Athiya Shetty
-
బేబీబంప్‌తో కేఎల్ రాహుల్ సతీమణి.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియాశెట్టి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాహుల్, అతని భార్య అతియా శెట్టి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఈ జంట మొదటి బిడ్డకు ఆహ్వానం పలకనున్నారు. అతియా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా అతియా శెట్టి సైతం ఆస్ట్రేలియాలోనే ఉంది.ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ బిజీగా ఉన్నారు. మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతోంది. తాజాగా మెల్బోర్న్ స్టేడియంలో అతియాశెట్టి కనిపించింది. ఆమెతో పాటు అనుష్క శెట్టి, నితీశ్ కుమార్ రెడ్డి ఫాదర్ కూడా కనిపించారు. అయితే అతియాశెట్టి బేబీబంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న ముంబయిలో జరిగింది. రాహుల్ శ్రీమతి అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు. Athiya Shetty with the baby 🥹❤️🧿🤞🏻🥹🧿❤️🪬😭💗😭🥹🪬🥺💗❣️🤍Also anushka and nitish family 🥹 pic.twitter.com/okzKM5umY4— Tia'world (@singh36896) December 29, 2024 -
గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని రాహుల్, అతని భార్య అతియా శెట్టి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. మా అందమైన ఆశీర్వాదం 2025లో రాబోతుందని రాహుల్, అతియా జంట తమ పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. వీరికి బాలీవుడ్ మరియు క్రికెట్ సర్కిల్స్‌లో అందమైన, అన్యూన్యమైన జంటగా పేరుంది. రాహుల్ శ్రీమతి అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty)కాగా, ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. రాహుల్.. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. రాహుల్ ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనలు చేస్తూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో రాహుల్ భారత టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. రాహుల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు, పది పరుగులు చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్‌కు ఆట పరంగా ఏదీ కలిసి రావడం లేదు. రాహుల్‌ను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కూడా వేలానికి వదిలేసింది. ఇదిలా ఉంటే, భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా త్వరలో రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నాడని తెలుస్తుంది. రోహిత్ భార్య రితక డెలివరీకి సిద్దంగా ఉండటంతోనే రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్‌కు దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. -
మై క్రేజీ బేబీ: భార్యకు కేఎల్ రాహుల్ బర్త్‌డే విషెస్ (ఫొటోలు)
-
ఫెస్టివ్ ఫ్యాషన్: అతియా శెట్టి లేటెస్ట్ లుక్
-
రిటైర్మెంట్ కాదు!.. కేఎల్ రాహుల్ ముఖ్యమైన ప్రకటన ఇదే
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ‘ముఖ్యమైన ప్రకటన’కు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. దివ్యాంగులైన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేలా.. తాము తలపెట్టిన సత్కార్యం విజయవంతమైందని తెలిపాడు. తమకు సహకరించిన తోటి క్రికెటర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. అసలు విషయమేమిటంటే..‘నేనొక ప్రకటన చేయబోతున్నా.. ’ అంటూ కేఎల్ రాహుల్ ఇన్‌స్టా పోస్ట్ పెట్టగానే.. అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ వదంతులు వ్యాపించాయి. జాతీయ జట్టులో తగినన్ని అవకాశాలు రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా ఇవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశాడు కేఎల్ రాహుల్.తన భార్య అతియా శెట్టితో కలిసి ఒక మంచి పని చేసినట్లు వెల్లడించాడు. దివ్యాంగులైన పిల్లల బాగు కోసం.. క్రికెటర్ల వస్తువులు వేలం వేయడం ద్వారా నిధులు సమకూర్చినట్లు తెలిపాడు. ఈ సత్కార్యంలో తమకు సహకరించిన తన సహచర, మాజీ క్రికెటర్ల జట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. వేలాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, విరాళాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపాడు.కోహ్లి జెర్సీకి అత్యధిక ధరకేఎల్ రాహుల్- అతియా శెట్టి దంపతులు నిర్వహించిన ఈ వేలంలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి జెర్సీ అత్యధిక ధర పలికినట్లు సమాచారం. రూ. 40 లక్షలకు కింగ్ జెర్సీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా... ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా కోహ్లినే ఉండటం విశేషం. అతడి గ్లోవ్స్ రూ. 28 లక్షల ధర పలికింది.ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ రూ. 24 లక్షలు, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ రూ. 13 లక్షలు, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ బ్యాట్ రూ. 11 లక్షలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వేలం ద్వారా రాహుల్- అతియా మొత్తంగా రూ. 1.93 కోట్లు సేకరించినట్లు సమాచారం.కాగా ఐపీఎల్-2024లో స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2022లో చివరి టీ20 ఆడిన రాహుల్.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. ఇదే ఏడాది జనవరిలో ఆఖరిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ కర్ణాటక బ్యాటర్ తదుపరి దులిప్ ట్రోఫీలో పాల్గొననున్నాడు.చదవండి: BAN vs PAK: తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్ నుంచి ఔట్? -
గొప్పమనసు చాటుకున్న అతియా శెట్టి- కేఎల్ రాహుల్ దంపతులు!
బాలీవుడ్ భామ, హీరోయిన్ అతియా శెట్టి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో కొద్ది సినిమాలే చేసినా.. గతేడాది క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో పెళ్లి తర్వాత మరింత ఫేమస్ అయింది. అయితే తాజాగా తన భర్తతో కలిసి ఓ ఛారిటీని స్థాపించింది ముద్దుగుమ్మ. విప్లా ఫౌండేషన్ కోసం నిధులను సేకరించేందుకు 'క్రికెట్ ఫర్ ఎ కాజ్' పేరుతో ఛారిటీని ప్రకటించారు. కాగా... ముంబయిలో సేవ్ ది చిల్డ్రన్ ఇండియాగా పిలువబడే సంస్థను ఆ తర్వాత విప్లా ఫౌండేషన్‌గా మార్చారు. మరికొందరు క్రికెటర్లతో కలిసి ఛారిటీ తరఫున నిధులు సమీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతియా మాట్లాడుతూ.. 'విప్లా ఫౌండేషన్ నా చిన్నతనంలోనే ఓ ముఖ్యమైన భాగం. నేను స్కూల్ అయిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఇక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారితో గడిపేదాన్ని. మేము నిర్వహించే వేలం ద్వారా వినికిడి లోపం, వైకల్యం ఉన్న పిల్లల అవసరాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. విప్లా ఫౌండేషన్‌ను ప్రారంభించిన నాని వారసత్వాన్ని కొనసాగించాలనేదే నా ఆశయం'అని తెలిపారు.కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..' ఇలాంటి పాఠశాలకు మొదటిసారి రావడం చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. అతియా కుటుంబం భాగమైన ఈ గొప్ప పనికి సహకరించడానికి ఈ పిల్లలే నన్ను ప్రేరేపించారు. వీరికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించడంలో విప్లా ఫౌండేషన్ చేస్తున్న అద్భుతమైన పనికి మద్దతు ఇవ్వడానికి వేలం నిర్వహిస్తున్నాం. నేను నాతోటి క్రికెట్ సోదరులను సంప్రదించినప్పుడు.. వారు తమ విలువైన క్రికెట్ వస్తువులను వేలం ద్వారా వచ్చే డబ్బును విరాళం ఇచ్చేందుకు సహకరించారు. వేలంలో పాల్గొని ప్రత్యేకమైన ఈ పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం మాతో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు.కాగా.. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ జనవరి 23, 2023న వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అతియా చివరిసారిగా 2019 చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె 2015లో వచ్చిన 'హీరో'లో మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' చిత్రంలోనూ నటించింది. -
భార్యతో కలిసి ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్
ఐపీఎల్-2024 తర్వాత కేఎల్ రాహుల్ టీమిండియాకు దూరమయ్యాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కలేదు.అయితే, తాజాగా శ్రీలంకతో జరుగనున్న దైప్వాక్షిక సిరీస్‌తో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయడం దాదాపుగా ఖాయమైంది. అంతేకాదు.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పర్యటనకు దూరమైతే వన్డే జట్టుకు కెప్టెన్‌గానూ ఈ కర్ణాటక బ్యాటర్ వ్యవహరించనున్నాడు.జూలై 27 నుంచి టీమిండియా శ్రీలంక టూర్ మొదలుకానుండగా.. తొలుత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది భారత్. అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. తన భార్య అతియా శెట్టితో కలిసి ముంబైలోని వెస్ట్ బాంద్రాలో విలాసంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు.ఇందుకోసం రాహుల్- అతియా జంట రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. వెస్ట్ బాంద్రాలోని 3350 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్ కోసం రూ. 1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది.ఇక ఇదే అపార్ట్మెంట్లో ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సైతం ఫ్లాట్ కలిగి ఉన్నట్లు సమాచారం. అదే విధంగా షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, త్రిప్తి డిమ్రి కూడా ఇక్కడ నివాసాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ తన కథనంలో వివరాలను వెల్లడించింది. కాగా భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుల్లో ఒకడైన కేఎల్ రాహుల్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్-ఏ జాబితాలో ఉన్నాడు.తద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నాడు. మ్యాచ్ ఫీజులు ఇందుకు అదనం. అదే విధంగా.. ఐపీఎల్‌లోనూ కేఎల్ రాహుల్‌కు భారీ మొత్తమే సంపాదిస్తున్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా సీజన్‌కు రూ. 17 కోట్ల మేర అందుకుంటున్నట్లు సమాచారం. ఇక అతియా శెట్టి.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె అన్న విషయం తెలిసిందే. నటిగానూ ఆమె తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. -
ప్రముఖ ఆలయంలో అతియా శెట్టి- కేఎల్ రాహుల్.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. 2015లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత ముబాకరన్, నవాబ్జాదే, మోతీచూర్ చక్నాచూర్ చిత్రాల్లో మెరిసింది. అయితే కొన్నేళ్లపాటు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్ కొనసాగించిన భామ.. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది.తాజాగా ఈ జంట కర్ణాటకలోని ఓ ఆలయాన్ని సందర్శించారు. మంగళూరులోని కుట్టారు కొరగజ్జ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో పాటు అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ సైతం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టికి కర్ణాటకలోని తులునాడు మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. అంతకుముందే మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కత్రినా, అథియా, అహన్ శెట్టి, కేఎల్ రాహుల్ హాజరయ్యారు. View this post on Instagram A post shared by Mangalore Meri Jaan (@mangaloremerijaanofficial)VIDEO | Indian cricketer KL Rahul (@klrahul) offers prayers at Bappanadu Sri Durga Parameshwari Temple in Karnataka's Mangaluru. (Source: Third Party) pic.twitter.com/zKer47NiQ2— Press Trust of India (@PTI_News) July 14, 2024 -
రాజ కుమారుడిలా రాహుల్.. అందంగా అతియా (ఫోటోలు)
-
హీరోయిన్ మొదటి వివాహ వార్షికోత్సవం.. దాదాపు ఐదు నెలల తర్వాత!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది జనవరి 23న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. వీరిద్దరికీ పెళ్లి జరిగి ఇప్పటికే ఏడాదిన్నర కావొస్తోంది. అయితే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటికి రాలేదు.అయితే దాదాపు ఐదు నెలల తర్వాత అతియా, రాహుల్ మొదటి వివాహా వార్షికోత్సవ ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. వేడుక జరిగిన హోటల్ నిర్వాహకులు వీరిద్దరి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ అద్భతమైన క్షణాలను ఇకపై సీక్రెట్‌గా ఉంచడం సాధ్యం కావడం లేదంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అతియా, కేఎల్ రాహుల్ క్యాండిల్‌లైట్ డిన్నర్, చెఫ్ టీమ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by The Private Chefs Club (@theprivatechefsclub) -
కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, బడా వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక నష్ట నివారణ చర్యలు చేపట్టారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ను ఆయన ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.ఐపీఎల్-2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో ఫ్రాంఛైజీ తమ సారథిగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌ను నియమించింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కెప్టెన్సీలో లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరింది. గతేడాది సైతం టాప్-4తో ముగించింది.ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, ప్లే ఆఫ్స్ రేసులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోయింది.అందరూ చూస్తుండగానే చీవాట్లుఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ టీమ్ కేఎల్ రాహుల్ సేనను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి.. బ్యాటింగ్ విధ్వంసంతో పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంక కెప్టెన్ రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైదానంలో అందరూ చూస్తుండగానే చీవాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్లు గోయెంక వ్యవహారశైలిని తప్పుబట్టారు.డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిఇక ఫ్యాన్స్ అయితే, రాహుల్ ఆత్మగౌరవం నిలబడాలంటే వెంటనే లక్నోకు గుడ్‌బై చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఫొటో తెర మీదకు వచ్చింది. కేఎల్ రాహుల్‌ను డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిన సంజీవ్ గోయెంక అతడిని ఆలింగనం చేసుకున్నాడు. Sanjiv Goenka invited KL Rahul for dinner at his home last night and both hugged each other.- Everything is okay now in LSG. ❤️ pic.twitter.com/RY9KsiNre3— Tanuj Singh (@ImTanujSingh) May 14, 2024తుపాన్ వెలిసిన తర్వాతఈ నేపథ్యంలో గోయెంక- రాహుల్ మధ్య సఖ్యత కుదిరిందని.. జట్టులో ప్రస్తుతం అంతా బాగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి చేసిన పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తుపాన్ వెలిసిన తర్వాత ప్రశాంతంగా ఇలా అంటూ ఆమె మబ్బులు వీడిన సూర్యుడి ఫొటో పంచుకుంది.కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో మంగళవారం ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, మిగిలి ఉన్న మరో మ్యాచ్ గెలవడంతో పాటు ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Athiya Shetty Instagram story.Cryptic post 🤔🤔 pic.twitter.com/HTKdJ95G9d— DREAM11s STATS (@fantasy1Cricket) May 14, 2024 -
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ బర్త్‌డే.. అరుదైన ఫొటోలు
-
అతియా శెట్టి ప్రెగ్నెంట్? హింటిచ్చిన తండ్రి!
బాలీవుడ్ నటి అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకుని ఏడాది కావస్తోంది. ఉన్నపళంగా అతియా త్వరలో తల్లి కాబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ ఎలా పుట్టుకొచ్చాయనుకుంటున్నారా? దానికి కారణం అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి! నెక్స్ట్ సీజన్‌కు తాతయ్యగా.. సునీల్ శెట్టి డ్యాన్స్ దీవానె డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఎపిసోడ్‌కు గ్రాండ్ మస్తి విత్ గ్రాండ్ పేరెంట్స్ అనే థీమ్ పెట్టారు. ఈ షోలో కమెడియన్ భారతీ సింగ్.. సునీల్ సర్.. మీకు మనవడో, మనవరాలో పుట్టి తాతయ్యవి అయిపోయాక ఎలా ఉంటావ్? అని అడిగింది. అందుకు నటుడు.. నెక్స్ట్ సీజన్లో నేను తాతయ్యనయ్యాక ఇదే స్టేజీపై నడుస్తాను అని చెప్పాడు. త్వరలోనే గుడ్‌న్యూస్! ఆయన సరదాగా అన్నారో, సీరియస్‌గా అన్నారో కానీ చాలామంది నిజంగానే ఈ నటుడు తాతగా ప్రమోషన్ పొందబోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే అతియా- రాహుల్ గుడ్‌న్యూస్ చెప్పనున్నారని, ఆరోజు కోసం కోసం వెయిటింగ్ అంటూ ఎవరికి తోచినట్లు వారు ఊహించేసుకుంటున్నారు. ప్రస్తుతం అతియా ప్రెగ్నెంట్ కావచ్చని భావిస్తున్నారు. కాగా అతియా- రాహుల్ గతేడాది జనవరి 23న పెళ్లి చేసుకున్నారు. చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో.. -
ఆ సమయంలో అతియా గురించి అస్సలు ఆలోచించను: కేఎల్ రాహుల్
KL Rahul Comments: గాయాల కారణంగా చాలా కాలం పాటు జట్టుకు దూరమైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పునరాగమనంలో సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన అతడు.. ఆసియా కప్-2023తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ వన్డే టోర్నీలో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత.. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్-2023లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. అనంతరం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ జట్టుతో చేరిన కేఎల్ రాహుల్..తొలి మ్యాచ్‌లో అసాధారణ పోరాటంతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. సఫారీ గడ్డపై సెంచరీతో సత్తా చాటి సాటి బ్యాటర్లంతా విఫలమైన వేళ.. సెంచరీ(101)తో రాణించి తన విలువేమిటో చాటుకున్నాడు. తద్వారా మిడిలార్డర్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. అయితే, గాయాల వల్ల సతమతమైన సమయంలో తన భార్య అతియా శెట్టి, కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైందంటున్నాడు కేఎల్ రాహుల్. స్టార్ స్పోర్ట్స్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఈ కర్ణాటక బ్యాటర్. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో తను(అతియా) నాకు తోడుగా ఉండేది. ఇప్పుడూ ఉంది. ఇక ముందు కూడా నాతోనే ఉంటుంది. కఠిన సమయంలో కలిసి ఉండటం ద్వారా మా మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకోగలిగాం. గాయం తాలుకు ప్రతికూల ప్రభావం నా మీద పడకుండా .. చిన్న చిన్న సంతోషాలను కూడా పూర్తిగా ఆస్వాదించేలా నాకు తోడ్పాటు అందించింది. ఈ మాట అన్నందుకు తను నాపై కోప్పడటం ఖాయం ఇంట్లో.. నా భార్య, కుటుంబంతో కలిసి ఉండటం మూలాన సానుకూల దృక్పథంతో క్లిష్ట పరిస్థితులను జయించగలిగాను. వేగంగా కోలుకోగలిగాను’’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక మైదానంలో దిగిన తర్వాతే తనకు ఆట తప్ప ఇంకేదీ గుర్తుండదన్న రాహుల్.. ‘‘ఈ మాట చెప్తున్నందుకు తను చంపేసినా చంపేస్తుంది(నవ్వుతూ).. ఒక్కసారి గ్రౌండ్లోకి వెళ్లానంటే అతియా గురించి పూర్తిగా మర్చిపోతాను. అతియాతో రాహుల్ ప్రేమపెళ్లి కేవలం ఆట మీద మాత్రమే నా దృష్టి ఉంటుంది. క్రికెట్ అంటే నాకు ప్రాణం. అలాగే నా భార్య అంటే కూడా! తను నా కోసం ఎంతో చేసింది. ఇండస్ట్రీలో తను కూడా ఎన్నో ఎత్తుపళ్లాలు చూసింది. ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. అయినా.. నాకు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు విసురుతూ నన్ను నేను మరింత మెరుగుపరచుకునేలా చేస్తుంది’’ అని సతీమణిపై ప్రశంసలు కురిపించాడు. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టిని ప్రేమించిన కేఎల్ రాహుల్.. గతేడాది జనవరిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ఎప్పుటికపుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ తమ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తోంది. చదవండి: IPL 2024: హార్దిక్ పాండ్యా దూరం! ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బుమ్రా? -
అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్ అంటున్న బాలీవుడ్ స్టార్! ఎందుకంటే..
Virat Kohli- ICC WC 2023: టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో 78 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రికార్డుల రారాజు ఆట అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఛేజింగ్‌లో కింగ్‌లా కోహ్లి పరుగుల వరద పారిస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటారు ఫ్యాన్స్. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి. ఫేవరెట్ క్రికెటర్‌గా అల్లుడిని కాదని.. విరాట్ కోహ్లికే ఓటు వేశాడు. అయితే.. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కాగా కర్ణాటకకు చెందిన సునిల్ శెట్టి బాలీవుడ్లో నటుడిగా నిలదొక్కుకున్నాడు. బల్వాన్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దిల్వాలే, బార్డర్, భాయ్, ఆఘాజ్ వంటి చిత్రాల్లో నటించాడు. ముంబైలో స్థిరపడ్డ సునిల్ ఈ క్రమంలో ముంబైలో సెటిల్ అయిన సునిల్ శెట్టి తన 30 ఏళ్ల కెరీర్లో వందకు పైగా సినిమాల్లో నటించాడు. వ్యాపారవేత్తగానూ కొనసాగుతున్న ఈ వెటరన్ యాక్టర్ మనా శెట్టిని వివాహమాడగా.. వీరికి కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్ శెట్టి జన్మించారు. వీరిద్దరు నటులుగా తమ ప్రతిభను నిరూపించుకునే పనిలో ఉన్నారు. అయితే, సునిల్ గారాల పట్టి అతియా శెట్టి హీరోయిన్గా ఎదిగే క్రమంలో టీమిండియా స్టార్, కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో ప్రేమలో పడింది. సునిల్‌కు అల్లుడిగా స్టార్ క్రికెటర్ ఇరు కుటుంబాల అంగీకారంతో రాహుల్-అతియా ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టారు. సునిల్ శెట్టికి చెందిన ఫామ్‌హౌజ్‌లో అత్యంత సన్నిహితుల నడుమ వీరి పెళ్లి వేడుక జరిగింది. కాగా సునిల్.. రాహుల్‌ను అల్లుడిలా కాకుండా కొడుకుగా చూసుకుంటాడని ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపితమైంది. రాహుల్ కుమారుడు కదా! ఈ క్రమంలో తాజాగా మనీకంట్రోల్ సమ్మిట్‌లో మాట్లాడిన సునిల్ శెట్టి తన అభిమాన క్రికెటర్‌గా విరాట్ కోహ్లి పేరు చెప్తూనే.. రాహుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం నా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే కచ్చితంగా విరాట్ కోహ్లి పేరే చెప్తాను. కేఎల్ రాహుల్ నా కుమారుడు. నా కుటుంబ సభ్యుడి గురించి నేను పొగిడితే బాగుండదు కదా! నిజానికి నేను జాతీయ జట్టుకు ఆడాలనుకున్నాను. నా అల్లుడి రూపంలో ఆ కోరిక నెరవేరింది. ఏదేమైనా.. ఛేజింగ్ మాస్టర్ కాబట్టే కోహ్లి నా అభిమాన క్రికెటర్ అయ్యాడు’’ అని సునిల్ శెట్టి చెప్పుకొచ్చాడు. కాగా ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి(85), రాహుల్(97- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియాపై గెలుపొందిన విషయం తెలిసిందే. అదే విధంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్లో 78వ సెంచరీ చేసేందుకు రాహుల్ సహకారం అందించి ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు. చదవండి: WC 2023: అయ్యో.. ఇదేంటి ఇలా అయిపోయింది?.. రోహిత్ శర్మ పోస్ట్ వైరల్ -
అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్
KL Rahul Posts An Adorable Pic With His Wife Athiya Shetty: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. గాయం కారణంగా నెలల తరబడి జట్టు దూరమైన ఈ కర్ణాటక ప్లేయర్.. ఆసియా కప్-2023తో ఘనంగా పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. అయితే, పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో మెగా ఈవెంట్లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్.. అజేయ సెంచరీ(111)తో సత్తా చాటాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. బ్యాట్‌తోనే కాదు వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుని.. వన్డే వరల్డ్‌కప్-2023కి తాను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు చాటిచెప్పాడు ఈ మిడిలార్డర్ బ్యాటర్. ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఏకంగా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గైర్హాజరీ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబరు 22న ఈ సిరీస్ మొదలు కానుండగా.. ఈ మధ్యలో దొరికిన కాస్త విరామ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. భార్య అతియా శెట్టితో కలిసి.. భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట గణపతి పూజలో పాల్గొన్నాడు. వైట్కుర్తా.. పైజామా ధరించి రాహుల్ హుందాగా కనిపించగా.. ఎరుపు రంగు చీరలో సంప్రదాయకట్టులో అతియా మెరిసిపోయింది. ఈ క్రమంలో రాహుల్- అతియా తమ అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. హార్ట్ ఎమోజీతో ఇన్‌స్టాలో ఇద్దరూ బుధవారం ఫొటోలను షేర్ చేయగా... నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక పూజలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ దంపతుల వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె, నటి అతియాతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కేఎల్ రాహుల్.. ఈ ఏడాది జనవరిలో ఆమెతో కలిసి ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. చదవండి: ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్‌పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే? #WATCH | Indian Cricketer KL Rahul with his wife Athiya Shetty arrive at Mukesh Ambani's residence 'Antilia' in Mumbai to attend Ganesh Chaturthi celebrations #GaneshChaturthi2023 pic.twitter.com/P2t3GXmSCG — ANI (@ANI) September 19, 2023 View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
కేఎల్ రాహుల్ సెంచరీ.. భావోద్వేగానికి గురైన అతియా
బాలీవుడ్ నటి అతియా శెట్టి తన భర్త కేఎల్ రాహుల్‌ను అభినందించారు. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో అతని ప్రదర్శనతో, క్రికెటర్ కొత్త రికార్డును నెలకొల్పాడు. క్రికెట్లో చాలా రోజులుగా ఫామ్ కోల్పోయి జట్టులో అవకాశమే కష్టం అనే స్థితికి చేరిన కేఎల్ రాహుల్ తిరిగి తనా సత్తా చాటుతూ పాక్‌పై సెంచరీ బాదాడు. దీంతో భర్తపై ప్రశంసల వర్షం కురిపించారు అథియా శెట్టి. ఆసియా కప్ 2023 భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం ఎందరో ఎదురు చూశారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి పాక్‌పై అద్భుత ప్రదర్శన చేశారు. పాకిస్థాన్‌పై వీరిద్దరూ సెంచరీలు సాధించి జట్టుకు గెలుపుతో ఊపునిచ్చారు. తాజాగా అతియా శెట్టి తన జీవిత భాగస్వామి అయిన కేఎల్ రాహూల్ ఆటతీరుపై ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రశంసించారు. 'చీకటి కూడా రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ముగుస్తుంది. సూర్యుడు తప్పకుండా మళ్లీ ఉదయిస్తాడు. మీరే నాకు సర్వస్వం, నేను నిన్ను ఆరాధిస్తాను. హ్యష్‌టాగ్ వన్ (#1).' అని ఆమె పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన వెంటనే రాహుల్ అభిమానులు రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌పై స్పందించిన నటుడు అనిల్ కపూర్,వాణి కపూర్ ప్రతిస్పందిస్తూ క్లాప్ ఎమోజీలతో రాహుల్‌ను అభినందించాడు. ఆపై వెంటనే బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా రెడ్ హార్ట్ ఎమోజీలతో స్పందించాడు. డ్రీమ్ గర్ల్ 2 ఫేమ్ ఆయుష్మాన్ ఖురానా ఇలా వ్రాశాడు 'వాట్ ఏ కంబ్యాక్' అంటూ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: ఆయన చేసిన తప్పు వల్ల.. నేను ఎంట్రీ ఇచ్చాను: శ్రీకాంత్ అడ్డాల) విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఈ జోడీ 233 పరుగులు చేసి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అతియా శెట్టి ఎవరు..? ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కొద్దిరోజులుగా డేటింగ్లో ఉండి ఈ ఏడాదిలోనే వివాహం చేసుకున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన సూరజ్ పంచోలీతో కలిసి 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’ సినిమాతో అతియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరి సారిగా ‘మోతీచూర్ చక్నాచూర్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ ‘హోప్ సోలో’లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!
సెలబ్రెటీలు ధరించే డ్రెస్‌లు ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. వాటి ధర కూడా ఖరీదుగానే ఉంటాయి. క్రికెటర్లనే పెళ్లి చేసుకున్న భాలీవుడ్ భామలు ఇద్దరూ ఒకేలాంటి స్లీవ్లె్లెస్ టాప్‌లు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయినా అతియా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్‌ని గత నెలలో పెళ్లిబంధంలో ఒక్కటయ్యారు. ఇక అనుష్కా క్రికెటర్ విరాట్‌ని కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి వామిక అను కూతురు కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు ఒకే బ్రాండ్ మాలీకి చెందిన దుస్తులు ధరించారు. అందులో ఇద్దరు తమ అందంతో చూపురులను కట్టిపడేశారు. అయితే వారు ధరించి ఆ షార్ట్ టాప్ల ధర వింటే షాకవ్వడం ఖాయం. సెలబ్రెటీలు దరించేవి చాలా ఖరీదైనవే అయినప్పటికీ..కొన్ని దుస్తులుకు ఇంతపెట్టారా అనే ఫీల్ వస్తుంది. అది సహజం. ఏ చీర లేదా లెహంగా అంత ధర ఉందంటే ఓకే చిన్న షార్ట్ లాంటి టాప్ ఏకంగా రూ. 18000/ అంటే నిజమేనా? అనిపిస్తుంది కదా! కానీ బ్రాండ్లకు పెట్టింది పేరు అయిన మలై బ్రాండ్ ధరలు ఎక్కువనే చెప్పాలి. ఆయా ఫ్యాషన్ కాస్ట్యూమ్‌లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక అతియా శెట్టి గూలాబీ రంగు స్లీవ్‌లెస్ టాప్, జీన్స్ ఫ్యాంట్లో అదర్సు అన్నట్లు ఉంది. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) చక్కటి ఈయర్ రింగ్స్, మ్యాచింగ్ లిప్‌స్టిక్‌తో మంచి లుక్‌తో ట్రెండీగా ఉంది అతియా. ఇక అనుష్క శర్మ కూడా సేమ్ అదే మాదిరి పసుపు రంగు టాప్‌లో చూడచక్కగా ఉంది. కంఫర్ట్ దుస్తులకే ప్రాధాన్యం ఇచ్చే అనుష్క రెండు నెలల క్రితం ఈ టాప్‌ని ధరించిన ఫోటోని నెట్టింట షేర్ చేసింది. ఇప్పుడూ అతియా అదే టాప్ వేసుకోవడంతో నెలక్రితం నాటి అనుష్క ఫోటోతో కలిపి అతియా ఫోటో నెట్టింట సందడి చేయడం. దీంతో నెటిజన్లు మీ భుజాలను కవర్ చేసేలా డ్రస్‌లు వేయకూడదనుకుంటున్నారా అంటూ సెటైరికల్ కామెంట్లతో పోస్ట్‌లు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) (చదవండి: పండుగ వేళ ..కంచిపట్టు చీరతో మరింత కళగా మార్చేయండి!) -
FDCI ICW 2023 Photos: ర్యాంప్‌వాక్‌లో సినీ తారల హోయలు (ఫోటోలు)
-
కేఎల్ రాహుల్‌పై దారుణ ట్రోల్స్.. గట్టిగానే కౌంటరిచ్చిన అతియా శెట్టి!
బాలీవుడ్ నటి అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఐపీఎల్లో లక్నో సూపర్ జైయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) అయితే ప్రస్తుతం ఈ జంట లండన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. లండన్‌లోని ఓ క్లబ్లో కేఎల్ రాహుల్ తన స్నేహితులతో సరదాగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ కేఎల్పై ట్రోల్స్ చేశారు. గాయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు దూరమైనా బాధ లేకుండా.. క్లబ్లో ఎంజాయ్ చేస్తూ కనిపించడాన్ని తప్పుబడుతున్నారు. అయితే కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి దీనిపై కాస్తా గట్టిగానే ఇచ్చి పడేసింది. (ఇది చదవండి: సత్తా చాటిన సమంత 'శాకుంతలం'.. ఏకంగా నాలుగు అవార్డులు!) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. నేను సాధారణంగా చాలా వరకు మౌనంగానే ఉండాలనుకుంటా. కానీ కొన్నిసార్లు మన కోసం నిలబడటం చాలా ముఖ్యం. నేను, రాహుల్, మా ఫ్రెండ్స్‌తో సాధారణంగా ఓ ప్రదేశానికి వెళ్లాం. దయచేసి సంబంధం లేని విషయాలతో ముడిపెట్టకండి. అనేముందు ఒకసారి అలోచించుకోండి.' అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అతియాశెట్టి. తన భర్తను ట్రోల్ చేయడంపై కాస్త ఘాటుగానే స్పందించింది. #KLRahul Spotted In Strip Club In UK During His Recovery pic.twitter.com/jMPzhraJqV — Stroke0Genius🇮🇳 (@Stroke0Genius18) May 26, 2023 -
నా కూతురిపై దారుణమైన కామెంట్స్ చేశారు: స్టార్ నటుడు
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేదు. 1992 నుంచి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సునీల్ శెట్టి ప్రస్తుతం అక్షయ్ కుమార్, పరేష్ రావల్‌తో కలిసి హేరా ఫేరి- 3లో నటిస్తున్నారు. తాజాగా ది రణవీర్ షోకు హాజరైన ఆయన సోషల్ మీడియాపై సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాతో సెలబ్రిటీల జీవితాలు నాశనం అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్లో కొంతమంది తన కుటుంబం గురించి చేసిన కామెంట్స్ చూసి చాలా బాధపడ్డానని తెలిపారు. నటీనటులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయని సునీల్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సెలబ్రిటీల జీవితాన్ని నాశనం చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాలంలో వ్యక్తిగత గోప్యత లేదని ఆయన అన్నారు. సెలబ్రిటీల జీవితాలను నాశనం చేస్తున్న సోషల్ మీడియాలో ఉండటం అసాధ్యమని సునీల్ శెట్టి వెల్లడించారు. సునీల్ శెట్టి మాట్లాడుతూ..' నాకు సోషల్ మీడియా అంటే భయం. అందుకే మాట్లాడటానికి భయపడుతున్నా. సోషల్ మీడియాలో నా కుమార్తె, తల్లిపై అసభ్యంగా కామెంట్స్ చేశారు. అలాంటి ట్రోల్స్‌తో చాలా బాధపడ్డా. ఇలాంటి చర్యలు దేనికి దారితీస్తాయో కూడా వారికి తెలియదు. తెర వెనుక ఉన్న వ్యక్తులు నా కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడటం బాధ కలిగించింది. ఇలాంటి వాటిపై తాను నిశ్శబ్దంగా ఉండనని' అని తేల్చి చెప్పారు. కాగా.. సునీల్ శెట్టి గారాల కూతురు అతియా శెట్టికి క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో ఈ ఏడాది వివాహామైన సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి చివరిసారిగా అమెజాన్ మిని టీవీ కొత్త వెబ్ సిరీస్ హంటర్లో కనిపించాడు. ధారవి బ్యాంక్‌తో తర్వాత రెండోసారి వెబ్ సిరీస్‌లో నటించారు. -
వారానికోసారి ఇలా చేస్తే చాలు.. మిలమిలా మెరిసిపోతారు: హీరోయిన్
Athiya Shetty- Beauty Tips: ముఖ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు కెమికల్స్ ఉన్న ఫేస్ క్రీముల జోలికి వెళ్లొద్దు అంటోంది బాలీవుడ్ అందాల తార అతియా శెట్టి. ఇంట్లోనే సహజసిద్దంగా నిగారింపును సొంతం చేసుకోవచ్చని చెబుతోంది. తనకు తల్లి మనా శెట్టి చెప్పిన చిట్కాలు పంచుకుంది. ‘‘మా అమ్మకు కెమికల్స్ ఉన్న ఫేస్ క్రీమ్స్, ప్యాక్స్ నచ్చవు. తను వాడాదు. నన్ను వాడనివ్వదు. ఆమె ఇంటి చిట్కాలతోనే అందానికి మెరుగులు దిద్దుకోవడం నేర్పింది. ఆవిడ చెప్పిన వాటిల్లో ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ఒకటి. రెండు టూబుల్ స్పూన్ల కొబ్బరి పాలల్లో సగం అరటి పండు గుజ్జు, టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, పావు కప్పు బొప్పాయి పండు గుజ్జు వేసి కలిపి.. మొహానికి అప్లయ్ చేసుకోవాలి. తడారిపోతున్నప్పుడు కడిగేసుకోవాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేసినా చాలు.. తేమ ఆరని చర్మంతో మిలమిలా మెరిసిపోతాం’’ అంటోంది ఈ కొత్త పెళ్లికూతురు. కాగా టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అతియా పెళ్లాడిన సంగతి తెలిసిందే. అతియా తండ్రి సునిల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌజ్‌లో జనవరి 23న వీరి వివాహం అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది. చదవండి: Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా.. Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? -
అతియాశెట్టి- కేఎల్ రాహుల్ సంగీత్ వేడుక.. ఫోటోలు వైరల్
-
అతియా శెట్టి-కేఎల్ రాహుల్‌కు ఖరీదైన బహుమతులు.. సునీల్ శెట్టి ఏమన్నారంటే..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రేమజంటకు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ పలు కథనాలు వచ్చాయి. అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టి రూ.50 కోట్ల ఫ్లాట్, కోహ్లీ, ధోని, సల్మాన్ ఖాన్ కూడా ఖరీదైన బహుమతులు అందించారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై అతియా కుటుంబసభ్యులు స్పందించారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటి వివరాలు రాసేముందు తమను సంప్రదించాలని సునీశ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్ - అతియా శెట్టి కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో ఈనెల 23న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబయిలోని సునీల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌస్‌లో పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు,కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, విరాట్ కోహ్లీ, ధోనీ.. డైమండ్ హారం, బైక్, కారు బహుకరించినట్లు రాశారు. వీటిని సునీల్ శెట్టి ఖండించడంతో అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. -
న్యూట్రీషనిష్టుతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ పెళ్లి.. వీడియో వైరల్
Axar Patel- Meha Patel Wedding: టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను వివాహమాడాడు. వడోదరలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో మెహాతో ఏడడుగులు నడిచాడు. గురువారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లి నేపథ్యంలో సెలవు తీసుకున్న అక్షర్ పటేల్ న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. మెహాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న అక్షర్ పటేల్ గతేడాది తన పుట్టినరోజున ఆమె చేతివేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాది తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు మెహాను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కాగా మెహా న్యూట్రిషనిస్ట్, డైటీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరి పెళ్లికి అక్షర్ స్నేహితుడు, క్రికెటర్ జయదేవ్ ఉనాద్కట్ కుటుంబంతో హాజరయ్యాడు. ఇదిలా ఉంటే టీమిండియా మరో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ జనవరి 23న బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లాడిన విషయం తెలిసిందే. మూడు రోజుల(జనవరి 26) తర్వాత అక్షర్ కూడా ఈవిధంగా శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్‌కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. Axar Patel married to me, took seven rounds with his meha in Vadodara... #axarpatel #mehapatel pic.twitter.com/yimPDvfUaD — Meha Patel (@Meha_Patela) January 27, 2023 Happy married life Axar Patel 💞👩❤️👨#AxarPatel #MehaPatel #WeddingNight #WeddingDay pic.twitter.com/priqlc2R6k — Meha Patel (@Meha_Patela) January 26, 2023