న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం భారత పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి దూరమైన రవిచంద్రన్ అశ్విన్.. పునరాగమనం చేయడం కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. కేవలం టెస్టు ఫార్మాట్‌కే పరిమితమైన ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్.. పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో చోటు కోల్పోవడం జీవితంలో భాగంగానే పేర్కొన్నాడు. అందుకోసం నిద్రలేని రాత్రులు ఏమీ గడపలేదన్నాడు. ఈ మేరకు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌కు కెప్టెన్‌గా ఎంపికైన అశ్విన్ మాట్లాడుతూ..తాను భారత పరిమిత ఓవర్ల జట్టులోకి పునరాగమనం చేయడం అనేది కచ్చితంగా జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, దీనికోసం ఐపీఎల్‌ను ప్లాట్‌ఫామ్ చూడటం లేదన్నాడు.
'టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌ను ప్రామాణికంగా చూడటం లేదు. ప్రతీ ఏడాది ఐపీఎల్ ఆడుతున్నట్లే ఈ ఏడాది కూడా ఆడుతున్నా. అదే మైండ్ సెట్‌తో పోరుకు సిద్దమవుతున్నా. అయితే ఈ సీజన్‌లో నాపై అతి పెద్ద బాధ్యత పడింది. కెప్టెన్‌గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడం నా ముందున్న సవాల్. దానిపైనే దృష్టి పెట్టా. అంతేకానీ ఐపీఎల్‌ను టీమిండియా జట్టులోకి పునరాగమనం కోసం మాత్రం చూడటం లేదు. జాతీయ జట్టులో నా రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందనే నమ్మకం ఉంది' అని అశ్విన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment