హీరోయిన్ మొదటి వివాహ వార్షికోత్సవం.. దాదాపు ఐదు నెలల తర్వాత! | Athiya Shetty And KL Rahul 1st Anniversary Celebration; Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Athiya Shetty: అతియా శెట్టి మొదటి వివాహ వార్షికోత్సవం.. ఫోటోలు వైరల్!

Published Wed, Jun 19 2024 2:54 PM | Last Updated on Wed, Jun 19 2024 3:07 PM

Athiya Shetty and KL Rahul's 1st anniversary celebration Photos Goes Viral

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది జనవరి 23న టీమిండియా క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. వీరిద్దరికీ పెళ్లి జరిగి ఇప్పటికే ఏడాదిన్నర కావొస్తోంది. అయితే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటికి రాలేదు.

అయితే దాదాపు ఐదు నెలల తర్వాత అతియా, రాహుల్ మొదటి వివాహా వార్షికోత్సవ ఫోటోలు నెట్టింట లీక్ ‍అయ్యాయి. వేడుక జరిగిన హోటల్ నిర్వాహకులు వీరిద్దరి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ అద్భతమైన క్షణాలను ఇకపై సీక్రెట్‌గా ఉంచడం సాధ్యం కావడం లేదంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అతియా, కేఎల్ రాహుల్ క్యాండిల్‌లైట్ డిన్నర్‌, చెఫ్ టీమ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో  'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement