Man Behind Multi Crore Brand Deals Of Kohli Rohit Sharma Brother In Law - Sakshi
Sakshi News home page

అలా రోజుకు 10 కోట్లు! విరాట్‌ కోహ్లి ఆర్జన వెనుక రోహిత్‌ శర్మ బావమరిది! ఆమెకు బాయ్‌ఫ్రెండ్‌?

Published Thu, Jul 20 2023 8:16 PM | Last Updated on Thu, Jul 20 2023 8:52 PM

Man Behind Multi Crore Brand Deals Of Kohli Rohit Sharma Brother In Law - Sakshi

Meet Rohit Sharma's brother-in-law- his link to Bollywood: అంతర్జాతీయ స్థాయిలో 500వ మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లి దేశంలోని అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకడు. పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఈ టీమిండియా స్టార్‌ నికర ఆస్తి విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌- ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉన్న కోహ్లి బ్రాండ్‌ వాల్యూ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రఖ్యాత బ్రాండ్లతో ఒప్పందాలు, ఎండార్స్‌మెంట్ల రూపంలో విరాట్‌ లెక్కకుమిక్కిలి ఆర్జిస్తున్నాడు. మరి మిగతా వాళ్లతో పోలిస్తే డీల్స్‌ విషయంలో కోహ్లి ఓ పదడుగులు ముందు ఉండటానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? బంటీ సజ్దే.. ఇతగాడు మరెవరో కాదు.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బావమరిది!!

క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలకు కూడా బంటీ బ్రాండ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాదు.. తనకంటూ సొంతంగా ఓ కంపెనీ కూడా ఉంది. ముంబైలో ఉన్న ఈ ఆఫీస్‌ ప్రధాన కార్యాలయం నుంచే బిజినెస్‌ డీల్స్‌ నడిపిస్తూ ఉంటాడు బంటీ.

సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంతో బంధుత్వం!
అయితే, బంటీ రోహిత్‌ సొంత బావమరిది కాదు! రోహిత్‌ భార్య రితికా సజ్దేకు కజిన్‌ అవుతాడు. అతడికి బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కుటుంబంతో కూడా బంధుత్వం ఉండేది. బంటీ సొంత అక్క సీమా సజ్దే.. సల్మాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ మాజీ భార్య.

ఎంఆర్‌ఎఫ్‌, మింత్రా తదితర బ్రాండ్లకు ప్రమోషన్‌ చేయడం ద్వారా విరాట్‌ కోహ్లి.. బంటీ సజ్దే కంపెనీ నుంచి రోజుకు ఏడు నుంచి 10 కోట్ల రూపాయల మేర ఆర్జిస్తాడని DNA నివేదిక వెల్లడించింది. 

రియా బాయ్‌ఫ్రెండ్‌ అంటూ వదంతులు
బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి ప్రియుడు అంటూ 45 ఏళ్ల బంటీ సజ్దే పేరు ఇటీవల బీ-టౌన్‌ వర్గాల్లో బలంగా వినిపించింది. దివంగత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో రిలేషన్‌లో ఉన్న రియా అతడి మరణం తర్వాత డ్రగ్స్‌ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సుశాంత్‌ కూడా తమ కంపెనీ క్లైంట్‌ అయిన నేపథ్యంలో బంటీ సజ్దే కూడా సీబీఐ విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. కాగా బంటీ సజ్దే నెట్‌వర్త్‌ 50 కోట్ల మేర ఉంటుందని పలు నివేదికలు అంచనా వేశాయి.

రితికా కూడా అంతే
ఇక రితికా సజ్దే కూడా రోహిత్‌ దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో అతడితో ప్రేమలో పడింది. వీరిద్దరు 2015 డిసెంబరు 13న పెళ్లి పీటలు ఎక్కారు. రోహిత్‌- రితికా జంటకు కుమార్తె సమైరా శర్మ సంతానం. ఇదిలా ఉంటే.. రితికా సొంత తమ్ముడు కునాల్‌ సజ్దే ఓ ప్రముఖ కంపెనీలో మేనేజర్‌ పొజిషన్లో ఉన్నట్లు సమాచారం. 

చదవండి: ఆసియాకప్‌ షెడ్యూల్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. అలా జరిగితే పాకిస్తాన్‌కు టీమిండియా! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement