు అనుకూల ఫలితం రావాలంటూ ప్రార్థించిన దృశ్యాలు గతంలో వైరల్ అయ్యాయి. ఇక తన మేనేజర్‌గా పనిచేసిన రితికాతో ప్రేమలో పడ్డ రోహిత్ 2015లో ఆమెను పెళ్లాడాడు. వారికి కూతురు సమైరా శర్మ సంతానం.
చదవండి: Axar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్ అదిరిపోయే పంచ్
T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్!
Comments
Please login to add a commentAdd a comment