ప్రియురాలికి కేఎల్ రాహుల్ సర్‌ప్రైజ్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ | Team India Opener KL Rahul Birthday Wishes To His Lover Athiya Shetty | Sakshi
Sakshi News home page

KL Rahul Wishes Athiya Shetty: అతియా శెట్టికి కేఎల్ రాహుల్ విషెస్.. పోస్ట్ వైరల్

Published Sat, Nov 5 2022 8:06 PM | Last Updated on Sat, Nov 5 2022 9:53 PM

Team India Opener KL Rahul Birthday Wishes To His Lover Athiya Shetty - Sakshi

ప్రముఖ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి, మనా శెట్టి ముద్దుల కుమార్తె అతియా శెట్టి. ఆమెతో టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ కూడా పెద్దఎత్తున వైరలయ్యాయి. తాజాగా ఇవాళ అతియా శెట్టి బర్త్‌డే సందర్భంగా కేఎల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బాలీవుడ్ భామ తొలిసారిగా 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చివరిసారిగా 2019లో విడుదలైన మోతీచూర్ చక్నాచూర్‌లో కనిపించింది. కేఎల్ రాహుల్, అతియాశెట్టి కలిసి ఉన్న ఫోటోలను ఇవాళ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు టీమిండియా ఓపెనర్. 

(చదవండి: క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అతియా శెట్టి)

కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నా జోకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ప్రతి విషయాన్ని గొప్పగా చేయాలి.' అంటూ ఫోటోలను పంచుకున్నారు. దీనిపై ఆమె తండ్రి సునీల్ బ్లాక్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేస్తూ కామెంట్ చేశారు. అతియా కూడా 'లవ్ యు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమెకు పలువురు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. అప్పుడు అతియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ చిత్రాన్ని షేర్ చేసి.. రెడ్ హార్ట్ ఎమోజితో క్యాప్షన్ ఇచ్చింది.

అయితే వచ్చే ఏడాది జనవరిలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. కేఏల్ రాహుల్‌తో, అతియా శెట్టి పెళ్లి విషయాన్ని సునీల్ శెట్టిని అడగ్గా.. 'కేఎల్ రాహుల్‌ అంటే నాకు ఇష్టమే.. వారిద్దరూ తమ ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారని నమ్ముతున్నా' అంటూ ఆయన బదులిచ్చారు. కొన్నేళ్లుగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్‌ చేశారు. గతంలో కేఎల్‌ రాహుల్‌ బర్త్‌డే సందర్భంగా 'ఎక్కడైనా నీతోనే.. హ్యాపీ బర్త్‌డే' అని అతియా పోస్ట్ షేర్‌ చేసింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement