ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి | How To Prevent Wrinkles On The Skin Using Natural Home Remedies In Telugu - Sakshi
Sakshi News home page

How To Remove Wrinkles On Face: ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి

Published Sat, Dec 16 2023 4:42 PM | Last Updated on Sat, Dec 16 2023 5:26 PM

How To Prevent Wrinkles On The skin Using Natural Remedies - Sakshi

సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మంపై ముడతలను రావడానికి కారణమవుతాయి. కాలుష్యం కూడా చర్మంపై ముడతలకు కారణం అవుతుంది. మరి సహాజసిద్దమైన పద్దతుల్లో చర్మంపై ముడతలను ఎలా నివారించాలి అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్‌ నడిమింటి మాటల్లోనే..

  • చర్మానికి మృదువైన, తేమను అందించే క్రీమ్‌ను రాసుకోండి
  • రోజుకు కనీసం 15 నిమిషాలు మీ చర్మాన్ని మసాజ్‌ చేయడం. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి ముడతలు తగ్గుతాయి.
  • చర్మం ఆరోగ్యం నిద్రపై చాలా ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. 
  •  ఒత్తిడి చర్మంపై ముడతలకు కారణం అవుతుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 
  • ధూమపానం సాధారణ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసి, ముడతలకు దోహదం చేస్తుందట.

  • అధిక నాణ్యత గల యాంటీ రింకిల్‌ క్రీమ్‌ను ఉపయోగించండి. ఇది ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • బొప్పాయి పైతొక్కును ముఖంపై రబ్‌ చేసి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే యవ్వనంగా మారుతుంది. 
  • అలోవెలా జెల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌, హైడ్రేటింగ్‌ లక్షణాలు ఉంటాయి. ప్రతిరోజూ దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి. 
  • గుడ్డులోని తెల్లసొనను చర్మంపై అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో వాష్‌ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయాలి. గుడ్డు తెల్లసొనలోని అల్బుమిన్‌ అనే ప్రోటీన్‌ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. 

  • పండిన అరటిపండును మెత్తగా చేసి 1స్పూన్‌ తేనే, 1స్పూన్‌ పెరుగు కలపి చర్మానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీళ్లతో వాష్‌ చేసుకోవాలి. అరటిపండులోని పోషకాలు కొల్లాజెన్‌ను పెంచుతాయి. 
  • కొబ్బరి నూనెతో మసాజ్‌ చేయడం వల్ల ముడతలను తగ్గిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement