ప్రపంచంలోని సంపన్న క్రికెటర్లలో టీమిండియా ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. తదితరులు తమ బ్రాండ్ వాల్యూతో వందల కోట్ల ఆస్తులు సంపాదించారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి ఇలాంటి ధనిక క్రికెటర్లందరిలో అత్యంత ఖరీదైన ఇంటిలో నివాసం ఉంటున్న ఆటగాడెవరో తెలుసా?
100 కోట్ల విలువ?!
టీమిండియా మాజీ సారథి ధోనికి తన స్వస్థలం రాంచిలో విశాలమైన ఫామ్‌హౌజ్ ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న భూమిలో విలాసవంతమైన భవనం ఉంది. రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ స్థలంలో స్విమ్మింగ్‌పూల్, జిమ్, ఇండోర్ క్రికెట్ పిచ్, ఆటోమొబైల్ గ్యారేజీ ఉన్నాయి.
అయితే, ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కానీ, ఇందులో ధోని నిర్మించిన ఇంటి విలువ మాత్రం దాదాపు ఆరు కోట్ల వరకే ఉంటుందట.
(చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..)
క్రికెట్ గాడ్ సచిన్, గంగూలీ ఇలా..
ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ముంబైలో ప్రస్తుతం తను ఉన్న ఇంటిని 35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో ఈ ఏడాది ఆరంభంలో రూ. 40 కోట్లతో విలాసవంతమైన బంగ్లా కొన్నట్లు తెలుస్తోంది.
హిట్‌మ్యాన్ 30 కోట్లతో!
మరోవైపు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2015లో ముంబైలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 29వ ఫ్లోర్‌లో అపార్ట్‌మెంట్ కొన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అరేబియా సముద్ర అందాలను వీక్షించే విధంగా నాలుగు బెడ్‌రూమ్‌లతో కూడి ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ను రూ. 30 కోట్లకు హిట్‌మ్యాన్ కొనుగోలు చేశాడట.
యువీ విలాసవంతమైన భవనం
ఇక సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ముంబైలో రూ. 64 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్ కలిగి ఉన్నాడట.
ఇక్కడ కూడా కోహ్లి నంబర్ 1
విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి గురుగ్రామ్‌లో ఓ విలాసవంతమైన భవనం కొనుగోలు చేశాడు. దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా విలువ 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో అధునాతన స్విమ్మింగ్‌పూల్, జిమ్మాజియం వంటి సదుపాయాలు ఎన్నో ఉన్నాయి.
ఈ మేరకు DNA రిపోర్టు.. అత్యంత ఖరీదైన ఇల్లు.. రికార్డులు రారాజు కింగ్ కోహ్లిదే అని చెబుతోంది!! ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న కింగ్ కోహ్లి తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసి.. మరిన్ని మధురానుభూతులు మూటగట్టుకునే పనిలో ఉన్నాడు.
చదవండి: Ashes 5th Test: మొండిగా వెళ్తున్న టీమ్ ఇంగ్లండ్.. కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment