Ritika Sajdeh
-
హ్యాపీ 9 బేబీ.. అన్నింటిలోనూ నువ్వు బెస్ట్: రోహిత్ శర్మపై భార్య రితిక పోస్ట్(ఫొటోలు)
-
రోహిత్ శర్మ కొడుకు పేరు వెల్లడి.. అర్దం ఏంటంటే..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటి నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. రోహిత్ భార్య రితికా సజ్దే సోషల్‌మీడియా వేదికగా తమ కుమారుడి పేరును వెల్లడించింది. జూనియర్ రోహిత్‌కు 'అహాన్' అని పేరును పెట్టారు. రితికా తన ఇన్‌స్టా పోస్ట్‌లో శాంటా గెటప్‌లో ఉన్న ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లోని బొమ్మలపై రిట్స్ (రితికా), రో (రోహిత్ శర్మ), స్యామీ (సమైరా), ఆహాన్ అనే పేర్లు రాసి ఉన్నాయి. రోహిత్ దంపతులకు తొలి సంతానం సమైరా. కాగా, రోహిత్ భార్య రితికా నవంబర్ 15వ తేదీన అహాన్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అహాన్ అంటే ఆరంభం అని అర్దం.ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అహాన్ జన్మించడం కారణంగా రోహిత్ తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. రోహిత్ ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగలేదు. యశస్వి జైస్వాల్‌కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. దీని బట్టి చూస్తే రెండో టెస్ట్‌లో రోహిత్ మిడిలార్డర్లో వచ్చే అవకాశం ఉంది. యశస్వి-కేఎల్ రాహుల్ తొలి టెస్ట్‌లో మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వారి లయను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో రోహిత్ మిడిలార్డర్లో వచ్చే అవకాశం ఉంది.వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. సామ్ కోన్స్టాస్ (107) సెంచరీతో కదంతొక్కాడు. హన్నో జాకబ్స్ (61) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 40, కేఎల్ రాహుల్ 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. -
రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య రితికా సజ్దే శుక్రవారం(నవంబర్ 15) పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రోహిత్- రితికా జోడీ ఇంకా అధికారికంగా అభిమానులతో పంచుకోలేదు. కానీ రోహిత్ శర్మ అనుచరులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీరిద్దిరికి ఇప్పటికే సమైరా అనే కుమార్తె ఉంది.ప్రేమించి పెళ్లాడి..రోహిత్ శర్మ తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015 డిసెంబరు 13న వీరిద్దరూ వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత 2018లో ఈ జోడీకి తొలి సంతానంగా సమైరా జన్మించింది. ఇప్పుడు రెండో సంతానంగా వారసుడు వారి ఇంట్లో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్, రితికా జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.టీమిండియాకు గుడ్ న్యూస్..కాగా రోహిత్ శర్మ తన భార్య డెలివరీ కారణంగా ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. జట్టు మొత్తం ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టగా హిట్‌మ్యాన్ మాత్రం భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే తన భార్య ప్రసవం ముందుగానే జరగడంతో రోహిత్ తొలి టెస్టుకు ముందే జట్టుతో కలిసే అవకాశముంది. పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.చదవండి: తిలక్, సామ్సన్ వీర విధ్వంసం -
Indv s Aus: రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్!.. కెప్టెన్‌గా అతడే ఉండాలి!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కానున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అందుకు గల కారణమేమిటన్నది ఇంత వరకు స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. పితృత్వ సెలవుల కారణంగానే హిట్‌మ్యాన్ ఆసీస్‌తో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం.రెండోసారి తండ్రి కాబోతున్న రోహిత్!అవును.. రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడట. అతడి భార్య రితికా సజ్దే త్వరలోనే తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ జియో సినిమాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. పెటర్నిటీ లీవ్‌లో ఉన్నందు వల్లే రోహిత్ కాస్త ఆలస్యంగా ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు వెల్లడించాడు.స్వదేశంలో చెత్త రికార్డుఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం రోహిత్ త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నాడనే సంకేతాలు ఇచ్చాడు. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇటీవల సారథిగా చెత్త రికార్డును రికార్డును మూటగట్టుకున్నాడు. స్వదేశంలో తొలిసారి మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు కెప్టెన్‌గా నిలిచాడు.న్యూజిలాండ్‌తో ఇటీవల బెంగళూరు, పుణె, ముంబై టెస్టుల్లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఓడిపోయింది. ఇక తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు భారత్ చేరుకుంటుంది.ఇంతటి కీలకమైన సిరీస్‌లో రోహిత్ శర్మ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడన్న వార్తల నడుమ.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతినివ్వాలనుకుంటే ఆసీస్‌తో టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా నియమించాలని సూచించాడు.ఒకవేళ భార్య ప్రసవం కోసమే అయితే..ఈ నేపథ్యంలో ఆరోన్ ఫించ్ స్పందిస్తూ.. గావస్కర్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు తెలిపాడు. ‘‘భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్. ఒకవేళ భార్య ప్రసవం కోసం.. అతడు ఇంటిదగ్గరే ఉండాలనుకుంటే.. అంతకంటే అందమైన క్షణాలు ఉండవు.కాబట్టి అతడు సెలవు తీసుకున్నా మరేం పర్లేదు. అతడికి ఆ హక్కు ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకటీ రెండు మ్యాచ్‌లకు దూరమైనంత మాత్రాన సిరీస్ మొత్తానికి కేవలం ఆటగాడిగానే పరిగణించాలనడం సరికాదని గావస్కర్ వ్యాఖ్యలను ఫించ్ ఖండించాడు.సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు!ఇక కివీస్‌తో ముంబై టెస్టు తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘నేను ఆస్ట్రేలియాకు ఇప్పుడే వెళ్తానో లేనో చెప్పలేను’’ అని పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సమైరాకు చెల్లి లేదంటే తమ్ముడు రావడం కన్ఫామ్ అంటూ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. కాగా 2015లో స్పోర్ట్స్ మేనేజర్ రితికా సజ్దేను రోహిత్ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు తొలి సంతానంగా 2018లో కుమార్తె సమైరా జన్మించింది.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
Ind vs SL: భారత్ చేరుకున్న రోహిత్ శర్మ.. వీడియో
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో అమెరికాను వీడి భారత్‌లో అడుగుపెట్టాడు. భార్య రితిక సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఇక కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవాలన్న తన చిరకాల కోరిక తీరిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఈ క్రమంలో జట్టుతో కలిసి ట్రోఫీతో భారత్‌కు తిరిగి వచ్చిన రోహిత్ శర్మ విజయోత్సవాల్లో పాల్గొన్నాడు. ముంబైలో సెలబ్రేషన్స్ ముగిసిన అనంతరం సెలవు తీసుకున్న హిట్‌మ్యాన్.. కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయాడు. అయితే, శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.అయితే, కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చొరవతో రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు శ్రీలంక, ఇంగ్లండ్‌లతో మాత్రమే వన్డే సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో బరిలోకి దిగేందుకు రోహిత్ మొగ్గుచూపినట్లు తెలిసింది.అందుకు అనుగుణంగానే శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడని ప్రకటించింది. ఇక జూలై 27 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుండగా.. ఇప్పటికే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా వన్డే జట్టులోని పలువురు ఆటగాళ్లు లంకకు చేరుకున్నారు. గంభీర్ మార్గదర్శనంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.అయితే, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి మాత్రం ఇంకా శ్రీలంకలో అడుగుపెట్టలేదు. తాజాగా రోహిత్ తిరిగి రాగా.. కోహ్లి సైతం లండన్ నుంచి త్వరలోనే భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి శ్రీలంకకు వెళ్లి అక్కడి భారత జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.Cutiessss Back 💕🥹🤌✨..!!#RohitSharma𓃵 #RitikaSajdeh pic.twitter.com/IHLJWh6daN— Neha_love._.45💌 (@NehaDubey187150) July 25, 2024 -
రో.. నీలాంటి వ్యక్తి నా సొంతమైనందకు చాలా గర్విస్తున్నా: రితికా
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ శకం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 విజయనంతరం పొట్టి క్రికెట్‌కు రోహిత్ శర్మ విడ్కోలు పలికాడు. ఎన్నో ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను అందించి రోహిత్ తన టీ20 కెరీర్‌ను ముగించాడు.140 కోట్ల భారతీయల కలను సారథిగా రోహిత్ సాకారం చేశాడు. ఈ క్రమంలో రోహిత్‌ను ఉద్దేశించి తన భార్య రితికా సజ్దేహ్ భావోద్వేగ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రపంచకప్ గెలవాలన్న కల నెరవేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రితికా తెలిపింది."రో.. ఈ విజయం నీకు ఎంత విలువైందో నాకు తెలుసు. ఈ క్షణం కోసం నీవు ఎంతగానో ఎదురుచూశావు. ఈ ఫార్మాట్, ఈ కప్, ఈ ఆటగాళ్లు, ఈ ప్రయాణం.. మొత్తం ఈ పక్రియ అంతా నీవు కన్న కల. నీవు గత కొన్ని నెలలగా ఎటువంటి క్లిష్టపరిస్థితులు ఎదుర్కొన్నావో నాకు తెలుసు.అది నీ మనసు, శరీరంపై ఎంత ప్రభావం చూపిందో నాకు తెలుసు. ఎట్టకేలకు నీ కల నేరివేరింనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ఈ ప్రయాణం ఎంతో స్పూర్తిదాయకం. ఓ భార్యగా ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కానీ నీ ఆటను ఇష్టపడే వ్యక్తిగా నువ్వు ఇప్పడు టీ20లకు విడ్కోలు పలకడం చాలా బాధగా ఉంది. ఇది నీకు కఠిన నిర్ణయమైనా.. జట్టుకు ఏది ఉత్తమైనదో దాని గురించే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు. కానీ నేను మాత్రం నీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఏదేమైనప్పటకి నీలాంటి గొప్ప వ్యక్తి నా సొంతమైనందకు ఒక భార్యగా నేను చాలా గర్విస్తున్నా. ఐ లవ్ వ్యూ సో మచ్’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా రాసుకొచ్చింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 అనంతరం రోహిత్‌తో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా సైతం పొట్టి క్రికెట్‌కు ముగింపు పలికాడు. View this post on Instagram A post shared by Ritika Sajdeh (@ritssajdeh) -
పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై ట్రోల్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను షేర్ చేయడమే ఇందుకు కారణం.వివరాల్లోకి వెళితే.. హమాస్ (పాలస్తీనాలో అధికారిక పార్టీ) నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు జరుపుతుంది. ఈ దాడుల్లో 37 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఈ దాడుల అనంతరం రఫా నగరం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. విశ్వవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు రఫా నగరాన్ని హైలైట్ చేస్తూ పాలస్తీనాపై సానుభూతి చూపిస్తున్నారు.Meet Ritika Sajdeh, wife of Rohit Sharma.“Did she ever talk about Kashmiri Pandits?”-No“Did she ever talk about the vιolence happening by a specific community in India?”-No“Did she ever raise her voice for Hindus being persecuted in Pakistan and Bangladesh?”-No“Did she… pic.twitter.com/SFNrMHOtAM— Mikku 🐼 (@effucktivehumor) May 28, 2024టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక కూడా పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే ట్రెండింగ్‌లో ఉన్న ఓ పోస్ట్‌ను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.BIG NEWS 🚨 Rohit Sharma’s wife Ritika Sajdeh removes ‘All Eyes On Rafah’ Instagram story after facing backlash from Hindus 🔥🔥She had posted "All Eyes on Rafah" on social media in support of Palestine.Many Hindus started questioning her about her silence on the issue of… pic.twitter.com/ayfbgjtYV6— Times Algebra (@TimesAlgebraIND) May 29, 2024రితిక ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. భారత్‌లో ఎన్ని అరాచకాలు జరిగినా స్పందించని రితిక పరాయి దేశంలోని సమస్యపై స్పందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీ పండిట్లపై దాడులు, మణిపూర్‌లో హింస, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఈమె ప్రశ్నించలేదే అని నిలదీస్తున్నారు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో, భారత్‌కు ఏమాత్రం సంబంధం లేని అంశంపై రితక స్పందించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇంటి సమస్యలు (భారత్‌లో జరిగేవి) పట్టవు కాని పరాయి దేశ సమస్యలపై గళం విప్పడం ఫ్యాషన్ అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. రఫా పోస్ట్‌పై నెట్టింట తీవ్ర వ్యతిరేత ఎదురవడంతో రితిక ఈ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేసి సైలెంట్ అయిపోయింది.ఇదిలా ఉంటే, రితిక కంటే ముందు చాలామంది భారతీయ సెలబ్రిటీలు పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ లిస్ట్‌లో కరీనా కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, త్రిప్తి దిమ్రీ, సమంత రూత్ ప్రభు, ఫాతిమా సనా షేక్, స్వరా భాస్కర్, దియా మీర్జా లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. -
స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(13)- రోహిత్ శర్మ(11) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్(11) కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు తిలక్ వర్మ(4), నేహాల్ వధేరా(6), హార్దిక్ పాండ్యా(1) పెవిలియన్‌కు క్యూ కట్టారు.సూర్య ఒంటరి పోరాటం వృథాసూర్య ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న సూర్యకు తోడైన టిమ్ డేవిడ్(20 బంతుల్లో 24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టెయిలెండర్లు గెరాల్డ్ కోయెట్జీ(8), పీయూశ్ చావ్లా(0), జస్ప్రీత్ బుమ్రా(1 నాటౌట్) కూడా చేతులెత్తేయడంతో 145 పరుగులకే ముంబై కథ ముగిసిపోయింది.ఫలితంగా కేకేఆర్ విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన ముంబై వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి కోల్‌కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ పరాజయం ముంబై ఫ్యాన్స్ హృదయాలను ముక్కలు చేస్తే.. పందొమ్మిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి పాండ్యా సేన పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్‌ను చూసి కేకేఆర్ అభిమానులు మురిసిపోయారు.అద్భుత రీతిలో బౌల్డ్ చేసిముంబైతో మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన స్టార్క్ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. గంటకు 142.3 కిలో మీటర్ల వేగంతో స్టార్క్ విసిరిన బంతి లెగ్ స్టంప్‌ను ఎగురగొట్టింది.అయినప్పటికీ స్టార్క్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే.. ఇషాన్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్‌తో పాటు చీర్ గర్ల్స్.. ముఖ్యంగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్‌గా మారాయి. ఇక ఇషాన్‌తో పాటు టిమ్ డేవిడ్, కోయెట్జీ, పీయూశ్ చావ్లా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్క్. చదవండి: అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యాStumps dismantled, in vintage Starc style 🔥🫡 #TATAIPL #MIvKKR #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/RcERxhgJps— JioCinema (@JioCinema) May 3, 2024 -
Anant- Radhika: తిరుగు పయనం.. భయ్యాకు కోపం వస్తే అంతే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో చేరనున్నాడు. నాలుగు- ఐదో టెస్టు మధ్య లభించిన విరామానికి స్వస్తి పలికి.. ఆటపై దృష్టి సారించనున్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలతో 3-1తో సత్తా చాటింది. తదుపరి ధర్మశాల వేదికగా నామమాత్రపు ఐదో టెస్టుకు భారత జట్టు సిద్ధం కానుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 26న రాంచి మ్యాచ్ ముగియగా.. మార్చి 7న ధర్మశాల మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మధ్యలో దొరికిన విరామ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. బిలియనీర్ ముకేశ్ అంబానీ- నీతా తమ చిన్న కుమారుడి కోసం నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమంలో భార్య రితికాతో కలిసి పాల్గొన్నాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా అత్యంత వైభవోపేతంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారమే ముగిసిన నేపథ్యంలో రోహిత్ తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో జామ్‌నగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అభిమానులు, పాపరాజీలు హిట్‌మ్యాన్‌ను చుట్టుముట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) అయితే, అప్పటికే అలసిపోయినట్లు కనిపిస్తున్నా రోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయినా మరికొందరు క్యూ కట్టడంతో అక్కడున్నవాళ్లలో ఒకరు.. ‘‘ఇప్పుడు రోహిత్ భయ్యాకు కోపం వస్తుంది జాగ్రత్త’’ అంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) కాగా అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ అందించాడు. అయితే, ఐపీఎల్-2024కు ముందు అతడి స్థానంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. ఫలితంగా రోహిత్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. దీంతో ఇప్పటికీ ముంబై ఇండియన్స్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. చదవండి: Shreyas Iyer: ‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?! ‘రోహిత్ సహచర ఆటగాళ్లను అందుకే తిడతాడు’ -
ముంబై ఇండియన్స్ కోచ్‌పై రితిక ఫైర్.. రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
Rohit Sharma first reaction after wife Ritika Sajdeh's Mark Boucher response: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సతీమణి రితికా సజ్దేపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘నా ప్రేమ.. ఎల్లప్పుడూ నా వెంటే’’ అంటూ రితికాతో కలిసి నడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడన్న వార్తల నేపథ్యంలో.. రితికను ఉద్దేశించి అతడు చేసిన పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే విజేతగా నిలిపిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. తిరిగి ముంబై గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌ను తప్పించి.. పాండ్యాకు పెద్దపీట ఈ క్రమంలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఫ్రాంఛైజీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ముంబై యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్‌ను కాదని.. పాండ్యాను కెప్టెన్ చేయడం ఏమిటని అభిమానులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను ఉద్దేశించి ఇటీవల ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయి. పనిభారం తగ్గించి.. రోహిత్ ఆటను ఆస్వాదిస్తూ.. బ్యాటర్‌గా కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అతడు వెల్లడించాడు. కోచ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన రితిక ఈ విషయంపై స్పందించిన రితికా సజ్దే .. ‘‘ఇందులో చాలా వరకు తప్పులే ఉన్నాయి’’ అంటూ బౌచర్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్‌తో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపించాయి. తాజాగా భార్య రితికా తనకు ఎల్లవేళలా తోడుగా ఉంటుందంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించడంతో.. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ విషయంలో భార్యాభర్తలిద్దరిదీ ఒకే మాట అని హిట్‌మ్యాన్ నిరూపించాడని పేర్కొంటున్నారు. కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా- ఇంగ్లండ్ చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: 13 ఏళ్లలో ఇదే తొలిసారి.. మేమంతా నీతోనే! ఆర్సీబీ ట్వీట్ వైరల్ Head Coach of Mumbai Indians Mark Boucher about the Captaincy selection. Rohit Sharma's wife Ritika commented "𝗦𝗼 𝗺𝗮𝗻𝘆 𝘁𝗵𝗶𝗻𝗴𝘀 𝘄𝗿𝗼𝗻𝗴 𝘄𝗶𝘁𝗵 𝘁𝗵𝗶𝘀..."#RohitSharma #MumbaiIndians pic.twitter.com/RncyzxcuJI — Ajay Gautam (@gautam_ajay007) February 6, 2024 View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
ముంబై కోచ్ పై రోహిత్ భార్య ఆగ్రహం
-
కూతురితో కలిసి చిన్నపిల్లాడిలా రోహిత్ శర్మ ఆటలు.. వీడియో
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా శర్మ ఐదో పుట్టినరోజు నేడు(డిసెంబరు 30). ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ తన చిన్నారి కూతురు కోసం తానూ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. తన ముద్దుల కుమార్తెతో కలిసి టాయ్ ట్రైన్లో విహరిస్తూ సందడి చేశాడు. ఆమెతో కలిసి అల్లరి చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యుల సమక్షంలో సమైరా బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేశాడు. భార్య రితికా సజ్దేతో కలిసి సమైరాతో కేక్ కట్ చేయించాడు. ‘సమైరా పోనివిల్లే థీమ్’ పేరిట నిర్వహించిన ఈ పార్టీకి సంబంధించిన వీడియోను రితిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. రోహిత్ శర్మ సైతం.. ‘‘నీ ఎదుగులను చూస్తూ మురిసిపోవడమే మా జీవితానికి సార్ధకత’’ అంటూ ఉద్వేగపూరిత శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ నేపథ్యంలో సమైరాకు హిట్‌మ్యాన్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన రోహిత్ శర్మ డిసెంబరు 13, 2015లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు డిసెంబరు 30, 2018లో కుమార్తె జన్మించగా ఆమెకు సమైరాగా నామకరణం చేశారు. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత.. రోహిత్ శర్మ సారథ్యంలో.. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి టీమిండియా అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక బోల్తా పడ్డ రోహిత్ సేన.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన భారత ఆటగాళ్లు భారమైన హృదయాలతో మైదానాన్ని వీడారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా సత్తా చాటాలని భావించాడు. కానీ అతడి కల నెరవేరలేదు. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ బాక్సింగ్ డే టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన ప్రొటిస్.. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మొత్తంగా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఆటగాడిగానూ విఫలమయ్యాడు. ఇక సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి ఆరంభం కానుంది. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
రితిక బర్త్‌డే.. అందమైన ఫొటోలు షేర్ చేసిన రోహిత్! ఎంఐపై ట్రోల్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సతీమణి రితికా సజ్దేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘‘నీలాంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరు’’ అన్న అర్థంలో హ్యాపీ బర్త్‌డే రిట్స్ అంటూ ప్రేమను చాటుకున్నాడు. ఈ సందర్భంగా రితికతో కలిసి ఉన్న అందమైన ఫొటోలను రోహిత్ శర్మ షేర్ చేశాడు. ఈ క్రమంలో రితికకు సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ సైతం రిట్స్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కేక్ ఎమోజీలు జతచేసింది. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘అంత ప్రేమ నటించాల్సిన అవసరం లేదు. మీకు హిట్‌మ్యాన్‌పై గౌరవం ఉంటే అతడిని మళ్లీ కెప్టెన్‌ను చేయండి’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న రోహిత్ సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన రికార్డు ఉన్న హిట్‌మ్యాన్‌ను ఫ్రాంఛైజీ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ మాజీ సారథి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. డిసెంబరులోనే హిట్‌మ్యాన్‌కు మూడు పండుగలు! డిసెంబరు 13, 2015లో రోహిత్- రితికని పెళ్లాడాడు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటళ్లో వీరి వివాహం వైభవోపేతంగా జరిగింది. ఆ తర్వాత.. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు అంబానీ కుటుంబం రోహిత్- రితిక వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఇక డిసెంబరు 21న రితిక పుట్టినరోజు కాగా.. డిసెంబరు 30న రోహిత్- రితికల గారాలపట్టి సమైరా బర్త్‌డే!! View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్!
How Ritika Related To Yuvraj Singh: ‘‘నా జీవితంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఎన్నో మార్పులు తీసుకొచ్చాడీ అబ్బాయి. నా ప్రాణ స్నేహితుడు.. నన్ను నవ్వించే నా కమెడియన్.. అన్నింటికీ మించి ఓ మంచి మనిషి. నాకు సర్వస్వమైన వ్యక్తి.. నీతో జీవితం ఇంద్రజాలం కంటే తక్కువేమీ కాదు. లవ్ యూ’’ అంటూ ఆమె.. ‘‘నాకు దొరికిన అత్యుత్తమ జీవిత భాగస్వామి’’ అంటూ అతడు పరస్పరం పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- రితిక సజ్దే. తమ వివాహ బంధానికి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ఇలా ఒకరికొరి పట్ల ఒకరు ప్రేమను చాటుకుంటూ సోషల్ మీడియా వేదికగా అందమైన ఫొటోలు పంచుకున్నారు. అన్యోన్య దాంపత్యంతో కపుల్ గోల్స్ సెట్ చేస్తున్న రోహిత్- రితికల లవ్‌స్టోరీపై ఓ లుక్కేద్దామా?! యాడ్ షూట్లో పరిచయం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ 2008లో ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నారు. ఆ యాడ్ షూట్‌కు మేనేజర్ రితిక. అప్పటికే రితికతో యువీకి ప్రత్యేక అనుబంధం ఉంది. రితికను తన సొంత చెల్లిలా భావిస్తాడు యువరాజ్ సింగ్. అందుకే.. రోహిత్ శర్మ షూటింగ్‌కు రాగానే ముందుగానే ఓ హెచ్చరిక జారీ చేసేశాడు. ఆమెకు దూరంగా ఉండు రితికా సజ్దేను చూపిస్తూ.. తను స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్.. ఆమెకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అని హిట్‌మ్యాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం రోహిత్ వంతైంది. అయినా.. నాకు ఆమెతో ఏం పని? నేనిక్కడకు వచ్చింది షూటింగ్లో పాల్గొనడానికి కదా! అని తానూ గట్టిగానే బదులిచ్చాడు. ఆ తర్వాత మరో షూట్లో కలిశారు రోహిత్- రితిక. మొదటిసారి రితికను చూసినపుడు పెద్దగా పట్టించుకోని రోహిత్.. రెండోసారి కలిసినపుడు ఆమె వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యాడు. రెండోసారి కలిసినపుడు ఫిదా మైక్రోఫోన్‌తో కలిగిన అసౌకర్యం వల్ల ఇబ్బంది పడిన తన పట్ల ఎంతో హృద్యంగా.. హుందాగా స్పందించిన రితిక వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. స్నేహం పెరిగింది. రోహిత్‌కు స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేయడం మొదలుపెట్టింది రితిక. స్పెషల్ ప్లేస్‌లో లవ్ ప్రపోజల్ అలా అలా ప్రొఫెషనల్‌గా దగ్గరైన రోహిత్- రితిక.. కాలక్రమంలో ప్రాణ స్నేహితులుగా మారారు. ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడైన రోహిత్.. బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు రితికను తీసుకువెళ్లి.. లవ్ యూ అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. డిసెంబరు మొత్తం రోహిత్ కుటుంబానికి ప్రత్యేకం ఆమె కూడా సరేనంది. అలా ఆరేళ్ల పరిచయం తర్వాత.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించి.. 2015, జూన్ 3న రితిక వేలికి ఉంగరం తొడిగి ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు రోహిత్. పదకొండేళ్ల వయసులో తను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన అదే బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎంగేజ్మెంట్ చేసుకుని కెరీర్, లైఫ్నకు సంబంధించిన కీలక ఘట్టాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకున్నాడు. ఇక డిసెంబరు 13, 2015లో ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటళ్లో రోహిత్- రితిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత.. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు అంబానీ కుటుంబం తమ కెప్టెన్ రోహిత్ శర్మ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా జరిపించింది. యువీకి రాఖీ సిస్టర్ ఈ జంటకు డిసెంబరు 30, 2018లో కుమార్తె సమైరా జన్మించింది. రోహిత్- రితిక జీవితాల్లో ప్రత్యేక ఘట్టాలన్నీ డిసెంబరుతో ముడిపడటం విశేషం. అన్నట్లు తమ పరిచయానికి కారణమైన యువరాజ్ సింగ్‌కు రితిక రక్షా బంధన్ కడుతున్న దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె యువీకి తోబుట్టువేమో అని అని నెటిజన్లు భావించారు. నిజానికి రితిక.. యువరాజ్‌కు రాఖీ సిస్టర్!!.. అదే విధంగా టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి దగ్గర కూడా స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. చదవండి: U19 WC 2024: క్రికెట్ వరల్డ్‌కప్ జట్టులో పోత్గల్ కుర్రాడు.. కేటీఆర్ హర్షం! పోస్ట్ వైరల్ -
రోజుకు 10 కోట్లు! కోహ్లి ఆర్జన వెనుక రోహిత్ శర్మ బావమరిది! సల్మాన్ ఖాన్‌తోనూ..
Meet Rohit Sharma's brother-in-law- his link to Bollywood: అంతర్జాతీయ స్థాయిలో 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి దేశంలోని అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకడు. పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఈ టీమిండియా స్టార్ నికర ఆస్తి విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్- ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న కోహ్లి బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రఖ్యాత బ్రాండ్లతో ఒప్పందాలు, ఎండార్స్మెంట్ల రూపంలో విరాట్ లెక్కకుమిక్కిలి ఆర్జిస్తున్నాడు. మరి మిగతా వాళ్లతో పోలిస్తే డీల్స్ విషయంలో కోహ్లి ఓ పదడుగులు ముందు ఉండటానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? బంటీ సజ్దే.. ఇతగాడు మరెవరో కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బావమరిది!! క్రికెటర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా బంటీ బ్రాండ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాదు.. తనకంటూ సొంతంగా ఓ కంపెనీ కూడా ఉంది. ముంబైలో ఉన్న ఈ ఆఫీస్ ప్రధాన కార్యాలయం నుంచే బిజినెస్ డీల్స్ నడిపిస్తూ ఉంటాడు బంటీ. సల్మాన్ ఖాన్ కుటుంబంతో బంధుత్వం! అయితే, బంటీ రోహిత్ సొంత బావమరిది కాదు! రోహిత్ భార్య రితికా సజ్దేకు కజిన్ అవుతాడు. అతడికి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కుటుంబంతో కూడా బంధుత్వం ఉండేది. బంటీ సొంత అక్క సీమా సజ్దే.. సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ మాజీ భార్య. ఎంఆర్ఎఫ్, మింత్రా తదితర బ్రాండ్లకు ప్రమోషన్ చేయడం ద్వారా విరాట్ కోహ్లి.. బంటీ సజ్దే కంపెనీ నుంచి రోజుకు ఏడు నుంచి 10 కోట్ల రూపాయల మేర ఆర్జిస్తాడని DNA నివేదిక వెల్లడించింది. రియా బాయ్‌ఫ్రెండ్ అంటూ వదంతులు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రియుడు అంటూ 45 ఏళ్ల బంటీ సజ్దే పేరు ఇటీవల బీ-టౌన్ వర్గాల్లో బలంగా వినిపించింది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో రిలేషన్లో ఉన్న రియా అతడి మరణం తర్వాత డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సుశాంత్ కూడా తమ కంపెనీ క్లైంట్ అయిన నేపథ్యంలో బంటీ సజ్దే కూడా సీబీఐ విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. కాగా బంటీ సజ్దే నెట్‌వర్త్ 50 కోట్ల మేర ఉంటుందని పలు నివేదికలు అంచనా వేశాయి. రితికా కూడా అంతే ఇక రితికా సజ్దే కూడా రోహిత్ దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో అతడితో ప్రేమలో పడింది. వీరిద్దరు 2015 డిసెంబరు 13న పెళ్లి పీటలు ఎక్కారు. రోహిత్- రితికా జంటకు కుమార్తె సమైరా శర్మ సంతానం. ఇదిలా ఉంటే.. రితికా సొంత తమ్ముడు కునాల్ సజ్దే ఓ ప్రముఖ కంపెనీలో మేనేజర్ పొజిషన్లో ఉన్నట్లు సమాచారం. చదవండి: ఆసియాకప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్.. అలా జరిగితే పాకిస్తాన్‌కు టీమిండియా! -
ఆరోజు రోహిత్ భార్య అన్న మాట జీవితంలో మర్చిపోలేను: తిలక్ వర్మ తండ్రి
Tilak Varma Family Sakshi Exclusive Interview: ‘‘మా ఇంటికి వస్తున్నట్లు ముందు రోజు చెప్పలేదసలు! టెండుల్కర్ సర్.. రోహిత్ సర్, సూర్యకుమార్ యాదవ్.. ఇషాన్ కిషన్... ఇలా ముంబై ఇండియన్స్ ప్లేయర్లంతా వచ్చారు. రోహిత్ సర్, సూర్యకుమార్ తమ కుటుంబాలతో వచ్చారు. వాళ్లందరినీ డిన్నర్‌కు పిలుస్తాన్నా డాడీ అని నాలుగు గంటల ముందు చెప్పాడు. కానీ నాకైతే వాళ్లు మన ఇంటికి వస్తరా అని డౌట్ వచ్చింది. అయితే, తిలక్ మాత్రం కచ్చితంగా వస్తారు డాడీ అని చెప్పాడు. మేము చాలా సంతోషించాం. క్రికెట్ గాడ్ టెండుల్కర్ సర్ మా ఇంటికి రావడం కంటే అదృష్టం ఏముంటుంది? ఆ రోజు రాత్రి 7. 30- 8.30 మధ్య సమయంలో వచ్చారు. అయితే, వాళ్లు వచ్చేదాకా మేమెవరికీ చెప్పలేదు. పబ్లిసిటీ చేయలేదు. మావాడు కూడా వాళ్లతోనే వచ్చాడు. వాళ్లతోనే వెళ్లిపోయాడు. కిందనే కూర్చున్నారు వాళ్లంతా మా ఇంట్లో దగ్గరదగ్గర మూడు- నాలుగు గంటలపాటు గడిపారు. డిన్నర్‌కు దమ్ బిర్యానీ, హండీ బిర్యాని వండించాం. వాళ్లకు వంటలన్నీ నచ్చాయని చెప్పారు. క్యారెట్ జ్యూస్ స్పెషల్‌గా ఇంట్లోనే చేశాం. అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. అంత పెద్ద క్రికెటర్లు అయినా వాళ్లకు ఏమాత్రం గర్వం లేదు. హుందాగా ఉన్నారు. వాళ్లంతట వాళ్లే సర్వ్ చేసుకున్నారు. కింద కూర్చునే భోజనం చేశారు. రితిక అన్న మాటలు జీవితాంతం మర్చిపోలేను ఇషాన్ కిషన్ అయితే చాలా సరదాగా ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ భార్య రితిక అయితే రాగానే మా ఇంట్లో వాళ్లతో కలిసిపోయారు. మా ట్రిగ్గర్(పెట్ డాగ్)తో ఆడుకున్నారు. సూర్య కుమార్ భార్య కూడా సరదాగా గడిపారు. ఇద్దరూ కిందనే కూర్చున్నారు. నేను వెంటనే.. ‘‘కింద ఎందుకు కూర్చున్నారు రితికా.. వద్దు’’ అన్నాను. అందుకు బదులుగా ఆవిడ అన్న మాటను నేను జీవితాంతం మర్చిపోలేను. ‘‘మేము సోఫా మీద కూర్చుంటే ఇది మీ ఇల్లు అవుతుంది. అదే కింద కూర్చుంటే మన ఇల్లు అవుతుంది కదా!’’ అన్నారు. అంత హుందాగా మాట్లాడారు. ఆరోజు మొత్తం 21 మంది వరకు వచ్చారు. మా మర్యాదలు వాళ్లకి నచ్చాయి’ అని భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ తండ్రి నంబూరి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ జట్టు తమ ఇంటికి వస్తారని అసలు ఊహించలేదన్నారు. నాడు తిలక్ ఇంటికి తరలివచ్చిన అతిరథ మహారథులు కాగా ఐపీఎల్-2023లో భాగంగా ఏప్రిల్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన ఎంఐ జట్టు తమ ఆటగాడు తిలక్ వర్మ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజం, ఎంఐ మెంటార్ సచిన్ టెండుల్కర్ సహా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా తిలక్ ఫ్యామిలీ వాళ్లకు రుచికరమైన భోజనం వడ్డించింది. ఇషాన్ కిషన్‌తో పాటు తన బెస్ట్‌ఫ్రెండ్ డెవాల్డ్ బ్రెవిస్(సౌతాఫ్రికా)తో తిలక్ ఎంతో సంతోషంగా గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. కాగా ముంబై ఇండియన్స్ కీలక బ్యాటర్లలో ఒకడిగా ఎదిగిన హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు సెలక్ట్ చేసిన జట్టులో అతడికి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ తిలక్ వర్మ కుటుంబాన్ని పలకరించగా.. అతడి ఎదుగుదల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా ముంబై ఇండియన్స్ జట్టు తమ ఇంటికి వచ్చిన నాటి సంగతులు గుర్తుచేసుకుని మరోసారి మురిసిపోయారు. చదవండి: Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్ -
ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా రెండోసారి రన్నరప్‌గా నిలిచింది. దీంతో రోహిత్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. అయితే వెస్టిండీస్‌తో జూలైలో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే విండీస్ టూర్లో అతను చేసే ప్రదర్శన ఆధారంగా రోహిత్ కెప్టెన్సీ భవితవ్యం తేలనుంది. కానీ రోహిత్ శర్మ మాత్రం అభిమానుల ట్రోల్స్, మీమ్స్ పట్టించుకోకుండా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు. గత ఐదు నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడిన రోహిత్.. విండీస్‌తో సిరీస్ ప్రారంభమయ్యేలోపూ వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా భార్య రితికా.. కూతురు సమైరాతో కలిసి దిగిన ఫోటోను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అయితే ఫోటో మాత్రమే షేర్ చేసిన రోహిత్ ఎలాంటి క్యాప్షన్ జత చేయలేదు. ఇక రోహిత్ షేర్చేసిన ఫోటోపై శిఖర్ ధావన్ సహా రిషబ్ పంత్ స్పందించారు. ఎంజాయ్ మూడ్‌లో రోహిత్ భయ్యా అంటూ కామెంట్ చేశారు. పంత్ గర్ల్‌ఫ్రెండ్ ఇషా నేగి, యజ్వేంద్ర చహల్.. అతని భార్య ధనశ్రీ వర్మ సహా మరికొందరు రోహిత్ షేర్ చేసిన ఫోటోకు లైకులు, హార్ట్ ఎమోజీలు పెట్టారు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) చదవండి: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
రోహిత్ ఔట్.. బుంగమూతి పెట్టిన రితికా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఇవాళ ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు వచ్చిన ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. 18 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. Photo: IPL Twitter మంచి టచ్‌లో ఉన్న రోహిత్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భాగ్యనగరంలో భర్త ఆటను ఎంజాయ్ చేద్దామని వచ్చిన రితికాకు నిరాశే మిగిలింది. రోహిత్ ఔట్ కాగానే బుంగమూతి పెట్టింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ritika Sajdeh's reaction on Rohit Sharma dismissal. pic.twitter.com/MmYVkOf5Lr — CricketGully (@thecricketgully) April 18, 2023 -
భార్య రితికాతో ఆసక్తికర సంభాషణ.. మధ్యలో ఈ సామీ ఎవరు?
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. తిలక్ వర్మ 41 పరుగులతో రాణించాడు. అయితే చివర్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికి ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ రెండు పరుగులు తీసి ముంబైకి విజయాన్ని అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే మ్యాచ్ ముగిశాకా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాకా రోహిత్ శర్మ తన భార్య రితికా సదేశ్కు వీడియో కాల్ చేశాడు. అయితే రోహిత్ మాట్లాడుతూ.. ''ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. సామీ నువ్వు ట్రోఫీ చూశావా అనగానే అందుకు నో అనే సమాధానం వచ్చింది. అయితే సరే.. ఈసారి సామీ కోసం కప్ తీసుకొస్తా''.. అంటూ పేర్కొన్నాడు. రితికాతో జరిగిన సంభాషణలో సామీ అనే పేరు రావడం అభిమానులకు ఆసక్తి కలిగించింది. మరి ఎవరా సామీ అని ఆరా తీస్తే విషయం తెలిశాకా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే సామీ ఎవరో కాదు.. రోహిత్, రితికాల గారాల పట్టి.. సమైరానే. రోహిత్ తన బిడ్డ సమైరాను ముద్దుగా సామీ అని పిలుస్తుంటాడు. ఇక రితికాతో రోహిత్ ఇంకా ఏం మాట్లాడాడంటే.. ''ఈరోజు మ్యాచ్ చాలా బాగుంది. కానీ చివరి ఓవర్ చూడలేక బయటికి, లోపలికి తిరిగాను. చివరి బంతికి నేను ముని వేళ్లపై నిలబడ్డా. కానీ ముంబై గెలిచాకా సంబరం చేసుకున్నా. కానీ గత 15 ఏళ్లలో ఐపీఎల్లో ఇలాంటి మ్యాచ్‌లు చాలానే చూశాను.. అలవాటైపోయింది '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్, రితికాల వీడియో కాల్‌ను ముంబై ఇండియన్స్ తమ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ro on call with Rits after a nail-biting win in Delhi 🥺💙#OneFamily #DCvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/qCXaLj8dwT — Mumbai Indians (@mipaltan) April 12, 2023 చదవండి: అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్; బలయ్యింది మాత్రం ఒక్కడే -
రితికాకు అన్యాయం చేస్తావా! రెడ్‌రోజ్ ఇచ్చి మరీ అతడికి రోహిత్ ప్రపోజల్.. వైరల్
India vs Australia, 2nd ODI- Rohit Sharma Viral Video: ఆస్ట్రేలియాతో రెండో వన్డేతో తిరిగి జట్టుతో కలిసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓటమి స్వాగతం పలికింది. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత జట్టు తొలి వన్డేలో ఘన విజయం సాధించగా.. విశాఖపట్నం మ్యాచ్‌లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కనివినీ ఎరుగని రీతిలో పరాజయం పాలైంది. ఈ క్రమంలో రెండో వన్డేలో ఫలితంపై స్పందించిన రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఓటమిని అంగీకరించాడు. కాగా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1 సమమైంది. ఇక నిర్ణయాత్మక ఆఖరి వన్డే చెన్నై వేదికగా మార్చి 22న జరుగనుంది. దీంతో ఆఖరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా ముందుకు సాగనుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ హాస్యచతురత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆసీస్‌తో రెండో వన్డే నేపథ్యంలో మరోసారి తనలోని హ్యూమర్ యాంగిల్ బయటకు తీశాడు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని భారత జట్టుతో సెల్ఫీ వీడియో తీసుకుంటున్న క్రమంలో రోహిత్ ఊహించని రీతిలో అతడిని సర్ప్రైజ్ చేశాడు. చేతిలో ఎర్రగులాబీతో అతడిని సమీపించిన హిట్‌మ్యాన్.. ‘‘తీసుకో.. నీకోసమే ఇది! నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ సదరు ఫ్యాన్‌ను అడిగాడు. దీంతో రెడ్‌రోజ్ అందుకుంటూ సంతోషం వ్యక్తం చేసిన అతడు.. రోహిత్ నోటి నుంచి ఊహించని మాట రావడంతో ఏం మాట్లాడాలో అర్థంకాక నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీకిది తగునా? ఈ క్రమంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘రోహిత్ నీకిది తగునా? రితికాకు అన్యాయం చేస్తావా? ఇదేం బాగోలేదు’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది అభిమానులు.. ‘‘మైదానంలో.. వెలుపలా రోహిత్ భయ్యాకు మాత్రమే ఇలా సరదాగా ఉండటం సాధ్యం’’ అని పాత వీడియోలు పంచుకుంటున్నారు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని గెలుచుకున్న టీమిండియా ప్రస్తుతం వన్డే సిరీస్‌లోనూ ఆసీస్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఘోర ఓటమి నుంచి త్వరగా కోలుకుని ఆఖరిదైన చెన్నై మ్యాచ్‌పై దృష్టి సారించేందుకు సన్నద్ధమైంది. చదవండి: Ind Vs Aus: పాపం సూర్య! అందరూ తననే అంటున్నారు.. అతడి తప్పేం లేదు! నిజానికి.. Rohit Sharma is an amazing character - what a guy! pic.twitter.com/YZzPmAKGpk — Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2023 -
Ind Vs Aus: రోహిత్ శర్మ రికార్డు.. రితికా పోస్ట్ వైరల్
Rohit Sharma- Rithika Sajdeh: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే తన భర్త అద్భుత ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘లవ్ యూ రోహిత్’’ అంటూ ప్రేమను కురిపించారు. కాగా రితికా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన వృత్తిగత, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అప్డేట్లు పంచుకోవడంతో పాటు ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో రోహిత్ శర్మ బ్యాట్ ఝులిపించిన విషయం తెలిసిందే. కెప్టెన్ రికార్డు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 212 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది తొలి శతకం. అదే విధంగా ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టా స్టోరీలో రోహిత్ శర్మ ఫొటో పంచుకున్న రితికా.. ఫింగర్స్ క్రాస్డ్ ఎమోజీని జత చేశారు. వీటికి రీప్లేస్మెంట్ పంపించు అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న ప్రతిసారి రితికా ఫింగర్స్ క్రాస్ చేసి.. తమకు అనుకూల ఫలితం రావాలంటూ ప్రార్థించిన దృశ్యాలు గతంలో వైరల్ అయ్యాయి. ఇక తన మేనేజర్‌గా పనిచేసిన రితికాతో ప్రేమలో పడ్డ రోహిత్ 2015లో ఆమెను పెళ్లాడాడు. వారికి కూతురు సమైరా శర్మ సంతానం. చదవండి: Axar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్ అదిరిపోయే పంచ్ T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంత్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని తప్పుబట్టారు. బాధితులకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారని, ఈ ఫొటోలు వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని మండిపడ్డారు. "రిషబ్ పంత్ కారు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన వారిని చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వారికి కావాల వద్దా అనేది నిర్ణయించుకోలేరు. సదరు బాధితుల వ్యక్తుల ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం వల్ల వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్రంగా ప్రభావితమవుతారు. కనీస జ్ఞానం లేకుండా ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు " అని రితికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఇక శ్రీలంకతో సిరీస్‌కు దూరమైన పంత్ కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ వెళ్తుండగా.. రూర్కీ సమీపంలో అతడి కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో గాయాలయ్యాయి. పంత్‌కు చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపాడు. ‘ఢిల్లీ నుంచి ఓ బృందం డెహ్రాడూన్‌లోని దవాఖానకు వెళ్లి రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్లాస్టిక్ సర్జారీ అవసరం కావడంతో అక్కడే వైద్యం అందించారు. బీసీసీఐ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నది’ అని ఆయన అన్నారు. పంత్ గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆ్రస్టేలియాతో స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు పంత్ దూరం కానున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్–మే నెలలో జరిగే ఐపీఎల్ టి20 టోరీ్నలో కూడా పంత్ ఆడేది అనుమానమే. చదవండి: పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు నిలకడగా రిషబ్ పంత్ ఆరోగ్యం -
రోహిత్ విఫలం.. రితికాను ఓదార్చిన అశ్విన్ భార్య
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అయితే 35వ పుట్టినరోజు జరుపుకున్న రోహిత్ తాను స్కోర్ చేయడంలో ఫెయిల్ అయినప్పటికి.. జట్టు మాత్రం రాణించి రోహిత్‌కు బర్త్‌డే కానుకగా సీజన్లో తొలి విజయాన్ని అందించింది. బర్త్‌డే రోజున రోహిత్ రాణిస్తాడనుకుంటే అతనికి నిరాశే ఎదురైంది. 2 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో డగౌట్లో కూర్చున్న రోహిత్ భార్య రితికా శర్మ చాలా ఫీలయ్యింది. దాదాపు ఏడ్చినంత పని చేసింది. రోహిత్ శర్మ వికెట్ తీశానన్న ఆనందంతో అశ్విన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన అశ్విన్ భార్య ప్రీతి కూడా చప్పట్లు కొడుతూ అభినందించింది. అయితే పక్కనే రితికా బాధపడడం చూసి పరిస్థితి అర్థం చేసుకున్న అశ్విన్ భార్య ఆమె దగ్గరకు వచ్చి ఓదార్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అనంతరం ఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, తిలక్ వర్మ (30 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. సూర్య, తిలక్ మూడో వికెట్‌కు 56 బంతుల్లో 81 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. చివర్లో టిమ్ డేవిడ్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయతీరానికి చేర్చాడు. చదవండి: MI Vs RR: ముంబై ఎట్టకేలకు భోణీ .. రోహిత్‌కు బర్త్‌డే కానుక Com'on ASh 😍 pic.twitter.com/3k7hyS3XsJ — Krishna Tiwari (@krishnaa_ti) April 30, 2022 -
Rohit Sharma: సాహో రోహిత్.. ఆ రికార్డు ఇప్పటికీ ‘హిట్‌మ్యాన్’ పేరిటే!
Rohit Sharma Birthday Special: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్ 30). అతడు ఈరోజు 35వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్, ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ సహా పలువురు ఆటగాళ్లు అతడికి విషెస్ తెలియజేశారు. ఇక రోహిత్ భార్య రితికా సజ్దే.. ‘‘హ్యాపీ బర్త్‌డే రో.. సమీ.. నిన్ను మేమెంతగానో ప్రేమిస్తున్నాం. మా హకూనా మటాటాగా ఉన్నందుకు థాంక్స్’’ అంటూ భర్త రోహిత్, కూతురు సమైరా శర్మతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేశారు. అప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడేమో! నిజానికి రోహిత్ శర్మ కెరీర్‌ను మూడు భాగాలుగా విభజించవచ్చు. తొలుత జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారిన వేళ.. ఓపికగా ఒక్కో మెట్టు ఎదుగుతూ... అద్భుత ఆటతీరుతో భారత జట్టు కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. కాగా 2013లో అప్పటి టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని.. రోహిత్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేయడంతో అతడి దశ తిరిగిందని చెప్పవచ్చు. శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్... టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో సాయపడ్డాడు. ఆ తర్వాత హిట్‌మ్యాన్‌కు వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదంటే అతిశయెక్తి కాదు. రోహిత్ శర్మ బర్త్‌డే సందర్భంగా అతడు సాధించిన ఐదు అద్భుత విజయాలను ఓసారి గమనిద్దాం. మూడు ద్విశతకాలు వన్డే ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో రోహిత్ ఇప్పటి వరకు మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. తొలుత ఆస్ట్రేలియాపై 2013లో ఈ ఘనత సాధించాడు. 158 బంతుల్లో 16 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 209 పరుగులు చేసి మొదటి ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత శ్రీలంకపై 2014లో రెండో డబుల్ సెంచరీ(173 బంతుల్లో 264 పరుగులు) చేశాడు. అనంతరం 2017లో మళ్లీ అదే జట్టుపై 208 పరుగులు సాధించాడు. ఏకంగా 33 బౌండరీలతో.. శ్రీలంకపై 2014లో చేసిన డబుల్ సెంచరీ రోహిత్ కెరీర్లో మరింత ప్రత్యేకమైనది. ఈ మ్యాచ్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో హిట్‌మ్యాన్ 264 పరుగులు(అత్యధిక స్కోరు) సాధించాడు. ఇందులో 186 పరుగులు బౌండరీల సాయంతో పొందినవే. ప్రపంచకప్‌లో అదరగొట్టి.. ఒక వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ తన పేరును లిఖించుకున్నాడు. 2019 ప్రపంచకప్ సమయంలో 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 5 శతకాలు బాదాడు. అత్యధిక పరుగుల వీరుడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 3313 పరుగులు సాధించాడు. 125 మ్యాచ్‌లలో భాగమైన హిట్‌మ్యాన్ 117 ఇన్నింగ్స్ ఆడి 139.55 స్ట్రైక్‌రేటుతో ఈ మేరకు పరుగులు రాబట్టాడు. ఇందులో 4 సెంచరీలు, 26 అర్ధ శతకాలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక స్కోరు శ్రీలంకపై నమోదు చేసిన తొలి డబుల్ సెంచరీ సందర్భంగా రోహిత్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో ఇప్పటి వరకు ఒక బ్యాటర్‌కు ఇదే అత్యధిక స్కోరు.(33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 264 పరుగులు). రోహిత్ కెరీర్ గ్రాఫ్ ►ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు- 400 ►అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు సాధించిన పరుగులు- 15,733 ►వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ ►2007 టీ20 వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించిన జట్టులో సభ్యుడు ►ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ ►ఇప్పటి వరకు స్వదేశంలో ఆడిన టీ20 మ్యాచ్‌లన్ని క్లీన్‌స్వీప్ ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత చదవండి👉🏾PBKS Vs LSG: చెత్తగా ఆడారు.. టీమ్‌ను అమ్మిపారేయండి.. అప్పుడే! View this post on Instagram A post shared by Ritika Sajdeh (@ritssajdeh) Happy birthday brotherman 🎂 this is the time to back yourself and hit it out of the park like you always have 💪🏻👊🏻 Sending you loads of love and good wishes on your special day ❤️🤗 @ImRo45 pic.twitter.com/kpxDGrdBem — Yuvraj Singh (@YUVSTRONG12) April 30, 2022 -
Rohit Sharma: భయ్యా.. ఒకవేళ నువ్వు సినిమాలో నటించాల్సి వస్తే! వామ్మో!
IPL 2022- Rohit Sharma: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ హాస్య చతురత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంత సరదాగా ఉంటాడు. ఇక హోలీ సందర్భంగా మరోసారి తనలోని ఫన్నీ యాంగిల్‌ను బయటపెట్టాడు హిట్‌మ్యాన్. ఐపీఎల్-2022 ఆరంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి ముంబై జట్టుతో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భార్య రితికాతో కలిసి రోహిత్ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. విషెస్ చెప్పడానికి టేకుల మీద టేకులు తీసుకున్న రోహిత్ శర్మ.. ‘‘నాకు నచ్చకుంటే ఎడిట్ చేయాలి సరేనా! ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ నుంచి స్టార్ట్ చేయాలి’’ అంటూ సతీమణిని ఆటపట్టించాడు. మధ్యలో కాస్త చిరాకు పడిన రోహిత్.. ఆఖరికి ఎట్టకేలకు హ్యాపీ హోలీ అంటూ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈ వీడియోపై స్పందించిన ముంబై ఇండియన్స్.. ‘‘ఈరోజు ఇంటర్నెట్లో అత్యంత సరదా అయిన వీడియో ఇదే’’ అంటూ కామెంట్ చేసింది. ఇక రోహిత్ సహచర ఆటగాళ్లు.. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ , యజువేంద్ర చహల్ తదితరులు ఫన్నీ ఎమోజీలతో బదులిచ్చారు. ఇక ఫ్యాన్స్ అయితే.. ‘‘భయ్యా.. ఇన్ని టేకులా? ఒకవేళ నువ్వు సినిమాలో నటించాల్సి వస్తే... ఇంకేమైనా ఉందా!’’ అంటూ సరదాగా స్పందిస్తున్నారు. ఇంకెందు ఆలస్యం మీరూ వీడియోపై ఓ లుక్కేయండి! View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) చదవండి: IPL 2022 -Lucknow Super Giants : లక్నో సూపర్‌జెయింట్స్‌కు వరుస షాకులు.. మరో ప్లేయర్ దూరం!