బ్యూటీ టిప్స్
- ఎండకు తిరిగి రావడం వల్ల కొందరి ముఖం కమిలిపోయినట్లు కనిపిస్తూ నల్లగా మారుతుంది. వెంటనే వారి ముఖం కాంతిమంతంగా మారాలంటే ఒక టీస్పూన్ శనగపిండిలో కొద్దిగా టమాటో రసం, పెరుగు, చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని చన్నీళ్లతో కడుక్కుంటే ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది.
- జిడ్డు చర్మం, మొటిమలతో బాధ పడేవారు ఓ పాత్రలో 10-12 వేప ఆకులు తీసుకొని, వాటికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని రెండు రోజులకోసారి ప్యాక్‌లా వేసుకుంటే సరి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది.
- పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. దీన్ని మెత్తగా పేస్ట్‌లా చేసుకొని తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనే కలిపి ప్యాక్‌లా వేసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలిపోయి చర్మం తాజాగా మెరుస్తుంది.
- అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది.
- సీజనల్ ఫ్రూట్స్‌తో కూడా చక్కగా పేస్‌ప్యాక్ ట్రై చేయొచ్చు. బొప్పాయి ఇందుకు బెస్ట్ ఆప్షన్. కాస్తంత బొప్పాయి గుజ్జులో రోజ్‌వాటర్ కలిపి రాసుకుంటే చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment