వారానికోసారి ఇలా చేస్తే చాలు.. మిలమిలా మెరిసిపోతారు: హీరోయిన్‌ | Athiya Shetty Shares About Benefits Of Her Natural Fruit Face Pack | Sakshi
Sakshi News home page

Athiya Shetty: వారానికోసారి ఇలా చేస్తే చాలు.. మిలమిలా మెరిసిపోతారు! నేనైతే..

Published Wed, Feb 8 2023 1:59 PM | Last Updated on Wed, Feb 8 2023 2:03 PM

Athiya Shetty Shares About Benefits Of Her Natural Fruit Face Pack - Sakshi

అతియా శెట్టి

Athiya Shetty- Beauty Tips: ముఖ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు కెమికల్స్‌ ఉన్న ఫేస్‌ క్రీముల జోలికి వెళ్లొద్దు అంటోంది బాలీవుడ్‌ అందాల తార అతియా శెట్టి. ఇంట్లోనే సహజసిద్దంగా నిగారింపును సొంతం చేసుకోవచ్చని చెబుతోంది. తనకు తల్లి మనా శెట్టి చెప్పిన చిట్కాలు పంచుకుంది. ‘‘మా అమ్మకు కెమికల్స్‌ ఉన్న ఫేస్‌ క్రీమ్స్, ప్యాక్స్‌ నచ్చవు.

తను వాడాదు. నన్ను వాడనివ్వదు. ఆమె ఇంటి చిట్కాలతోనే అందానికి మెరుగులు దిద్దుకోవడం నేర్పింది. ఆవిడ చెప్పిన వాటిల్లో ఈ ఫ్రూట్‌ ఫేస్‌ ప్యాక్‌ ఒకటి. రెండు టూబుల్‌ స్పూన్ల కొబ్బరి పాలల్లో సగం అరటి పండు గుజ్జు, టీ స్పూన్‌ తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, పావు కప్పు బొప్పాయి పండు గుజ్జు వేసి కలిపి.. మొహానికి అప్లయ్‌ చేసుకోవాలి.

తడారిపోతున్నప్పుడు కడిగేసుకోవాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేసినా చాలు.. తేమ ఆరని చర్మంతో మిలమిలా మెరిసిపోతాం’’ అంటోంది ఈ కొత్త పెళ్లికూతురు. కాగా టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను అతియా పెళ్లాడిన సంగతి తెలిసిందే. అతియా తండ్రి సునిల్‌ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌజ్‌లో జనవరి 23న వీరి వివాహం అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది.

చదవండి: Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా..
 Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్‌ హెయిర్‌.. పీసీఓఎస్‌ వల్లేనా? పరిష్కారం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement