
క్రిస్ గేల్
సాక్షి, హైదరాబాద్ : 20 క్రికెట్‌లో క్రిస్‌గేల్ విద్వంసకర ఆటగాడు.. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సమర్ధుడు. బంతిని అవలీలగా బౌండరీ దాటించగల సత్తా ఉన్నవాడు. కానీ ఒక్కసారి కూడా జట్టుకు ఐపీఎల్ కప్‌ను అందించలేకపోయాడు. పది ఐపీఎల్‌లు ఆడిన గేల్ గత రెండు సీజన్‌లలో మాత్రం అంచనాలను అందుకోలేక పోయాడు. దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బెంగుళూరు జట్టు వదుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా గేల్‌లో కసి రగులుతుందా.. ఈ సీజన్‌లోనైనా గేల్ సునామీని చూడొచ్చా అంటూ క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
- 2011, 2012, 2013 సీజన్‌లలో సుమారు 60కి పైగా సగటు నమోదు చేశాడు
- గత రెండు సీజన్లు మొత్తం కలుపుకొని గేల్ చేసిన అర్ధ సెంచరీలు రెండు
- చివరి రెండు ఐపీఎల్ సీజన్లలో గేల్ సగటు 22.47 మాత్రమే
జట్టు మారితేనైనా గేల్ ఆటతీరు మారకపోతుందా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడైనా గేల్ మైదానంలో బంతులను సిక్సర్లకు మళ్లించగలిగితే ఇక పండుగే. పంజాబ్ తరపున సత్తా చాటాలని, తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment