
Athiya Shetty Response on Her Marriage Rumours With KL Rahul: ప్రముఖ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి, క్రికెటర్ కెఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి ఉండేందుకు ముంబైలో బ్రాండ్ న్యూ హోం కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్‌తో పెళ్లి వార్తలపై స్పందించింది హీరోయిన్ అతియా శెట్టి. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన అతియాకు రాహుల్‌తో డేటింగ్, పెళ్లి రూమర్స్‌పై ప్రశ్న ఎదురైంది. ఇది విని ఆమె ఒక్కసారిగా నవ్వింది.
చదవండి: డెలివరీ తర్వాత ఫస్ట్ ఫోటో షేర్ చేసిన కాజల్
అనంతరం ‘దీనిపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను. ఈ రూమర్స్ విని విని విసిగిపోయా. ఇక ఈ వార్తలకు నేను నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ప్రజలకు ఎలా అనిపిస్తే అలా అనుకోవివ్వండి. వారికి నచ్చినట్టుగా వారు ఆలోచిస్తున్నారు’ అని బదులిచ్చింది. అలాగే రాహుల్‌తో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్న వార్తలపై కూడా ఆమె స్పందించింది. ‘నేను కొత్త ఇంటికి మారుతున్న విషయం వాస్తవమే. కానీ ఎవరితోనో కాదు. నా కుటుంబంతోనే. త్వరలోనే మా అమ్మ-నాన్న(మన శెట్టి-సునీల్ శెట్టి)తో పాటు నా సోదరుడుతో కలిసి ముంబై బాద్రాలోని కొత్త ఇంటికి మారబోతున్నా’ అని చెప్పుకొచ్చింది.
చదవండి: అప్పుడే ఓటీటీకి ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, స్ట్రీమింగ్ ఎక్కడంటే
కాగా గత మూడేళ్లుగా కెఎల్ రాహుల్, అతియాలు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్ చేశారు ఈ జంట. కెఎల్ రాహుల్ బర్త్‌డే సందర్భంగా 'ఎక్కడైనా నీతోనే.. హ్యాపీ బర్త్‌డే' అని అతియా పోస్ట్ షేర్ చేసింది. దీంతో త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవల పింక్ విల్లా తన కథనంలో రాహుల్ అతియాలు ముంబైలోని సుమద్రం పక్కన, బాంద్రా కార్టర్ రోడ్‌లో 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని, ఈ అపార్ట్‌మెంట్ అద్దె నెలకు రూ. 10 లక్షలు అని తెలుస్తోంది అంటూ ప్రచురించింది. పెళ్లి తర్వాత వారు అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment