రాహుల్‌ ఆ పదానికి అర్థం ఏంటి.. | Viral: KL Rahul Comment On Girlfriend Athiya Shetty Pic | Sakshi
Sakshi News home page

వైరల్‌: ప్రేయసి పోస్టుపై కేఎల్‌ రాహుల్‌ కామెంట్‌..

Published Thu, Aug 20 2020 1:24 PM | Last Updated on Thu, Aug 20 2020 1:54 PM

Viral: KL Rahul Comment On Girlfriend Athiya Shetty Pic - Sakshi

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ప్రేయసిగా ప్రచారంలో ఉన్న అతియా శెట్టి పోస్టుపై స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతియా ఇటీవల అద్దం ముందు సెల్ఫీ దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో స్విమ్‌ సూట్‌లో తన స్టిన్నింగ్‌ లుక్స్‌తో అదరగొడుతున్నారు. ఈ పోస్టుపై తాజాగా కేఎల్‌ రాహుల్‌ స్పందిస్తూ  ‘జెఫా’ అని కామెంట్‌ చేశారు. అయితే చాలా మందికి జెఫా అంటే ఎంటో అర్థం తెలియక ఆశ్చర్య పోతున్నారు. ఆ తర్వాత కాసేపటికి జెఫా అంటే స్పానిష్‌ భాషలో ‘బాస్‌’ అని అర్థం అంటూ ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. (‘ఈ జంట కటిఫ్‌ చెప్పేసుకున్నట్టేనా?!’)

💜

A post shared by Athiya Shetty (@athiyashetty) on

కాగా అతియా, కేఎల్‌ రాహుల్‌ ఏడాది నుంచి డేటింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఈ విషయంపై వీరు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వారిద్దరి సోషల్​మీడియా పోస్టులు మాత్రం తరచూ వైరల్​ అవుతున్నాయి. ఇటీవలే రాహుల్​ పుట్టినరోజు సందర్భంగా అతియా శుభాకాంక్షలు తెలుపుతూ ‘అతను నా వ్యక్తి’ అని సోషల్‌ మీడియాలో పేర్కొంది. ఇద్దరు కలిసి తరచూ డిన్నర్‌లు, పార్టీలకు హాజరు అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అతియా చివరిసారిగా నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన ‘మోటిచూర్ చక్నాచూర్’లో కనిపించారు. అలాగే కేఎల్‌ రాహుల్‌ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం సిద్ధంగా ఉన్నాడు. అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. (షాక్‌కు గురయ్యాను: కేఎల్‌ రాహుల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement