kings eleven punjab
-
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
దుబాయ్: ఐపీఎల్-2020 సీజన్ రెండో మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. యువ క్రికెటర్లు, సీనియర్ ఆటగాళ్లు పుష్కలంగా ఢిల్లీ జట్టే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, సందీప్ లామిచాన్ వంటి యువ క్రికెటర్స్.. శిఖర్ ధావన్, అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫినిషర్స్ కు కొదవ లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఈ జట్టులో ఉన్నారు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ అనుభవం యువ బౌలర్లకు చాలా ఉపయోగపడుతుంది. పేస్ బౌలింగ్ విభాగంలో ఇషాంత్ శర్మ, కగిసో రబడా, కీమో పాల్, మోహిత్ శర్మ, క్రిస్ వోక్స్‌లు ఉన్నారు. పంజాబ్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: ‘ప్లేఆఫ్స్‌కు చేరకపోతే నేను ఫెయిలైనట్లే’) -
రాహుల్ ఆ పదానికి అర్థం ఏంటి..
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ప్రేయసిగా ప్రచారంలో ఉన్న అతియా శెట్టి పోస్టుపై స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతియా ఇటీవల అద్దం ముందు సెల్ఫీ దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో స్విమ్ సూట్లో తన స్టిన్నింగ్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. ఈ పోస్టుపై తాజాగా కేఎల్ రాహుల్ స్పందిస్తూ ‘జెఫా’ అని కామెంట్ చేశారు. అయితే చాలా మందికి జెఫా అంటే ఎంటో అర్థం తెలియక ఆశ్చర్య పోతున్నారు. ఆ తర్వాత కాసేపటికి జెఫా అంటే స్పానిష్ భాషలో ‘బాస్’ అని అర్థం అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. (‘ఈ జంట కటిఫ్ చెప్పేసుకున్నట్టేనా?!’) View this post on Instagram 💜 A post shared by Athiya Shetty (@athiyashetty) on Aug 19, 2020 at 1:48am PDT కాగా అతియా, కేఎల్ రాహుల్ ఏడాది నుంచి డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఈ విషయంపై వీరు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వారిద్దరి సోషల్‌మీడియా పోస్టులు మాత్రం తరచూ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే రాహుల్ పుట్టినరోజు సందర్భంగా అతియా శుభాకాంక్షలు తెలుపుతూ ‘అతను నా వ్యక్తి’ అని సోషల్ మీడియాలో పేర్కొంది. ఇద్దరు కలిసి తరచూ డిన్నర్లు, పార్టీలకు హాజరు అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అతియా చివరిసారిగా నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన ‘మోటిచూర్ చక్నాచూర్’లో కనిపించారు. అలాగే కేఎల్ రాహుల్ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం సిద్ధంగా ఉన్నాడు. అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. (షాక్‌కు గురయ్యాను: కేఎల్ రాహుల్) -
కొడుకు మెరుపులు.. ‘డ్యాన్సింగ్ డ్యాడ్’ స్టెప్పులు!
మొహాలీ: యంగ్ సెన్సేషన్ శుబ్‌మన్ గిల్ మరోసారి క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవైపు శుబ్‌మన్ గిల్ రాణిస్తుంటే.. మరోవైపు అతని తండ్రి స్టెప్పులతో ప్రేక్షకుల గ్యాలరీలో హల్చల్ చేశారు. లోకల్ బాయ్ అయిన శుబ్‌మన్ గిల్ మొహాలీలో ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌కు అతని తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న తన పేరెంట్స్‌ను ఏమాత్రం డిసాపాయింట్ చేయకుండా శుబ్‌మన్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. దీంతో అతడు భారీ షాట్స్ ఆడినప్పుడల్లా భంగ్రా స్టెప్పులతో హల్చల్ చేశాడు. కోల్‌కతా జట్టు యాజమాని షారుఖ్ ఖాన్ సైతం ఈ విషయాన్ని పసిగట్టి.. మ్యాచ్ అనంతరం తన ట్వీట్లో గిల్ ‘పప్పా‘ను ప్రత్యేకంగా అభినందించారు. శుబ్‌మన్ భారీ రికార్డు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన శుబ్‌మన్.. ఆసాంతం క్రీజ్‌లో నిలిచి.. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 65 పరుగులు చేసిన గిల్‌ను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వరించింది. అద్భుతమైన షాట్లు ఆడకపోయినప్పటికీ.. చక్కని స్ట్రోక్‌ప్లేతో, మంచి తెలివైన క్రికెటింగ్ షాట్లతో క్లాసీ ఆటతీరును శుబ్‌మన్ ప్రదర్శించాడు. పంజాబ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించడంతో కోల్‌కతా ఆడుతూ.. పాడుతూ ఛేదించింది. ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్ గణనీయమైన పాత్రను పోషించాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా శుబ్‌మన్ తన పేరిట భారీ రికార్డును నెలకొల్పాడు. 20 ఏళ్ల లోపే ఐపీఎల్లో నాలుగు అర్ధసెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధించాడు. సంజు సామ్సన్, రిషభ్ పంత్ వంటి యంగ్‌స్టర్స్‌ను అధిగమించి శుబ్‌మన్ ఈ రికార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. శుబ్‌మన్ ఆటతీరుతో ముగ్ధులైన అభిమానులు ట్విటర్లో ప్రశంసల జల్లు కురిపించారు. అతను ఫ్యూచర్ విరాట్ కోహ్లి అని, భారత్ క్రికెట్లో గొప్ప ఆటగాడిగా అతను ఎదుగుతాడని కొనియాడారు. తలా కొంత దంచేశారు... 184 పరుగుల లక్ష్యఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్ ఎక్కడా వేగం తగ్గలేదు. ఓపెనర్లలో శుబ్‌మన్ సంయమనం చూపగా, లిన్ మొదటి నుంచే ధాటిగా ఆడుతూ పంజాబ్‌కు వణుకు పుట్టించాడు. అర్షదీప్ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు, అశ్విన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు. ఆండ్రూ టై ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు. మరుసటి బంతికి భారీ షాట్ ఆడబోయి టైకే క్యాచ్ ఇచ్చాడు. పవర్ ప్లే అనంతరం నైట్ రైడర్స్ 62/1తో నిలిచింది. ఉతప్ప (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాక గిల్ జూలు విదిల్చాడు. అప్పటివరకు బంతికో పరుగు చొప్పున చేస్తున్న అతడు... అశ్విన్ వేసిన 13వ ఓవర్లో విరుచుకుపడి రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టాడు. 48 బంతుల్లో 74 పరుగులుగా ఉన్న విజయ సమీకరణం దీంతో ఒక్కసారిగా 42 బంతుల్లో 54 పరుగులుగా మారిపోయింది. 36 బంతుల్లోనే గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం టై బౌలింగ్‌లో రసెల్ (14 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండు సిక్స్‌లు బాదడంతో లక్ష్యం మరింత తేలికైంది. కరన్ ఓవర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో షాట్లు కొట్టి అనుకున్నదానికంటే ముందే మ్యాచ్‌ను ముగించాడు. కీలకమైన మ్యాచ్‌లో అదీ సొంతగడ్డపై బౌలింగ్ తేలిపోవడం పంజాబ్‌ను దెబ్బతీసింది. "Shubman Gill" Future "Virat Kohli" For Team India Wt a talented boy Shot Selection look like same @imVkohli😎👌🏻🤘#KXIPvKKR #IPL @KKRiders @IPL — ಬದ್ರಿ ಶಶಿಮಠ್ (Badri Shashimath) (@badrii9999) May 3, 2019 Liked the way @RealShubmanGill is batting with maturity! Great to see a young gun learning quickly ,great signs for Indian cricket in the coming years , I guess credit to @ipl for creating opportunities for young talent @StarSportsIndia — yuvraj singh (@YUVSTRONG12) May 3, 2019 Shubman Gill....future of Indian batting is in very exciting hands. Now, take the team home....make it a habit. ☺️🤗🏏 #KXIPvKKR #IPL — Aakash Chopra (@cricketaakash) May 3, 2019 -
వాడియాపై చర్చించనున్న సీఓఏ
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియాపై శుక్రవారం ముంబైలో జరుగనున్న సమావేశంలో క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చర్చించనుంది. వాడియా... ఇటీవల జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. దీంతో అక్కడి కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత ఈ శిక్షను ఐదేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ఐపీఎల్ నైతిక నియమావళి ప్రకారం... ఫ్రాంచైజీలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆటకు అపకీర్తి తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. గతంలో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల సంబంధీకులు స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో అభియోగాలు ఎదుర్కొన్నందుకు చర్యలకు గురయ్యారు. మరోవైపు వాడియా వ్యవహారం ఇప్పటివరకు ఐపీఎల్ నైతిక విలువల కమిటీ ముందుకు రాలేదు. శుక్రవారం సమావేశంలో దీనిని చర్చించి ముగ్గురు సభ్యుల ఆఫీస్ బేరర్ల బృందానికి కానీ, సుప్రీం కోర్టు నియమిత అంబుడ్స్‌మన్–ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్‌కు కానీ నివేదించనున్నట్లు తెలుస్తోంది. బహుశా, అంబుడ్స్‌మన్‌కే ఈ బాధ్యత అప్పగిస్తారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘పంజాబ్‌పై నిషేధం’ ఊహాగానమేనని పేర్కొన్న ఆయన... ఘటనతో ఐపీఎల్‌కు నేరుగా సంబంధం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. లీగ్‌కు ఇబ్బంది అని భావిస్తేనే చర్యలుంటాయని వివరించారు. బీసీసీఐ న్యాయ బృందం, అంబుడ్స్‌మన్ దీనిపై చర్చిస్తుందని స్పష్టం చేశారు. -
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై హైదరాబాద్ ఘనవిజయం
-
‘సన్’ అదరహో
స్వదేశానికి పయనం కానున్న డాషింగ్ ఓపెనర్ వార్నర్ ఆఖరి మెరుపులు చూపాడు. హైదరాబాద్ భారీస్కోరు చేసి గెలిచింది. సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఆట విజయంతో ముగిసింది. సోమవారం అన్నీ అలా కలిసొచ్చాయి. ప్లేఆఫ్ బాటలో నిలబెట్టాయి. ఎటొచ్చి పంజాబే టాస్ నుంచి కష్టాలను కొనితెచ్చుకుంది. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పజెప్పి ఓవర్ ఓవర్‌కూ కష్టపడింది. ప్లేఆఫ్ ఆవకాశాలను క్లిష్టం చేసుకుంది. సాక్షి, హైదరాబాద్: రెండు వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ సొంతగడ్డపై ఆడిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచింది. ప్లేఆఫ్ రేసులో నిలిచింది. సోమవారం జరిగిన కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్ 45 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగుల భారీస్కోరు చేసింది. వార్నర్ (56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. లోకేశ్ రాహుల్ (56 బంతుల్లో 79; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. వార్నర్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రైజింగ్ ఆరంభం... టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపడమే సన్‌రైజర్స్‌కు వరమైంది. బ్యాటింగ్‌కు కలిసొచ్చిన పిచ్‌పై హైదరాబాద్ టాపార్డర్ అదరగొట్టింది. వార్నర్‌కు జతగా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఆరంభం నుంచే ఇద్దరు బౌండరీలు బాదడంతో 4 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. ఐదో ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో సాహా వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. మరుసటి ఓవర్లో వార్నర్ భారీ సిక్సర్ బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్లోనే మురుగన్ అశ్విన్... సాహా (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్)జోరుకు కళ్లెం వేశాడు. దీంతో 78 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన మనీశ్ పాండే అండతో వార్నర్ తన దూకుడు కొనసాగించాడు. పదో ఓవర్లోనే జట్టు 100 పరుగులు చేయగా... వార్నర్ ఫిఫ్టీ 38 బంతుల్లో పూర్తయింది. రాణించిన పాండే... చేతిలో 9 వికెట్లుండటం, పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించడంతో వార్నర్, మనీశ్ పాండే జోడీ పంజాబ్ బౌలర్లపై పరుగుల ప్రతాపం చూపించింది. దీంతో ఓవర్‌కు 10 పరుగుల సగటుతో స్కోరు బోర్డు కదిలింది. ఇద్దరు కలిసి బౌండరీ లేదంటే సిక్స్ లేకుండా ఏ ఓవర్‌నూ విడిచిపెట్టలేదు. 15వ ఓవర్లో వార్నర్, పాండే ఫోర్ బాదడంతో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది. చకచకా పరుగులు సాధిస్తున్న ఈ జోడీకి 16వ ఓవర్లో షాక్ తగిలింది. అశ్విన్ బౌలింగ్‌లో మొదట పాండే (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), తర్వాత వార్నర్ నిష్క్రమించారు. దీంతో 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మూడో బంతిని పాండే ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడగా అక్కడే కాచుకున్న షమీ చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ఆఖరి బంతిని ఆఫ్‌సైడ్‌లో కొట్టిన వార్నర్ ముజీబ్ చేతికి చిక్కాడు. 4, 6, 1, 6, 1, 1, 6, 1 అశ్విన్, షమీ 16, 17 ఓవర్లలో కలిపి 10 పరుగులే ఇచ్చారు. అయితే ఈ రెండు ఓవర్ల కట్టడి కాస్తా 18వ ఓవర్లో కట్టలు తెంచుకుంది. ముజీబుర్ రహ్మాన్ వేసిన ఆ ఓవర్లో విలియమ్సన్, నబీ సిక్సర్లతో హోరెత్తించారు. తొలి రెండు బంతుల్ని కెప్టెన్ కేన్ ఫోర్, సిక్స్‌గా బాదేశాడు. తర్వాత నబీ రెండు సిక్సర్లు కొట్టాడు. బౌలర్ కూడా 2 వైడ్లు వేసుకోవడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు లభించాయి. ఆ వెంటనే షమీ 19వ ఓవర్ వేసి విలియమ్సన్ (7 బంతుల్లో 14; ఫోర్, సిక్స్), నబీ (10 బంతుల్లో 20; 2 సిక్స్‌లు)లను ఔట్ చేయడంతో పాటు ఏడే పరుగులు ఇచ్చాడు. విజయ్ శంకర్ క్రీజులోకి రాగా జట్టు స్కోరు 200 దాటింది. ఇక ఆఖరి ఓవర్ వేసిన అర్‡్షదీప్‌సింగ్ తొలి బంతికి రషీద్ ఖాన్‌ను ఔట్ చేసి 10 పరుగులు సమర్పించాడు. ఈ రెండు డెత్ ఓవర్లలో 17 పరుగులే రాగా సన్‌రైజర్స్ మూడు వికెట్లను కోల్పోయింది. గేల్... ఒక ఫోర్, ఔట్! భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌కు క్రిస్ గేల్ (4) ఔట్ రూపంలో తొలుతే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో ఫోర్ కొట్టిన గేల్ ఆట అదేస్కోరు మీద ముగిసింది. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ తొలిబంతికి షాట్ ఆడే ప్రయత్నంలో అతను పాండేకు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత రాహుల్‌కు మయాంక్ అగర్వాల్ జతయ్యాడు. ఇద్దరు కాసేపు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. వేగం పెంచే దశలో రషీద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మయాంక్ (27) మరుసటి బంతికే నిష్క్రమించాడు. దీంతో 71 పరుగుల వద్ద రెండో వికెట్ కూలింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూరన్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడి... ఆ వేగంలోనే వికెట్‌ను పారేసుకున్నాడు. కాసేపటికే మిల్లర్ (11), అశ్విన్ (0)లను వరుస బంతుల్లో రషీద్ ఔట్ చేశాడు. మరోవైపు దూకుడుతో రాహుల్ రెండు వరుస సిక్సర్లు బాది 38 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. అనంతరం కూడా రాహుల్ పోరాటం కొనసాగింది కానీ... పంజాబ్ లక్ష్యానికి మాత్రం దూరమైంది. 19వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన రాహుల్... విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (16), ముజీబుర్ రహ్మాన్ (0) ఔటయ్యారు. -
గేల్, రాహుల్ చెలరేగితే... సన్‌రైజర్స్‌కు పరీక్ష
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో హైదరాబాద్ తలపడుతుంది. పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు గెలుపే లక్ష్యంగా సోమవారం బరిలో దిగనున్నాయి. ఎలాగైన ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను పటిష్టం చేసుకోవాలని ఇరు జట్ల ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. వార్నర్ చివరి మ్యాచ్... సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో వార్నర్, బెయిర్‌స్టో జంట అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యమే ఐదు మ్యాచ్‌ల్లో విజయాలను అందించింది. ఇప్పటికే బెయిర్‌స్టో జట్టు నుంచి వైదొలగగా... వార్నర్‌కు ఈ మ్యాచే ఈ సీజన్లో చివరిది కానుంది. ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన వార్నర్ తమ జాతీయ జట్టుతో కలిసేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. ఈ సీజన్లో సెంచరీతో సహా 7 అర్ధసెంచరీలు నమోదు చేయడం వార్నర్ విలువను చూపిస్తోంది. అత్యధిక పరుగుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వార్నర్ (611), బెయిర్‌స్టో (445) కీలక సమయంలో జట్టుకు దూరమవడంతో ప్లే ఆఫ్స్ ముందర రైజర్స్పై ఒత్తిడి అధికమైంది. రైజర్స్ ఓడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ మిడిలార్డర్ వైఫల్యం... డెత్ ఓవర్లలో బౌలింగ్ తడబాటు స్పష్టంగా కనబడుతోంది. వార్నర్ స్థానంలో ఓపెనింగ్ చేస్తోన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇప్పటివరకు తన స్థాయిని ప్రదర్శించలేదు. విజయ్ శంకర్, దీపక్ హుడా బ్యాట్ ఝళిపించలేకపోతున్నారు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో మిడిలార్డర్లో ఆల్‌రౌండర్ మనీశ్ పాండే ఆకట్టుకున్నాడు. ఇది రైజర్స్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం. షకీబుల్ హసన్ కూడా ఇప్పటివరకు ఒక్క కీలక ఇన్నింగ్స్ ఆడలేదు. నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్‌తో కూడిన పటిష్ట బౌలింగ్ విభాగం మ్యాచ్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోతోంది. డెత్ ఓవర్లలోనూ హైదరాబాద్ బౌలర్ల ఆధిపత్యం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని సన్ భావిస్తోంది. గేల్, రాహుల్ చెలరేగితే... సన్‌రైజర్స్ తరహాలోనే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో కూడా టాపార్డరే ఎక్కువగా రాణిస్తోంది. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ (444 పరుగులు), కేఎల్ రాహుల్ (441 పరుగులు) ఆ జట్టుకు పరుగులు సాధించి పెడుతున్నారు. వీరిద్దరూ బ్యాట్‌తో చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. మయాంక్ అగర్వాల్ (262) పరవాలేదనిపిస్తుండగా... డేవిడ్ మిల్లర్ (9 మ్యాచ్‌ల్లో 202 పరుగులు), సర్ఫరాజ్ ఖాన్ (8 మ్యాచ్‌ల్లో 180 పరుగులు) భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నారు. అయితే ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో యువ ఆటగాడు నికోలస్ పూరన్ ప్రదర్శన జట్టు గెలుపుపై ఆశలు రేకెత్తిస్తోంది. సన్‌రైజర్స్ మిడిలార్డర్ బలహీనతపై దెబ్బకొట్టాలని భావిస్తోన్న కెప్టె న్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ మొహమ్మద్ షమీ అందుకు సిద్ధమై మ్యాచ్ బరిలో దిగనున్నారు. -
పంజాబ్ ప్రతాపం
సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ ఆల్‌రౌండ్ ‘పంజా’కు రాజస్తాన్ రాయల్స్ తోకముడిచింది. బ్యాటింగ్‌లో టాపార్డర్ నిలకడను ప్రదర్శిస్తే... చివర్లో అశ్విన్ మెరుపు ఇన్నింగ్స్‌తో అదుర్స్ అనిపించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో పంజాబ్ పేసర్లు, స్పిన్నర్లు రాయల్స్‌ను దెబ్బ మీద దెబ్బ తీశారు. ఒక దశలో 10 ఓవర్లు ముగిసేసమయానికి పటిష్టస్థితిలో ఉన్నట్లే కనిపించిన రాజస్తాన్ మ్యాచ్ నడుస్తున్న కొద్దీ ఒత్తిడిలోకి కూరుకొని వికెట్లను సమర్పించుకుని కంగుతింది. మొహాలి: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఐపీఎల్లో ఐదో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 12 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. 8 మ్యాచ్‌లాడిన రాజస్తాన్‌కు ఇది ఆరో ఓటమి కావడంతో క్వాలిఫయర్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. మొదట కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (47 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్ (27 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ అశ్విన్ (4 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) మెరిశారు. ఆర్చర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి ఓడింది. రాహుల్ త్రిపాఠి (45 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. అర్షదీప్, అశ్విన్, షమీ తలా 2 వికెట్లు తీశారు. అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లోకేశ్ రాహుల్ ఫిఫ్టీ... టాస్ నెగ్గిన రాజస్తాన్ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపింది. దీంతో గేల్‌తో కలిసి రాహుల్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. ఉనాద్కట్ వేసిన రెండో ఓవర్లో క్రిస్ గేల్ సిక్సర్లు మొదలయ్యాయి. రెండు వరుస 6, 6లతో 12 పరుగులు వచ్చాయి. తర్వాత కులకర్ణి వేసిన ఐదో ఓవర్లో 4, 6 బాదాడు. అయితే మరుసటి ఓవర్లోనే గేల్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోరుకు ఆర్చర్ బ్రేకులేశాడు. పవర్ ప్లేలో పంజాబ్ 39/1 స్కోరు చేసింది. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇష్ సోధి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన మయాంక్, ఆ తర్వాత గోపాల్ వరుస బంతుల్ని ఫోర్, సిక్సర్‌గా మలిచాడు. కానీ ఈ జోరూ ఎంతో సేపు నిలువలేదు. ఇష్ సోధి ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అతని ఆట ముగించాడు. తర్వాత మిల్లర్ క్రీజులోకి రాగా... 10 ఓవర్లు ముగిసేసరికి కింగ్స్ 75/2 స్కోరు చేసింది. ఆ తర్వాత మూడు ఓవర్ల పాటు పంజాబ్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. 14వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఇష్ సోధి వేసిన అదే ఓవర్లో రాహుల్, మిల్లర్ చెరో సిక్సర్ కొట్టడంతో 19 పరుగులు లభించాయి. ఆ తర్వాత ఉనాద్కట్ బౌలింగ్‌లోనూ ఇద్దరు బ్యాట్ ఝళిపించడంతో మరో 20 పరుగులు జతయ్యాయి. ఈ క్రమంలో 45 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రాహుల్ ఎంతోసేపు నిలువలేదు. ఉనాద్కట్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. స్కోరు పెరగాల్సిన 19వ ఓవర్లో ఆర్చర్ 3 పరుగులే ఇచ్చి పూరన్ (5), మన్దీప్ (0) వికెట్లను తీశాడు. కులకర్ణి ఆఖరి ఓవర్ తొలి బంతికి మిల్లర్ ఔటైనా... కెప్టెన్ అశ్విన్ ఒక ఫోర్, 2 సిక్సర్లు బాదడంతో స్కోరు 180 దాటింది. రాణించిన త్రిపాఠి... ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్ రహానే ... ఈసారి బట్లర్‌కు జతగా రాహుల్ త్రిపాఠిని పంపాడు. ఇద్దరు లక్ష్యానికి తగ్గట్లే ఇన్నింగ్స్‌ను వేగంగా నడిపించారు. అయితే జోరు మీదున్న బట్లర్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను ఐదో ఓవర్లో అర్షదీప్ ఔట్ చేశాడు. తర్వాత సంజూ సామ్సన్, త్రిపాఠికి జతయ్యాడు. పవర్ ప్లేలో రాజస్తాన్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఇద్దరు క్రీజులో ఉన్నంతసేపు స్కోరు వేగం తగ్గకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించాక సామ్సన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. 97 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక అక్కడి నుంచి రాజస్తాన్ ఆట తిరోగమించింది. రాజస్తాన్ విజయానికి 24 బంతుల్లో 56 పరుగులు కావాలి. అయితే టర్నర్ (0), ఆర్చర్ (1), కెప్టెన్ రహానే (21 బంతుల్లో 26; 1 ఫోర్)లను వెంటవెంటనే ఔట్ కావడంతో రాజస్తాన్ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో స్టువర్ట్ బిన్నీ (11 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. -
సన్ ‘షాక్’నుంచి కోలుకునేనా!
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో...ఈ సీజన్లో ఇద్దరు సన్‌రైజర్స్ ఓపెనర్లు పోటీ పడి పరుగుల వరద పారించారు. ఫలితంగా సన్‌రైజర్స్ అద్భుత విజయాలతో దూసుకుపోయింది. కానీ వీరిద్దరు ఒకే మ్యాచ్‌లో విఫలమైతే? పరిస్థితి ఎలా ఉంటుందో గత మ్యాచ్ చూపించింది. సొంతగడ్డపై కూడా ముంబైకి పోటీనివ్వలేక కుప్పకూలిన రైజర్స్ ఐపీఎల్లోతమ అత్యల్ప స్కోరుకు పరిమితమైంది. ఇలాంటి ఫలితం తర్వాత సన్ తిరిగి సత్తా చాటగలదా...కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ఆసక్తికరం. మొహాలి: లీగ్‌లో వరుసగా చక్కటి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ముంబై ఇండియన్స్ బ్రేకులు వేసింది. మరో వైపు చెన్నైతో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చిన పంజాబ్ చివర్లో బోల్తా కొట్టింది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌లు ప్రత్యర్థులుగా తలపడబోతున్నాయి. సొంత మైదానంలో ఆడబోతుండటం పంజాబ్‌కు అనుకూలత కాగా...సన్ తమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. మార్పులుంటాయా... గత మ్యాచ్‌లో ఘోరంగా ఓడినా... సన్‌రైజర్స్ తమకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టునే బరిలోకి దించింది. కాబట్టి ఒక్కసారిగా మార్పులు కూడా ఊహించలేం. గెలుపు అవకాశాలు ఉండాలంటే ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో మరోసారి శుభారంభం అందించాల్సి ఉంది. ఎందుకంటే తర్వాతి ఆటగాళ్లలో ఎవరూ విజయంపై భరోసా ఇవ్వలేకపోతున్నారు. వరల్డ్ కప్ జట్టులో చోటు ఆశిస్తున్న విజయ్ శంకర్ గత మ్యాచ్‌లో బాధ్యతారహితంగా ఆడాడు. అతను కీలక పాత్ర పోషించాలి. ఆ తర్వాత మిడిలార్డర్‌పైనే సందేహాలు ఉన్నాయి. గత సీజన్‌నుంచి కూడా యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే, దీపక్ హుడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. వీరిలో ఒకరి స్థానంలో రికీ భుయ్లాంటి యువ ఆటగాడికి మ్యాచ్ దక్కే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా సాహాను కూడా పరీక్షించేందుకు సన్ ముందు అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ నబీ సన్‌రైజర్స్ తరఫున ఆడి తొలి సారి ఓటమి పక్షాన నిలిచాడు. అయితే అతనితో పాటు రషీద్ ఖాన్ కూడా ఖాయం కాబట్టి నలుగురు విదేశీ ఆటగాళ్ల విషయంలో సందేహం లేదు. ముగ్గురు ప్రధాన పేసర్లతో ఆడుతున్న రైజర్స్‌కు మొహాలి పిచ్ అనుకూలంగా ఉంటుంది. వీరిలో సిద్ధార్థ్ కౌల్, సందీప్శర్మలకు అది సొంత మైదానం కావడం విశేషం. ఇక భువనేశ్వర్ కూడా తన స్థాయికి తగినట్లుగా ఆడితే పేసర్లే మ్యాచ్ గెలిపించవచ్చు. పంజాబ్ ఏం చేస్తుందో... చెన్నైతో మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదిస్తూ కూడా పంజాబ్ గెలుపు గీత దాటలేకపోయింది. అర్ధ సెంచరీలు సాధించినా... రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ ధాటిగా ఆడకపోవడమే అందుకు కారణం. ఈ తప్పును సరిదిద్దుకుంటే జట్టు బ్యాటింగ్ బలంగా మారుతుంది. మయాంక్ అగర్వాల్ కూడా చక్కగా రాణిస్తుండగా... క్రిస్ గేల్ లీగ్ ఆరంభ దశలో చూపించిన దూకుడును మళ్లీ ప్రదర్శిస్తే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. మిల్లర్ కూడా తన స్థాయికి తగ్గట్లు మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక పంజాబ్ కొత్త హీరో స్యామ్ కరన్‌కు ఈ పిచ్ సరిగ్గా సరిపోతుంది. భారత బౌలర్ షమీ, ఆండ్రూ టై కూడా రాణించాలని అశ్విన్ సేన కోరుకుంటోంది. అశ్విన్ కూడా గత మ్యాచ్ లాగే తన బౌలింగ్‌తోనూ ఆకట్టుకుంటే ఆ టీమ్ ఖాతాలో మరో విజయం చేరుతుంది. -
ఆ నిర్ణయం ఫ్రాంచైజీదే
మొహాలి: ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‘మెంటార్ అండ్ హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్’ పదవి నుంచి తప్పుకున్న వీరేంద్ర సెహ్వాగ్ తనంతట తానుగా బయటకు రాలేదని వెల్లడించాడు. ఈ నిర్ణయం ఫ్రాంచైజీదేనని అతను స్పష్టం చేశాడు. పంజాబ్ జట్టు తమకు బ్రాండ్ అంబాసిడర్ లేదా మెంటార్ అవసరం లేదని భావించి సెహ్వాగ్ సేవలకు ముగింపు పలికింది. ‘ఫ్రాంచైజీ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. తమకు ఇకపై బ్రాండ్ అంబాసిడర్ కానీ లేదా మెంటార్ కానీ అవసరం లేదని వారు అందులో తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు పంజాబ్ జట్టులో భాగంగా ఉండటం సంతోషం. నేను తప్పుకోవాలనేది వారి నిర్ణయం. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. గతంలో ఒకసారి ప్రీతి జింటాతో చెలరేగిన వివాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. వారు కొత్త మెంటార్ లేదా కొత్త అంబాసిడర్ కావాలని కోరుకుంటే అది వారి ఇష్టం’ అని సెహ్వాగ్ చెప్పాడు. -
ముంబై బతికిపోయింది
పంజాబ్ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు రావాలి...అద్భుతంగా చెలరేగిపోతున్న లోకేశ్ రాహుల్ క్రీజ్‌లో ఉండటంతో లక్ష్యం సునాయాసంగా ఛేదించేలా కనిపించింది. అయితే బుమ్రా వేసిన మ్యాజిక్ బాల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముగించింది. మిగిలిన 9 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్ చతికిలపడింది... ఓడితే లీగ్ నుంచి నిష్క్రమించే స్థితిలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఊపిరి పోసింది. పది రోజుల క్రితం 95 పరుగులు చేసి కూడా రాజస్తాన్‌పై జట్టును గెలిపించలేకపోయిన రాహుల్ ఈసారి 94 పరుగులతో ఓటమి పక్షాన నిలిచి కన్నీళ్ల పర్యంతం కాగా... ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకొని రోహిత్ సేన సంబరపడింది. పొలార్డ్ కీలక బ్యాటింగ్‌కు తోడు బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ ముంబై ఇండియన్స్‌కు కీలక విజయాన్ని అందించాయి. ముంబై: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు అదృష్టం మళ్లీ కలిసొచ్చింది. ఓటమికి చేరువగా వచ్చి కూడా ఆ జట్టు సొంతగడ్డపై విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 3 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. ముందుగా ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (23 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, కృనాల్ పాండ్యా (23 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఆండ్రూ టై (4/16) చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (60 బంతుల్లో 94; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ కోల్పోగా, ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. మెరుపు భాగస్వామ్యం... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (15 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి శుభారంభం అందించాడు. ముఖ్యంగా రాజ్‌పుత్ వేసిన మూడో ఓవర్లో అతను 2 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోవడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. మరో ఎండ్‌లో తన తొలి బంతికే ఎవిన్ లూయీస్ (9)ను ఔట్ చేసి ఆండ్రూ టై పంజాబ్‌కు మొదటి వికెట్ అందించినా... మోహిత్ వేసిన తర్వాతి ఓవర్లో ఇషాన్ కిషన్ (12 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఒక ఫోర్, వరుసగా 2 సిక్సర్లు బాదడంతో ముంబై ఖాతాలో 18 పరుగులు చేరాయి. అయితే టై వరుస బంతుల్లో వీరిద్దరిని వెనక్కి పంపి ముంబైని దెబ్బ తీశాడు. ఆ తర్వాత రాజ్‌పుత్ బౌలింగ్‌లో వెనుదిరిగిన రోహిత్ శర్మ (6) లీగ్‌లో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఒక దశలో ముంబై వరుసగా 29 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. 10 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు 79 పరుగులకు చేరింది. సరిగ్గా ఈ సమయంలో వాంఖెడే మైదానంలో రెండు ఫ్లడ్‌లైట్లు పని చేయకపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక ముంబై ఇన్నింగ్స్‌కు కొత్త వెలుగు వచ్చింది. స్టొయినిస్ ఓవర్లో కృనాల్ 6, 6, 4తో చెలరేగగా... రాజ్‌పుత్ బౌలింగ్‌లో పొలార్డ్ వరుసగా 6, 4, 4 బాది తన పవర్‌ను ప్రదర్శించాడు. స్టొయినిస్ తర్వాతి ఓవర్లో కృనాల్ వెనుదిరిగినా... ఏమాత్రం తగ్గని పొలార్డ్ అదే ఓవర్లో మళ్లీ 4, 4, 6తో సత్తా చాటాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే సీజన్లో తొలి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కృనాల్, పొలార్డ్ 36 బంతుల్లోనే 65 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు పొలార్డ్‌ను ఔట్ చేసి అశ్విన్ ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అతను వెనుదిరిగాక ముంబై ఆఖరి 27 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్ల సహాయంతో 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెంచరీ భాగస్వామ్యం... ఛేదనను నెమ్మదిగా ప్రారంభించిన పంజాబ్ తొలి 2 ఓవర్లలో 9 పరుగులే చేసింది. అయితే హార్దిక్ పాండ్యా వేసిన మూడో ఓవర్లో గేల్ సిక్స్, ఫోర్... రాహుల్ 2 ఫోర్లు బాదడంతో జోరు పెరిగింది. అయితే గేల్ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్)ను బౌన్సర్‌తో ఔట్ చేసి మెక్లీనగన్ వాంఖెడే అభిమానుల్లో ఆనందం నింపాడు. అయితే రాహుల్, ఫించ్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లే తర్వాత ముంబై చక్కటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కొద్దిసేపు నియంత్రించింది. ఫలితంగా తర్వాతి ఆరు ఓవర్లలో 42 పరుగులే వచ్చాయి. అయితే 36 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్న అనంతరం రాహుల్ దూకుడు పెంచాడు. మార్కండే ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో పంజాబ్ విజయావకాశాలు పెంచాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫించ్ వెనుదిరగడంతో 111 పరుగుల (74 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అదే ఓవర్లో స్టొయినిస్ (1) కూడా వెనుదిరిగాడు. కటింగ్ వేసిన తర్వాతి ఓవర్లో రాహుల్ 3 ఫోర్లు కొట్టడంతో మొత్తం 15 పరుగులు లభించాయి. అయితే బుమ్రా వేసిన 19వ ఓవర్ మూడో బంతికి రాహుల్ ఔట్ కావడంతో పంజాబ్ ఆశలు గల్లంతయ్యాయి. -
బెంగళూరు బ్రహ్మాండం
ఐపీఎల్ ఆరంభం నుంచి బ్యాటింగ్‌లో ఇద్దరినే నమ్ముకొని విజయాలు సాధిస్తూ వచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆ ఇద్దరు విఫలమైతే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఒకే ఓవర్లో రాహుల్, గేల్ అవుట్... మూడు రనౌట్లు... ఏకంగా 29 బంతులు మిగిలి ఉండగానే ముగిసిన ఇన్నింగ్స్... 52 పరుగుల వ్యవధిలో పడిన 10 వికెట్లు... ఫలితంగా అశ్విన్ బృందానికి ఘోర పరాభవం... రెండు రోజుల క్రితమే ఇక్కడే 214 పరుగులు చేసిన ఆ జట్టు ఈసారి బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో 88 పరుగులకే చాప చుట్టేసి నిరాశపర్చింది. ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధిస్తే తప్ప ముందుకు వెళ్లలేని తీవ్ర ఒత్తిడిలో ఉన్న రాయల్ చాలెంజర్స్‌కు ‘బూస్ట్’లాంటి గెలుపు. ఉమేశ్ యాదవ్ అద్భుత బౌలింగ్‌కు తోడు చక్కటి ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన తర్వాత గెలుపు కోసం విరాట్ కోహ్లి ఇంకా ఆలస్యం చేయదల్చుకోలేదు. పార్థివ్‌తో కలిసి ఫటాఫట్ బ్యాటింగ్‌తో వికెట్ కూడా నష్టపోకుండా కెప్టెన్ లాంఛనం ముగించాడు. మరో 71 బంతులు ఉండగానే జట్టుకు భారీ విజయాన్ని అందించి అతి కీలకమైన రన్‌రేట్‌ను కూడా రాకెట్లా దూసుకుపోయేలా చేశాడు. ఇండోర్: ఐపీఎల్–11లో అతి చెత్త బ్యాటింగ్ ప్రదర్శన నమోదైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పని పట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యంత సునాయాస విజ యాన్ని అందుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 15.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆర్సీబీ 8.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 92 పరుగులు సాధించింది. కోహ్లి (28 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పార్థివ్ పటేల్ (22 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. వీరిద్దరి ధాటికి 49 బంతుల్లోనే విజయం ఆర్సీబీ సొంతమైంది. 52/10... సరిగ్గా నెల రోజుల క్రితం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ ఇదే ప్రత్యర్థిపై ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి తమ జట్టును గెలిపించాడు. ఇప్పుడు సరిగ్గా అవే గణాంకాల (3/23)తో అతను మరోసారి పంజాబ్ పని పట్టడం విశేషం. ఉమేశ్ వేసిన తొలి ఓవర్లోనే ‘సున్నా’ వద్ద గేల్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ పార్థివ్ వదిలేసినా దాని ప్రభావం మ్యాచ్‌పై పడలేదు. సౌతీ, ఉమేశ్ బౌలింగ్‌లో సిక్సర్లు బాది రాహుల్ (15 బంతుల్లో 21; 3 సిక్సర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా, సౌతీ వేసిన తర్వాతి ఓవర్లో గేల్ (14 బంతుల్లో 18; 4 ఫోర్లు) మూడు ఫోర్లు కొట్టాడు. అయితే 4 ఓవర్లు ముగిసే సరికి 28 పరుగులకు చేరిన పంజాబ్ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో షార్ట్ పిచ్ బంతులతో ఓపెనర్లను అవుట్ చేసి ఉమేశ్ పంజాబ్‌ను దెబ్బ తీశాడు. మూడో బంతికి గ్రాండ్‌హోమ్ చక్కటి క్యాచ్‌కు రాహుల్ వెనుదిరగ్గా... చివరి బంతికి సిరాజ్ పట్టిన క్యాచ్‌తో గేల్ ఆట ముగిసింది. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడి డగౌట్ చేరారు. మరో రెండు బంతులకే నాయర్ (1)ను సిరాజ్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లో స్టొయినిస్ (2)ను చహల్ బౌల్డ్ చేశాడు. మయాంక్ అగర్వాల్ (2) కూడా ఎక్కువ సేపు నిలవకపోవడంతో పంజాబ్ పరిస్థితి దారుణంగా మారింది. మరో ఎండ్‌లో ఫించ్ మాత్రం కొన్ని షాట్లతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే మొయిన్ అలీ తన తొలి ఓవర్లోనే ఫించ్‌ను వెనక్కి పంపగా...అదే ఓవర్లో లేని పరుగు కోసం ప్రయత్నించి రవిచంద్రన్ అశ్విన్ (0) రనౌటయ్యాడు. తర్వాతి మూడు వికెట్లను తీసేందుకు బెంగళూరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయింది. వీటిలో చివరి రెండు వికెట్లు రనౌట్ల రూపంలోనే వచ్చాయి. అవలీలగా... సునాయాస లక్ష్యాన్ని ఆర్సీబీ ఏమాత్రం అలసట లేకుండా ఛేదించేసింది. అశ్విన్ వేసిన తొలి ఓవర్లో 9 పరుగులు రాబట్టిన బెంగళూరు, టై వేసిన రెండో ఓవర్లో పార్థివ్ ఫోర్లతో 11 పరుగులు సాధించింది. రాజ్‌పుత్ వేసిన మూడో ఓవర్లోనైతే కోహ్లి చెలరేగిపోయాడు. సిక్స్, రెండు ఫోర్లు బాదడంతో మరో 16 పరుగులు ఆర్సీబీ ఖాతాలో చేరాయి. ఆ తర్వాత మోహిత్ తొలి ఓవర్లో పార్థివ్ మూడు బౌండరీలతో దూకుడు ప్రదర్శించాడు. టై ఓవర్లో కోహ్లి మళ్లీ 4, 6 కొట్టడంతో పవర్ ప్లే ముగిసి సరికే ఆ జట్టు స్కోరు 66 పరుగులకు చేరింది. మిగిలిన పరుగులు సాధించేందుకు బెంగళూరుకు 13 బంతులు సరిపోయాయి. ► 3 ఐపీఎల్లో 10 వికెట్ల తేడాతో గెలవడం బెంగళూరుకు ఇది మూడో సారి. ఏ జట్టు కూడా ఒకసారికి మించి గెలవలేదు. ► 5 ఉమేశ్‌కు పంజాబ్‌పై ఇది ఐదో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. గతంలో యూసుఫ్ పఠాన్ (దక్కన్ చార్జర్స్‌పై) మాత్రమే ఒకే ప్రత్యర్థిపై ఇన్ని సార్లు ఈ ఘనత సాధించాడు. పంజాబ్‌పై అతను ఏడు సార్లు మ్యాచ్‌లో కనీసం మూడేసి వికెట్లు పడగొట్టాడు. మరే బౌలర్ ఐదు సార్లకు మించి ఈ గణాంకం నమోదు చేయలేదు. ► 1 ఐదు ఐపీఎల్ సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడు కోహ్లి. వార్నర్ 4 సార్లు ఈ ఘనత సాధించాడు. -
ఓహో లోకేశ్ రాహుల్
కింగ్స్ ఎలెవన్ మొదట స్పిన్‌తో కట్టేసింది. తర్వాత బ్యాటింగ్‌లో చితగ్గొట్టింది. దాని పంజా(బ్) ధాటికి రాజస్తాన్ రాయల్స్ నిలువలేకపోయింది. ముజీబ్ తన స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగా... తర్వాత బ్యాటింగ్‌లో ఓపెనర్ లోకేశ్ రాహుల్ కడదాకా నిలిచి గెలిపించాడు. జట్టును ప్లే–ఆఫ్‌కు చేరువ చేశాడు. ఇండోర్: పంజాబ్ ఆల్‌రౌండ్ షోకు రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. మొదట ముజీబుర్ రెహమాన్ (3/27) ముచ్చెమటలు పట్టించగా, లోకేశ్ రాహుల్ (54 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత ప్రదర్శనతో గెలిపించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో రాయల్స్‌పై నెగ్గింది. తొలుత రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. బట్లర్ (39 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ 3, ఆండ్రూ టై 2 వికెట్లు తీశారు. తర్వాత పంజాబ్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. కరుణ్ నాయర్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ సీజన్లో రాజస్తాన్కిది ఆరో ఓటమి కాగా, పంజాబ్ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బట్లరే బాగా ఆడాడు... రాజస్తాన్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ భారీ స్కోరు చేస్తుందనిపించేలా సాగలేదు. ఆ జట్టులో బట్లర్ ఒక్కడే నిలిచాడు. మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా అడేసిపోయారంతే. సంజు శామ్సన్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ గోపాల్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఓ చెయ్యేశారు. టాస్ నెగ్గిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను బట్లర్, షార్ట్ ప్రారంభించారు. కానీ ఆట మొదలైన మూడో బంతికే షార్ట్ (2), కాసేపటికి కెప్టెన్ రహానే (5) నిష్క్రమించారు. తర్వాత శామ్సన్ అండతో బట్లర్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. దీంతో పది ఓవర్ల దాకా మరో వికెట్ కోల్పోకుండా 81 పరుగులు చేసింది. కానీ ఆ మరుసటి ఓవర్లోనే శామ్సన్ ఔట్ కావడంతో రాయల్స్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. మరోవైపు బట్లర్ (37 బంతుల్లో, 7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముజీబ్ మ్యాజిక్ అయితే ముజీబ్ సూపర్ స్పెల్‌తో రాజస్తాన్ ఇన్నింగ్స్ కకావికలమైంది. 13వ ఓవర్లో స్టోక్స్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను ఔట్ చేసిన ముజీబ్... 15వ ఓవర్ తొలి బంతికి బట్లర్‌ను, రెండో బంతికి ఆర్చర్ (0)ను పెవిలియన్ చేర్చాడు. వీరంతా 6 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో శ్రేయస్ గోపాల్ కాసేపు పోరాడంతో 150 దాటింది. అశ్విన్, రాజ్‌పుత్, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు. పడుతూ... లేస్తూ... లక్ష్యం సునాయాసమే కానీ... పంజాబ్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఓపెనర్ గేల్ (8)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ మయాంక్ (2) విఫలమయ్యాడు. దీంతో మరో ఓపెనర్ కె.ఎల్.రాహుల్ బాధ్యతగా ఆడాడు. కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మూడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక నాయర్‌ను అనురీత్, అక్షర్ పటేల్ (4)ను గౌతమ్ పెవిలియన్ చేర్చారు. 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా... స్టోయినిస్ (16 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో రాహుల్ (44 బంతుల్లో; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రన్‌రేట్ పెరిగిపోతున్న దశలో రాహుల్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. చివరి 24 బంతుల్లో 43 కొట్టాల్సిన సమయంలో ఆర్చర్ వేసిన ఓవర్లో సిక్స్, ఫోర్ సహా 16 పరుగులు వచ్చాయి. తర్వాత రాహుల్... ఉనాద్కట్ బౌలింగ్‌లో 15 పరుగులు చేశాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 12గా మారింది. రాహుల్ సిక్స్, ఫోర్ బాది 8 బంతులు మిగిలి ఉండగానే గెలుపు తీరం చేర్చాడు. రాయల్స్ బౌలర్లలో గౌతమ్, ఆర్చర్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) రాహుల్ (బి) ముజీబ్ 51; షార్ట్ (సి) టై (బి) అశ్విన్ 2; రహానే (సి) గేల్ (బి) పటేల్ 5; శామ్సన్ (సి) నాయర్ (బి) టై 28; స్టోక్స్ (సి) తివారి (బి) ముజీబ్ 12; త్రిపాఠి (సి) అశ్విన్ (బి) టై 11; ఆర్చర్ (బి) ముజీబ్ 0; గౌతమ్ (సి) స్టొయినిస్ (బి) రాజ్‌పుత్ 5; గోపాల్ రనౌట్ 24; ఉనాద్కట్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–3, 2–35, 3–84, 4–100, 5–106, 6–106, 7–114, 8–129, 9–152. బౌలింగ్: అశ్విన్ 4–0–30–1, రాజ్‌పుత్ 3–0–37–1, ముజీబ్ 4–0–27–3, అక్షర్ పటేల్ 4–0–21–1, టై 4–0–24–2, స్టొయినిస్ 1–0–6–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 84; గేల్ (సి) శామ్సన్ (బి) ఆర్చర్ 8; అగర్వాల్ (సి) త్రిపాఠి (బి) స్టోక్స్ 2; నాయర్ (బి) అనురీత్ సింగ్ 31; అక్షర్(సి) షార్ట్ (బి) గౌతమ్ 4; స్టొయినిస్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–23, 2–29, 3–79, 4–87. బౌలింగ్: గౌతమ్ 3–0–18–1, ఆర్చర్ 3.4–0–43–1, స్టోక్స్ 3–0–22–1, ఉనాద్కట్ 4–0–26–0, గోపాల్ 3–0–26–0, అనురీత్ సింగ్ 2–0–20–1. -
మళ్లీ 'సన్' చలనం
సన్‌రైజర్స్ బౌలింగ్ సత్తా మరోసారి ప్రదర్శితమైంది. ఐపీఎల్లో తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో తమకు తామే సాటి అనిపించుకున్న హైదరాబాద్ టీమ్ సొంతగడ్డపై మరోసారి ఆ సంచలనాన్ని చేసి చూపించింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రెండు రోజుల క్రితం 118 పరుగులే చేసి మ్యాచ్ గెలుచుకున్న రైజర్స్ ఇప్పుడు 132 పరుగులు చేసి మళ్లీ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ 42 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 13 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మనీశ్ పాండే (51 బంతుల్లో 54; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, షకీబుల్ హసన్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) రాణించాడు. పంజాబ్ బౌలర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంకిత్ రాజ్‌పుత్ 14 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ఈ సీజన్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రషీద్ ఖాన్ 19 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి హైదరాబాద్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. లక్కీ పాండే... 4, 9, 46 ... పంజాబ్ ఫీల్డర్లు మనీశ్ పాండే ఇచ్చిన మూడు క్యాచ్‌లను వదిలేసినప్పుడు అతని స్కోర్లు ఇవి. అతని క్యాచ్ పట్టడమే పాపం అన్నట్లుగా ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్ సాగింది. వారి సహకారంతో అర్ధ సెంచరీ చేసుకోగలిగిన పాండే వల్లే రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. యువ పేసర్ రాజ్‌పుత్ పదునైన బౌలింగ్‌తో సన్ పతనానికి శ్రీకారం చుట్టాడు. ఫామ్‌లో ఉన్న విలియమ్సన్ (0) నాలుగో బంతికే వెనుదిరగ్గా, రాజ్‌పుత్ తర్వాతి ఓవర్లో శిఖర్ ధావన్ (11) కూడా అవుటయ్యాడు. సాహా (6)ను కూడా డగౌట్ చేర్చి అతను వరుసగా మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్, టై క్యాచ్‌లు వదిలేయడంతో మరో అవకాశం దక్కించుకున్న పాండే... సున్నా వద్ద ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చినా నోబాల్ కావడంతో బతికిపోయిన షకీబ్ కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. అశ్విన్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన పాండేకు మళ్లీ లైఫ్ లభించింది. 48 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. 7 పరుగుల వద్ద తివారీ క్యాచ్ వదిలేసిన అనంతరం చివర్లో యూసుఫ్ పఠాన్ (19 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించాడు. వికెట్ల వరుస కట్టి... 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ సాధారణ రీతిలోనే ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లలో ఆ జట్టు 14 పరుగులు చేసింది. ఆ తర్వాత నబీ వేసిన నాలుగో ఓవర్లో రాహుల్ వరుసగా 6, 4, 4తో దూకుడు ప్రదర్శించాడు. మరో ఎండ్‌లో గేల్ కూడా రెండు సిక్సర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అయితే నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి రైజర్స్ దెబ్బ తీసింది. రాహుల్‌ను రషీద్ బౌల్డ్ చేయగా, గేల్ (22 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు)ను థంపి వెనక్కి పంపాడు. మయాంక్ అగర్వాల్ (12) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. రషీద్ అద్భుత బౌలింగ్‌కు కరుణ్ నాయర్ (13) వెనుదిరగ్గా, ఫించ్ (8)ను షకీబ్ అవుట్ చేశాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మనోజ్ తివారి (1) కూడా విఫలం కావడంతో పంజాబ్ పరిస్థితి దిగజారింది. అశ్విన్ (4) కూడా చేతులెత్తేయడంతో కింగ్స్ కుప్పకూలింది. -
రాహుల్ జిగేల్
మెరుపు షాట్లు... వీర విజృంభణ... తుఫాన్ ఇన్నింగ్స్ వంటి వర్ణనల కలబోతతో... కేఎల్ రాహుల్ విరుచుకు పడిన వేళ... ఢిల్లీ డేర్ డేవిల్స్ను బోల్తా కొట్టించి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ గెలుపు బోణి కొట్టింది. విధ్వంసకర ఆటతో పదకొండేళ్ల ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన (14 బంతుల్లో) అర్ధ శతకం నమోదు చేసిన రాహుల్ ఇన్నింగ్స్‌కు... కరుణ్ నాయర్ సమయోచిత ఆట తోడవడంతో కింగ్స్ ఎలెవన్ గెలుపు దిశగా అలవోకగా సాగిపోయింది. వీరిద్దరి దూకుడు ముందు లక్ష్యం చిన్నబోగా గంభీర్ సేన చేసేదేమీ లేకపోయింది. మొహాలీ: కొత్త కెప్టెన్ అశ్విన్ సారథ్యంలో సొంతగడ్డపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ శుభారంభం చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (16 బంతుల్లో 51; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను 6 వికెట్లతో ఓడించింది. కీలక సమయంలో కరుణ్ నాయర్ (33 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని మరో 7 బంతులు ఉండగానే అందుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కెప్టెన్ గంభీర్ (42 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం సాధించాడు. పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ (2/33), ముజిబుర్ రహమాన్ (2/28) రాణించగా, అశ్విన్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. రాహుల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ధనాధన్ ఇన్నింగ్స్... లక్ష్యం... 167. ప్రత్యర్థి జట్టులో బౌల్ట్, షమీ, అమిత్ మిశ్రా వంటి బౌలర్లు ఉన్నా రాహుల్ ఎదుట అంతా తేలిపోయారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే అతడు 16 పరుగులు బాదేశాడు. 2వ (షమీ) ఓవర్లో 11, 3వ (మిశ్రా) ఓవర్లో 24 పరుగులతో 14 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. ఈ క్రమంలో యూసుఫ్ పఠాన్ (15 బంతుల్లో 2015 సన్‌రైజర్స్‌పై) పేరిట ఉన్న ఐపీఎల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు. మూడు ఓవర్ల అనంతరం పంజాబ్ స్కోరు 52 కాగా... అందులో రాహుల్‌వే 51 పరుగులు కావడం తానెంతగా వీర విహారం చేశాడో చెబుతోంది. ఈ జోరు చూస్తే పంజాబ్ 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేస్తుందా? అనిపించింది. అయితే రాహు ల్తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7)ను వరుస ఓవర్లలోఅవుట్ చేసి ఢిల్లీ బౌలర్లు పరువు దక్కించుకున్నారు. వన్‌డౌన్‌లో వచ్చిన యువరాజ్ సింగ్(12) తడబడుతున్నా... కరుణ్ నాయర్ స్వేచ్ఛగా ఆడటంతో పంజాబ్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. లక్ష్యానికి 25 పరుగుల దూరంలో నాయర్ అవుటైనా.. మిల్లర్ (24 నాటౌట్), స్టొయినిస్ (22 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ముజిబుర్ రికార్డు ఈ మ్యాచ్‌తో అఫ్గానిస్తాన్‌కు చెందిన స్పిన్నర్ ముజిబుర్ రహమాన్ (17 ఏళ్ల 11 రోజులు) ఐపీఎల్ టోర్నీలో బరిలో దిగిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు సర్ఫరాజ్ ఖాన్ (17 ఏళ్ల 277 రోజలు) పేరిట ఉండేది. సంక్షిప్త స్కోర్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్: 166/7 (20 ఓవర్లలో) (గంభీర్ 55, రిషభ్ పంత్ 28, మోరిస్ నాటౌట్ 27; అశ్విన్ 1/23, మోహిత్ శర్మ 2/33, ముజిబుర్ 2/28), పంజాబ్ కింగ్స్ ఎలెవన్: 167/4 (18.5 ఓవర్లలో) (కేఎల్ రాహుల్ 51, కరుణ్ నాయర్ 50, మిల్లర్ నాటౌట్ 24, స్టొయినిస్ నాటౌట్ 22; బౌల్ట్ 1/34, మోరిస్ 1/25, క్రిస్టియాన్ 1/12, తేవటియా 1/24). -
ఐపీఎల్: గేల్ ఈ సారైనా..
సాక్షి, హైదరాబాద్ : 20 క్రికెట్లో క్రిస్‌గేల్ విద్వంసకర ఆటగాడు.. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సమర్ధుడు. బంతిని అవలీలగా బౌండరీ దాటించగల సత్తా ఉన్నవాడు. కానీ ఒక్కసారి కూడా జట్టుకు ఐపీఎల్ కప్‌ను అందించలేకపోయాడు. పది ఐపీఎల్‌లు ఆడిన గేల్ గత రెండు సీజన్లలో మాత్రం అంచనాలను అందుకోలేక పోయాడు. దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బెంగుళూరు జట్టు వదుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా గేల్‌లో కసి రగులుతుందా.. ఈ సీజన్లోనైనా గేల్ సునామీని చూడొచ్చా అంటూ క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2011, 2012, 2013 సీజన్లలో సుమారు 60కి పైగా సగటు నమోదు చేశాడు గత రెండు సీజన్లు మొత్తం కలుపుకొని గేల్ చేసిన అర్ధ సెంచరీలు రెండు చివరి రెండు ఐపీఎల్ సీజన్లలో గేల్ సగటు 22.47 మాత్రమే జట్టు మారితేనైనా గేల్ ఆటతీరు మారకపోతుందా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడైనా గేల్ మైదానంలో బంతులను సిక్సర్లకు మళ్లించగలిగితే ఇక పండుగే. పంజాబ్ తరపున సత్తా చాటాలని, తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా అశ్విన్
ఐపీఎల్లో తమ జట్టు కెప్టెన్‌గా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యవహరిస్తాడని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ... ‘యువరాజ్, గేల్‌లాంటి మేటి ఆటగాళ్లున్న జట్టుకు సారథిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. కెప్టెన్సీతో నాపై అదనపు ఒత్తిడేమీ ఉండదు. 21 ఏళ్ల వయసులోనే తమిళనాడుకు సారథ్యం వహించా. ఈసారీ ఆ సవాల్‌ను ఆస్వాదిస్తా’ అని అన్నాడు. ఎనిమిదేళ్లపాటు చెన్నై, రెండు సీజన్లుగా పుణే జట్టుకు ఆడిన అశ్విన్‌ను ఈసారి పంజాబ్ దక్కించుకుంది. -
సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్..
-
ముచ్చటగా మూడోది
► సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ విజయం ► 5 వికెట్లతో పంజాబ్ చిత్తు ► చెలరేగిన సన్ బౌలర్లు ► వార్నర్ నాలుగో అర్ధ సెంచరీ వార్నర్ టాస్ గెలిచాడు... వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు... వార్నర్ మళ్లీ వేగంగా అర్ధసెంచరీ చేశాడు... రీప్లే షో లాగా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అదే వ్యూహం, మళ్లీ అదే ఫలితం. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగింది. ఫలితంగా జట్టుకు ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయం. ముందుగా సన్ బౌలర్లు చెలరేగి ప్రత్యర్థిని కట్టడి చేస్తే, ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ తమ పని పూర్తి చేశారు. ముఖ్యంగా ముస్తఫిజుర్‌ను ఆడలేక పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత హైదరాబాద్ 13 బంతుల ముందే గమ్యం చేరింది. వరుస వికెట్లతో కొంత తడబడినా పెద్దగా ఇబ్బంది లేకుండానే గెలుపును అందుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9లో సన్‌రైజర్స్ బండి వేగం పుంజుకుంది. లక్ష్యాన్ని వేటాడటంలో గురి తప్పకుండా దూసుకుపోతూ మరో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (34 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, చివర్లో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. సన్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ముస్తఫిజుర్, హెన్రిక్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (31 బంతుల్లో 59; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్లో నాలుగో అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించగా, మరోసారి శిఖర్ ధావన్ (44 బంతుల్లో 45; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 59 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. రాణించిన మార్ష్, అక్షర్: గత మ్యాచ్ ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే సన్ బరిలోకి దిగింది. భువనేశ్వర్ చక్కటి బంతితో విజయ్ (2)ను అవుట్ చేయడంతో పంజాబ్ ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన వోహ్రా (23 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ముస్తఫిజుర్ ఓవర్లో ఇబ్బంది పడిన తర్వాత లేని పరుగు కోసం ప్రయత్నించి శిఖర్ ధావన్ త్రోకు రనౌటయ్యాడు. షాన్ మార్ష్ ఒక్కడే కొద్దిగా పోరాడినా, మిల్లర్ (9), మ్యాక్స్‌వెల్ (1) వైఫల్యం పంజాబ్‌ను దెబ్బ తీసింది. ఈ ఇద్దరినీ హెన్రిక్స్ ఒకే ఓవర్లో వెనక్కి పంపించాడు. హుడా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి దూకుడు కనబర్చిన మార్ష్‌ను ముస్తఫిజుర్ అవుట్ చేయడంతో ఆ జట్టు మరింత ఇబ్బందుల్లో పడింది. అయితే నిఖిల్ నాయక్ (28 బంతుల్లో 22; 1 ఫోర్) అండగా అక్షర్ పటేల్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. భువీ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన అక్షర్, హెన్రిక్స్ ఓవర్లోనూ సిక్స్ కొట్టి జోరు ప్రదర్శించాడు. అక్షర్, నాయక్ ఆరో వికెట్‌కు 35 బంతుల్లోనే 50 పరుగులు జోడించి పంజాబ్‌ను ఆదుకున్నారు. చెలరేగిన కెప్టెన్: తొలి ఓవర్లో, రెండో ఓవర్లో శిఖర్ ధావన్ ఒక్కో ఫోర్ కొట్టాడు. అంతే... తర్వాత అతడిని మరో ఎండ్‌లో నిలబెట్టి వార్నర్ పరుగుల ప్రవాహం మొదలైంది. సందీప్ ఓవర్లో 2 సిక్సర్లు, 1 ఫోర్... అబాట్ ఓవర్లో 2 ఫోర్లు... మ్యాక్స్‌వెల్ ఓవర్లో సిక్స్, ఫోర్... ఈ జోరు ఇలాగే కొనసాగింది. చూస్తూ ఉండగానే 23 బంతుల్లోనే వార్నర్ అర్ధసెంచరీ పూర్తయింది. ఈ హాఫ్ సెంచరీలో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సీజన్లో ఐదు మ్యాచ్‌లలో నాలుగో అర్ధ సెంచరీ సాధించిన అనంతరం వార్నర్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే తారే (0) కూడా రనౌటయ్యాడు. అయితే తొలి 10 ఓవర్లలోనే 90 పరుగులు చేసిన హైదరాబాద్‌కు ఆ తర్వాత మిగిలిన పరుగులు సాధించడంలో పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. 14వ ఓవర్ చివరి బంతికి ధావన్ వెనుదిరిగిన తర్వాత మోర్గాన్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. స్కోరు వివరాలు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 2; వోహ్రా (రనౌట్) 25; మార్ష్ ఎల్బీడబ్ల్యూ (బి) ముస్తఫిజుర్ 40; మిల్లర్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 9; మ్యాక్స్‌వెల్ (సి) ముస్తఫిజుర్ (బి) హెన్రిక్స్ 1; నాయక్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 22; అక్షర్ (నాటౌట్) 36; రిషి ధావన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1-14; 2-35; 3-63; 4-65; 5-89; 6-139. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-1; బరీందర్ 4-0-33-0; హుడా 4-0-30-0; ముస్తఫిజుర్ 4-1-9-2; హెన్రిక్స్ 4-0-33-2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మిల్లర్ (బి) సందీప్ 59; ధావన్ (సి) నాయక్ (బి) రిషి ధావన్ 44; తారే (రనౌట్) 0; మోర్గాన్ (సి) వోహ్రా (బి) మోహిత్ 25; హుడా (రనౌట్) 5; హెన్రిక్స్ (నాటౌట్) 5; ఓజా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-90; 2-90; 3-115; 4-139; 5-139. బౌలింగ్: సందీప్ 4-0-30-1; అబాట్ 3-0-34-0; మ్యాక్స్‌వెల్ 2-0-16-0; మోహిత్ 3-0-20-1; రిషి ధావన్ 4-0-35-1; అక్షర్ 1.5-0-11-0. -
లయన్స్ గర్జన
► తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం ► 5 వికెట్లతో పంజాబ్ చిత్తు ► బ్రేవోకు నాలుగు వికెట్లు ► చెలరేగిన ఫించ్, దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ముందు బౌలింగ్‌లో ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన ఆ జట్టు లీగ్‌లో విజయంతో బోణీ చేసింది. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ అయిన రైనా, ఇప్పుడు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. వోహ్రా, మురళీ విజయ్‌ల శుభారంభం తర్వాత పంజాబ్‌ను లయన్స్ బౌలర్లు కట్టడి చేశారు. ‘చాంపియన్’ బ్రేవో రెండు ఓవర్లలో రెండేసి వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బతీయగా... ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఫించ్ మెరుపులు, చివర్లో దినేశ్ కార్తీక్ దూకుడు గుజరాత్‌ను గెలిపించాయి. మొహాలి: ఐపీఎల్లో మొదటిసారి బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో లయన్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మురళీ విజయ్ (34 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బ్రేవో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం గుజరాత్ లయన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ (47 బంతుల్లో 74; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. ఆకట్టుకున్న ఓపెనర్లు.. ఓపెనర్లు విజయ్, వోహ్రా దూకుడుగా ఆడి కింగ్స్ ఎలెవన్‌కు శుభారంభం అందించారు. ఫాల్క్‌నర్ వేసిన ఓవర్లో వోహ్రా మూడు ఫోర్లు బాదడంతో జోరు పెరిగింది. అదే ఓవర్లో బ్రేవో క్యాచ్ వదిలేయడంతో వోహ్రా బతికిపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు విజయ్, వోహ్రా 50 బంతుల్లో 78 పరుగులు జోడించిన అనంతరం జడేజా ఈ జోడీని విడదీశాడు. వోహ్రా, కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే విజయ్ను కూడా జడేజా బౌల్డ్ చేశాడు. ఈ రెండు వికెట్ల తర్వాత లయన్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. బ్రేవో తన రెండో ఓవర్లో చెలరేగి రెండు కీలక వికెట్లు తీశాడు. అతని స్లో బంతులకు మ్యాక్స్‌వెల్ (2), మిల్లర్ (15; 1 ఫోర్, 1 సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ దశలో స్టొయినిస్ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు), సాహా (25 బంతుల్లో 20) పంజాబ్‌ను ఆదుకున్నారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 45 బంతుల్లో 55 పరుగులు జత చేశారు. చివరి ఓవర్లో బ్రేవో మళ్లీ సత్తా చాటి సాహా, స్టొయినిస్‌లను పెవిలియన్ పంపించాడు. కీలక భాగస్వామ్యాలు... తొలి ఓవర్లోనే గుజరాత్‌కు షాక్ తగిలింది. సందీప్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన మెకల్లమ్ (0) స్టంపౌటయ్యాడు. అయితే ఫించ్ దూకుడుగా ఆడగా, ఉన్న కొద్దిసేపు రైనా (9 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించడంతో జట్టు ఇన్నింగ్స్‌లో వేగం తగ్గలేదు. వీరిద్దరు రెండో వికెట్‌కు 27 బంతుల్లోనే 51 పరుగులు జోడించడం విశేషం. రైనా వెనుదిరిగినా... మరో ఎండ్‌లో ఫించ్ 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి దినేశ్ కార్తీక్ అండగా నిలిచాడు. ఫించ్, కార్తీక్ 38 బంతుల్లోనే 65 పరుగులు జత చేశారు. ఈ దశలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫించ్ స్టంపౌట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత జడేజా (8) రనౌట్‌తో పాటు, కిషన్ (11) వెనుదిరగడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరో 14 బంతులు మిగిలి ఉండగానే కార్తీక్ మ్యాచ్‌ను ముగించాడు. ►1 బ్రెండన్ మెకల్లమ్ 42 ఇన్నింగ్స్‌ల తర్వాత ఐపీఎల్లో మరోసారి డకౌట్ అయ్యాడు. తొలి నాలుగు సీజన్లలో మెకల్లమ్ 35 ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు ► 4/22 ఐపీఎల్లో డ్వేన్ బ్రేవో తన వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ► 300 టి20 క్రికెట్లో డ్వేన్ బ్రేవో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 299 వికెట్లతో మలింగ రెండో స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (బి) జడేజా 42; వోహ్రా (సి) కార్తీక్ (బి) జడేజా 38; మిల్లర్ (బి) బ్రేవో 15; మ్యాక్స్‌వెల్ (బి) బ్రేవో 2; సాహా (సి) జడేజా (బి) బ్రేవో 20; స్టొయినిస్ (సి) ఫించ్ (బి) బ్రేవో 33; అక్షర్ పటేల్ (నాటౌట్) 4; జాన్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-78; 2-91; 3-101; 4-102; 5-157; 6-157. బౌలింగ్: ప్రవీణ్ 4-0-25-0; సాంగ్వాన్ 2-0-21-0; ఫాల్క్‌నర్ 4-0-39-0; లడ్డా 2-0-21-0; జడేజా 4-0-30-2; బ్రేవో 4-0-22-4. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (స్టంప్డ్) సాహా (బి) సాహూ 74; మెకల్లమ్ (స్టంప్డ్) సాహా (బి) సం దీప్ 0; రైనా (సి) జాన్సన్ (బి) స్టొయినిస్ 20; కార్తీక్ (నాటౌట్) 41; జడేజా (రనౌట్) 8; ఇషాన్ కిషన్ (సి) శర్మ (బి) జాన్సన్ 11; బ్రేవో (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-1; 2-52; 3-117; 4-133; 5-151. బౌలింగ్: సందీప్ 3-0-21-1; జాన్సన్ 4-0-35-1; మోహిత్ 2.4-0-24-0; స్టొయినిస్ 2-0-27-1; అక్షర్ పటేల్ 2-0-17-0; సాహూ 4-0-35-1. -
రెండో సారి ఐపీఎల్ విజేతగా కోల్‌కతా
-
డబుల్’ రైడర్స్
-
‘డబుల్’ రైడర్స్
రెండో సారి ఐపీఎల్ విజేతగా కోల్‌కతా ఫైనల్లో 3 వికెట్లతో పంజాబ్‌పై గెలుపు కింగ్స్ ఎలెవన్‌కు తీవ్ర నిరాశ మనీశ్ పాండే అద్భుత ఇన్నింగ్స్ సాహా సెంచరీ వృథా పైజ్మనీ కోల్‌కతా: రూ. 15 కోట్లు పంజాబ్: రూ. 10 కోట్లు 18904 ఈ సీజన్ ఐపీఎల్లో మొత్తం పరుగులు 3 నమోదైన సెంచరీలు 671 సీజన్లో మొత్తం వికెట్లు 36 అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు (మ్యాక్స్‌వెల్) కోల్‌కతా మళ్లీ సాధించింది...రెండేళ్లనాటి అద్భుత ప్రదర్శనను పునరావృతం చేసింది. సీజన్ ఆరంభంలో పేలవంగా ఆడిన గంభీర్ సేన... టోర్నీ ద్వితీయార్ధంలో సంచలన ఆటతీరు కనబరచింది. ప్రత్యర్థి భారీ స్కోరు చేసినా బెదరకుండా... ఆత్మవిశ్వాసంతో ఆడి షారుఖ్‌కు మరో టైటిల్‌ను కానుకగా అందించింది. రెండు కొదమసింహాల్లాంటి జట్ల మధ్య జరిగిన భారీ స్కోర్ల పోరాటంలో పంజాబ్ చేతులెత్తేసింది. సాహా అద్భుతమైన సెంచరీ చేసినా ప్రీతి జింటా టైటిల్ కరవును తీర్చలేకపోయాడు. ఫైనల్లో కోల్‌కతా గెలిచినా... రెండు జట్ల పోరాటంతో క్రికెట్ అభిమానులు మాత్రం చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు. బెంగళూరు: మూడు వారాల క్రితం... ఈ సీజన్ ఐపీఎల్లో సగం మ్యాచ్‌లు ముగిశాక... కోల్‌కతా టైటిల్ గెలుస్తుందని ఎవరైనా అంటే అదో పెద్ద జోక్. తాము ప్లే ఆఫ్‌కు చేరడమే గొప్ప అని ఆ జట్టు కెప్టెన్ స్వయంగా చెప్పిన పరిస్థితి. అలాంటి కోల్‌కతా మ్యాజిక్ చేసింది. వరుసగా 9వ మ్యాచ్‌లో గెలిచి ఔరా అనిపించింది. ఇన్నాళ్లూ గెలిచిన మ్యాచ్‌లు ఒకెత్తయితే... ఈసారి ఫైనల్లో పంజాబ్‌ను ఓడించడం మరో ఎత్తు. వరుసగా రెండు సార్లు కోల్‌కతా చేతిలో ఓడి కసి మీదున్న పంజాబ్ తమ సర్వశక్తులూ ఒడ్డి భారీ స్కోరు సాధించినా... సమష్టి మంత్రంతో రాణించిన నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-7 విజేతగా నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో... టాస్ గెలిచిన గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 115 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. మనన్ వోహ్రా (52 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మూడు బంతుల ముందే మ్యాచ్ ముగించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (50 బంతుల్లో 94; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ప్రదర్శనతో పాటు యూసుఫ్ పఠాన్ (22 బంతుల్లో 36; 4 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 2012లో ఐపీఎల్ టోర్నీ నెగ్గిన కోల్‌కతా రెండో సారి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకొని చెన్నైతో సమంగా నిలవడం విశేషం. ‘ఆహా’ అనిపించాడు గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించిన సెహ్వాగ్ (7)తో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన కెప్టెన్ బెయిలీ (1)ని ఆరంభంలోనే అవుట్ చేసి కోల్‌కతా ఆధిక్యం ప్రదర్శించింది. మోర్కెల్, షకీబ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ దశలో వోహ్రా, సాహా భాగస్వామ్యం జట్టును నిలబెట్టింది. ఆరంభంలో కొంత తడబడ్డా నిలదొక్కుకున్నాక చెలరేగిపోయారు. ముఖ్యంగా నరైన్ వేసిన 14వ ఓవర్లో 19 పరుగులు...మోర్కెల్ వేసిన తర్వాతి ఓవర్లో 20 పరుగులు రాబట్టడంతో పంజాబ్ వేగం పుంజుకుంది. ఈ క్రమంలో సాహా 29 బంతుల్లో, వోహ్రా 42 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా సాహా గతంలో ఎప్పుడూ చూడని దూకుడు ప్రదర్శించాడు. ఏ బౌలర్‌ను లెక్క చేయకుండా అద్భుతమైన షాట్లతో కింగ్స్ ఎలెవన్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతా ప్రధాన బలమైన నరైన్ బౌలింగ్‌లో 18 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 35 పరుగులు బాదాడు. 129 పరుగుల భారీ భాగస్వామ్యం అనంతరం వోహ్రా వెనుదిరిగినా...తన జోరు కొనసాగిస్తూ సాహా 49 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన తొలి సెంచరీ ఇదే. తొలి పది ఓవర్లలో 58 పరుగులే చేయగలిగిన కింగ్స్ ఎలెవన్...తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 141 పరుగులు చేయడం విశేషం. పాండే ప్రతాపం సూపర్ ఫామ్‌లో ఉన్న ఉతప్ప (5)ను నాలుగో బంతికే అవుట్ చేసిన జాన్సన్, పంజాబ్ శిబిరంలో ఆనందం నింపాడు. అయితే గంభీర్ (17 బంతుల్లో 23; 3 ఫోర్లు), పాండే జోడి కలిసి కోల్‌కతాను నిలబెట్టారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ పరుగుల వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. పవర్ ప్లేలో జట్టు స్కోరు 59 పరుగులకు చేరగా...ఆ తర్వాతి బంతికే గంభీర్ వెనుదిరిగాడు. అయితే మనీశ్ పాండే తన ఐపీఎల్ కెరీర్లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి రైడర్స్‌ను రేసులో నిలబెట్టాడు. స్వేచ్ఛగా ఆడుతూ ప్రతీ బౌలర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు యూసుఫ్ పఠాన్ మెరుపులు కోల్‌కతాను విజయానికి చేరువ చేశాయి. పఠాన్, షకీబ్ (12), డస్కటే (4) అవుటైనా, పాండే జోరు తగ్గలేదు. భారీ సిక్సర్లు కొట్టిన అతను మరో షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో కొద్ది సేపు ఉత్కంఠ నెలకొంది. అయితే చావ్లా (13 నాటౌట్) నిలబడి సూపర్ ఫోర్‌తో జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) గంభీర్ (బి) ఉమేశ్ 7; వోహ్రా (సి) అండ్ (బి) చావ్లా 67; బెయిలీ (బి) నరైన్ 1; సాహా (నాటౌట్) 115; మ్యాక్స్‌వెల్ (సి) మోర్కెల్ (బి) చావ్లా 0; మిల్లర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1-23; 2-30; 3-159; 4-170. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-40-0; ఉమేశ్ యాదవ్ 4-0-39-1; నరైన్ 4-0-46-1; షకీబ్ 4-0-26-0; చావ్లా 4-0-44-2; కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) పటేల్ (బి) జాన్సన్ 5; గంభీర్ (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 23; పాండే (సి) బెయిలీ (బి) కరణ్వీర్ 94; పఠాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ వీర్ 36; షకీబ్ (రనౌట్) 12; డస్కటే (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 4; యాదవ్ (సి) వోహ్రా (బి) జాన్సన్ 5; చావ్లా (నాటౌట్) 13; నరైన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.3 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1-6; 2-59; 3-130; 4-156; 5-168; 6-179; 7-187. బౌలింగ్: జాన్సన్ 4-0-41-2; బాలాజీ 4-0-41-0; అవానా 3.3-0-43-0; కరణ్వీర్ 4-0-54-4; అక్షర్ పటేల్ 4-0-21-0. మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: మనీష్‌పాండే (కోల్‌కతా) అత్యంత విలువైన ఆటగాడు: మ్యాక్స్‌వెల్ (పంజాబ్) ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): ఉతప్ప (కోల్‌కతా, 660 పరుగులు) పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్ల): మోహిత్ శర్మ (చెన్నై, 23 వికెట్లు) ఎమర్జింగ్ క్రికెటర్: అక్షర్ పటేల్ (పంజాబ్) ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్ ఉత్తమ క్యాచ్: పొలార్డ్ (ముంబై) మూడు సార్లు ఐపీఎల్ గెలిచిన తొలి క్రికెటర్ యూసుఫ్ పఠాన్. 2008లో రాజస్థాన్, 2012, 14లలో కోల్‌కతాలో పఠాన్ సభ్యుడు. -
‘7’ పై ఎలెవన్ గురి!
రాత్రి గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం తొలి టైటిల్‌పై కన్నేసిన కింగ్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ పోరు నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అద్భుత ఫామ్‌లో ఇరు జట్లు ఐపీఎల్-7లో నమ్మశక్యం కాని విజయాలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దూసుకొచ్చింది. అదే జోరులో తొలి టైటిల్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే అలాంటి సూపర్ ఫామ్‌లోనూ ఆ జట్టును కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ ఒక్కటే కట్టడి చేయగలిగింది. టోర్నీలో ఏకంగా ఏడు సార్లు 190కి పైగా స్కోర్లు చేయగలిగిన పంజాబ్, కోల్‌కతాతో మాత్రం ఒక్కసారి కూడా 150 దాటలేకపోయింది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో, వ్యూహంతో తుదిపోరులో కూడా వారిని లువరించేందుకునైట్రైడర్స్ సిద్ధమైంది. అయితే ఒకరు కాదంటే మరొకరు అన్నట్లుగా బలమైన బ్యాటింగ్ వనరులతో పంజాబ్ కూడా తగ్గనంటోంది. ఇరు జట్ల మధ్య గత మూడు మ్యాచ్‌లు పెద్దగా వినోదాన్ని పంచలేదు. అలా కాకుండా ‘చిన్న’ మైదానంలో పరుగుల వరద పారాలని అభిమానులు కోరుకుంటున్నారు. బెంగళూరు: చిరస్మరణీయ ప్రదర్శనలు... మెరుపు ఫీల్డింగ్... వ్యక్తిగత రికార్డులు... ఇలా ఎంతో వినోదం, విశేషాలతో గత 46 రోజులుగా ఆకట్టుకున్న ఐపీఎల్-7 ఇప్పుడు తుది ఘట్టానికి చేరింది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పటిష్టమైన బ్యాటింగ్ పంజాబ్ బలం కాగా... కోల్‌కతా తమ బౌలింగ్‌నే ఎక్కువగా నమ్ముకుంది. లీగ్ దశలో ఇద్దరూ చెరో మ్యాచ్ నెగ్గినా... తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతానే విజయం వరించింది. అయితే ఇప్పుడు తటస్థ వేదికపై గంభీర్ సేనకు విజయం అంత సులువు కాకపోవచ్చు. టీమ్‌లో ఓవరాల్ ప్రదర్శనను చూస్తే ఆరంభం నుంచి జోరుగా ఆడుతూ కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరగా... ఎనిమిది వరుస విజయాలతో కోల్‌కతా సత్తా ఏమిటో బయటపడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో ఆసక్తికర ముగింపునకు రంగం సిద్ధమైంది. బ్యాటింగే బలం... టోర్నీ మొదట్లో మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్ల సూపర్ బ్యాటింగ్ పంజాబ్‌ను గెలిపించింది. ఇప్పుడు సెహ్వాగ్ ఫామ్‌తో ఆ జట్టు బలం రెండింతలైంది. చెన్నైతో శుక్రవారం ఇన్నింగ్స్‌ను బట్టి చూస్తే ఇప్పుడు వీరూ కోసం కూడా ప్రత్యర్థి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందే. మనన్ వోహ్రా కూడా నిలకడగా రాణిస్తూ తనపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. అయితే టోర్నీలో తనదైన ముద్ర వేసినా... గత కొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న మ్యాక్స్‌వెల్, ఆఖరిసారి మెరుపులు ప్రదర్శించాల్సి ఉంది. చివర్లో బెయిలీ, సాహా ధాటిగా ఆడగల సమర్థులు. మిచెల్ జాన్సన్, సందీప్ శర్మలతో పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. టోర్నీలో ఆ జట్టు పేసర్లు 23.45 సగటుతో 69 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచారు. గత మ్యాచ్ ఆడిన జట్టులో మార్పులు చేస్తే అవానా స్థానంలో రిషి ధావన్‌కు చోటు దక్కవచ్చు. టోర్నీలో 6.19 ఎకానమీతో 17 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడుతున్నాడు. బౌలర్లంతా విఫలమైన గత మ్యాచ్‌లో అతనొక్కడే చెన్నైని కట్టడి చేసి మ్యాచ్‌ను పంజాబ్ నియంత్రణలోకి తెచ్చాడు. మరో స్పిన్నర్ కరణ్వీర్ సింగ్ కూడా కీలకం కానున్నాడు. కోల్‌కతాతో మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్ పేలవంగా ఆడింది. పైగా ఐపీఎల్లో తొలిసారి ఆ జట్టు ఫైనల్లో ఆడుతుండటంతో జట్టుపై ఒత్తిడి ఉంటుంది. జాన్సన్‌కు గత ఏడాది ముంబై తరఫున ఫైనల్ ఆడిన అనుభవం ఉంది. ఉతప్పకు అండగా... కోల్‌కతా జట్టు బ్యాటింగ్‌కు పెద్ద దిక్కుగా రాబిన్ ఉతప్ప ఉన్నాడు. వరుసగా గత 10 మ్యాచుల్లో అతను 40కి పైగా స్కోర్లు చేయడం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. అయితే ఉతప్ప ఇచ్చిన శుభారంభంపైనే ఆధారపడుతున్న జట్టు అతను విఫలమైతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. వరుసగా మూడు ఫిఫ్టీలు కొట్టిన అనంతరం గౌతమ్ గంభీర్ గతి తప్పగా... మనీశ్ పాండే అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. ఆ తర్వాత షకీబ్, యూసుఫ్ పఠాన్‌లపై బ్యాటింగ్ బాధ్యత ఉంది. ఇప్పటివరకు తన గుర్తింపునకు తగిన న్యాయం చేయలేకపోయిన డస్కటే కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. బౌలింగ్‌లో కోల్‌కతా స్పిన్‌దే ఆధిక్యం. ఈ టోర్నీలో 19.91 సగటుతో 43 వికెట్లు తీసిన స్పిన్నర్లు ముందంజలో ఉన్నారు. షకీబ్, చావ్లాలు కీలకం కాగా... పేస్‌లో ఉమేశ్ ఫామ్‌లో ఉండగా, మోర్కెల్ అండగా నిలిచాడు. కోల్‌కతా అవకాశాలు నరైన్ వేసే 4 ఓవర్లపై ఆధారపడి ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఫైనల్ కోసం అతను సొంత బోర్డునే ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా రాణించాల్సిన ఒత్తిడి అతనిపై ఉంది. పంజాబ్‌తో తొలి మ్యాచ్‌లో రాణించినా (3/24)... ఆ తర్వాత రెండు మ్యాచుల్లో అతను 8 ఓవర్లలో ఒకే వికెట్ తీసి 60 పరుగులిచ్చాడు. గతంలో ఐపీఎల్లో నెగ్గిన ఆటగాళ్లలో చాలా మంది ఈ ఫైనల్ ఆడుతుండటంతో మానసికంగా నైట్‌రైడర్స్‌దే పైచేయి. ఈ సీజన్లో ఒకేసారి 170కు పైగా పరుగులు చేసిన కోల్‌కతా, పంజాబ్‌తో పోలిస్తే ఎప్పుడూ పెద్ద లక్ష్యాలు ఛేదించాల్సిన అవసరం రాలేదు. ప్రత్యర్థి భారీ స్కోరు చేస్తే ఇది సమస్య కావచ్చు. జట్ల వివరాలు (అంచనా) కింగ్స్ ఎలెవన్ పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్‌వెల్, మిల్లర్, సాహా, జాన్సన్, అక్షర్, సందీప్, కరణ్ వీర్, అవానా/రిషి ధావన్. కోల్‌కతా నైట్‌రైడర్స్: గంభీర్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, మనీశ్ పాండే, షకీబ్, యూసుఫ్ పఠాన్, డస్కటే, సూర్యకుమార్, చావ్లా, నరైన్, మోర్కెల్, ఉమేశ్ యాదవ్. -
ఆఖరి మ్యాచ్‌లోనూ అదుర్స్
పంజాబ్‌కు 11వ విజయం రాణించిన మిల్లర్, వోహ్రా పీటర్సన్ శ్రమ వృథా ఢిల్లీకి తప్పని మరో ఓటమి మొహాలీ: ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసి విజయంతో లీగ్ దశను ముగించింది. దీంతో కీలకమైన నాకౌట్‌కు ముందు జట్టులో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. పీటర్సన్ (41 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. దినేశ్ కార్తీక్ (13), నీషమ్ (12) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కార్తీక్, పీటర్సన్ రెండో వికెట్‌కు 31 పరుగులు జోడించడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 3 వికెట్లకు 44 పరుగులు చేసింది. తర్వాతి వరుస బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా ఢిల్లీ 24 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. అవానా, పటేల్, జాన్సన్, కరణ్వీర్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత పంజాబ్ 13.5 ఓవర్లలో 3 వికెట్లకు 119 పరుగులు చేసి గెలిచింది. వోహ్రా (38 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిల్లర్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. సెహ్వాగ్ (9) విఫలమయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను వోహ్రా, మిల్లర్ మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించి విజయపథంలో నిలబెట్టారు. షమీ, ఉనాద్కట్, తాహిర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. వోహ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పీటర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ధావన్ 58; అగర్వాల్ (సి) సెహ్వాగ్ (బి) జాన్సన్ 2; కార్తీక్ (సి) పటేల్ (బి) అవానా 13; జాదవ్ (సి) వోహ్రా (బి) అవానా 0; తివారీ రనౌట్ 8; డుమిని (సి) పటేల్ (బి) కరణ్వీర్ 8; నీషమ్ (సి) బెయిలీ (బి) కరణ్వీర్ 12; నదీమ్ నాటౌట్ 3; షమీ (బి) పటేల్ 0; తాహిర్ (సి) ధావన్ (బి) పటేల్ 4; ఉనాద్కట్ (సి) మాక్స్వెల్ (బి) జాన్సన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (18.1 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1-13; 2-44; 3-44; 4-67; 5-91; 6-93; 7-110; 8-111; 9-115; 10-115 బౌలింగ్: అవానా 3-1-15-2; అక్షర్ పటేల్ 4-0-28-2; జాన్సన్ 3.1-0-27-2; కరణ్వీర్ 4-0-22-2; రిషీ ధావన్ 4-0-22-1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) కార్తీక్ (బి) షమీ 9; వోహ్రా (బి) తాహిర్ 47; మాక్స్వెల్ (సి) పీటర్సన్ (బి) ఉనాద్కట్ 0; మిల్లర్ నాటౌట్ 47; బెయిలీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (13.5 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1-13; 2-16; 3-112 బౌలింగ్: షమీ 3-0-26-1; ఉనాద్కట్ 2-0-3-1; నీషమ్ 1-0-14-0; డుమిని 2-0-15-0; తాహిర్ 3.5-0-32-1; నదీమ్ 2-0-24-0. -
205... సరిపోలేదు!
పంజాబ్ సూపర్ ఛేజింగ్ ఆరు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు రాణించిన సాహా, వోహ్రా, మ్యాక్స్‌వెల్ నమన్ ఓజా శ్రమ వృథా పంజాబ్‌ది బలమైన బ్యాటింగ్ లైనప్... ఇందులో సందేహం లేదు. హైదరాబాద్ బౌలింగ్ కూడా అన్ని జట్లలోకీ ఉత్తమం. ఈ నేపథ్యంలో సొంత గడ్డపై హైదరాబాద్ జట్టు 205 పరుగులు చేశాక కూడా ఓడిపోతుందా..? పంజాబ్ జట్టు ఒక్క మ్యాక్స్‌వెల్ మీదో, మిల్లర్ మీదో ఆధారపడితే సన్‌రైజర్స్ గెలిచేదేమో. కానీ కింగ్స్ ఎలెవన్ యువ క్రికెటర్లు సాహా, వోహ్రా సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఏకంగా పవర్‌ప్లేలోనే 86 బాదారు. ఈ యువ జోడీ జోరుకే సగం డీలా పడ్డ ధావన్ సేనను... మ్యాక్స్‌వెల్, బెయిలీ ఉతికి ఆరేశారు. వెరసి... హైదరాబాద్ 205 పరుగులు చేసినా పంజాబ్ ముందు సరిపోలేదు. సాక్షి, హైదరాబాద్:ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరు కొనసాగుతూనే ఉంది. బుధవారం ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నమన్ ఓజా (36 బంతుల్లో 79 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా... శిఖర్ ధావన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (23 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వృద్ధిమాన్ సాహా (26 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనన్ వోహ్రా (20 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరంభంలో చెలరేగగా... మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెయిలీ (19 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించారు. నమన్ జోరు బౌండరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్ ఆసాంతం అదే జోరు కొనసాగించింది. ఓపెనర్లు ఫించ్ (23 బంతుల్లో 20; 2 ఫోర్లు), ధావన్ శుభారంభం అందించారు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 55 పరుగులకు చేరింది. స్పిన్నర్ శివమ్ శర్మ... ఫించ్‌ను బౌల్డ్ చేయడంతో 65 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. కీపర్ నమన్ ఓజా ఆరంభంనుంచే దూకుడు ప్రదర్శించాడు. ధావన్ వెనుదిరిగాక వార్నర్‌తో కలిసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. వీరిద్దరు పోటీ పడి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. వీరిద్దరు 42 బంతుల్లోనే 81 పరుగులు జోడించడం విశేషం. 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఓజా, చివరి వరకు నిలబడి స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 6 ఓవర్లలో హైదరాబాద్ 94 పరుగులు సాధించింది. పవర్ఫుల్ ప్లే... భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతిని ఫోర్ బాదిన సెహ్వాగ్ (4) రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే రైజర్స్లాగే పంజాబ్‌కు కూడా కీపర్ సాహా కలిసొచ్చాడు. భువీ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను, హెన్రిక్స్ ఓవర్లో మరో సిక్స్, ఫోర్ బాదాడు. కేవలం 22 బంతుల్లోనే సాహా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వోహ్రా కూడా రాణించాడు. దీంతో పంజాబ్ పవర్‌ప్లేలో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 86 పరుగులు చేసింది. సాహా అవుటయ్యాక మ్యాక్స్‌వెల్ వచ్చీ రాగానే తన సత్తా చూపించాడు. దురదృష్టవశాత్తూ వోహ్రా రనౌట్ కాగా, విజయానికి 47 పరుగులు కావాల్సిన స్థితిలో మ్యాక్సీ వెనుదిరిగాడు. అయితే మిల్లర్ (24 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి బెయిలీ జట్టుకు విజయాన్ని అందించాడు. స్టెయిన్ వేసిన 18 ఓవర్లో బెయిలీ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి గెలుపు ఖాయం చేశాడు. స్కోరు వివరాలు: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) శివమ్ 20; ధావన్ (సి) శివమ్ (బి) 45; నమన్ ఓజా (నాటౌట్) 79; వార్నర్ (రనౌట్) 44; హెన్రిక్స్ (సి) మిల్లర్ (బి) సందీప్ 0; ఇర్ఫాన్ (సి) మిల్లర్ (బి) రిషి ధావన్ 1; కరణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15: మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1-65; 2-88; 3-169; 4-183; 5-196. బౌలింగ్: సందీప్ 4-0-65-1; జాన్సన్ 4-0-26-0; శివమ్ 4-0-31-1; అక్షర్ 4-0-40-0; రిషి ధావన్ 4-0-42-2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) అండ్ (బి) భువనేశ్వర్ 4; వోహ్రా (రనౌట్) 47; సాహా (స్టంప్డ్) ఓజా (బి) కరణ్ 54; మ్యాక్స్‌వెల్ (సి) స్టెయిన్ (బి)మిశ్రా 43; మిల్లర్ (నాటౌట్) 24; బెయిలీ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1-4; 2-95; 3-125; 4-159. బౌలింగ్: భువనేశ్వర్ 3.4-0-38-1; స్టెయిన్ 4-0-51-0; హెన్రిక్స్ 2-0-36-0; కరణ్ శర్మ 4-0-46-1; మిశ్రా 4-0-32-1; ఇర్ఫాన్ 1-0-5-0. మ్యాచ్ హైలైట్స్ ఈ సీజన్లో పంజాబ్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన సందీప్ శర్మ ఈ మ్యాచ్‌లో మాత్రం ఏకంగా 65 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఉమేశ్ యాదవ్ (65) సరసన చేరాడు. గత ఏడాది ఇదే మైదానంలో చెన్నైపై ఇషాంత్ ఇచ్చిన 66 పరుగులు ఐపీఎల్లో అతి చెత్త ప్రదర్శన. మ్యాక్స్‌వెల్ హిట్టింగ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం హైదరాబాద్ అభిమానులకు దక్కింది. సన్‌రైజర్స్ లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ బౌలింగ్‌లోనే మ్యాక్స్‌వెల్ ఏకంగా 5 సిక్సర్లు బాదాడు. మ్యాక్స్‌వెల్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిశ్రా బౌలింగ్‌లో స్టెయిన్ క్యాచ్ పట్టగా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఆ తర్వాత మరో 20 పరుగులు జోడించి మిశ్రా బౌలింగ్‌లోనే స్టెయిన్‌కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. -
హైదరాబాద్ లో ఐపిఎల్ సందడి
-
కోల్‌కతా అలవోకగా..
9 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపు గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్ రాణించిన చావ్లా, ఉతప్ప సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న పంజాబ్‌కు బ్రేక్ పడింది. సెహ్వాగ్ రాణించినా... మిల్లర్, మ్యాక్స్‌వెల్ విఫలం కావడంతో కోల్‌కతా చేతిలో ఓడిపోయింది. సీజన్లో పంజాబ్‌కు ఇది కేవలం రెండో ఓటమి మాత్రమే. కటక్: ప్లే ఆఫ్ రేసులో వెనకబడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలకమైన సమయంలో పుంజుకుంది. బౌలింగ్‌లో పీయూష్ చావ్లా (3/19), మోర్నీ మోర్కెల్ (2/20)... బ్యాటింగ్‌లో గంభీర్ (45 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు), ఉతప్ప (28 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో... కోల్‌కతా 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసి, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సెహ్వాగ్ (50 బంతుల్లో 72; 11 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించినా... కోల్‌కతా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను దెబ్బ తీశారు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 18 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 150 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గంభీర్, ఉతప్పలతో పాటు మనీష్ పాండే (35 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఏడో సీజన్లో పంజాబ్‌కు శుభారంభాలు అందిస్తున్న సెహ్వాగ్ మరోసారి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. కలిస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వీరూ నాలుగు ఫోర్లు బాదాడు. అయితే రెండో ఓవర్లో పంజాబ్‌కు తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ మన్దీప్ సింగ్ (0)ను మోర్నీ మోర్కెల్ అవుట్ చేశాడు. ఉన్నంతసేపు దడదడలాడించిన సాహా (15), మోర్కెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇక సెహ్వాగ్ తన వ్యక్తిగత స్కోరు 23 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత స్కోరు నెమ్మదించినా.. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 49 పరుగులు చేసింది. జోరుమీదున్న సెహ్వాగ్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తన సహజ ఆటతీరుకు భిన్నంగా ఆడిన మ్యాక్స్‌వెల్ (14)ను చావ్లా డగౌట్‌కి పంపాడు. చకచక రెండు ఫోర్లు కొట్టి సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో సెహ్వాగ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మిల్లర్ (13), రిషి ధావన్ (4) వెనువెంటనే అవుటవడంతో పంజాబ్ స్కోరు నెమ్మదించింది. నరైన్ వేసిన చివరి ఓవర్లో మిచెల్ జాన్సన్ (14) ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టి పంజాబ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అదిరిపోయే ఆరంభం లక్ష్యఛేదనను కోల్‌కతా నెమ్మదిగా మొదలుపెట్టినా ఆ తర్వాత దూకుడు పెంచింది. ముఖ్యంగా ఉతప్ప చెలరేగిపోయాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు ఫోర్లు, మిచెల్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో ఓ సిక్స్, మూడు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. కెప్టెన్ గంభీర్‌తో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాక ఉతప్ప అవుటయ్యాడు. ఉతప్ప అవుటైనా... గంభీర్, మనీష్ పాండే జోరు కొనసాగించారు. దీంతో 12వ ఓవర్లో కోల్‌కతా స్కోరు వంద దాటింది. ఫామ్‌లో ఉన్న గంభీర్ ఫోర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. పాండేతో కలిసి గంభీర్ పంజాబ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజ యాన్ని అందించాడు. రెండో వికెట్‌కు గంభీర్, పాండే అజేయంగా 82 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) చావ్లా 72; మన్దీప్ (సి) ఉతప్ప (బి) మోర్కెల్ 0; సాహా (బి) మోర్కెల్ 15; మ్యాక్స్‌వెల్ (సి) మోర్కెల్ (బి) చావ్లా 14; మిల్లర్ (బి) ఉమేశ్ 13; బెయిలీ నాటౌట్ 12; రిషి (బి) చావ్లా 4; మిచెల్ జాన్సన్ (స్టంప్డ్) ఉతప్ప (బి) నరైన్ 14; అక్షర్ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1-17; 2-48; 3-87; 4-112; 5-120; 6-127; 7-148; 8-149. బౌలింగ్: కలిస్ 3-0-38-0; మోర్నీ మోర్కెల్ 4-0-20-2; ఉమేశ్ 4-0-34-1; నరైన్ 4-0-30-1; చావ్లా 4-0-19-3; డస్కాటే 1-0-6-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) అక్షర్ (బి) అవానా 46; గంభీర్ నాటౌట్ 63; మనీష్ పాండే నాటౌట్ 36; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో 1 వికెట్‌కు) 150. వికెట్ల పతనం: 1-68. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-32-0; మిచెల్ జాన్సన్ 3-0-33-0; అక్షర్ 4-0-20-0; అవానా 2-0-20-1; రిషి 4-0-32-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0. ఎన్నాళ్లకెన్నాళ్లకు వీరేంద్ర సెహ్వాగ్ ఎట్టకేలకు ఐపీఎల్లో అర్ధసెంచరీ చేశాడు. గత సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన వీరూ ముంబైపై 95 పరుగులు చేసిన తర్వాత... ఆ సీజన్లో, ప్రస్తుత సీజన్లో కలిసి వరుసగా 17 మ్యాచ్‌ల పాటు అర్ధసెంచరీ చేయలేదు. ఈ సీజన్లో 20లు, 30లు కొట్టినా అర్ధసెంచరీ మార్కు ఊరిస్తూనే ఉంది. ఇన్నాళ్లకు కరవు తీర్చుకున్నాడు. -
పంజాబ్ బల్లే..బల్లే...
కోల్‌కతాపై 23 పరుగులతో గెలుపు వరుసగా నాలుగో విజయం రాణించిన సందీప్, అక్షర్ పటేల్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించలేదు. డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించలేదు. చివరికి భారీ స్కోరు కూడా నమోదు కాలేదు. అయినా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి, సగర్వంగా గెలిచి వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. అబుదాబి: ఐపీఎల్-7లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. తొలుత వీరేంద్ర సెహ్వాగ్ (30 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌తో రాణించగా... సందీప్ శర్మ (3/21), అక్షర్ పటేల్(2/16), మిచెల్ జాన్సన్ (2/22) అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ముకుతాడు వేశారు. ఫలితంగా పంజాబ్ 23 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. శనివారం షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. రిషి ధావన్ (18 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా స్పిన్నర్లు పీయూష్ చావ్లా, సునీల్ నరైన్ చెరో మూడు వికెట్లు తీసుకుని పంజాబ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత కోల్‌కతా 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మూడు వికెట్లు తీసిన పంజాబ్ పేసర్ సందీప్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నరైన్, చావ్లా మ్యాజిక్ తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ రెండో ఓవర్లోనే పుజారా వికెట్‌ను చేజార్చుకుంది. ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సాహా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తక్కువ స్కోరుకే కలిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సెహ్వాగ్, మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడటంతో పంజాబ్ జట్టు పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఏడో సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ అభిమానులను నిరాశపరుస్తూ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర మోర్కెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇక వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరుమీదున్నట్లు కనిపించిన మిల్లర్‌ను చావ్లా అవుట్ చేశాడు. ఆ తర్వాత అదే మ్యాజిక్‌ను కొనసాగిస్తూ కెప్టెన్ జార్జ్ బెయిలీని, ఓపెనర్ సెహ్వాగ్‌ను డగౌట్‌కి పంపాడు. సెహ్వాగ్ 37 పరుగులతో రాణించాడు. మిస్టరీ స్పిన్నర్ నరైన్ తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో అక్షర్ పటేల్, మిచెల్ జాన్సన్‌లను అవుట్ చేశాడు. నాలుగో బంతికి బాలాజీని వెనక్కి పంపాడు. చివరికి పంజాబ్ స్కోరు 130 దాటింది. చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కోల్‌కతాకు సందీప్ శర్మ ఆరంభంలోనే షాకిచ్చాడు. వరుస ఓవర్లలో మనీష్ పాండే, గౌతమ్ గంభీర్‌లను అవుట్ చేశాడు. కెప్టెన్ గంభీర్ వన్‌డౌన్‌లో బరిలోకి దిగినప్పటికీ ఫామ్‌లోకి రాలేకపోయాడు. సున్నా దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గౌతీ ఒక పరుగుకే వెనుదిరిగాడు. కలిస్‌ను బాలాజీ అవుట్ చేయడంతో కోల్‌కతా 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా పవర్ ప్లేలో 24 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తర్వాత బౌలర్లు అదే జోరు కొనసాగించారు. దీంతో 12 పరుగుల తేడాతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ లిన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ చివర్లో మెరుపులు మెరిపించినా... లక్ష్యాన్ని చేధించలేకపోయింది. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా రనౌట్ 8; సెహ్వాగ్ (బి) చావ్లా 37; సాహా ఎల్బీడబ్ల్యూ (సి) కలిస్ 14; మ్యాక్స్‌వెల్ (బి) మోర్నీ మోర్కెల్ 15; మిల్లర్ (సి) మోర్నీ మోర్కెల్ (బి) చావ్లా 14; బెయిలీ (సి) మోర్నీ మోర్కెల్ (బి) చావ్లా 11; రిషి ధావన్ నాటౌట్ 19; అక్షర్ పటేల్ (స్టంప్డ్) ఉతప్ప (బి) నరైన్ 7; మిచెల్ జాన్సన్ (బి) నరైన్ 0; బాలాజీ ఎల్బీడబ్ల్యూ (బి) నరైన్ 0; సందీప్ శర్మ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు): 132 వికెట్ల పతనం: 1-9; 2-28; 3-58; 4-74; 5-101; 6-103; 7-126; 8-126; 9-126. బౌలింగ్: ఉమేశ్ 4-0-28-0; మోర్నీ మోర్కెల్ 4-0-26-1; కలిస్ 4-0-32-1; నరైన్ 4-0-24-3; పీయూష్ చావ్లా 4-0-19-3. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మనీష్ పాండే ఎల్బీడబ్ల్యూ (బి) సందీప్ శర్మ 8; కలిస్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) బాలాజీ 9; గంభీర్ (సి) పటేల్ (బి) సందీప్ శర్మ 1; క్రిస్ లిన్ (బి) అక్షర్ పటేల్ 13; ఉతప్ప రనౌట్ 19; యూసుఫ్ పఠాన్ ఎల్బీడబ్ల్యూ (బి) రిషి ధావన్ 3; సూర్య కుమార్ (సి) జాన్సన్ (బి) సందీప్ శర్మ 34; పీయూష్ చావ్లా (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ పటేల్ 0; నరైన్ (బి) జాన్సన్ 6; ఉమేశ్ (బి) జాన్సన్ 2; మోర్నీ మోర్కెల్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 109 వికెట్ల పతనం: 1-13; 2-19; 3-19; 4-50; 5-59; 6-62; 7-65; 8-85; 9-103; 10-109. బౌలింగ్: సందీప్ 4-1-21-3; జాన్సన్ 3.2-0-22-2; బాలాజీ 3-0-21-1; రిషి ధావన్ 4-0-24-1; అక్షర్ 4-0-16-2.