ఐపీఎల్-2024 తర్వాత కేఎల్ రాహుల్ టీమిండియాకు దూరమయ్యాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కలేదు.
అయితే, తాజాగా శ్రీలంకతో జరుగనున్న దైప్వాక్షిక సిరీస్‌తో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయడం దాదాపుగా ఖాయమైంది. అంతేకాదు.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పర్యటనకు దూరమైతే వన్డే జట్టుకు కెప్టెన్‌గానూ ఈ కర్ణాటక బ్యాటర్ వ్యవహరించనున్నాడు.
జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్ మొదలుకానుండగా.. తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది భారత్. అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.
ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. తన భార్య అతియా శెట్టితో కలిసి ముంబైలోని వెస్ట్ బాంద్రాలో విలాసంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇందుకోసం రాహుల్- అతియా జంట రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. వెస్ట్ బాంద్రాలోని 3350 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్ కోసం రూ. 1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇక ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సైతం ఫ్లాట్ కలిగి ఉన్నట్లు సమాచారం. అదే విధంగా షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, త్రిప్తి డిమ్రి కూడా ఇక్కడ నివాసాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తన కథనంలో వివరాలను వెల్లడించింది. కాగా భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుల్లో ఒకడైన కేఎల్ రాహుల్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్-ఏ జాబితాలో ఉన్నాడు.
తద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నాడు. మ్యాచ్ ఫీజులు ఇందుకు అదనం. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ కేఎల్ రాహుల్‌కు భారీ మొత్తమే సంపాదిస్తున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా సీజన్‌కు రూ. 17 కోట్ల మేర అందుకుంటున్నట్లు సమాచారం. ఇక అతియా శెట్టి.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె అన్న విషయం తెలిసిందే. నటిగానూ ఆమె తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment