first anniversary
-
హీరోయిన్ మొదటి వివాహ వార్షికోత్సవం.. దాదాపు ఐదు నెలల తర్వాత!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది జనవరి 23న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. వీరిద్దరికీ పెళ్లి జరిగి ఇప్పటికే ఏడాదిన్నర కావొస్తోంది. అయితే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటికి రాలేదు.అయితే దాదాపు ఐదు నెలల తర్వాత అతియా, రాహుల్ మొదటి వివాహా వార్షికోత్సవ ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. వేడుక జరిగిన హోటల్ నిర్వాహకులు వీరిద్దరి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ అద్భతమైన క్షణాలను ఇకపై సీక్రెట్‌గా ఉంచడం సాధ్యం కావడం లేదంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అతియా, కేఎల్ రాహుల్ క్యాండిల్‌లైట్ డిన్నర్, చెఫ్ టీమ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by The Private Chefs Club (@theprivatechefsclub) -
ఆహా మొదటి వార్షికోత్సవ వేడుకలు
-
చప్పట్లు కొట్టి అభినందించండి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి శుక్రవారంతో ఏడాది పూర్తవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రతి ఇంటి ముందుకు ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది అని పేర్కొన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ‘అవినీతికి తావు లేకుండా 543 సేవలను ఈ రోజు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. అవినీతి రహిత పాలనను ఈ ప్రభుత్వం అందిస్తోంది. సచివాలయ పనితీరుని మన దేశ ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని అభినందించారు. యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్ లో ఒక పాఠ్యాంశంగా మన సచివాలయ వ్యవస్థని చేర్చారు. 61,65,000ల మందికి పెన్షన్లు గత నెల వరకు ఇస్తున్నాం. 34,907 మందిని గత నెల కొత్తగా పెన్షన్ ఇచ్చే జాబితాలో చేర్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా మా ప్రభుత్వంలో ఈ పెన్షన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 1,26,200 మంది ఇప్పటి వరకు గ్రామ సచివాలయల్లో పనిచేస్తున్నారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. రేపు గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం సస్పెండ్ అయిన జడ్జ్ ద్వారా దళితులలో లబ్ది పొందాలి అని చంద్రబాబు చూస్తున్నారు’ అని అన్నారు. చదవండి: ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం -
త్వరలో విజయవాడ, రాజమండ్రికి... ఎయిర్ పెగాసస్ సర్వీసులు
సాక్షి, బెంగళూరు: దేశీయ విమానయాన సంస్థ ‘ఎయిర్ పెగాసస్’ తొలి వార్షికోత్సవ సందర్భంగా సేవలను విస్తరించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి నగరాలకు త్వరలోనే సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. ‘ఎయిర్ పెగాసస్’ విమానయాన సేవలను ప్రారంభించి ఏడాది పూర్తై సందర్భంగా బెంగళూరులో గురువారం విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ షైషన్ థామస్ మాట్లాడారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రస్తుతం తమ సంస్థ హుబ్లీ, తిరువనంతపురం, మధురై, మంగళూరు, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను నడుపుతోందని తెలిపారు. ఏడాది కాలంలో మొత్తం 2,80,000 మంది ప్రయాణికులు తమ విమాన సర్వీసుల్లో ప్రయాణించారని చెప్పారు. దక్షిణ భారతదేశంలో మరిన్ని ఎక్కువ పట్టణాలకు సేవలను విస్తరించే దిశగా రూ.100 కోట్లను అదనం గా వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్ అశ్విన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
స్టెప్పులు అదుర్స్
మండలంలోని కండ్లకోయ గ్రామ పరిధిలోని టైమ్ స్కూల్ మొదటి వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతికకార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంగీతం, పాటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్కూల్ డెరైక్టర్ మాణిక్ దారువాలా, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, మేడ్చల్ రూరల్ -
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కు ఘననివాళి
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తొలి వర్ధంతి పురస్కరించుకొని రాష్ర్టవ్యాప్తంగా బుధవారం ఆయనకు ఘన నివాళులు ఆర్పించారు. సొంతూరైన లాతూర్ జిల్లాలోని బహల్గావ్ గ్రామంలో విలాస్‌రావ్‌కు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశం వద్ద ఆయన భార్య వైశాలితో పాటు వేలాది మంది నివాళులు ఆర్పించారు. వైశాలి వెంట ఆమె కుమారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్, బాలీవుడ్ నటుడు రితేశ్, ధీరాజ్‌లు ఉన్నారు. అలాగే విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ సెంటర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. ఫ్రధానంగా సామాజిక సమస్యలకు ప్రాధాన్యతనిచ్చింది. ముంబైలోని వైబీ చవాన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు హాజరై విలాస్‌రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. కాలేయ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన విలాస్‌రావ్ గతేడాది ఆగస్టు 14న చెన్నై ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. తర్వాత రోజు బహల్గావ్లో జరిగిన అంత్యక్రియలకు ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా హాజరయ్యారు.