సెహ్వాగ్ ఆకాంక్ష ఇదే (PC: BCCI)
ICC ODI World Cup 2023: 2011, 2015 వరల్డ్‌కప్ జట్లలో సభ్యుడిగా.. 2019 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా.. 2023లో మరోసారి ఆటగాడిగా.. మీరు ఊహించిన పేరు కరెక్టే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. ధోని సారథ్యంలోని జట్టులో భాగమై ట్రోఫీని ముద్దాడాడు.
నాడు సచిన్‌ను భుజాలపై మోసిన కోహ్లి
పన్నెండేళ్ల క్రితం భారత్ సొంతగడ్డ మీద తొలిసారి ప్రపంచకప్ గెలిచిన సంబరంలో పాలుపంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్‌ను భుజాల మీద మోస్తూ.. దిగ్గజానికి సహచర ఆటగాడిగా తనకు దక్కిన గౌరవానికి మురిసిపోయాడు.
అదే తరహాలో విరాట్ కోహ్లికి సైతం ఈసారి సన్మాన సత్కారం జరగాలని టీమిండియా మాజీ ఓపెనర్, 2011 వరల్డ్‌కప్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్షించాడు. వన్డే ప్రపంచకప్-2023లో ట్రోఫీ గెలిచి.. నాడు సచిన్ మాదిరే ఈసారి కోహ్లిని కూడా అలా భుజాలపై మోస్తూ మైదానమంతా తిప్పితే చూడాలని ఉందని పేర్కొన్నాడు.
చీకూని అలా భుజాలపై మోస్తే
‘‘చీకూ(కోహ్లి) 2019 వరల్డ్‌కప్ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఈసారి అతడు వీలైనన్ని ఎక్కువ శతకాలు బాదుతాడనుకుంటున్నా. ఈసారి టోర్నమెంట్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిస్తే బాగుంటుంది. ఇక ట్రోఫీ గెలిస్తే సహచర ఆటగాళ్లు కోహ్లిని భుజాలపై ఎత్తుకుని గ్రౌండ్ అంతా కలియదిరిగితే చూడాలనేది నా కోరిక’’ అని వీరూ భాయ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ తన మనసులోని మాట వెల్లడించాడు.
వాళ్లిద్దరూ అర్హులే.. అప్పుడు రోహిత్ మిస్ అయ్యాడు
అదే విధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కోహ్లి- రోహిత్.. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వరల్డ్‌కప్ గెలిచేందుకు పూర్తి అర్హులు. 2011లో ప్రపంచకప్ ఆడాల్సిన రోహిత్ కొద్దిలో మిస్ అయ్యాడు. ఆ తర్వాత వన్డే ఫార్మాట్లో అతడు బాద్‌షా అయిపోయాడు.
ఈసారి కెప్టెన్ హోదాలో ట్రోఫీ గెలిస్తే అంతకంటే సంతోషం ఉండదు. అద్భుతమైన ఆటగాడు రోహిత్’’ అంటూ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో టీమిండియా ఐసీసీ ఈవెంట్‌ను మొదలుపెట్టనుంది.
చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్‌దే ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే!
Comments
Please login to add a commentAdd a comment