మొహాలి: ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‘మెంటార్ అండ్ హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్’ పదవి నుంచి తప్పుకున్న వీరేంద్ర సెహ్వాగ్ తనంతట తానుగా బయటకు రాలేదని వెల్లడించాడు. ఈ నిర్ణయం ఫ్రాంచైజీదేనని అతను స్పష్టం చేశాడు. పంజాబ్ జట్టు తమకు బ్రాండ్ అంబాసిడర్ లేదా మెంటార్ అవసరం లేదని భావించి సెహ్వాగ్ సేవలకు ముగింపు పలికింది. ‘ఫ్రాంచైజీ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. తమకు ఇకపై బ్రాండ్ అంబాసిడర్ కానీ లేదా మెంటార్ కానీ అవసరం లేదని వారు అందులో తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు పంజాబ్ జట్టులో భాగంగా ఉండటం సంతోషం. నేను తప్పుకోవాలనేది వారి నిర్ణయం. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. గతంలో ఒకసారి ప్రీతి జింటాతో చెలరేగిన వివాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. వారు కొత్త మెంటార్ లేదా కొత్త అంబాసిడర్ కావాలని కోరుకుంటే అది వారి ఇష్టం’ అని సెహ్వాగ్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment