
రవిచంద్రన్ అశ్విన్
ఐపీఎల్‌లో తమ జట్టు కెప్టెన్‌గా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యవహరిస్తాడని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ... ‘యువరాజ్, గేల్‌లాంటి మేటి ఆటగాళ్లున్న జట్టుకు సారథిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా.
కెప్టెన్సీతో నాపై అదనపు ఒత్తిడేమీ ఉండదు. 21 ఏళ్ల వయసులోనే తమిళనాడుకు సారథ్యం వహించా. ఈసారీ ఆ సవాల్‌ను ఆస్వాదిస్తా’ అని అన్నాడు. ఎనిమిదేళ్లపాటు చెన్నై, రెండు సీజన్లుగా పుణే జట్టుకు ఆడిన అశ్విన్‌ను ఈసారి పంజాబ్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment