రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్‌! | Rohit Sharma And Ritika Sajdeh Love Story In Telugu: Is Ritika Related To Yuvraj Singh? - Sakshi
Sakshi News home page

Rohit Sharma-Ritika Love Story: రితిక జోలికి వస్తే ఊరుకోను.. నాడు రోహిత్‌కు యువీ వార్నింగ్‌! ఆమెతో నాకేం పని అంటూ..

Published Thu, Dec 14 2023 1:13 PM | Last Updated on Thu, Dec 14 2023 2:51 PM

Rohit Sharma Ritika Sajdeh Love Story: Is Ritika Related To Yuvraj Singh - Sakshi

How Ritika Related To Yuvraj Singh: ‘‘నా జీవితంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఎన్నో మార్పులు తీసుకొచ్చాడీ అబ్బాయి. నా ప్రాణ స్నేహితుడు.. నన్ను నవ్వించే నా కమెడియన్‌.. అన్నింటికీ మించి ఓ మంచి మనిషి. నాకు సర్వస్వమైన వ్యక్తి.. నీతో జీవితం ఇంద్రజాలం కంటే తక్కువేమీ కాదు. లవ్‌ యూ’’ అంటూ ఆమె.. 

‘‘నాకు దొరికిన అత్యుత్తమ జీవిత భాగస్వామి’’ అంటూ అతడు పరస్పరం పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరంటే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- రితిక సజ్దే.

తమ వివాహ బంధానికి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ఇలా ఒకరికొరి పట్ల ఒకరు ప్రేమను చాటుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా అందమైన ఫొటోలు పంచుకున్నారు. అన్యోన్య దాంపత్యంతో కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తున్న రోహిత్‌- రితికల లవ్‌స్టోరీపై ఓ లుక్కేద్దామా?!

యాడ్‌ షూట్‌లో పరిచయం
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, రోహిత్‌ శర్మ 2008లో ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ యాడ్‌ షూట్‌కు మేనేజర్‌ రితిక. 

అప్పటికే రితికతో యువీకి ప్రత్యేక అనుబంధం ఉంది. రితికను తన సొంత చెల్లిలా భావిస్తాడు యువరాజ్‌ సింగ్‌. అందుకే.. రోహిత్‌ శర్మ షూటింగ్‌కు రాగానే ముందుగానే ఓ హెచ్చరిక జారీ చేసేశాడు.

ఆమెకు దూరంగా ఉండు
రితికా సజ్దేను చూపిస్తూ.. తను స్పోర్ట్స్‌ ఈవెంట్‌ మేనేజర్‌.. ఆమెకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అని హిట్‌మ్యాన్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవడం రోహిత్‌ వంతైంది. అయినా.. నాకు ఆమెతో ఏం పని? నేనిక్కడకు వచ్చింది షూటింగ్‌లో పాల్గొనడానికి కదా! అని తానూ గట్టిగానే బదులిచ్చాడు.

ఆ తర్వాత మరో షూట్‌లో కలిశారు రోహిత్‌- రితిక. మొదటిసారి రితికను చూసినపుడు పెద్దగా పట్టించుకోని రోహిత్‌.. రెండోసారి కలిసినపుడు ఆమె వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యాడు. 

రెండోసారి కలిసినపుడు ఫిదా
మైక్రోఫోన్‌తో కలిగిన అసౌకర్యం వల్ల ఇబ్బంది పడిన తన పట్ల ఎంతో హృద్యంగా.. హుందాగా స్పందించిన రితిక వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. స్నేహం పెరిగింది. రోహిత్‌కు స్పోర్ట్స్‌ మేనేజర్‌గా పనిచేయడం మొదలుపెట్టింది రితిక.

స్పెషల్‌ ప్లేస్‌లో లవ్‌ ప్రపోజల్‌
అలా అలా ప్రొఫెషనల్‌గా దగ్గరైన రోహిత్‌- రితిక.. కాలక్రమంలో ప్రాణ స్నేహితులుగా మారారు. ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడైన రోహిత్‌.. బోరివలీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు రితికను తీసుకువెళ్లి.. లవ్‌ యూ అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పాడు.

డిసెంబరు మొత్తం రోహిత్‌ కుటుంబానికి ప్రత్యేకం
ఆమె కూడా సరేనంది. అలా ఆరేళ్ల పరిచయం తర్వాత.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలను ఒప్పించి.. 2015, జూన్‌ 3న రితిక వేలికి ఉంగరం తొడిగి ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు రోహిత్‌. పదకొండేళ్ల వయసులో తను క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన అదే బోరివలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని కెరీర్‌, లైఫ్‌నకు సంబంధించిన కీలక ఘట్టాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకున్నాడు.

ఇక డిసెంబరు 13, 2015లో ముంబైలోని తాజ్‌ ల్యాండ్స్‌ హోటళ్లో రోహిత్‌- రితిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత.. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ యజమానులు అంబానీ కుటుంబం తమ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ఘనంగా జరిపించింది.

యువీకి రాఖీ సిస్టర్‌
ఈ జంటకు డిసెంబరు 30, 2018లో కుమార్తె సమైరా జన్మించింది. రోహిత్‌- రితిక జీవితాల్లో ప్రత్యేక ఘట్టాలన్నీ డిసెంబరుతో ముడిపడటం విశేషం. అన్నట్లు తమ పరిచయానికి కారణమైన యువరాజ్‌ సింగ్‌కు రితిక రక్షా బంధన్‌ కడుతున్న దృశ్యాలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి.

దీంతో ఆమె యువీకి తోబుట్టువేమో అని అని నెటిజన్లు భావించారు. నిజానికి రితిక.. యువరాజ్‌కు రాఖీ సిస్టర్‌!!.. అదే విధంగా టీమిండియా సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి దగ్గర కూడా స్పోర్ట్స్‌ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.

చదవండి: U19 WC 2024: క్రికెట్‌ వరల్డ్‌కప్‌ జట్టులో పోత్గల్‌ కుర్రాడు.. కేటీఆర్‌ హర్షం! పోస్ట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement